రేషన్‌కు మంగళం! | cash transfer scheme from public distribution system | Sakshi
Sakshi News home page

రేషన్‌కు మంగళం!

Published Thu, Apr 28 2016 12:23 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

cash transfer scheme from public distribution system

 ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇక నుంచి నగదు బదిలీ పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. గ్యాస్ వాడకందార్లకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని బ్యాంకు ఖాతాలకు జమచేసి డీలర్ల వద్ద మొత్తం చెల్లించుకోమని తీసుకొచ్చిన వ్యవస్థనే పౌరసరఫరాకు ఇక అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాపంపిణీ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి పథక రచన మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డీబీటీ (డెరైక్టు బెనిఫిట్ ట్రాన్‌‌సఫర్) విధానాన్ని రెండువిడతల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. గ్యాస్ వినియోగదారుల ఖాతాలకు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ రాయితీ జమ కావడం లేదు. ఇప్పుడు పౌరసరఫరా శాఖ పరిధిలోని ప్రజాపంపిణీ వ్యవస్థలో కూడా ఇదే అమలు చేస్తే పేదలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 శ్రీకాకుళం టౌన్:
 జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కానుందా..ప్రభుత్వ యోచన చూస్తే ఔననే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా 1999మంది డీలర్లు ఉపాధి పొందుతున్నారు. 8.17లక్షల రేషన్ కార్డులున్నాయి.  50,971 అంత్యోదయ, 1087 అన్నపూర్ణ కార్డులన్నాయి. ఈకార్డులకు ప్రతినెలా బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, కందిపప్పుపంచధార, కిరోసిన్ రాయితీపై అందిస్తున్నారు.   మిగిలిన సరకులపై రాయితీపై అందుతున్నాయి. వీటికి సంబంధించి రాయితీ మొత్తాలను ఇకపై కార్డుదారుని ఖాతాకు జమ చేస్తారు. ముందుగా గ్యాస్ తర హాలోనే నిత్యావసర సరకులకు వినియోగదారులే పూర్తి మొత్తాలు చెల్లించి కొనుగోలు చేసుకుంటే ఆమొత్తాలను ప్రభుత్వం నేరుగా వినియోగదారుని ఖాతాలకు జమ చేస్తుందని చెపుతున్నారు.
 
  గ్యాస్ వాడకంలో కేంద్ర ప్రభుత్వ రాయితీ అందుకునేందుకు ముందుగా ఆధార్, బ్యాంకు అకౌంట్లను గ్యాస్ డీలరుకు అందజేశారు. ఒక్కో వినియోగదారుడు నెలల తరబడి తిరిగినా ఇంతవరకు ఆ రాయితీ మొత్తాలు బ్యాంకు ఖాతాలకు చేరడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈవిధానం కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పటికే అనేక మంది గ్యాస్ కనెక్షన్లను అటకెక్కించేశారు. లోపభూయిష్టంగా ఉన్న ఈవిధానంలో ఆయిల్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారుు. జనానికి చెల్లించాల్సిన రాయితీలకు మంగళం పాడేస్తున్నారు. అటువంటి విదానాన్నే ప్రజాపంపిణీ వ్యవస్థలో తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధరలపెరుగుతున్న నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పేదలను ఆదుకుంటోంది.
 
  ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఈ-పాస్ విధానం అమలుతో 15శాతం కుటుంబాలు ప్రతినెలా నిత్యావసర సరకులు అందుకోలేక పోతున్నారు. దీంతో లక్ష కుటుంబాలు అధిక ధరలకు నిత్యావసర సరకును కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు నగదు బదిలీ విదానం అమలైతే నిత్యావసర సరకుల కోసం ముందే అధిక మొత్తాలు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది.   రెండు మూడు రోజులు మాత్రమే సరకుల పంపిణీ చేసి తర్వాత డీలర్లు ఆపేస్తున్నారు. రానున్న రోజుల్లో కిరాణా తరహాలో నిత్యం ప్రజలకు అందుబాటు అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులున్న వారైనా సరే రాయితీల వల్ల తక్కువధర చెల్లించి సరకులను తీసుకుంటూ ఇంటిల్లిపాది ఆకలిదప్పులు తీర్చుకుంటున్నారు. కొందరైతే బియ్యం మార్కెట్‌లో అమ్మేసినా మిగిలిన సరకులను కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. సరకులు కొనాలంటే పెద్ద మొత్తాలను దాచుకుంటే తప్ప కొనుక్కోలేరు. నగదు బదిలీ అమలైతే రాయితీ లేకుండా కొనాలంటే ముందుగానే పెట్టుబడి పెటటాలి. వ్యవసాయకూలీలు,నిరుపేదలకు ఈ స్తోమతు ఉండదు. ఏమైనప్పటికీ రేషన్‌కు నగదు బదిలీ పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement