సాక్షి, అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా.. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు సీఎం జగన్ అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ. 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఇంత భారీ ఎత్తున పేదల ఖాతాల్లో జమ చేయడం ఇదే తొలిసారి.
ఇది దేశంలో అన్ని వర్గాల ప్రజల చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసింది. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4,38,102.91 కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియో గం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగు పరుచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో పేదరికం 11.77 శాతం ఉంటే.. అది 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం.
అభివృద్ధికి ఊతం
♦ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్‌ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటతో ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది.
♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ.. ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో 1.80 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు.
♦ నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరి మితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు.
ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి రూ.13 వేల కోట్ల వ్యయం చేసి.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభమవగా.. వచ్చేవి ద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కానున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందిస్తున్నారు.
♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్‌లను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. గత 58 నెలల్లోనే రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే అందుకు తార్కాణం. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి.
♦ ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)ల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 35 శాతం ఉండటమే అందుకు తార్కాణం.
♦ విప్లవాత్మక సంస్కరణతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం.
♦ సీఎం జగన్ సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతిపథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాల్సిందేననే చైతన్యం విద్యావంతులు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో రగులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment