ఓటమి భయంతోనే అయోధ్యలో పోటీకి వెనకడుగు: రాహుల్
అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఉన్న లోక్‌సభ స్థానంలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడించబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అయోధ్య పరాభవమే అక్కడా ఎదురవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఓడిస్తామన్నారు. ‘‘నేను చెబుతున్నది చాలా పెద్ద విషయం.
అయోధ్యలో బీజేపీని మట్టికరిపించడం ద్వారా అద్వానీ ప్రారంభించిన రామ మందిర ఉద్యమాన్ని కూడా ఇండియా కూటమి ఓడించింది’’ అని పేర్కొన్నారు! శనివారం అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ‘‘కొన్ని రోజుల క్రితం గుజరాత్ బీజేపీ నేతలు మనల్ని బెదిరించారు. మన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మనం గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్నే ధ్వంసం చేయబోతున్నాం.
బీజేపీని, మోదీని చిత్తుగా ఓడిస్తాం. ఇది రాసి పెట్టుకోవాలి. నూతన ఆరంభం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మోదీ విజన్ అనే గాలి బుడగ గుజరాత్‌లో ఇప్పటికే బద్దలైంది. వారణాసి లోక్‌సభ స్థానంలోనూ మోదీ తక్కువ మెజారీ్టతోనే గెలిచారు. అక్కడ మనం కొన్ని పొరపాట్లు చేశాం. లేదంటే మోదీ కచి్చతంగా ఓడేవారు. తొలుత అయోధ్యలో పోటీ చేయాలని మోదీ భావించారు.
అక్కడ గెలిచే అవకాశం లేదని, రాజకీయ కెరీర్‌కే తెర పడవచ్చని బీజేపీ సర్వేయర్లు చెప్పడంతో వారణాసికే పరిమితమయ్యారు’’ అని ఎద్దేవా చేశారు. దైవాంశసంభూతుడైన మోదీకి సామాన్య మానవుల కష్టాలు అర్థం కావడం లేదన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి పేదల భూములు లాక్కున్నారని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘హస్తం’ ప్రతి మతంలోనూ ప్రముఖంగా కనిపిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment