సాక్షి,విజయవాడ: ఏపీలో వాలంటీర్లు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాలంటీర్ల సేవలు లేక రాష్ట్రంలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. తుపాన్‌లు, వరదల సమయంలో బాధితులకు గతంలో వాలంటీర్లు అండగా నిలిచేవారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం అందుబాటులో ఉన్న వాలంటీర్లను కూడా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వినియోగించడం లేదు.
వాలంటీర్లు ఉన్నప్పుడు తమకు సమస్యలు లేవని బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో విపత్తుల వేల వాలంటీర్లు విస్తృతంగా సేవలందించారని చెబుతున్నారు. వాలంటీర్లపై కక్ష ప్రజలకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment