సాక్షి, నంద్యాల: ఉన్నత విద్యకు ఆలంబన లక్ష్యంతో పేద విద్యార్థుల చదువుకు ఫీజుల ఖర్చులను పూర్తిగా భరించడం. భోజన, వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యార్దుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం నంద్యాలలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద రెండో విడతలో 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సభలో.. సీఎం జగన్ ఎదుట నంద్యాలకు చెందిన విద్యార్థిని కరణం బృహతి మానస మాట్లాడుతూ.. తాను శ్రీ రామకృష్ణ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు తెలిపింది. జగనన్న అందిస్తున్న వసతి దీవెన పథకం కింద ఏడాదికి రూ. 20 ఇవ్వడం తన లాంటి మధ్య తరగతికి చెందిన కుటుంబాల అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పింది. నవరత్నాల్లో భాగంగా విద్యా దీవెనను ప్రవేశపెట్టినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. వసతి దీవెన పథకం వల్ల ఎంతో మంది విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం అందించే రూ. 20వేల ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు, హాస్టల్స్ చార్జీలు, పౌషికాహారం అందుతోందని సంతోషం వ్యక్తం చేసింది.
అమ్మఒడి పథకం వల్ల తన తమ్ముడు శ్రీరామ చంద్ర బడిలో మంచిగా చదువుకుంటున్నాడని తెలిపింది. తన లాంటి ఎంతో మంది జగనన్న వల్ల ఈరోజు చదువుకుంటున్నారని చెప్పింది. కాగా, తన తండ్రి గుడిలో అర్చకులుగా ఉన్నారని.. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వారికి జీతాలు డబుల్ అయ్యాయని.. దీంతో ఆర్థికంగా తన కుటుంబం నిలదోక్కుకుందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అన్ని తన ఇంట్లోనే ఉన్నాయని చిరునవ‍్వులు చిందించింది. ప్రతీ నెల ఒకటవ తేదీన వలంటీర్లు వచ్చి పెన్షన‍్లు అందిస్తున్నట్టు తెలిపింది. చివరగా నంద్యాల సభ సాక్షిగా ధన్యవాదాలు చెబుతూ.. జగనన్న వల్ల తాను బాగా చదువుకుని లాయర్‌ను అవుతానని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment