Nandyala town
-
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్‌దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్‌దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్‌దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్‌దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్‌గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్‌ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
మేమంతా సిద్ధం డే-2: సీఎం జగన్ బస్సు యాత్ర అప్డేట్స్
#MemanthaSiddham Day-2 Live Updates.. 05:55PM, March 28, 2024 నంద్యాల భారీ బహిరంగ సభలో సీఎం జగన్ నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోంది నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు వారిని అడ్డుకేనేందుకు ప్రజలంతా సిద్ధం సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు,బిజేపీ వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి 175 ఎమ్మెల్యే,25 ఎంపీ స్ధానాలు గెలిచి డబుల్ సెంచరీ కొడదాం గతంలో చంద్రబాబు అబద్ధాలు చూశాం..మోసాలు చూశాం వైఎస్సార్సీపీ ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లు కూడా ఓసారి ఆలోచించాలి వైఎస్సార్సీపీ ఐదేళ్లపాలనపై అందిరితో చర్చించండి ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి లంచాలు, వివక్షలేని సంక్షేమ పాలన అందించాం ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూల్స్ ఏర్పాటు చేశాం పౌర సేవలతో పాటు ప్రతి గ్రామంలో మహిళా కానిస్టేబుల్ ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి 58 నెలల్లో ప్రతి ఇంటి తలుపుతట్టి సంక్షేమం అందించాం పిల్లల చదువుల గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేదు నాడు నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చాం ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం 3వేల ప్రొసీజర్స్ చేర్చి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం రాష్ట్రంలో 10,600 విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటు చేశాం రైతులకోసం 10,700 ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చంద్రబాబు మూసేసిన డెయిరీలను తెరిపించి పాడిరైతులను ఆదుకున్నాం పేదల గుండెల్లో నాకు చోటు దక్కింది..అదే నాకు బహుమతి పేదల బతుకుల్లో మార్పు కోసమే నా ఆరాటం చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు బాబు పేరు చెబితే బషీర్ బాగ్ కాల్పులు,కరువు కాటకాలు గుర్తొ్స్తాయి 2014లో చంద్రబాబు రంగురంగుల హామీల ఇచ్చారు సూపర్ సిక్స్ అంటూ మళ్లీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారు రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణమాఫీ ఒక్కరూపాయి కూడా చేయలేదు ఆడబిడ్డ పుడితే రూ.24 వేలు ఇస్తామన్నారు..ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ప్రజలు యుద్దానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది 5:45PM, March 28, 2024 నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ నా దమ్ము, ధైర్యం సీఎం జగనే: శిల్పా రవిచంద్రారెడ్డి మనందరి వెనుక సీఎం జగన్ ఉన్నారు సీఎం జగన్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమైంది నంద్యాల చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ జనసంద్రంగా మారిన నంద్యాల ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులకు సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదం మేము సిద్దం రోడ్ షోలో తనను చూసేందుకు వచ్చిన అవ్వను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్ ►దీబగుంట్లకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర. దీబగుంట్లలో సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన జనం. యర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి.. యర్రగుంట్లలో సీఎం జగన్ మాట్లాడుతూ.. యర్రగుంట్లలో వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారు. యర్రగుంట్ల పరిధిలో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి జరిగింది. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం. ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఎర్రగుంట్లలో 1391 ఇళ్లకు 48.74కోట్లు అందించాం. అమ్మ ఒడి కింద 1043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు కోట్ల పైగా లబ్ధి చేకూరింది. ఆరోగ్యశ్రీ కింద రెండు కోట్లకుపైగా లబ్ధి చేకూరింది. చేదోడు కింద 31,20,000 లక్షలు లబ్ధి జరిగింది. వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇది. 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదు?. ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి. మొట్టమొదటి సారిగా స్కూల్స్ బాగుపడ్డాయి. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వైద్యం అందిస్తున్నారు. మీ బిడ్డ హయాంలోనే రైతన్నకు పెట్టుబడి సాయం అందించే మార్పు జరిగింది. మార్పు ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి. ►కార్యక్రమంలో వికలాంగుడైన లబ్దిదారుడు ప్రసాద్ మాట్లాడుతూ.. నేను, నా భార్య వికలాంగులం. మాకు పెన్షన్ ఆరు వేలు వస్తోంది. జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేం. సీఎం జగన్ గొంతులా మిమిక్రీ చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. ►మరో లబ్ధిదారుడు మాట్లాడుతూ.. తన కుమారుడికి ఆరోగ్య శ్రీ కింద ఎంతో మేలు జరిగింది. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేయాల్సిన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగింది. దీంతో, నా కుమారుడు మీ దయతో ఆరోగ్యంగా ఉన్నాడు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం జగన్ అని కితాబు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అందరూ కూడా రకరకాల జిమ్మిక్కులతో పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నారు. మీరు ఇవన్నీ గమనిస్తున్నారు కూడా. మీకు ఈరోజు రెండు విషయాలు చెబుతాను. సీఎం వైయస్ జగన్ 2019లో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలోకి వస్తే రైతు భరోసా, అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలను ప్రకటించారు. ఆ పాదయాత్రలో మీ మద్దతు చూరగొని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా ప్రతి ఒక్క హామీని ఎలాంటి దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా మీకే అందించారు. గత ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందివ్వకపోగా దాదాపు 650 హామీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం ఒకటే చెబుతున్నాం మాకు అధికారం ఇస్తే మీ గ్రామాలను మారుస్తాం, మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత అందిస్తామని ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తామని కోరుతుంటే ఇవాళ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో గమనించండి. ఒకడు అధికారంలోకి వస్తే మా దగ్గర ఎర్రబుక్కు ఉంది, అందులో పేర్లు ఉన్నాయని అంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలా? వాళ్ల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా? అని మీరందరూ ఆలోచన చేయాలి. ఇంకొకడు..మేం అధికారంలోకి వస్తే మీరు గుడుల్లో, బడుల్లో దాచి పెట్టుకోవాలి అంటాడు. మేం కూడా ఆళ్లగడ్డ వాళ్లమే, గుడుల్లో, బడుల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు కలలు మానుకోండి. అధికారంలోకి వచ్చేది వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎగిరేది వైఎస్సార్ కాంగ్రెస్ జెండా. 2019లో మీరు మంచి మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి మీకు పెద్దఎత్తున సంక్షేమం చేసే అవకాశం దొరికింది. కాబట్టి రానున్న రోజుల్లో మీకు, మీ కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుతున్నాను. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో, పాదయాత్రలో మన నుంచి విన్నారు దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్లీ వినడానికి వచ్చారు. పేదల కోసం పెత్తందారులందరితో యుద్ధం చేస్తున్నారు. ఈరోజు మన అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు ఒక సమయం వచ్చింది. సిద్ధమేనా మన అందరం. ►యర్రగుంట్లలో సీఎం జగన్. ►ఎర్రగుంట్లకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో సీఎం జగన్ ముఖాముఖి ►కాసేపట్లో ఎర్రగుంట్లలో మేధావులు, ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి ►ప్రజల నుంచి తన పాలనపై ఫీడ్‌బ్యాక్‌తో పాటు మరింత మెరుగుపర్చుకునేందుకు సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు అంబులెన్స్‌కు దారిచ్చి ప్రాణం కాపాడిన సీఎం జగన్.. ►బత్తులూరు సమీపంలో మేమంతా సిద్ధం యాత్ర ►సీఎం జగన్ కోసం బత్తులూరు ప్రజల ఎదురు చూపులు ► నల్లగట్టు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధం యాత్ర.. సీఎం జగన్ బస్సు యాత్రకు పూలు చల్లి స్వాగతం పలికిన గ్రామస్తులు పార్టీ శ్రేణులకు, అభిమాన ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ ► ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతున్న బస్సు యాత్ర ► ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. ►మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇది కూడా చదవండి: మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం జగన్ ►అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ►అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ కామెంట్స్.. విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది. ఎన్నికల కోసం @ncbn మేనిఫెస్టో ఇచ్చి.. గెలిచాక ప్రజలకు కనిపించకుండా దాచేస్తారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతో సిగ్గులేకుండా జతకడతారు. ఇందుకోసం ఢిల్లీదాకా వెళ్లి కాళ్ళు పట్టుకుంటారు. -సీఎం @ysjagan #TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/sd9LoyJcxJ — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్ గుర్తుపై రెండు మార్లు బటన్ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం. ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్‌గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్‌పై వచ్చి టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే. జననేతకు అడుగడుగునా ప్రజలు, పార్టీ శ్రేణుల నీరాజనం Memantha Siddham Yatra - Day 1.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/Lu0bmaA8Mb — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 -
రేపు సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 14న పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
‘డోన్’టాక్..!
సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను కలిసేందుకు యత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్ టికెట్ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీన్ ! ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్‌లతో హల్చల్ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం. వాడీవేడిగా విమర్శలు ! మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. -
విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ విశేష కృషి
సాక్షి, నంద్యాల: విద్యారంగంలో సీఎం జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. ‘వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాలలో ‘విద్యా సాధికారిత జగనన్నతోనే సాధ్యం’ అని తెలిపేలా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతినగర్‌లోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి శ్రీనివాస్ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. చైతన్య, సురేష్ మాట్లాడుతూ ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గిందన్నారు. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా బోధన, టోఫెల్ శిక్షణ తదితర కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చైర్మన్ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
అభిమానుల ‘ఆత్మీయ’ వరద
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆత్మకూరు పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కనుచూపు మేర ఎటుచూసినా, ఇసుకేస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. సుమారు 500 బైక్‌లతో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గజ మాలలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లతో తమ అభిమాన నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కరోనా కాటేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రశంసించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే.. నమ్మిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టే.. తామంతా కాలర్ ఎగరేసి ఓట్లడుగుతున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వారిని ఓట్లడుగుతారని ఎద్దేవా చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేశారు: మంత్రి కారుమూరి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన ప్రతి మాటనూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు పదవులు ఇవ్వలేదని, కేవలం సీఎం జగన్ మాత్రమే యాదవులకు సముచిత గౌరవం ఇచ్చారని చెప్పారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. తన కులం వారికి కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏనాడూ రాజ్యసభ టికెట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా సీఎం జగన్ కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనతో మాట్లాడిన మాటలను కారుమూరి గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఓ రిక్షా కార్మికుడు.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో నేను చదువుకుని అమెరికాకు రాగలిగా.. మా కుటుంబమంతా వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటుంది’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. దళితుల పట్ల నిబద్దతను చాటుకున్న సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు పూర్వకాలంలో దళితులు చదువుకుంటే నాలుక కోసేవారని, చెవుల్లో సీసం పోసేవారని.. కానీ, సీఎం జగన్ తన కేబినెట్లో ఓ దళితుడిని విద్యాశాఖ మంత్రిగా చేసి దళితుల పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2019లో 151 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పారని, 2024 ఎన్నికల్లో 175 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, తొగురు ఆర్థర్, కర్నూలు మేయర్ రామయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 20వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది. గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు జనం నీరాజనాలు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. ఉదయం 10.30 గంటలకు చిన్న మంగళాపురంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం జరగనుంది. 12.00 లకు మంగళాపురం గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. సాయంత్రం 3.30 కి పాలకొండ ప్రధాన సెంటర్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సాధికార యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు శకుంతలమ్మ డిగ్రీ కళాశాలలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం శకుంతలమ్మ కళాశాల నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 3:30 గంటలకు బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు హాజరుకానున్నారు. నంద్యాల జిల్లా: శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు మండలం నల్ల కాల్వ వద్ద వైఎస్సార్ స్మృతి వనంలో తటస్థులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం అనంతరం వైఎస్సార్ స్మృతివనం నుంచి ఆత్మకూరు వరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు హాజరుకానున్నారు. -
కుటుంబానికి పెద్ద దిక్కై.. దేశ సేవలో అమరుడై..
ఆ తల్లి కలలు చెదిరిపోయాయి. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నాడని గర్విస్తున్న తల్లిదండ్రులకు ఆనందం అంతలోనే ఆవిరైంది. మరో రెండు నెలల్లో సెలవులకు వస్తానని చెప్పిన రెండు రోజులకే విగతజీవిగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడిలో నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన జవాన్ శిరిగిరి సురేంద్ర వీర మరణం పొందారు. నిన్న మొన్నటి వరకు కళ్లెదుట తిరగాడిన యువకుడు ఇక లేడనే చేదు నిజాన్ని ఆ గ్రామం జీర్ణించుకోలేకపోతుంది. నంద్యాల: దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర (ఆర్మీ నెం:15631599కే) నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ప్రస్తుతం బారాముల్లా ఆర్ఆర్ బెటాలియన్ యూనిట్ నెంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31వ తేదీ మధ్యాహ్నం జరిగిన మిలిటెంట్ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. సురేంద్ర సొంతూరు పాములపాడు మండలం మద్దూరు గ్రామ పంచాయతీలోని మజరా కృష్ణానగర్ గ్రామం. గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమైంది. ఎకరా పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు కుమారులను బాగా చదివించారు. పెద్ద కుమారుడు సుమన్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, చిన్న కుమారుడు సురేంద్ర 2019లో ఆర్మీలో చేరారు. నాలుగు నెలల క్రితం సెలవుపై గ్రామానికి వచ్చి రెండు నెలలు కుటుంబీకులతో ఆనందంగా గడిపాడు. తిరిగి వెళ్లిన రెండు నెలలకే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సురేంద్ర మృతితో విషాదం నెలకొంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శ్రీనగర్‌కు చేర్చారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్‌కు విమానంలో తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో అర్ధరాత్రి కృష్ణానగర్‌కు తరలించారు. విగతజీవిగా తిరిగి వచ్చిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీఓ గోపీకృష్ణ, ఈఓపీఆర్డీ శ్రీనివాసనాయుడు గ్రామానికి చేరుకుని జవాన్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. నాన్నకు డబ్బులు పంపి.. అన్నకు మెసేజ్ చేసి.. ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన సురేంద్ర తరచూ కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అక్కడి విషయాలు పంచుకునేవారు. తల్లిదండ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేవారు. ఈ విషాద ఘటనకు ముందు రోజు ఆదివారం తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి సెలవులు మంజూరయ్యాయని, సెపె్టంబర్ నెలాఖరులో ఇంటికొస్తానని ఆనందంగా చెప్పారు. అలాగే మరణానికి కొన్ని గంటల ముందు సోమవారం ఉదయం 9.30 గంటలకు తండ్రి సుబ్బయ్య బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు జమ చేశాడు. ఆ విషయాన్ని తన సోదరుడు సుమన్ సెల్‌కు మెసేజ్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత మూడు గంటల్లోనే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సుబ్బయ్యకు ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుమారుడి మరణం గురించి తెలపడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాన్ సురేంద్ర 1 నుంచి 7వ తరగతి వరకు కృష్ణానగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు పాములపాడు జెడ్పీ స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో, డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ వెలుగోడులో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకుగా ఉండే సురేంద్ర 2019 మార్చి 31న ఆర్మీలో చేరారు. కాగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే 31వ తేదీన వీర మరణం పొందడం విషాదం. మాజీ సైనికుల సంక్షేమ సంఘం సంతాపం కర్నూలు(అర్బన్): వీర జవాన్ సురేంద్ర మృతి పట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షలు నర్రా పేరయ్య, కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి నజీర్‌అహమ్మద్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కృష్ణానగర్‌లో జరిగే అంత్యక్రియలకు జిల్లా సైని క సంక్షేమ అధికారిణి ఆర్ రత్నరూత్, ఎన్సీసీ గ్రూప్ నుంచి సుబేదార్ రవీంద్రసింగ్‌తో పాటు తాము కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. -
కొత్తగా మూడు గురుకుల జూనియర్ కళాశాలలు మంజూరు
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మరో మూడు కొత్త జూనియర్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో 14 జూనియర్ కాలేజీలు ఉండగా, కొత్తగా మంజూరైన వాటితో కలిపి ఆ సంఖ్య 17కు చేరింది. కొత్త జూనియర్ కాలేజీలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బేతంచర్ల(బాలురు), చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సదూం(బాలురు), శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస(బాలికలు) కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఒక్కో కాలేజీలో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు చొప్పున కేటాయించారు. కాగా, రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మొత్తం 105 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 17 జూని యర్ కాలేజీలు కాగా, మిగిలిన 88 పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. నీట్, జేఈఈలో బీసీ విద్యార్థుల ప్రతిభ నీట్, జేఈఈ పరీక్షల్లో బీసీ విద్యార్థులు ప్రతిభ చూపారని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. వాటి ఫలితాలను అంచనా వేస్తే మెడికల్ సీట్లు నలుగురు, డెంటల్ ఒకరు, వెటర్నరీ నలుగురు, అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు నలుగురు సాధించే అవకాశం ఉందని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ ఆరుగురు విద్యార్థులు, ఇంజినీరింగ్ సీట్లు 24 మంది సాధించనున్నారని వివరించారు. -
మనసే దేవాలయం
మన ఊరు: ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత సంపాదించినా.. సొంత ఊళ్లో లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. కనీసం పండగలు, పబ్బాలకైనా అక్కడ కాలు మోపకపోతే జీవతమే వృథా అనిపిస్తుంది. మన గుడి: ఊరు అన్నాక గుడి ఉంటుంది.. బాల్యం అన్నాక ఆ గుడిలో తిరిగే ఉంటాం. కులమతాలకు అతీతంగా ఆడిపాడుతూ కలిసి తిరిగే చోటు కావడంతో ప్రతి ఒక్కరి జీవితం ఈ గుడితో ముడిపడి ఉంటుంది. మన బాధ్యత: ఓ సినిమాలో చెప్పినట్లు తిరిగివ్వకపోతే లావై పోతాం. ఇది అక్షరాలా నిజం. పుట్టిన ఊరును మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే. ఇక తిరగాడిన గుడి కూడా అంతే. దేవాలయాన్ని శుభ్రం చేస్తే మనసును కడిగేసినట్లే. ‘‘అక్కా ఆ పొరక ఇలా అందుకో.. అన్నా ఆ చెట్టు కొమ్మలు కత్తరిద్దాం.. తమ్ముడూ గుడి గోపురం నీళ్లతో కడుగుదాం.. చెల్లీ నవగ్రహాలను శుభ్రం చేద్దాం.. వదినా ఆ చెత్తంతా పోగు చేద్దాం.. సార్ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దాం.. అమ్మా బండలను నేను తుడుస్తా.. పిల్లలూ ఆ మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త. ఏంటండీ బరువు ఎక్కువగా ఉందా, ఉండండి నేనూ ఓ చేయి వేస్తా.’’ ఏంటీ ఇదంతా ప్రతి ఇంట్లో కనిపించే సందడే కదా అనుకుంటున్నారా? కాదు.. ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఆ దైవమే కుటుంబాన్ని ఏర్పరిచింది. ఆప్యాయతను పంచుకునేలా చేసింది.. దూరమవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తోంది. ఇదీ జగమంత కుటుంబం. – సాక్షి, కర్నూలు డెస్క్ 12మే 2022 ఏకాదశి రోజున.. గుంటూరులో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా పని చేస్తున్న శివకుమార్‌రెడ్డి స్వస్థలం నంద్యాల. సెలవు రోజుల్లో దేవాలయాలను శుభ్రం చేస్తే మంచి జరుగుతుందనే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను అందిపుచ్చుకుని ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించారు. ఆ మేరకు మిత్రులు, పరిచయం ఉన్న వ్యక్తులకు ఫోన్లు చేసి, వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చి కొందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అలా పట్టణంలోని నందీశ్వరాలయాన్ని చేసేందుకు నిర్ణయించగా, మొదట 150 మందికి తెలియజేయగా 50 మంది సుముఖత వ్యక్తం చేశారు. అయితే ముందురోజు రాత్రి వర్షం కారణంగా 13 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ముందుగా నిర్ణయించుకున్నట్లు ఉదయం 5 గంటలకు ఆలయానికి చేరుకొని అనుకున్న కార్యాన్ని నాలుగు గంలల్లో పూర్తి చేశారు. కమిటీ నిర్ణయం మేరకు.. ఏ ప్రాంతానికి వెళ్లాలి, ఏ గుడిని ఎంపిక చేసుకోవాలనే విషయమై కమిటీ సభ్యులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సంబంధిత గుడి అధికారులకు సమాచారం అందించి అనుమతి పొందుతారు. అనంతరం ఈ విషయమై వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తారు. గుడిని శుభ్రం చేసేందుకు అవసరమైన సామగ్రిని సొంత డబ్బుతోనే కొనుగోలు చేస్తున్నారు. నెలలో రెండు గుడులు చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్తీక మాసానికి ముందు నవ నందుల ఆలయాన్ని ఒకేరోజు 900 మందితో కలిసి సేవ చేశారు. ఇప్పటి వరకు 32 గుడులను శుభ్రం చేయగా.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించడంతో పాటు దైవనామ స్మరణతో భక్తిభావం పెంపొందిస్తుండటం విశేషం. దేవుడిచ్చిన బంధాలు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. బూతద్దం పెట్టి వెతికినా అన్నదమ్ములు కలిసుంటున్న కుటుంబాలు ఎక్కడో కానీ కనిపించవు. ఈ పరిస్థితుల్లో బంధువులు దూరమవుతుండగా, బంధుత్వాలు శుభకార్యాలకే పరిమితం అవుతున్నాయి. అలాంటిది మన ఊరు, మన గుడి, మన బాధ్యతలో భాగంగా సేవకులంతా ఓ కుటుంబంగా మారిపోతున్నారు. పిలుపులో ఆప్యాయత కనిపిస్తోంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం చూస్తున్నాం. ఈ బంధం ఇక్కడితో ఆగిపోకుండా తిరిగి ఊరికి చేరుకున్న తర్వాత కూడా ఆయా కుటుంబాలు తరచూ కలసిమెలసి ఉండటం చూస్తే కార్యక్రమం ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతోంది. సహపంక్తి భోజనం ఒక ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటే.. ఎవరు ఏ సమయానికి భోజనం చేస్తారో తెలియని పరిస్థితి. ఇంతకు ముందు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తింటే తప్ప సంప్తి కలిగేది కాదు. కాలంతో పోటీ పడే రోజులు కావడంతో ఎవరి పనుల్లో వాళ్లు బిజీ కావడంతో కలసి భోజనం చేయడమనే మాటే లేకుండా పోతోంది. అలాంటిది ఈ కార్యక్రమం సభ్యులందరినీ ఓ కుటుంబంగా మార్చేస్తుంది. కార్యక్రమం మధ్యలో అందరూ ఎంచక్కా విస్తరాకులు వేసుకొని ఒక్క చోట కూర్చొని భోజనం చేయడం ఆలయానికి వచ్చే భక్తులను సైతం ఆలోచింపజేస్తోంది. గోమాత గోళ్లు కత్తిరిస్తూ.. ‘మన ఊరు.. మన గుడి.. మన బాధ్యత’ దేవాలయాలకే పరిమితం కాలేదు. గోవులకు గోర్లు పెరిగి నడవటానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన సభ్యులు వాటి సేవకు నడుంబిగించారు. ఇలాంటి గోవులను గుర్తించి హాఫ్ ట్రిమ్మింగ్, గిట్టలు సరిసేసే కార్యక్రమాన్ని కూడా తరచుగా చేపడుతున్నారు. ఇప్పటి వరకు 15 ఆవుల కన్నీటిని తుడిచి నడక సజావుగా సాగేందుకు దోహదపడ్డారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తిరుమల, తిరుపతి.. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మంత్రాలయంలోనూ గోవుల గోళ్లు కత్తిరించేందుకు మానవతామూర్తులు ముందుకు రావడం విశేషం. ఆర్యోగం కూడా.. గుడి శుభ్రం చేయడం ద్వారా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని సేవకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో తెలియకుండానే ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ బృందంలోని ఓ సభ్యుడు ప్రతి రోజూ ఉదయాన్నే 6వేల నుంచి 7వేల అడుగుల నడక కొనసాగిస్తారు. అయితే ఈ కార్యక్రమం వల్ల దినచర్య కాస్త మారినా, కార్యక్రమం నిర్వహణలో భాగంగా 10వేలకు పైగా అడుగులు పడటం చూస్తే ఆరోగ్యానికి ఏ స్థాయిలో సహకరించిందో అర్థమవుతుంది. ఇంటి వద్ద కనీసం నడిచేందుకు కూడా ఆరోగ్యం సహకరించని వృద్ధులు సైతం గుడిని శుభ్రం చేసేందుకు శక్తినంతటినీ కూడగట్టుకొని ఉత్సాహంగా కలియతిరగడం విశేషం. మానసిక ప్రశాంతత మా చిన్ననాటి స్నేహితుల కలయికకు గుర్తుగా నంద్యాలలోని ఓ పార్కును 2015లో స్వచ్ఛ భారత్ పార్కుగా తీర్చిదిద్దాం. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో 2015లో రూపుదిద్దుకున్న ఈ పార్కు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా 2016లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ అవార్డును కైవసం చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి. ఆ తర్వాత స్నేహితులంతా కలిసి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. తాజాగా ఆలయాలను శుభ్రపరిచే బృహత్ కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నాం. ఇది మానసిక ప్రశాంతతో పాటు మానవతా విలువలను నేర్పుతోంది. – శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, గుంటూరు -
AP: ప్రభుత్వ నిర్ణయాల్ని ఓ అధికారి శాసించలేరు: హైకోర్టు
సాక్షి, అమరావతి: నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (ఆర్‌ఏఆర్‌ఎస్) చెందిన 50 ఎకరాలను ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ వర్సిటీ గతేడాది చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ భూములను వైద్య కళాశాల కోసం బదలాయించడం ప్రజాప్రయోజనాలకు ఎంతమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. వ్యవసాయ పరిశోధనతో ముడిపడి ఉన్న ప్రజాప్రయోజనాల కంటే వైద్య కళాశాల ఏర్పాటుతో ముడిపడి ఉన్న ప్రజాప్రయోజనాలు సర్వోత్కృçÙ్టమైనవని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఓ విధాన నిర్ణయం తీసుకున్న తరువాత శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు వంటి ప్రజాప్రయోజనం నిమిత్తం భూమి కేటాయించిన తరువాత ఆ విధాన నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం కింద పనిచేసే అధికారి ప్రభుత్వ నిర్ణయాలను శాసించేందుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. వ్యాజ్యాలివీ.. నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఇతర భూములేవీ లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వ్యవసాయ వర్సిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరథరామిరెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ‘ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. నంద్యాలలో ఎక్కడా వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన భూమి లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమిని తీసుకోవాల్సి వచ్చింది. వైద్య కళాశాల కోసం ఇప్పుడు తీసుకున్న 50 ఎకరాల భూమిని వ్యవసాయ పరిశోధన కోసం మాత్రమే కేటాయించారన్న పిటిషనర్ల వాదన సరికాదు. 2015లోనే వ్యవసాయ వర్సిటీకి 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు వైద్య కళాశాల కోసం తీసుకుంటున్న 50 ఎకరాలకు బదులుగా మరో 50 ఎకరాలను అదనంగా ప్రభుత్వం కేటాయించింది. ప్రజలందరికీ తగిన వైద్య సదుపాయం కల్పించడం సమాజ మౌలిక అవసరం. ప్రతి ప్రభుత్వం కూడా ఇందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. తాము జోక్యం చేసుకోవాల్సినంత ప్రజాప్రయోజనాలు ఈ వ్యాజ్యాలలో లేవని పేర్కొంది. కాగా, కొత్తగా కలెక్టరేట్ కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రం భవనాలను వినియోగించుకోవడంపై దాఖలైన పిల్‌ను సైతం కొట్టేసింది. -
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, నంద్యాల: టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి కుమారుడు ఏవీ చంద్రమౌళి రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. చంద్రమౌళి హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురికావడంతో.. ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. అయితే, చంద్రమౌళి మృతిపై ధర్మారెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లి.. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా చంద్రమౌళి రెడ్డి అకాల మరణంపై సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు.. చంద్రమౌళి రెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి, కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. -
నంద్యాల ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత
-
చిన్నారికి సీఎం వైఎస్ జగన్ భరోసా
-
నాడు.. దోచుకో.. పంచుకో.. తినుకో 'నేడు నేరుగా లబ్ధి'
మూడేళ్ల నాలుగు నెలల్లో మీ బిడ్డ బటన్ నొక్కి అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. అప్పట్లోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పుల గ్రోత్‌రేట్ కూడా అప్పటి కంటే ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు? అని ఆలోచించాలని అడుగుతున్నా! అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు దోచుకో, పంచుకో, తినుకో అనేలా డీపీటీ అనే పథకం అమలయ్యేది. ఈ రోజు మీ బిడ్డ ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’తో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా మీ ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. అప్పట్లో అంత దోచుకున్నా ఎవడూ రాయడు, ప్రశ్నించడు. కారణం.. వీరందరిదీ గజదొంగల ముఠా కాబట్టి! దేవుడి దయతో, మీ అందరికీ మంచి చేసే పరిస్థితులు రావాలని, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా సంస్థలు కూలిపోవాలని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని త్రికరణ శుద్ధిగా విశ్వసించి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అన్నదాతకు ఇంతగా తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ, ఎక్కడా లేదని మీ బిడ్డగా చెప్పేందుకు గర్విస్తున్నానన్నారు. ప్రతి పథకాన్ని క్రమం తప్పకుండా కాలెండర్లో పేర్కొన్న ప్రకారం అమలు చేస్తూ ప్రతి కుటుంబానికీ అండగా నిలిచామన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రారంభించారు. బటన్ నొక్కి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096 కోట్లు జమ చేశారు. రైతులకు మెగా చెక్ అందచేసి లబ్ధిదారులతో ముచ్చటించారు. వారితో కలసి గ్రూపు ఫోటో దిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 82 శాతం చిన్నకారు రైతులకు ప్రయోజనం మూడేళ్ల నాలుగు నెలల పాలనలో దేశంలోని 27 రాష్ట్రాలలో ఎక్కడా లేనివిధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచిస్తే కేవలం అర హెక్టార్ అంటే 1.25 ఎకరాలలోపు ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టార్ వరకూ అంటే 2.5 ఎకరాలు ఉన్న రైతులు 82 శాతం ఉన్నారు. వీరికి ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న రైతుభరోసా సొమ్ము దాదాపు 80 శాతం పెట్టుబడి ఖర్చులకు సరిపోతుంది. అన్నదాతలు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. పంట వేసే సమయానికి పెట్టుబడి సొమ్ము చేతికందాలి. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా, పారదర్శకంగా ఖాతాల్లో ఈ డబ్బులు మూడు విడతల్లో జమ చేస్తున్నాం. ఏటా ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మే నెలలో రూ.7,500, పంటలు కోతకు వచ్చేముందు అక్టోబర్‌లో మరో రూ.4 వేలు, సంక్రాంతి సందర్భంగా జనవరిలో మరో రూ.2 వేలు కలిపి మొత్తం రూ.13,500 రైతన్నల చేతిలో పెడుతున్నాం. మూడున్నరేళ్లలో వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ ద్వారా దాదాపు 50.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.25,971 కోట్లకుపైగా నేరుగా జమ చేశాం. అంటే ఏటా దాదాపు రూ.7 వేల కోట్లను రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.51 వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. కౌలు, గిరిజన రైతులకూ భరోసా పట్టా భూములున్న రైతులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కౌలు రైతులు, దేవదాయశాఖ భూములు సాగు చేస్తున్న వారు, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు కూడా రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందచేసి మంచి చేయగలుగుతున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయానికి సాయంగా, అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు వ్యయం చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సభకు హాజరైన భారీ జన సందోహం మాఫీ పేరుతో బాబు మోసం చంద్రబాబు పాలన చూశారు.. మన పాలన చూస్తున్నారు. తేడా ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. దీంతో రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి కాకుండా తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలుగుతున్నారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో వడ్డీలేని రుణాల కింద చెల్లించింది రూ.685 కోట్లు మాత్రమే. 2016 అక్టోబర్ నుంచి ఆ పథకాన్ని రద్దు చేశారు. మీ బిడ్డ తిరిగి ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో రూ.1,282 కోట్లు చెల్లించామని సగర్వంగా చెబుతున్నా. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో రూ.3,64,624 కోట్లు అందితే ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల పాలనలోనే రూ.5,48,518 కోట్లు అందచేశాం. తేడా గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో పంటల బీమా ప్రీమియంలో రైతులు, ప్రభుత్వం వాటాలు చెల్లించాలి. ఈ రెండూ సక్రమంగా జరగకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్‌లో నష్టం వాటిల్లింది. ఆ ఐదేళ్లలో 30.80 లక్షల మందికి రూ.3,412 కోట్లు మాత్రమే బీమా పరిహారంగా దక్కితే ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684 కోట్ల బీమా సొమ్ము రైతుల ఖాతాల్లోకి జమ అయింది. తేడా మీరే గమనించండి. రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు హయాంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇన్‌ఫుట్ సబ్సిడీ పేరుకే ఉండేది. ఎప్పుడు వస్తుందో? ఎవరికి వస్తుందో? తెలియదు. చివరకు 2017–18, 2018–19 కాలానికి రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల్లో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,800 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందచేశాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపే డబ్బులు జమ అవుతున్నాయి. ఈ – క్రాప్ డేటాతో సహా సోషల్ ఆడిట్‌తో పారదర్శకంగా ప్రతీ రైతన్నకు తోడుగా నిలుస్తున్నాం. ఇవాళ ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు క్రమం తప్పకుండా అందుతోంది. గొప్ప మార్పు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ప్రతీ గ్రామంలో రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనం మొదలు పంట విక్రయం వరకూ వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఈ – క్రాపింగ్ ప్రతీ గ్రామంలో నమోదవుతోంది. ఈ– డేటా ఆధారంగా ప్రతీ రైతుకు, ప్రతీ పథకం వివక్ష, లంచం లేకుండా నేరుగా అందుతోంది. పరిహారం అందని కుటుంబం ఒక్కటీ లేదు రైతన్నలు ఎవరైనా దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే గతంలో సానుభూతి కూడా చూపలేదు. అసలు ఆత్మహత్య చేసుకున్నవారు రైతులే కాదనే మాటలు వినిపించేవి. ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పాసు పుస్తకాలున్న అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం అందని రైతన్నలు ఒక్కరంటే ఒక్కరూ లేరు. సీసీఆర్టీ కార్డులున్న కౌలు రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే వారికీ పరిహారం అందించాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆర్బీకేలను యూనిట్‌గా తీసుకుని అర్హులెవరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో మంచి చేస్తున్నాం. పగటిపూట 9 గంటల ఉచిత కరెంటు, కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలు, ఆక్వా రైతులను ఆదుకోవడం, రైతులను భాగస్వాములుగా చేసి ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్ల ఏర్పాటు, వ్యవసాయ ఉపకరణాలను కమ్యూనిటీ సెంటర్ల ద్వారా అందించడం, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధర లభించేలా అమూల్ సంస్థను తేవడం లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఇషాక్‌బాషా, ఎమ్మెల్యేలు బిజేంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్థర్, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. మన ఖర్మ ఏమిటంటే.. మన ఖర్మ ఏమిటంటే గొప్ప మార్పులు జరుగుతున్నా, పండ్లు కాసే చెట్టుకే రాళ్లు పడతాయి అన్నట్లు రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నా ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఒక దత్తపుత్రుడు రాష్ట్రంలో ఏం చేస్తున్నారో మీకు తెలిసిందే. వారి చేతిలో మీడియా ఉంది. వారు రాసిందే రాత. వారు ఏం చూపిస్తే అదే జరుగుతుందనే భ్రమలో ఉన్నారు. గర్వం పెరిగిపోయింది. వారికి చెందిన వ్యక్తి సీఎం స్థానంలో లేరు కాబట్టి ఆయన్ను తెచ్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు. ఆనాటికి, ఇప్పటికి తేడా గమనించాలని అడుగుతున్నా. ఆ రోజు కంటే ఈ రోజు మన బతుకులు బాగున్నాయా? లేదా? అనేది మీరు గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే. పరిపాలన ఎలా సాగిందో మీరంతా చూసిన వారే. కేవలం రైతుల కోసం మీ బిడ్డ రూ.1,33,527 కోట్లు ఖర్చు చేశాడు. ఇది మీ ప్రభుత్వం. మీ బిడ్డ బటన్ నొక్కి మూడున్నరేళ్లలో అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేకుండా పారదర్శకంగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్లింది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నా. నాడు ఏటా కరువే.. నేడు తావే లేదు దేవుడి దయ, మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనను గమనిస్తే 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359 మండలాలు, 2016లో 301 మండలాలు, 2017లో 121 మండలాలు, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో మరో 257 కరువు మండలాలు ప్రకటించారు. చంద్రబాబు, కరువు రెండూ కవల పిల్లలే అన్నట్లుగా పాలన సాగింది. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. మంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ వరకూ సాధారణ వర్షపాతం 668 మిల్లీమీటర్లు కాగా ఈ సీజన్లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 4 శాతం అధికంగా వర్షాలు కురిసి రాష్ట్రం కళకళలాడుతోంది. 21 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైతే ఐదు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ కురిసింది. గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలను తీసుకున్నా మూడేళ్ల నాలుగు నెలల్లో ఏ ఒక్క ఏడాదీ ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబు పాలనతో పోల్చితే పంటల విస్తీర్ణంతో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. నాడు ఐదేళ్లలో సగటున 154 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా మన ప్రభుత్వంలో 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 13.24 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ప్రతీ గ్రామంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారని ఈ దిగుబడులే చెబుతున్నాయి. దీంతోపాటు వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కార్మికులకు కూడా మంచి జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల నాలుగు నెలల్లో ప్రతీ రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో కూడా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దివ్యాంగురాలికి ముఖ్యమంత్రి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తక్షణ సాయం నంద్యాల: అనారోగ్యంతో బాధపడుతూ తనను కలిసిన ఓ దివ్యాంగురాలికి నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా కల్పించారు. నంద్యాల జగజ్జననీనగర్కు చెందిన హేమపావని మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. వైద్యం చేయించుకునే స్థోమత ఆ కుటుంబానికి లేదు. సీఎం జగన్ సోమవారం ఆళ్లగడ్డ వస్తున్న విషయం తెలుసుకొని బాధితురాలు తండ్రి శ్రీనివాసులుతో కలిసి హెలిపాడ్ వద్దకు వచ్చింది. సీఎంను కలసి తన సమస్యను మొరపెట్టుకుంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిని పిలిచి బాధితురాలి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తనకు వివరాలు ఇవ్వాలని సూచించారు. అంతేగాకుండా తక్షణమే ఆ బాలికకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. భయం పోయింది.. నాకు ఏడెకరాల పొలం ఉంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం అంటే పండుగ అయింది. భయం పోయింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా రూ.48 వేలు వచ్చాయి. ఇప్పుడు మరో రూ.4 వేలు జమ కానున్నాయి. అంతేకాకుండా పంట నష్టం కింద రూ.30 వేలు వచ్చిందన్నా. రైతులంతా సీహెచ్ఎస్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సబ్సిడీపై ట్రాక్టర్, టిల్లర్, కంకుల మిషన్ తీసుకున్నాం. దీనికి రూ.13.50 లక్షలు కాగా సబ్సిడీ కింద రూ.5.40 లక్షలు ఖాతాలో జమ అయ్యాయి. గతంలో మందు మూటెలు (ఎరువులు) కావాలంటే మండల కేంద్రం శిరివెళ్లకు వెళ్లి క్యూలైన్లలో నిలుచుని అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు గ్రామంలోని ఆర్బీకేలో మందు బస్తాలు అందచేస్తూ అటు నుంచి అటే పొలానికి వెళ్లి చల్లుకునేలా చేశావన్నా. రెతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? – గుర్రప్ప ,రైతు, కోటపాడు నిన్ను చూడాలని.. గతంలో రెండు సార్లు వరి పంట నష్టపోవడంతో బాధపడ్డా. మళ్లీ పంట వేయకముందే పంట నష్టం కింద రూ.40 వేలు జమ చేశారు. బ్యాంకులో రూ.20 వేలు తీసుకుంటే సున్నా వడ్డీ కింద రూ.3 వేలిచ్చారు. అధికారులే మా దగ్గరకు వచ్చి వివరించి ప్రయోజనం చేకూరుస్తున్నారు. మీరు సీఎం అయ్యాకే మా నాన్నకు పింఛన్ వచ్చిందన్నా. నాన్నకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె జబ్బుకు, కంటి వెలుగు కింద అమ్మకు కంటి ఆపరేషన్ చేశారు. వాళ్లిద్దరూ నిన్ను చూడాలని మీటింగ్‌కు వచ్చి జనంలో కూర్చున్నారన్నా. మానాన్న బతికారంటే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చలువే కారణం. రైతుల కోసం మీరు చేపడుతున్న పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. – కృష్ణ నాయక్, రైతు, బాచేపల్లె తాండ ఆర్బీకేలతో రైతన్నలకు అండగా ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్, ఇన్సూరెన్స్ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా నిలిచి ప్రతి పథకం అందిస్తూ నష్టపోకుండా చూస్తున్నాం. చంద్రబాబు హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అంతా కల్తీనే. వీటితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్రంలో కేవలం 12 ల్యాబ్‌లు మాత్రమే చంద్రబాబు పాలనలో ఉండగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 147 ల్యాబ్‌లు నియోజకవర్గ స్థాయిలో కనిపిస్తున్నాయి. 70 ల్యాబ్‌లు ఇప్పటికే పూర్తై రైతులకు సేవలు అందిస్తున్నాయి. తక్కిన 77 నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో రెండు ల్యాబ్‌లు, 4 ప్రాంతీయ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. -
అది ప్రభుత్వ విధాన నిర్ణయం
సాక్షి, అమరావతి: జిల్లాకు ఏ పేరు పెట్టాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిల్లాకు ఫలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం న్యాయస్థానం పని కాదని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఏదైనా జిల్లాకు లేదా పట్టణానికి రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, యోగి, ఇతర ప్రఖ్యాత వ్యక్తి పేరు పెట్టడం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టంచేసింది. ఒకవేళ కోర్టు అలాంటి ఆదేశం ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు లేదా ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. జిల్లాలకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన చట్టం ఏదీ లేదని చెప్పింది. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. -
నంద్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: నంద్యాలలో వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించడాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంటూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు దరఖాస్తు సమర్పించామన్నారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నాటికి భవన నిర్మాణం చేపట్టకపోతే వైద్య కళాశాల అనుమతులు రద్దవుతాయన్నారు. అంతేకాక అమూల్యమైన విద్యా సంవత్సరం వృథా అవుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పంపిన వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం అదనపు ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. వైద్య కళాశాల భవన నిర్మాణానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిర్మాణం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం .. భద్రాచలాన్ని తిరిగి ఆంధ్రాలో కలపాలి) -
థ్యాంక్స్ అన్నది చిన్న మాట.. జగనన్నకు రుణపడి ఉంటాం
సాక్షి, నంద్యాల: ఉన్నత విద్యకు ఆలంబన లక్ష్యంతో పేద విద్యార్థుల చదువుకు ఫీజుల ఖర్చులను పూర్తిగా భరించడం. భోజన, వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యార్దుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం నంద్యాలలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద రెండో విడతలో 10, 68, 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సభలో.. సీఎం జగన్ ఎదుట నంద్యాలకు చెందిన విద్యార్థిని కరణం బృహతి మానస మాట్లాడుతూ.. తాను శ్రీ రామకృష్ణ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు తెలిపింది. జగనన్న అందిస్తున్న వసతి దీవెన పథకం కింద ఏడాదికి రూ. 20 ఇవ్వడం తన లాంటి మధ్య తరగతికి చెందిన కుటుంబాల అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పింది. నవరత్నాల్లో భాగంగా విద్యా దీవెనను ప్రవేశపెట్టినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. వసతి దీవెన పథకం వల్ల ఎంతో మంది విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం అందించే రూ. 20వేల ద్వారా ట్రాన్స్పోర్ట్ చార్జీలు, హాస్టల్స్ చార్జీలు, పౌషికాహారం అందుతోందని సంతోషం వ్యక్తం చేసింది. అమ్మఒడి పథకం వల్ల తన తమ్ముడు శ్రీరామ చంద్ర బడిలో మంచిగా చదువుకుంటున్నాడని తెలిపింది. తన లాంటి ఎంతో మంది జగనన్న వల్ల ఈరోజు చదువుకుంటున్నారని చెప్పింది. కాగా, తన తండ్రి గుడిలో అర్చకులుగా ఉన్నారని.. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వారికి జీతాలు డబుల్ అయ్యాయని.. దీంతో ఆర్థికంగా తన కుటుంబం నిలదోక్కుకుందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అన్ని తన ఇంట్లోనే ఉన్నాయని చిరునవ్వులు చిందించింది. ప్రతీ నెల ఒకటవ తేదీన వలంటీర్లు వచ్చి పెన్షన్లు అందిస్తున్నట్టు తెలిపింది. చివరగా నంద్యాల సభ సాక్షిగా ధన్యవాదాలు చెబుతూ.. జగనన్న వల్ల తాను బాగా చదువుకుని లాయర్‌ను అవుతానని పేర్కొంది. -
నంద్యాల జిల్లా కార్యాలయాలను పరిశీలించిన మంత్రి బుగ్గన
-
స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధుల పోరాటం
బొమ్మలసత్రం: స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పాలకులను ఎదిరించారు. కుటుంబ సభ్యులకు దూరమై, ఆస్తులను త్యాగం చేసి స్వాతంత్ర పోరాటం చేశారు. కొందరు యోధులు బ్రిటీష్ పాలకుల చిక్కకుండా నల్లమలలో అజ్ఞాత జీవితం గడపగా, మరి కొందరు జైలు పాలై ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. నేడు వీరు భౌతికంగా లేకున్నా, వారి త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాయి. నంద్యాల ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులు జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం చేశారు. ప్రస్తుతం ఆర్డీఓ, వన్‌టౌన్ పోలీసు స్టేషన్, డీఎస్పీ బంగ్లా, తహసిల్దార్ కార్యాలయాల్లో బ్రిటీష్ పాలకులు ఉంటూ పాలన చేసేవారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో పోలీసు బలగాలు ఉండేవి. నంద్యాల 25వేల జనాభాతో, చిన్న పట్టణంగా ఉందేది. జాతీయ స్థాయిలో గాం«ధీజీ ఉప్పు సత్యగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు పిలుపునిచ్చినా, ఏ నేతను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసినా నంద్యాల నేతలు త్రీవంగా స్పందించేవారు. 19వ శతాబ్ధంలో ఉద్యమం: నంద్యాలలో 19వ శతాబ్ధంలో నంద్యాలలో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకొనేది. బిట్రీష్ పాలకులకు వ్యతిరేకంగా నేతలు సభలు, సమావేశాలను నిర్వహించేవారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, టీఆర్కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, కోడి నరసింహం, దేశాయి కుప్పూరావు తదితరులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. దీంతో బ్రిటీష్ పోలీసులు వెంట పడి, వీరిని అరెస్టు చేయడానికి యత్నించేవారు. దీంతో నేతలు నక్సలైట్లలా నల్లమల అడవిలోకి పారిపోయి, అజ్ఞాత జీవితం గడిపేవారు. వీరు మహానంది, బండి ఆత్మకూరు ప్రాంతాల్లోని అడవుల్లో తలదాచుకున్నప్పుడు, కొందరు నేతలు, గ్రామస్తులు వీరికి ఆహారాన్ని పంపేవారు. ఖ్యాతి తెచ్చిన గాడిచర్ల, నివర్తి స్వాతంత్య్ర సంగ్రామంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర స్థాయిలో నంద్యాలకు ఘనకీర్తిని తెచ్చారు. ఆంధ్రా తిలక్‌గా పేరొందిన గాడిచర్ల కర్నూలు ప్రాంతానికి చెందినవారు. నంద్యాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆయన నంద్యాల కేంద్రంగా కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. స్వరాజ్య పత్రికను స్థాపించి, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. తిలేస్వరంలో బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులపై జరిపిన కాల్పుల సంఘటనలను తీవ్రంగా విమర్శిస్తూ స్వరాజ్య పత్రికలో ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిండి తలకు మురికి టోపీ పెట్టి, కాళ్లకు, చేతులకు గోలుసులు వేసి, మట్టి చిప్పలో భోజనం పెట్టి తిడ్తూ, కొట్టినా ఆయన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తర్వాత ఆయన నంద్యాల నుండి మద్రాస్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. పత్తికొండకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య నంద్యాలకు వలస వచ్చారు. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి తాలూకా ఆఫీసులోని ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యమ బాట పట్టారు. వ్యక్తి సత్యగ్రహంలో పాల్గొన్న నివర్తిని ఆయన 140మంది సహచరులను అక్టోబర్ 14, 1940లో ప్రభుత్వం ఆరెస్టు చేసి, 8నెలలు జైలు శిక్ష వేసింది. జైలు నుండి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. విద్యార్థులతో, కాంగ్రెస్ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశారు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్ధేశిస్తూ ఆయన రూపొందించిన సర్క్యూలర్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఆయన లొంగిపోయారు. స్వాతంత్రం వచ్చాక, 1968 నుండి 78వరకు శాసన మండలి అధ్యక్షుడిగా పని చేశారు. రథసారథులు వీరే...: ఖాదర్‌బాద్ నర్సింగరావు ఫిరంగి పాలనకు వ్యతిరేకంగా 1910లో కాంగ్రెస్‌లో చేరీ, ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1928లో బ్రిటీష్ పాలకులు భారతీయులు చదువుకోవడానికి పెద్దగా సహకరించలేదు. కాని స్థానిక బ్రిటీష్ పాలకులు వ్యతిరేకించినా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకొని వచ్చి, ఆరెకరాల భూమిని విరాళంగా ఇచ్చి నంద్యాల మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ వేల మంది రాజకీయ నాయకులకు, శాస్త్రవేత్తలకు, వైద్యులకు ఇంజనీర్లకు, పారిశ్రామిక వేత్తలకు అక్షరాలను నేర్పించింది. ఖాదర్‌బాద్ నర్సింగరావు జైలు పాలైన దేశ భక్తుల కుటుంబ సభ్యులకు ఆశ్రయమిచ్చి నెలలు తరబడి భోజనాలను పెట్టి ఆదుకునేవారు. ఈయనతో పాటు దేశాయి కుప్పూరావు, కోడి నరసింహం, ఆత్మకూరు నాగభూషణం శెట్టి, టీ ఆర్కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, యరబోలు సుబ్బారెడ్డి, యాతం మహానందిరెడ్డి, రాజా శ్రీనివాస్‌లు ఉద్యమ పోరాటంతో నిస్వార్థంగా సేవలను అందించారు. స్వాతంత్ర ఉద్యమంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడమే కాక పోరాటాన్ని జరిపిన ఏకైక మహిళగా పద్మావతమ్మ ఆదర్శనీయంగా నిలిచింది. బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీసులుగా పని చేసిన శ్యాముల్ బెనెటిక్ట్ సుభాష్‌చంద్రబోష్ ఇచ్చిన పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు. కాంగ్రెస్ సభ్యురాలుగా పని చేసిన పద్మావతమ్మ స్వాతంత్య్ర అనంతరం కమ్యూనిష్టుగా మారారు. బైర్మల్ వీధిలో ఉన్న ఇప్పటి డాక్టర్ ఉదయ్‌శంకర్ హాస్పిటల్, వాసవీ భవన్, ప్రక్కనే ఉన్న దళితులు హాస్టల్ పలువురు నేతలు ఇళ్లలో సభల, సమావేశాలు జరిగేవి. నంద్యాలను సందర్శించిన గాంధీ, నెహ్రూ: జాతిపిత గాంధీజీ 1930లో నంద్యాలను సందర్శించి విక్టోరియా రీడింగ్ రూంలో జరిగిన సభలో ప్రసంగించారు. 1934లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 1937లో రాజాగోపాలచారి, 1952లో ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పర్యటించారు. వీరితో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు, వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, కళావెంకటరావు, కల్లూరి సుబ్బారావు, ఆచర్య రంగా, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, గోపిరాజు రామచంద్రారావు, వెన్నెటి విశ్వనాథం, కడప కటిరెడ్డి, శ్రీమతి రామసుబ్రమ్మ, వాలిలాలు గోపాలక్రిష్ణయ్య నంద్యాలను సందర్శించారు. అప్పటి మున్సిపాలిటీ చైర్మన్ ఖాదర్‌బాద్ నర్సింగరావు వీరికి ఆహ్వానం పలికారు. -
నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యుల సస్పెన్షన్
-
వృద్ధురాలిపై టీడీపీ నేతల దాష్టీకం
బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు మితివీురుతున్నాయి. ఇటీవల పొన్నాపురం గ్రామానికి చెందిన దళిత నాయకుడు సుబ్బరాయుడిని హత్య చేశారు. ఆదివారం నాడు ఆర్యవైశ్య సంఘానికి చెందిన సత్యానారాయణశెట్టిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా సోమవారం ఓ వృద్ధురాలి భూమిని కబ్జా చేయడమే కాకుండా.. అదేమని అడిగినందుకు ఆమె చేతి వేళ్లు నరికారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసిం, ఫాతమ్మ దంపతులకు అదే గ్రామంలో 2.80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఖాసిం అనారోగ్యంతో మృతి చెందగా.. ఫాతమ్మ తన ముగ్గురు కుమారులతో కలిసి ఉంటోంది. వారసత్వంగా వచ్చిన ఆ భూమిని ఆమె పెద్ద కుమారుడు హుస్సేన్ పీరా సాగు చేస్తున్నాడు. ఆ భూమిపై రైతు నగరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బెజవాడ నరేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు కన్నేశారు. మృతిచెందిన ఖాసిం ఆ భూమిని తమకు విక్రయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి.. ఆన్లైన్లో కూడా నమోదు చేయించుకున్నారు. దీనిపై ఫాతమ్మ, ఆమె కుమారులు నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కాగా.. కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీ నాయకులు ఆ భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఇది తెలుసుకున్న బాధితులు ‘ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది’ అని రాయించిన బోర్డును పొలంలో పెట్టారు. సోమవారం మధ్యాహ్నం వృద్ధురాలు ఫాతమ్మ పొలంలో పనిచేసుకుంటుండగా.. టీడీపీ నాయకులు ఆమెపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లగా.. వారిపైనా దాడికి పాల్పడ్డారు. పొలంలో ఉన్న బోర్డును తొలగిస్తుండగా ఫాతమ్మ అడ్డుపడింది. దీంతో టీడీపీ నాయకుడు శ్రీనివాసులు సలిక పారతో ఆమె చేతి వేళ్లను నరికేశాడు. ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చేతి వేళ్లు రెండు పూర్తిగా తెగిపోవటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. ఫాతమ్మ కుమారుడు హుస్సేన్‌పీరా ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు నరేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులుపై నంద్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
అబ్దుల్ సలాం కుటుంబానికి సీఎం అండ
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్నివిధాలా అండగా నిలిచారు. అబ్దుల్ సలాం అత్త మాబున్నీసా మనవరాలు రేష్మకు పశుసంవర్థక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శుక్రవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రమణయ్య ఆమెకు అందజేశారు. అబ్దుల్ సలాం భార్యా పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆదుకున్నారు. ముఖ్యమంత్రికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని సలాం అత్త మాబున్నీసా, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. -
ఆ నేతల వ్యాఖ్యలు అవివేకం..
సాక్షి, కృష్ణా జిల్లా: నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనలో టీడీపీ రాజకీయం చేయడం మానుకోవాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదం పాడులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గత నెల 3న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరిగిన నెల రోజుల్లో సలాం కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారా ? ఇదే నా ఆయనకు ముస్లింల పై ఉన్న చిత్తశుద్ధి’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. (చదవండి: రాజకీయం చేసేందుకేనా అసెంబ్లీ..?) సలాం కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారని, బాధ్యులపై కేసులు కూడా పోలీసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గుంటూరు పోలీస్‌స్టేషన్ ఘటన, నారా హమారా టీడీపీ హమారా సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టారు. అప్పుడు టీడీపీ నేతలకు ముస్లింలు గుర్తులేదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను చంద్రబాబు వాడుకుంటున్నారని సయ్యద్ నూరుద్దీన్ దుయ్యబట్టారు.(చదవండి: నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక) -
చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మతాలు, కులాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హితవు పలికారు. ప్రభుత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ కులాలను, మతాలను అడ్డుపెట్టుకోరని, చంద్రబాబులా అధికారం కోసం మనుషుల మధ్య చిచ్చుపెట్టాలని చూడలేదంటూ చురకలు అంటించారు. నంద్యాల షేక్ అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తుకువస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ఇక నంద్యాల ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్, సామూహిక ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, టీడీపీకి చెందిన రామచంద్రరావు మాత్రం నిందితులకు బెయిలు ఇప్పించారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకోని బాబు ఇప్పుడు ఈ ఘటనపై ముసలి కన్నీరు కారుస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు, జూమ్ యాప్ ద్వారా సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.(చదవండి: నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్) ఆ సబ్సిడీని కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి మోకాలడ్డుతున్న చంద్రబాబు తీరుపై కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కోలో 13 లక్షల ఇల్లు ఎక్కడ కట్టించారో చంద్రబాబు చూపించాలని డిమాండ్ చేశారు. డెబ్బై ఏళ్లు వచ్చినా అబద్ధాలు చెప్పే అలవాటు మానుకోవడం లేదంటూ ఆయనపై మండిపడ్డారు. ‘‘ఇళ్ల కోసం కేంద్రం నుంచి తెచ్చిన సబ్సిడీని కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన ఘనత బాబుకే చెల్లుతుంది. ఇక కట్టిన 2లక్షల ఇళ్లకు కనీసం వసతులు కల్పించలేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే వాటిని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడు. సంక్రాంతికి టిడ్కో ఇళ్లను ప్రజలకు ఎలా అప్పగిస్తారు. పేదల అవసరాలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటారా’’ అని చంద్రబాబు, టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. కోర్టుల్లో వేసిన స్టేను చంద్రబాబు వెకేట్ చేస్తే డిసెంబర్ 21 సీఎం జగన్ పుట్టిన రోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. 25 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల మంది ఇళ్ల స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకోవద్దు. ఇప్పటికైనా కేసులను ఉపసంహరణ చేసుకోవాల్సిందిగా చంద్రబాబును కోరుతున్నాం. ఇళ్ల పట్టాల కేసుల విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకోక పోతే టిడ్కో ఇళ్ల ముందే నేను ఆందోళన చేపడతా’’అని కొడాలి నాని హెచ్చరించారు. -
నంద్యాల ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు
సాక్షి, కర్నూలు: నంద్యాలలో సామూహిత ఆత్మహత్యలపై ప్రత్యేక విచారణకు కమిటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసు విచారణకు అధికారులను నియమించారు. సమగ్ర విచారణ చేపట్టేందుకు డీఐజీ వెంకటరామిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం నంద్యాలకు చేరుకుంది. అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను, వన్‌టౌన్ పోలీసులను ప్రత్యేక అధికారుల బృందం విచారించనుంది. విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని డీఐజీ వెంకటరామిరెడ్డి తెలిపారు. కాగా, నంద్యాలకు చెందిన అబ్దుల్సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదాఖలందర్, కుమార్తె సల్మా ఈ నెల 3వ తేదీన పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.పోలీసుల వేధింపుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అబ్దుల్సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను సీఎం జగన్ ఆదేశించారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. -
కుటుంబం ఆత్మహత్యపై విచారణకు సీఎం ఆదేశం
కర్నూలు/నంద్యాల/బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన కర్నూలు జిల్లా కౌలూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం విదితమే. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు. పోలీసుల వేధింపులు భరించలేకే.. ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ సెల్‌ఫోన్‌ను ఇంట్లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్‌ను పరిశీలిస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియో శనివారం బయటపడింది. ‘నేనేం తప్పు చేయలేదు సార్. ఆటోలో జరిగిన దొంగతనానికి, నాకు సంబంధం లేదు. అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా సంబంధం లేదు. పోలీసుల టార్చర్ భరించలేకున్నా సార్. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నా’మంటూ సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ తమ పరిస్థితిని అందులో వివరించారు. దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో తీస్తుండగా.. అభం శుభం తెలియని చిన్నారులు సెల్‌ఫోన్ వైపు అమాయకంగా చూస్తూ కన్పించడం కంటతడి పెట్టిస్తోంది. తన కుమార్తె, అల్లుడు, మనుమళ్ల ఆత్మహత్యలకు సీసీఎస్ పోలీసులే కారణమని సలాం అత్త మాబున్నీసా అంటున్నారు. తమ అల్లుణ్ణి 8 రోజుల పాటు చితక బాదారని ఆమె ఆరోపించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించం: హోం మంత్రి సుచరిత గుంటూరు రూరల్: పోలీసులు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హోం మంత్రి సుచరిత హెచ్చరించారు. శనివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు. -
నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి
సాక్షి, నంద్యాల: ‘నిన్ను చంపితే కాని మాకు చైర్మన్ పోస్టు రాదు’ అని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డిని భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం నంద్యాల తాలూకా పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా సీఐ దివాకర్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయ డెయిరీ పాలక మండలి సమావేశం గత నెల 28వ తేదీన జరగగా డైరెక్టర్లను మాట్లాడాలని పిలిపించుకొని భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ ఆళ్లగడ్డలో ఉంచుకున్నారు. ముగ్గురు డైరెక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో 28వ తేదీ జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని విజయడెయిరీ చైర్మన్ ఎండీ ప్రసాదరెడ్డి డైరెక్టర్లకు సమాచారం అందించారు. డైరెక్టర్లు కొందరు మంత్రాలయం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. డైరెక్టర్లు వెళ్లిన చోట జగత్‌విఖ్యాత్ రెడ్డి మనుషులు కనిపించడంతో తిరిగి వారు రైతునగరం గ్రామంలోని భూమా నారాయణరెడ్డి నివాసానికి వచ్చారు. విషయం తెలుసుకున్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్, రవి తమ అనుచరులతో కలిసి వాహనాల్లో నారాయణరెడ్డి ఇంటి వద్దకు 1వ తేదీ రాత్రి 11.20గంటలకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ‘నిన్ను చంపితే గాని చైర్మన్ పదవి మాకు రాదు అంటూ’ భూమా నారాయణ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మంగళవారం బాధితుడు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బిడ్డలతో కలిసి దంపతుల ఆత్మహత్య
పాణ్యం (కర్నూలు జిల్లా): ఆ ఇంటి యజమాని షేక్ అబ్దుల్ సలామ్‌ను వరుస అవమానాలు, కష్టాలు వెంటాడాయి. మొదట్లో అతడు బంగారం దుకాణంలో గుమాస్తాగా పని చేసేవాడు. తనకు తెలిసిన వారితో అగ్రి గోల్డ్ డిపాజిట్లు చేయించాడు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో పరువు కాపాడుకునేందుకు తన ఆస్తి అమ్మేసి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాడు. గత ఏడాది నవంబర్ 7వ తేదీన అతడు పని చేస్తున్న దుకాణంలో బంగారం చోరీ చేశాడని నంద్యాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా అతడు ఓసారి ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్పట్లో అతని నుంచి 500 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. చివరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అక్కడా అతడిని విధి చిన్నచూపు చూసింది. రెండ్రోజుల క్రితం అతడి ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్నాడు. ఆ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు సోమవారం అబ్దుల్ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డల ప్రాణాలను సైతం తనతో తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతా కలసి రైలు పట్టాలను ఆశ్రయించారు. వారి మీదనుంచి గూడ్స్ రైలు దూసుకుపోయింది. నలుగురి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి. కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని కౌలూరు గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్సలామ్ (45) తన భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్ (10)తో కలిసి మంగళవారం గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్కూల్‌కి తీసుకెళ్తానని చెప్పి: అబ్దుల్సలామ్ భార్య నూర్జహాన్ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. కుమార్తె సల్మా పదో తరగతి, కుమారుడు ఖలంధర్ నాలుగో తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయాన్నే పిల్లల్ని స్కూల్ వద్ద దింపుతానని చెప్పిన అబ్దుల్ సలామ్ భార్యాబిడ్డలతో కలిసి నంద్యాల నుంచి తన ఆటోలో బయలుదేరాడు. కానీ.. స్కూల్‌కు వెళ్లకుండా అంతా కలిసి కౌలూరు గ్రామంలోని రైలు పట్టాల వద్దకు చేరుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కనమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొట్టాయి. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలూరుకి చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) -
నంద్యాలలో ఉదయానంద ఆసుపత్రి ప్రారంభం
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో నూతనంగా నిర్మించిన ఉదయానంద మెగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా నంద్యాల ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ► నంద్యాలలో 250 పడకల మెగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో 80 ఐసీయూ, 120 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, కరోనా పాజిటివ్ కేసులకు ఇక్కడ చికిత్స అందించేందుకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ముందుకొచ్చారని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ► రాయలసీమ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉదయానంద ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఈ ఆసుపత్రితో పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణానికి మెడికల్ కాలేజీ కూడా మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ► సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్ స్వప్నారెడ్డి పాల్గొన్నారు. ► నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గంగుల బిజేంద్రనాథరెడ్డి, తొగురు ఆర్థర్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి, ఎస్పీ ఫక్కీరప్ప, ఉదయానంద ఆసుపత్రి డైరెక్టర్లు రామకృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, డాక్టర్లు శ్రీనాథరెడ్డి, రామేశ్వరరెడ్డి, భార్గవరెడ్డి, పోచా జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, గంగుల భరత్‌రెడ్డి, జయన్న తదితరులు పాల్గొన్నారు. -
కారులోనే చితిమంట..!
బొమ్మలసత్రం(నంద్యాల): తండ్రి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కారులో తిరిగొస్తున్న కుమారుడికి మృత్యువు లారీ రూపంలో ఎదురుపడింది. కష్టాలతో ప్రయాణం చేస్తున్న ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అసలేం జరిగింది.. నంద్యాల రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని టెక్కె నాగులకట్ట వీధికి చెందిన దేశాయి రవికుమార్, ఉమాదేవి కుమారుడు శివకుమార్ (35)కు పుట్టుకతోనే పోలియో సోకడంతో రెండు కాళ్లూ పనిచేయవు. దివ్యాంగుడైనప్పటికీ బాగా చదువుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగం సాధించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ తండ్రి సోమవారం, తల్లి ఉమా దేవి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. స్నేహితుల సహాయంతో తల్లిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి.. బుధవారం వేకువజామున శివకుమార్ నంద్యాలకు బయలు దేరారు. స్నేహితుడు కాశీ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. నంద్యాల శివారులోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద కారు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో కారు లారీని ఢీకొట్టి ఇరుక్కుపోయింది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కారును దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు స్నేహితులు బయటకు దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. శివకుమార్‌ను రక్షించేందుకు వారు విఫలయత్నం చేశారు. శివకుమార్ నిస్సహాయ స్థితిలో కారులోనే సజీవ దహనమయ్యాడు. మరో వాహనదారుడు లారీని ఓవర్టేక్ చేసి చెప్పేవరకు డ్రైవర్ గమనించక పోవడం గమనార్హం. -
అప్పు తీర్చలేదని కిరాతకం
బొమ్మలసత్రం (నంద్యాల): రూ.లక్ష అప్పు తీర్చలేదని ఇద్దరు మహిళలపై మున్సిపల్ ఉద్యోగి సైకిల్ చైన్, కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివార్లలోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన సామేలు స్థానిక ప్రభుత్వ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ పదేళ్ల క్రితం చనిపోయాడు. అతని భార్య మరియమ్మ ఒక కుమార్తె, ఇద్దరు కుమారులను కష్టపడి పోషించింది. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కుమార్తె స్వప్న మానసిక వికలాంగురాలు. మరియమ్మ పిల్లల చదువు కోసం గత ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ ఉద్యోగి శేషన్న వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంది. రూ.4 వడ్డీతో అప్పు తీసుకున్న ఆమె.. కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బుతో కొంత మేర వడ్డీ చెల్లించింది. మూడు నెలలుగా స్వప్న ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. దీంతో వడ్డీ చెల్లించడం మరియమ్మకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వడ్డీ, అసలు చెల్లించాలని వారం రోజులుగా శేషన్న వేధించడం మొదలుపెట్టాడు. మూడు నెలలు గడువు కావాలని కోరినా అతను అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉన్న మరియమ్మ, స్వప్నపై సైకిల్ చైన్, కత్తితో దాడికి పాల్పడ్డాడు. దెబ్బలు భరించలేక బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోయారు. దీంతో వారిపైనా దాడికి ప్రయత్నించాడు. స్థానికుల సమక్షంలో బాధితులపై రెండోసారి కూడా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయాలతో పడి ఉన్న తల్లి, కుమార్తెను స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
త్వరలోనే సౌరశక్తి రైలింజన్ కూత
రాజంపేట/జమ్మలమడుగు: జిల్లాలో రెండో రైలుమార్గంలో విద్యుద్దీకరణ పనులకు ఎట్టకేలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ విద్యుద్దీకరణ (ట్రాక్షన్) పనులు ఇక ఊపందుకోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే కేంద్రం పరిధిలోని సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వేమంత్రి పియూష్ గోయల్ మంగళవారం ఈ పనులకు శంకుస్థాపన చేయడంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక స్వప్నం నెరవేరనుందని ఆశాభావంతో ఉంది. శంకుస్థాపన చేస్తూ తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సౌరవిద్యుత్ సెక్షనుగా ఈ మార్గాన్ని ప్రకటించారు. ఇప్పటివరకూ ఈమార్గంలో డీజిల్ లోకో రైళ్లు నడుస్తున్నాయి. డీఎంయూ (డీజల్ మల్టిపుల్ యూనిట్) ప్యాసింజర్ రైలు ఒకటి నడుస్తోంది. అదొక్కటే ఉపయోగకరంగా ఉంది. ధర్నవరం నుంచి అమరావతికి వారంలో రెండురోజులు ఈ ప్యాసింజర్ రైలును నడిపిస్తున్నారు. డీజల్ లోకో(రైలింజన్)తో గూడ్స్ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. త్వరలోనే సౌరవిద్యుత్ సహాయంలో రైళ్లను నడపాలని రైల్వే అధికారులు సంకల్పిస్తున్నారు. రైలుమార్గం తీరు ఇలా.. కర్నూలు, కడప జిల్లాలను రాజధాని అమరావతికి అనుసంధానం చేసే ఈ రైలు మార్గం (ఎర్రగుంట్ల–నంద్యాల) 123 కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఈ రూటులో ఇప్పటికే రూ.967కోట్లు వివిధ పనులకు వెచ్చించారు. 780హెక్టార్లు భూమిని ఈ మార్గం కోసం సేకరించారు. 139 ఆర్‌యూబీలు, కాపలా ఉన్నవి 5, లేనివి 15 ఎల్సీ గేట్లు ఉన్నాయి. 36 పెద్దవంతెనలు, 469 చిన్న వంతెనలున్నాయి. ఈ మార్గంలో ప్రొద్దుటూరు,జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజమల, కోయిలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్లు కవరవుతాయి. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ ట్రాక్షన్ పనులు గతేడాది జనవరిలో ప్రారంభిస్తారని భావించారు. బడ్జెట్లో నిధులు మంజూరయినా పనులను ప్రారంభించలేదు. రేణిగుంట–గుంతకల్ రైలుమార్గం విద్యుద్ధీకరణ అయినందున ఎర్రగుంట్ల నుంచి నంద్యాల రైల్వేలైన్ కూడా విద్యుద్దీకరణ పూర్తయితే ఎలక్ట్రికల్ ఇంజన్లతో రైళ్లు నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే కడప..కర్నూలు జిల్లా ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. దక్షిణ మధ్య రైల్వేలో తొలి సౌర విద్యుత్ వినియోగ సెక్షనుగా దీనిని రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వేపరిధిలో సౌర విద్యుత్ సహాయంతో నడిచే రైలింజన్లు లేవు. అనుకున్న సమయంలో ఈ పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిధులు స్వల్పమే.. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్ విద్యుద్దీకరణకు కేంద్రం గత బడ్జెట్లో రూ.111.48 కోట్లు కేటాయించింది. ట్రాక్షన్ సర్వే పనులు కూడా నిర్వహించింది. ట్రాక్షన్ పనులను ఆర్వీఎన్ఎల్(రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్) సంస్థ చేపట్టనుంది. ఈఏడాది బడ్జెట్లో రూ.18కోట్లు కేటాయించింది. ఈమార్గం 123 కిలోమీటర్ల మేర రైలుమార్గంలో విద్యుద్దీకరణకు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ కేంద్రం కేటాయించిన నిధులు స్వల్ప మేననే ఆవేదన వ్యక్తమవుతోంది. ఉత్త మాటలు కాకుండా నిధుల విడుదలలో కేంద్రం మరింత చొరవ చూపిస్తే ఈ మార్గంలో సౌరశక్తి సహాయంతో రైళ్ల కూత వినే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. -
సెల్ఫోన్లలో చిత్రీకరించి వేధింపులు
-
నంద్యాలలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
-
4 కేజీల బంగారు ఆభరణాల చోరీ
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. వన్‌టౌన్ పరిధిలోని నిమిషాంబ బంగారు దుకాణంలో నాలుగు కేజీల బంగారం. రూ.5లక్షల నగదు ఎత్తికెళ్లారు. వన్‌టౌన్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిత్తారి వెంకన్నవర్మ చాలాకాలంగా బంగారు అంగళ్ల వీధిలో దుకాణాన్ని నడుపుతున్నాడు. షాపు వెనుక భాగంలో గోడతో పాటు ఇనుముతో తయారు చేసి తలుపు ఉంది. పాత భవనం కావటంతో షాపు పైభాగంలో గవాజీ ఉండేది. యజమాని వెంకన్నవర్మ ఎప్పటిలాగే బుధవారం రాత్రి 10 గంటలకు దుకాణం మూసి ఇంటికి వెళ్లి పోయాడు. రాత్రి 12 నుంచి 2 వరకూ పట్టణంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షం నిలిచిపోయిన కొద్ది సేపటికి ఆప్రాంతంలో పోలీసు పహారా లేకపోవటం దొంగలకు అదనుగా మారింది. పక్కనే మెట్ల ద్వారా దొంగలు షాపు పైఅంతస్తుకు ప్రవేశించారు. పైభాగంలో వెంటిలేషన్ కోసం ఉంచిన గవాజీ నుంచి దొంగలు దర్జాగా దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న బంగారు అభరణాలతో పాటు గల్లా పెట్టెలో దాచిన రూ.5 లక్షల నగదును దోచుకున్నారు. అనంతరం దుకాణం వెనక భాగంలో ఉన్న ఇనుప వాకిలి వద్దకు చేరి దానికున్న తాళం నెమ్మదిగా తొలగించి అక్కడి నుంచి జారుకున్నారు. ఉదయం 11 గంటలకు వెంకన్నవర్మ దుకాణాన్ని తెరిచాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నా దుకాణంలోని బంగారు మాత్రం మాయమైంది. ఇది చూసి యజమాని కంగుతిన్నాడు. తాను దాచుకున్న రూ.5 లక్షల కోసం గళ్లాపెట్టలో చూశాడు. అందులో ఉన్న నగదు కనిపించలేదు. ఇది చూసి బోరున విలపించాడు. ఏం చేయాలో తెలియక ఇరుగుపొరుగు షాపుల యజమానులను పిలిచి విచారించాడు. షాపుపైభాగంలో గమనించగా గవాజీ తెరుచుకుని ఉంది. తన షాపులో దొంగలు పడ్డారని భావించి వెంకనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి దొంగల ఆనవాళ్లకోసం గాలించారు. పోలీసు జాగిలాలు దుకాణం మొత్తం తిరిగి షాపు వెనుక భాగంలో నూతనంగా నిరి్మస్తున్న భవనంలోకి వెళ్లి నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవన యజమానిని విచారించగా బుధవారం నలుగురు కొత్తవారు పనికి వచ్చారని, వారిని మేస్త్రి పంపించారని, వారి వివరాలు తనకు తెలియవని పోలీసులకు తెలిపాడు. అయితే మేస్త్రికి ఫోన్ చేసిన పోలీసులకు తాను ఎవరిని పనికి పంపలేదని కూలీలు అందుబాటులో లేక, పని కొన్ని రోజుల నుంచి నిలిపానని సమాధానం ఇచ్చాడు. దీన్ని బట్టి భవననిర్మాణ కారి్మకుల పేరుతో దొంగలు వచ్చి రెక్కీ నిర్వాహించిన అనంతరం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. యజమాని వెంకన్నవర్మ ఫిర్యాదు మేరకు దాదాపు రూ.1.40కోట్లు విలువ చేసే 4 కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు అంచనా వేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: నంద్యాలలో నెలకొన్న వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల రాయలసీమలో వర్షాలు బాగా కురిసి వర్షపాతం సాధారణ స్థాయికి వచ్చిందన్నారు. నంద్యాల డివిజన్లో 17 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆర్ అండ్ బీ రోడ్లు, పీఆర్ రోడ్లు బాగా దెబ్బతిన్నాయని.. ఫలితంగా రూ. 784కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అంతేకాక 31వేల హెక్టార్లలో పంటనష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో కుందు నది పరివాహక ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు జగన్. కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్ తెలిపారు. భవిష్యత్తులో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారని.. అవి మధ్యలోనే ఆగిపోయానని తెలిపారు. త్వరలోనే వాటిని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని.. సాధారణంగా ఇచ్చే వరద సాయం కంటే ప్రతి ఇంటికి అదనంగా రూ.2 వేలు ఎక్కువ ఇస్తామన్నారు. వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్ స్పష్టం చేశారు. -
పైసలివ్వందే ఇక్కడ పని జరగదు!
సాక్షి, నంద్యాల : నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు–కడప జాతీయ రహదారి పక్కనున్న రవాణా శాఖ (ఆర్టీఓ) కార్యాలయంలో పైసలివ్వందే ఏ పనీ జరగడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకుని ప్రతి పనికీ ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ఇక్కడి అధికారులు అనధికారికంగా ఏజెంట్లను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారు. వారి ఆగడాలు శ్రుతిమించడంతో వ్యవహారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాకా వెళ్లింది. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి..క్లర్క్‌తో పాటు నలుగురు అనధికారిక ఏజెంట్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన క్లర్క్ దత్తాత్రేయ నంద్యాల పట్టణానికి చెందిన కరీం అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అనధికారిక ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్నాడు. అతను అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కాలేదు. చివరకు కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న దత్తాత్రేయను కలిశాడు. డబ్బు ఇస్తేనే పని అవుతుందని ఆయన కరాఖండీగా చెప్పాడు. రూ.2,500 ఇవ్వడానికి అతను అంగీకరించగా.. అది చాలదని, అదనంగా ఇవ్వాలని క్లర్క్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలోకి బాధితుడిని పంపారు. అతను క్లర్క్ దత్తాత్రేయను కలిసి రూ.2,500 ఇచ్చాడు. మిగతా డబ్బు ఏదని క్లర్క్ అడగ్గా.. బయటకు వెళ్లి తీసుకొని వస్తానని చెప్పాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చి క్లర్క్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి ఎవరినీ రానివ్వకుండా, లోపలున్న వారిని బయటకు పంపించకుండా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయ అధికారులు అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్లు నరసింహ, సోమేశ్వరరెడ్డి, రమేష్, బాషాలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద రూ.39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బాషా అనే ఏజెంట్ ఏసీబీ అధికారుల కన్నుగప్పి బయటకు పారిపోయాడు. క్లర్క్‌తో పాటు మిగతా ముగ్గురిని తమ అదుపులో ఉంచుకున్నారు. సోమేశ్వరరెడ్డి అనే ఏజెంట్ స్వయాన బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహన డ్రైవర్ కావడం గమనార్హం. -
నంద్యాలలొ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందని పోస్టర్ బ్యాలెట్లు
-
ఈసారి ఆశలు గల్లంతేనా?
-
ఓట్లకోసం తెలుగుదేశం నాయకుల బరితెగింపు
-
నంద్యాలలోని పలు వార్డుల్లో డబ్బు ప్రవాహం
-
నంద్యాలలో బలిజల ఆత్మీయ సదస్సు
-
దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం
నంద్యాల: టీడీపీ హయాంలో అవినీతికి పెచ్చుమీరిందని, దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపేరోజు ఎప్పుడెప్పుడు వస్తుందానని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. శుక్రావారం పట్టణంలోని నూనెపల్లెలో రావాలి జగన్.. కావాలి జగన్.. కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ముఖ్యమంత్రి అయితే చేపట్టే నవరత్నాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరులో పేదవారికి న్యాయం జరగడం లేదన్నారు. ఎవరు లంచం ఇస్తే వారికి మాత్రమే పనులు జరుగుతుండటంతో పేదలు మరింత నిరుపేదలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాల మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, కార్పొరేషన్ రుణాలు ఇలా ప్రతి పథకానికి టీడీపీ నాయకులు డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా రైతులకు అన్యాయం టీడీపీ హయాంలో రైతాంగం కన్నీరు పెడుతోందని శిల్పా రవి అన్నారు. కర్నూలు జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలను ఎండగట్టి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు పంపారని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు జలసిరి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతుల కన్నీరు కనపడలేదా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేదని, దీని వలన రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మంచిరోజులు రావాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన మళ్లీ రావాలని, అది ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమృతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు సోమ గోని శ్రీనివాసగౌడు, తోట రామకృష్ణ, రమణగౌడ్, తోట రాజగోపాల్, ఓబులేసు గౌడ్, తోట మద్దిలేటి, కుమారగౌడ్, పోలూరు శీను పాల్గొన్నారు. -
నంద్యాలలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం
-
నంద్యాల: వైఎస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు
సాక్షి, నంద్యాల : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగున్నాయి. తాజాగా నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటాచలం కాలనీకి 34వ వార్డుకు చెందిన 50 కుటుంబాలకు చెందిన సుమారు వందమంది టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ స్థానిక కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వారికి వైస్సార్సీపీ కండువా కప్పి.. శిల్పామోహన్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
నంద్యాలలో భారీగా పైరసీ సీడీలు స్వాధీనం
నంద్యాల : కొత్త సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న వ్యక్తిని కర్నూలు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం కేంద్రంగా పైరసీ మాఫియా నడుస్తుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి... స్థానిక ఎస్బీఐ కాలనీ వీధిలోని శ్రీ ఎలక్ట్రికల్ మ్యూజిక్ షాప్ యజమాని మధుసూధన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ షాపులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూధన్ కొత్త సినిమాలను పైరసీ చేసి డీవీడీలుగా మార్చి అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దుకాణం నుంచి రెండు మానీటర్లు, తొమ్మిది సీపీయూలు, 194 డీవీడీ రైటర్లు, 879 కొత్త సినిమా ప్రింట్లు, 650 నీలి చిత్రాల ప్రింట్లతో పాటు ప్రింట్ వేయడానికి సిద్దంగా ఉంచిన వేల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. వాటిని సీజ్ చేశారు. మధుసూదన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.