అందమైన జమ్మూకశ్మిర్‌ను దారుణంగా దెబ్బతీశాయి
ఇక్కడి ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయి
మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది
దోడా ఎన్నికల ప్రచార సభలో మోదీ
జమ్మూ: జమ్మూకశ్మిర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస పీల్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన జమ్మూకశ్మిర్‌ను ఇక్కడి వారసత్వ రాజకీయాలు దారుణంగా దెబ్బతీశాయని, పెనుశాపంగా మారి ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని మండిపడ్డారు. వారసత్వ రాజకీయ పారీ్టలు సొంత బిడ్డల సంక్షేమమే తప్ప ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నూతన నాయకత్వాన్ని పైకి ఎదగనివ్వలేదని ఆరోపించారు.
వారసత్వ రాజకీయాలకు పోటీగా నూతన నాయకత్వాన్ని ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇక్కడ నాయకత్వ నిర్మాణంపై దృష్టి పెట్టామన్నారు. శనివారం జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో భారీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అద్భుతమైన మెజారీ్టతో గెలిపించాలని ప్రజలను కోరారు.
నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ లాంటి పారీ్టలు మళ్లీ అధికారంలోకి వస్తే అధోగతేనని తేలి్చచెప్పారు. జమ్మూకశ్మిర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చనప్పుటి నుంచి జమ్మూకశ్మిర్ విదేశీ శక్తులకు టార్గెట్‌గా మారిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ ప్రాంత భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని స్పష్టంచేశారు. గత నాలుగు దశాబ్దాల్లో దోడా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. సభలో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం
‘‘ఉగ్రవాద భూతం వల్ల జమ్మూకశ్మిర్ యు వత తీవ్రంగా నష్టపోయారు. ఇక్క డ అధికారం వెలగబెట్టిన పారీ్టలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ కుటుంబ స్వామ్యాన్ని పెంచి పోషించాయి. యు వతను రాజకీయాల్లో ప్రోత్సహించలే దు. 2000 సంవత్సరం నుంచి పంచా యతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014 తర్వాత బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, జిల్లా డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగలేదు. మేము అధికారంలోకి వ చ్చాక ఆయా ఎన్నికలు నిర్వహించాం. యువ నాయకత్వానికి పెద్దపీట వేశాం.
వెండితెరపై మళ్లీ జమ్మూకశ్మిర్ అందాలు
ఉగ్రవాద బాధితురాలు షగున్ పరిహర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ కేటాయించాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా పెకిలించాలన్న మా అంకితభావానికి ఇదొక ఉదాహరణ. 2018 నవంబర్‌లో షగున్ తండ్రిని, బంధువును ఉగ్రవాదులు కాలి్చచంపారు. జమ్మూకశ్మిర్‌ను ఉగ్రవాద రహితంగా, పర్యాటకుల స్వర్గధామంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరిగే పరిస్థితి రావాలి. వెండితెరపై జమ్మూకశ్మీర్ అందాలు మళ్లీ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తారట!
కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ హామీల మధ్య తేడాలను ప్రజలు గమనించాలి. ఆరి్టకల్ 370ను మళ్లీ తీసుకొస్తామని ఆ మూడు పారీ్టలు చెబుతున్నాయి. అంటే ప్రజల హక్కులను మళ్లీ దోచుకుంటారట! రిజర్వేషన్లు, ఓటు హక్కును రద్దు చేస్తారట! ఆర్టికల్ 370తోపాటు ఆరి్టకల్ 35ఏ పునరుద్ధరిస్తే ఆడబిడ్డలను తీరని అన్యాయం జరుగుతుంది. మూడు పార్టీల మేనిఫెస్టో అమల్లోకి వస్తే పాఠశాలలు మళ్లీ అగి్నకి ఆహూతవుతాయి.
బీజేపీ నేతలను అరెస్టు చేయడమే కాంగ్రెస్ ఎజెండానా?
కాంగ్రెస్ పారీ్టకి ఏమాత్రం నిజాయతీ లేదు. అధికారంలోకి రావడానికి అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడం ఆ పారీ్టకి అలవాటే. అమెరికాలో భారతీయ జర్నలిస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరువిప్పుతారా? అని శామ్ పిట్రోడాను ప్రశ్నించింనందుకు గదిలో బంధించి దారుణంగా కొట్టారు.
ఇలా చేయడం మన దేశ గౌరవాన్ని పెంచుతుందా? కాంగ్రెస్ రాజకుటుంబం అత్యంత అవినీతిమయమైన కుటుంబం. వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఆ కుటుంబం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మరో 20 సీట్లు వచ్చి ఉంటే బీజేపీ నేతలను జైలుకు పంపించేవాళ్లమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అంటే వారి ఎజెండా అదేనా? మమ్మల్ని జైల్లో పెట్టడానికే కాంగ్రెస్‌కు అధికారం కావాలా? ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అక్కర్లేదా?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment