
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది.
ఈలోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.
మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan
డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు
పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న
మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు,…— YSR Congress Party (@YSRCParty) May 16, 2024

Comments
Please login to add a commentAdd a comment