3వైఎస్సార్ ఆసరాకు రూ.1,480 కోట్లు విడుదల
జగనన్న విద్యా దీవెనకు రూ.502 కోట్లు చెల్లింపు
పోలింగ్‌కు ముందు నిధుల పంపిణీని
అడ్డుకున్న చంద్రబాబు బ్యాచ్
పోలింగ్ ముగియడంతో పేద లబ్దిదారులకు నిధులు చెల్లిస్తున్న సర్కారు
రెండు మూడు రోజుల్లో మొత్తం పథకాల చెల్లింపులు పూర్తి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు, దు్రష్పచారాన్ని వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల డీబీటీ చెల్లింపులను ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా తదితర పథకాల లబ్దిదారులకు చివరి దశ చెల్లింపులను చంద్రబాబు బృందం అడ్డుకుంది. పేదల పొట్ట కొట్టేలా పోలింగ్‌కు ముందు పచ్చ బ్యాచ్ ఫిర్యాదులు చేయడంతో డీబీటీ చెల్లింపులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసింది.
పోలింగ్ ముగిసిన తరువాత చెల్లింపులు చేయాలని, పోలింగ్‌కు ముందు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాలు గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని, కొత్తవి కాదని, లబ్ధిదారులు కూడా పాతవారే తప్ప కొత్తవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ, చంద్రబాబు బృందానికి అనుకూలంగా ఈసీ వ్యవహరించింది. పోలింగ్ ముగియడంతో పేద లబ్దిదారులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పథకాల చెల్లింపులను ప్రారంభించింది.
పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందించిన వైఎస్సార్ ఆసరా పథకం నిధులు రూ.1,480 కోట్లను డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే పేద విద్యార్ధులకు ఫూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన కింద డీబీటీ ద్వారా రూ.502 కోట్లు చెల్లించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా పథకాల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది.
ముందే అనుమతి కోరినా సాగదీసి..
నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న పథకాల లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ కోసం పోలింగ్ తేదీకి చాలా ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. తెరవెనుక చంద్రబాబు అండ్ కో చేసిన మంత్రాంగంతో ఎన్నికల సంఘం ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చకుండా సాగదీసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దంటూ ఉత్తర్వులిచ్చింది. దీని వెనుక పచ్చ బ్యాచ్ ఒత్తిడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఉత్తర్వులను ఈనెల 10వ తేదీన ఒకరోజు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పథకాల డీబీటీ చెల్లింపులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది. ఈసీ తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయినప్పటికీ, 10వ తేదీన సమయం మించిపోవడంతో లబి్ధదారులకు పథకాల మేలు నిలిచిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో పేదలకు నగదు చెల్లింపులను ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నికల కోసం ఈ పథకాలను అమలు చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందనే అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment