DBT
-
డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు, దు్రష్పచారాన్ని వమ్ము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల డీబీటీ చెల్లింపులను ప్రారంభించింది. వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా తదితర పథకాల లబ్దిదారులకు చివరి దశ చెల్లింపులను చంద్రబాబు బృందం అడ్డుకుంది. పేదల పొట్ట కొట్టేలా పోలింగ్‌కు ముందు పచ్చ బ్యాచ్ ఫిర్యాదులు చేయడంతో డీబీటీ చెల్లింపులను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలిపివేసింది. పోలింగ్ ముగిసిన తరువాత చెల్లింపులు చేయాలని, పోలింగ్‌కు ముందు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకాలు గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని, కొత్తవి కాదని, లబ్ధిదారులు కూడా పాతవారే తప్ప కొత్తవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ, చంద్రబాబు బృందానికి అనుకూలంగా ఈసీ వ్యవహరించింది. పోలింగ్ ముగియడంతో పేద లబ్దిదారులకు మేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ పథకాల చెల్లింపులను ప్రారంభించింది. పొదుపు సంఘాల మహిళల కోసం రూపొందించిన వైఎస్సార్ ఆసరా పథకం నిధులు రూ.1,480 కోట్లను డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే పేద విద్యార్ధులకు ఫూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జగనన్న విద్యా దీవెన కింద డీబీటీ ద్వారా రూ.502 కోట్లు చెల్లించింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా పథకాల చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది.ముందే అనుమతి కోరినా సాగదీసి.. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న పథకాల లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ కోసం పోలింగ్ తేదీకి చాలా ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. తెరవెనుక చంద్రబాబు అండ్ కో చేసిన మంత్రాంగంతో ఎన్నికల సంఘం ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చకుండా సాగదీసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దంటూ ఉత్తర్వులిచ్చింది. దీని వెనుక పచ్చ బ్యాచ్ ఒత్తిడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఉత్తర్వులను ఈనెల 10వ తేదీన ఒకరోజు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పథకాల డీబీటీ చెల్లింపులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది. ఈసీ తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, 10వ తేదీన సమయం మించిపోవడంతో లబి్ధదారులకు పథకాల మేలు నిలిచిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో పేదలకు నగదు చెల్లింపులను ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నికల కోసం ఈ పథకాలను అమలు చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందనే అభిప్రాయాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. ఈలోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు,…— YSR Congress Party (@YSRCParty) May 16, 2024 -
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది. -
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
-
ఠంఛన్‌గానే పింఛన్
సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధిదారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కష్టాలకు చంద్రబాబే కారణమని వారు మండిపడుతున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావాలని సహాయమడగాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.పింఛన్ కోసం వెళ్లి మృత్యువాతపింఛన్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్పకూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతివలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్ బేగ్ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్ బ్యాంకులో వేస్తున్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలోచనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులునాకు వృద్ధాఫ్య పింఛన్ వస్తోంది. ఆధార్‌కు లింక్ చేసినా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా పని చేయడం లేదు. పింఛన్ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – గుంజి లక్ష్మీదేవిఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?పింఛన్ సొమ్మును ఈసారి బ్యాంక్‌లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా వలంటీర్ ఉంటే ఉదయాన్నే పింఛన్..నాకు వితంతు పింఛన్ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పింఛన్‌ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్‌కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు. – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
సుస్థిర ప్రగతే లక్ష్యం ఆపొద్దు ఈ పయనం
‘సమాజ పురోగతిని ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తూ రాష్ట్రాభివృద్దికి బాటలు వేసింది. పేద, మధ్య తరగతి వారికి మంచి జరగాలంటే పాలకుడికి అనుభవం ఉంటే సరిపోదు. మంచి మనస్సు, వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో అద్భుతాలే జరిగాయి. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం, సామాజికం, ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అనేక అవకాశాలను కల్పించారు. సమాజంలో పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టింది. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే పేద మహిళా కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం ‘వైఎస్సార్ చేయూత పథకం’ అమలు చేసింది. ఈ రెండు పథకాలు లక్షలాది కుటుంబాల వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం సొమ్మును నాలుగు ధపాలుగా వారికి అందిస్తామ’ని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరిగి ఎన్నికల జరిగే సమయానికల్లా ఆక్షరాల అమలు చేసి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూటికి నూరు శాతం బ్యాంకులకు తమ అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ దశలో దేశంలో ఇతర రాష్ట్రాల పొదుపు సంఘాలన్నింటికీ ఆదర్శంగా నిలిచాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ♦ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నాన్ డీబీటీ ద్వారా రూ. 2,72,811 కోట్లు సాయం అందించింది. ♦ ఇంతకు ముందు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఐదేళ్ల కాలంలో ఒక ప్రభుత్వం అంత భారీగా స్థాయిలో పేద మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ♦ ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి సంస్థలతో బ్యాంకులతో ఒప్పందాలు చే సుకొని వారికి వ్యాపార మార్గాలు చూపించింది. ♦ ఈ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా అంతర్జాతీయ సంస్థలు, పేద మహిళల మధ్య సమన్వయం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్త (సెర్ప్) కార్యాలయంలో ప్రత్యేక విభాగం కొనసాగిస్తున్నారు. అతివలను అందలం ఎక్కించాలనే.. ♦ 57 నెలల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన సహాయం, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కువడానికి అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలోని 18,37,568 మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ♦ అంతకు ముందు లేనివి, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా పొదుపు సంఘాలకు అందించిన తోడ్పాటుతో 54 శాతం మంది రూ. 5 వేలకు పైనే అంటే ఏడాదికి రూ. 60 వేలకు పైబడి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ♦ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 14,01,519 మంది పొదుపు సంఘాల మహిళలు ఏటా రూ. లక్ష చొప్పున ఆదాయం పొందుతూ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకున్నారు. ♦ మరో 31,04,314 మంది ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ. 5 వేల నుంచి రూ. 8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ. లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు ♦ 2021–2023 ఆర్థిక సంవత్సరంలో 1,126 మంది పొదుపు సంఘాల మహిళలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ఏర్పాటు చేసుకుని భావి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ♦ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ,ఎస్టీ మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తే ప్రత్యేకంగా ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ఆయా రంగాల్లో నైపుణ్యాలపై శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తోంది. స్వయం కృషి ‘వనిత’ర సాధ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 250 స్వయం సహాయ సంఘాల మహిళలంతా కలిసి కార్పొరేట్‌కు దీటుగా చేయూత మహిళా మార్ట్ పేరిట షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఒక్కో మహిళ కేవలం రూ.210 పెట్టుబడితో దీనిలో భాగస్తులయ్యారు. కేవలం పది నెలల్లోనే ఈ మార్ట్ మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. గత సంక్రాంతి సీజన్లో రూ.రెండులక్షల వరకు అమ్మకాలు జరిపి అందరినీ అబ్బురపరిచింది. డాంబికాల ‘డప్పు’తో సరి ♦ 2014 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ♦ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే డ్వాక్రా అప్పులు మహిళలు బ్యాంకులకు కట్టొద్దని గొప్పగా డప్పు కొట్టారు. ♦ ఆయన చెప్పిన మాటలు నమ్మి రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మందికి పైగా తమ అప్పులు కట్టలేదు. ♦ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదు. దీనివల్ల ఏకంగా 18.36 శాతం పొదుపు సంఘాలు (అంటే దాదాపు 14 లక్షల మందికి సంబందించిన సంఘాలు) ఎన్పీఏ (బ్యాంకుల వద్ద రుణ ఎగవేతదారు)లుగా ముద్రవేయించుకున్నాయి. నూరుశాతం మహిళా సాధికారత మహిళా సాధికారత అనే మాట గతంలో వినడం తప్ప సాధించింది లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారత నూటికి నూరుశాతం అమలవుతోంది. మహిళలు సంక్షేమ పరంగా, రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజకీయ ప దవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. – తానేటి వనిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజకీయంగా ఇంకా చైతన్యం రావాలి మహిళలు రాజకీయంగా ఇంకా చైతన్యవంతులు కావాలి. గృహిణిగా పరిమితం కాక సమాజంలో అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉండాలి. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సంక్షేమంతోపాటు రాజకీయంగా మహిళలకు పురుషులతోపాటు సమభాగం కల్పిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మహిళకు కేటాయించడం అభినందనీయం. –ఘంటా పద్మశ్రీ, చైర్పర్సన్, పశ్చిమగోదావరి జెడ్పీ ధైర్యంగా ముందడుగు వేయాలి మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలి. మహిళలు మానసికంగా, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి. అప్పుడే సమాజం బలంగా ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపదలో ఉన్నవారికి, అన్యాయం జరిగిన మహిళలకు మహిళా కమిషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. – బూసి వినీత, మహిళా కమిషన్ సభ్యురాలు -
దేశం చూపు రాష్ట్రం వైపు
సాక్షి, అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా.. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు సీఎం జగన్ అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ. 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఇంత భారీ ఎత్తున పేదల ఖాతాల్లో జమ చేయడం ఇదే తొలిసారి. ఇది దేశంలో అన్ని వర్గాల ప్రజల చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసింది. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4,38,102.91 కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియో గం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగు పరుచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో పేదరికం 11.77 శాతం ఉంటే.. అది 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. అభివృద్ధికి ఊతం ♦ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్‌ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటతో ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ.. ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో 1.80 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ♦ నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరి మితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి రూ.13 వేల కోట్ల వ్యయం చేసి.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభమవగా.. వచ్చేవి ద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కానున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. గత 58 నెలల్లోనే రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే అందుకు తార్కాణం. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. ♦ ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)ల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 35 శాతం ఉండటమే అందుకు తార్కాణం. ♦ విప్లవాత్మక సంస్కరణతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. ♦ సీఎం జగన్ సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతిపథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాల్సిందేననే చైతన్యం విద్యావంతులు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో రగులుతోంది. -
మోదీ ప్రయాగ్‌రాజ్ పర్యటనలో మహిళా సంఘాలకు రూ. 1000 కోట్లు బదిలీ!
UP Assembly Elections 2022 ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మంగళవారం) ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా దాదాపు లక్షా 60 వేల మహిళా స్వయం సహాయక బృందాల బ్యాంక్ ఖాతాలకు నేడు ఆన్లైన్లో 1000 కోట్లను బదిలీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు. అంతేకాకుండా 202 టెక్ హోమ్ రేషన్ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో స్థానిక భాషలో మహిళా సంఘాలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. గ్రామానికే బ్యాంక్‌లు.. ఇంటివద్ద నుంచే డబ్బు విత్‌డ్రా! యూపీలో మహిళల అభివృద్ధికి చేస్తున్న కృషిని దేశం మొత్తం చూస్తోంది. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం కింద లక్షలాది మహిళల ఖాతాలకు కోట్లాది రూపాయలను బదిలీ చేసే భాగ్యం ఈరోజు నాకు లభించింది. యూపీలో ప్రారంభించిన బ్యాంక్ సఖీ ప్రచార కార్యక్రమం మహిళల జీవితాల్లోనూ పెనుమార్పులు తీసుకొస్తుందని అన్నారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఖాతాకు వస్తుంది. ఐతే ఈ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే నేరుగా పొందవచ్చన్నారు. ఈ విధంగా బ్యాంకే గ్రామాలకు వచ్చి డబ్బునందిస్తుంది. కానీ ఇదేమీ చిన్న విషయం కాదు. 75 వేల కోట్లు బ్యాంక్ ఫ్రెండ్ల ద్వారా పంపిణీచేసే బాధ్యతను యూపీ ప్రభుత్వం అప్పగించింది. గ్రామాల్లో ఎంత ఎక్కువ లావాదేవీలు జరిగితే అంత ఆదాయం పెరుగుతుంది. క్రితం రోజుల వరకు సొంత బ్యాంకు ఖాతాలు కూడా లేని అక్కాచెల్లెళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఫిజికల్ బ్యాంకింగ్ అధికారం వారి చేతుల్లోకి నేరుగా వచ్చిందని ప్రధాని మోదీ సమావేశంలో అన్నారు. కాగా త్వరలో ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! చదవండి: Covid Alert: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా మూడోవేవ్.. -
పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది?
మూడు డోసుల టీకా.. ఇప్పటివరకు ఉన్న అన్ని టీకాలు రెండు డోసులు ఇస్తుండగా.. జైకోవ్–డి వ్యాక్సిన్ మూడు డోసులు ఉంటుంది. మొదటిరోజుతోపాటు 28వ రోజున, 56వ రోజున ఈ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సూదిలేని మందు.. ప్రస్తుతమున్న కరోనా టీకాలన్నీ ఇంట్రామస్క్యులర్ (కండరాల లోపల ఇచ్చేవి) కాగా.. జైకోవ్–డి టీకాను ఇంట్రాడెర్మల్ (చర్మానికి, కండరాలకు మధ్య) రూపంలో ఇస్తారు. దీనిలో సూది ఉండదు. ఫార్మాజెట్‌గా పిలిచే ప్రత్యేక ఇంజెక్టర్‌ను వాడుతారు. ఎలా పనిచేస్తుంది? జైకోవ్–డి టీకాను డీఎన్ఏ ప్లాస్మిడ్ విధానంలో అభివృద్ధి చేశారు. ఈ టీకా తీసుకున్నవారిలో అచ్చంగా కరోనా వైరస్‌పై ఉండే స్పైక్ ప్రొటీన్ల వంటి ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ దానిని వైరస్‌గా భావించి.. తగిన యాంటీబాడీలను విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీలు శరీరంలో అలాగే ఉండిపోతాయి. తర్వాత ఎప్పుడైనా కరోనా వైరస్ ఆ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తే.. వెంటనే అడ్డుకుంటాయి. కొత్త వేరియెంట్లకు తగ్గట్టు డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో రూపొందించిన టీకాల్లో మార్పులు చేయడం సులభమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనాలో ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు వస్తే.. దానికి తగినట్టుగా వెంటనే వ్యాక్సిన్‌లో మార్పులు చేసి వినియోగించవచ్చని అంటున్నారు. న్యూఢిల్లీ: పన్నెండేళ్లు దాటిన పిల్లలకూ ఇవ్వగలిగిన సరికొత్త కరోనా టీకా సిద్ధమైంది. పిల్లలతోపాటు పెద్దవారిలోనూ ప్రభావవంతంగా పనిచేసే ‘జైకోవ్–డి’ టీకా త్వరలోనే మార్కెట్లోకి రానుంది. గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ఈ టీకా అత్యవసర వాడకానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. అత్యంత ఆధునికమైన డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో ఈ టీకాను రూపొందించారు. ఈ తరహా వ్యాక్సిన్లలో ప్రపంచంలోనే ఇదే మొదటిది. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో కరోనా వ్యాక్సిన్ కూడా ఇదే. కాగా జైకోవ్–డి వ్యాక్సిన్‌ను అనుమతిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో దేశం మరో ముందడుగు వేసిందని, శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారని అభినందించారు. డీబీటీ, ఐసీఎంఆర్ సహకారంతో..: ‘మిషన్ కోవిడ్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా.. జాతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)ల సహకారంతో జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ వ్యాక్సిన్‌ను అభి వృద్ధి చేసింది. తొలిరెండు దశల్లో సంతృప్తికర ఫలితాలు రావడంతో.. దేశవ్యాప్తంగా 28వేల మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ డేటాను పరిశీలించిన నిపుణుల కమిటీ.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వొచ్చని డీసీజీఐకి సిఫార్సు చేసింది. డీసీజీఐ శుక్రవారం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు వివరాలతో డీబీటీ ప్రకటన విడుదల చేసింది. జైకోవ్–డి టీకా అన్నిరకాల కరోనా వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. రెండు నెలల్లో మార్కెట్లోకి..: జైకోవ్–డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం గత నెల ఒకటిన దరఖాస్తు చేసుకున్నట్టు జైడస్ క్యాడిలా సంస్థ వెల్లడించింది. పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా తమ టీకా సురక్షితమని ప్రకటించింది. అనుమతులు వచ్చాక రెండు నెలల్లోనే టీకాను మార్కెట్లోకి తెచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపింది. ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ ఎండీ షర్విల్ పటేల్ వెల్లడించారు. దేశంలో ఆరో టీకా..: దేశంలో ఇప్పటివరకు సీరం ఇనిస్టిట్యూట్–ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవి షీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్–వి, అమెరికాకు చెందిన మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు అనుమతి ఉంది. తాజాగా అందుబాటులోకి వస్తున్న జైకోవ్–డి టీకా ఆరోది కానుంది. అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్‌తో.. జైకోవ్–డి ప్రపంచంలోనే తొలి ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్. పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేసి, అందుబాటులోకి వస్తున్న రెండో వ్యాక్సిన్. ఒకవేళ కరోనా సోకితే.. సాధారణ లక్షణాలు మాత్రమే కనిపించే వారి విషయంలో తమ టీకా 100% ప్రభావవంతంగా పనిచేస్తుందని జైడస్ క్యాడిలా కంపెనీ ప్రకటించింది. అదే లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశమున్న వారిలో 66.6% మేర పనితీరు చూపుతుందని వెల్లడించింది. 50కిపైగా కేంద్రాల్లో 28వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిపారు. దేశంలో చేపట్టిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇదే అతిపెద్దది. డీఎన్ఏ ప్లాస్మిడ్ టీకా అంటే? వ్యాక్సిన్లకు సంబంధించి అత్యంత అధునాతనమైన కొత్త విధానమే డీఎన్ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీ. కణాల్లో కేంద్రకానికి బయట ఉండే డీఎన్ ఏను ప్లాస్మిడ్స్ అంటారు. ఈ ప్లాస్మిడ్స్‌ను జన్యుపరంగా మార్పిడి చేసి, టీకా ఉత్పత్తిలో వాడుతారు. టీకా ఇచ్చినప్పుడు జన్యుమార్పిడి ప్లాస్మిడ్లు.. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ సిస్టమ్)ను ప్రేరేపిస్తాయి. దీంతో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. భవిష్యత్‌లో కరోనా సోకితే.. వెంటనే హతమారుస్తాయి. -
రేషన్‌కు మంగళం!
ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇక నుంచి నగదు బదిలీ పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. గ్యాస్ వాడకందార్లకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని బ్యాంకు ఖాతాలకు జమచేసి డీలర్ల వద్ద మొత్తం చెల్లించుకోమని తీసుకొచ్చిన వ్యవస్థనే పౌరసరఫరాకు ఇక అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాపంపిణీ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి పథక రచన మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డీబీటీ (డెరైక్టు బెనిఫిట్ ట్రాన్సఫర్) విధానాన్ని రెండువిడతల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. గ్యాస్ వినియోగదారుల ఖాతాలకు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ రాయితీ జమ కావడం లేదు. ఇప్పుడు పౌరసరఫరా శాఖ పరిధిలోని ప్రజాపంపిణీ వ్యవస్థలో కూడా ఇదే అమలు చేస్తే పేదలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కానుందా..ప్రభుత్వ యోచన చూస్తే ఔననే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా 1999మంది డీలర్లు ఉపాధి పొందుతున్నారు. 8.17లక్షల రేషన్ కార్డులున్నాయి. 50,971 అంత్యోదయ, 1087 అన్నపూర్ణ కార్డులన్నాయి. ఈకార్డులకు ప్రతినెలా బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, కందిపప్పుపంచధార, కిరోసిన్ రాయితీపై అందిస్తున్నారు. మిగిలిన సరకులపై రాయితీపై అందుతున్నాయి. వీటికి సంబంధించి రాయితీ మొత్తాలను ఇకపై కార్డుదారుని ఖాతాకు జమ చేస్తారు. ముందుగా గ్యాస్ తర హాలోనే నిత్యావసర సరకులకు వినియోగదారులే పూర్తి మొత్తాలు చెల్లించి కొనుగోలు చేసుకుంటే ఆమొత్తాలను ప్రభుత్వం నేరుగా వినియోగదారుని ఖాతాలకు జమ చేస్తుందని చెపుతున్నారు. గ్యాస్ వాడకంలో కేంద్ర ప్రభుత్వ రాయితీ అందుకునేందుకు ముందుగా ఆధార్, బ్యాంకు అకౌంట్లను గ్యాస్ డీలరుకు అందజేశారు. ఒక్కో వినియోగదారుడు నెలల తరబడి తిరిగినా ఇంతవరకు ఆ రాయితీ మొత్తాలు బ్యాంకు ఖాతాలకు చేరడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈవిధానం కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పటికే అనేక మంది గ్యాస్ కనెక్షన్లను అటకెక్కించేశారు. లోపభూయిష్టంగా ఉన్న ఈవిధానంలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారుు. జనానికి చెల్లించాల్సిన రాయితీలకు మంగళం పాడేస్తున్నారు. అటువంటి విదానాన్నే ప్రజాపంపిణీ వ్యవస్థలో తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధరలపెరుగుతున్న నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పేదలను ఆదుకుంటోంది. ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఈ-పాస్ విధానం అమలుతో 15శాతం కుటుంబాలు ప్రతినెలా నిత్యావసర సరకులు అందుకోలేక పోతున్నారు. దీంతో లక్ష కుటుంబాలు అధిక ధరలకు నిత్యావసర సరకును కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు నగదు బదిలీ విదానం అమలైతే నిత్యావసర సరకుల కోసం ముందే అధిక మొత్తాలు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. రెండు మూడు రోజులు మాత్రమే సరకుల పంపిణీ చేసి తర్వాత డీలర్లు ఆపేస్తున్నారు. రానున్న రోజుల్లో కిరాణా తరహాలో నిత్యం ప్రజలకు అందుబాటు అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులున్న వారైనా సరే రాయితీల వల్ల తక్కువధర చెల్లించి సరకులను తీసుకుంటూ ఇంటిల్లిపాది ఆకలిదప్పులు తీర్చుకుంటున్నారు. కొందరైతే బియ్యం మార్కెట్లో అమ్మేసినా మిగిలిన సరకులను కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. సరకులు కొనాలంటే పెద్ద మొత్తాలను దాచుకుంటే తప్ప కొనుక్కోలేరు. నగదు బదిలీ అమలైతే రాయితీ లేకుండా కొనాలంటే ముందుగానే పెట్టుబడి పెటటాలి. వ్యవసాయకూలీలు,నిరుపేదలకు ఈ స్తోమతు ఉండదు. ఏమైనప్పటికీ రేషన్‌కు నగదు బదిలీ పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టనుంది. -
రిబేటు రద్దు గొడ్డలిపెట్టు
సాక్షి, కాకినాడ / న్యూస్‌లైన్, రాయవరం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమాని లాభాలబాట పట్టిన చేనేత సంఘాలు కేంద్ర సర్కారు నిర్ణయంతో మళ్లీ నష్టాలబాటపట్టే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్‌తో పాటు పలు పథకాలకు అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ(డీబీటీ)ని చేనేత రంగంలోనూ అమలు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై కనీస కసరత్తు కూడా చేయకుండానే ఈ రంగంలో పలు రాయితీలకు మంగళం పాడుతోంది. చేనేత రంగంలో డీబీటీని అమలు చేస్తున్నట్టు సూత్రప్రాయంగా ప్రకటించిన కేంద్రం తాజాగా రిబేట్ పథకానికి మంగళం పాడింది. ఈ నిర్ణయం సంఘాలతో పాటు చేనేత కార్మికులకు అశనిపాతంగా మారింది. రిబేట్ రద్దుతో గత ఏడు నెలల్లో జిల్లాలో రూ.75 లక్షలకు పైగా అమ్మకాలు తగ్గిపోవడంతో ఆ మేరకు ఉత్పత్తి పడిపోయి కార్మికులు పస్తులుండే పరిస్థితులు దాపురించాయి. ఒక పక్క రోజురోజుకూ పెరుగుతున్న నూలు, ముడిసరుకు ధరలతో కునారిల్లుతుండగా రిబేట్ రద్దు ఈ రంగం ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. చిల్లర అమ్మకాల్ని ప్రోత్సహిం చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం రిబేట్ (రాయితీ) ఇస్తాయి. కార్మికులు నేసిన వస్త్రాలను చేనేత సంఘాలు నేరుగా విక్రయిస్తే 20 శాతం రిబేట్ పొందవచ్చు. అదే ఆప్కోకు విక్రయిస్తే పది శాతం రి బేట్ లభిస్తుంది. మరో పది శాతం వినియోగదారుల కు ఆప్కో రాయితీ ఇస్తుంది. జిల్లాలోని 50 సం ఘాల్లో 47 సంఘాలు 20 శాతం రిబేట్‌ను పొం దేం దుకు అర్హత కలిగి ఉన్నాయి. దసరా, దీపావళి తది తర పర్వదినాల సమయంలో సంఘాలు రిబేట్‌తో వస్త్రాలు విక్రయిస్తుంటాయి. తద్వారా నిల్వలను అమ్ముకునేందుకు సంఘాలకు అవకాశం లభిస్తుంది. 12 వేల మంది నేత కార్మికులపై ప్రభావం జిల్లాలో 47 సంఘాల పరిధిలోని 12 వేల మంది నేత కార్మికుల ఉపాధిపై రిబేట్ రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంఘాల పరిధిలో ఏటా రూ.3 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతుంటాయి. వీటిపై 20 శాతం రిబేట్ చొప్పున సంఘాలకు రూ.60 లక్షల వరకు రాయితీ లభించేది. ఈ సొమ్ముతో సంఘాల పరిధిలోని కార్మికులకు కొంత వరకు ఊరట లభించేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒకేసారి రూ.60 లక్షల వరకు రాయితీ సొమ్ము కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో సంఘాలు మళ్లీ నష్టాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. చేనేత రంగంలోనూ నగదు బదిలీని అమలు చేయాలన్న సంకల్పంతోనే రిబేట్‌ను ఎత్తివేసిందని చెబుతున్నారు. సంఘాల్లో జరిగే ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని రిబేట్ మొత్తాన్ని నేరుగా సంబంధిత చేనేత కార్మికుని ఖాతాలో వేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల కాకుండానే రిబేట్‌ను ఎత్తివేయడం సబబు కాదని చేనేత రంగ నిపుణులు చెబుతున్నారు. ముందుచూపు లేని ఇలాంటి నిర్ణయాలు ఈ రంగం మనుగడపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడుదల కాని రూ.12.20 కోట్ల బకాయిలు రిబేట్ పథకం కేంద్రం ప్రవేశపెట్టిందే అయినా 20 శాతం రిబేట్‌లో 10 శాతం కేంద్రం, మరో 10 శాతం రాష్ర్టం భరించేవి. ఆ మేరకు ఆ రాయితీ సొమ్ము ప్రతి మూడు నెలలకొకసారి నేరుగా సంబంధిత చేనేత సహకార సంఘాలకు జమయ్యేది. ఇక నూలు పై 10 శాతం రిబేట్ పథకం పూర్తిగా రాష్ర్టప్రభుత్వానిదే. ఈ విధంగా జిల్లాలో ఉన్న సంఘాలకు రావాల్సిన రాయితీ, నూలుపై రిబేటు సొమ్ము గత కొన్నేళ్లుగా సక్రమంగా విడుదల కావడం లేదు. 2010 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని సంఘాలకు రూ.12.20 కోట్లకు పైగా రావలసి ఉంది. రిబేట్ కిం ద రాష్ర్టం నుంచి 2011-12 సంవత్సరానికి రూ.20 లక్షలు, 2012-13 సంవత్సరానికి రూ.25 లక్షలు, కేంద్రం నుంచి 2012-13 సంవత్సరానికి సంబంధించి రూ.25 లక్షలు విడుదల కావాల్సి ఉంది. వీటికి తోడు నూలు రిబేట్‌పై రాష్ర్టం నుంచి జిల్లాలోని సంఘాలకు రూ.3.5 కోట్లకు పైగానే రావలసి ఉంది. ఇక అమ్మకాలకు సంబంధించి ఆప్కో నుంచి చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయి మొత్తం రూ.8 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.