సమావేశంలో మోదీ
UP Assembly Elections 2022 ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మంగళవారం) ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా దాదాపు లక్షా 60 వేల మహిళా స్వయం సహాయక బృందాల బ్యాంక్ ఖాతాలకు నేడు ఆన్‌లైన్‌లో 1000 కోట్లను బదిలీ చేశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు. అంతేకాకుండా 202 టెక్ హోమ్ రేషన్ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో స్థానిక భాషలో మహిళా సంఘాలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ..
గ్రామానికే బ్యాంక్‌లు.. ఇంటివద్ద నుంచే డబ్బు విత్‌డ్రా!
యూపీలో మహిళల అభివృద్ధికి చేస్తున్న కృషిని దేశం మొత్తం చూస్తోంది. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం కింద లక్షలాది మహిళల ఖాతాలకు కోట్లాది రూపాయలను బదిలీ చేసే భాగ్యం ఈరోజు నాకు లభించింది. యూపీలో ప్రారంభించిన బ్యాంక్ సఖీ ప్రచార కార్యక్రమం మహిళల జీవితాల్లోనూ పెనుమార్పులు తీసుకొస్తుందని అన్నారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఖాతాకు వస్తుంది. ఐతే ఈ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే నేరుగా పొందవచ్చన్నారు. ఈ విధంగా బ్యాంకే గ్రామాలకు వచ్చి డబ్బునందిస్తుంది. కానీ ఇదేమీ చిన్న విషయం కాదు. 75 వేల కోట్లు బ్యాంక్ ఫ్రెండ్ల ద్వారా పంపిణీచేసే బాధ్యతను యూపీ ప్రభుత్వం అప్పగించింది. గ్రామాల్లో ఎంత ఎక్కువ లావాదేవీలు జరిగితే అంత ఆదాయం పెరుగుతుంది. క్రితం రోజుల వరకు సొంత బ్యాంకు ఖాతాలు కూడా లేని అక్కాచెల్లెళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఫిజికల్ బ్యాంకింగ్ అధికారం వారి చేతుల్లోకి నేరుగా వచ్చిందని ప్రధాని మోదీ సమావేశంలో అన్నారు.
కాగా త్వరలో ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!
చదవండి: Covid Alert: వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా మూడోవేవ్..
Comments
Please login to add a commentAdd a comment