అబ్దుల్‌ సలాం కుటుంబానికి సీఎం అండ | YS Jagan Govt Support To Abdul Salam Family | Sakshi
Sakshi News home page

అబ్దుల్‌ సలాం కుటుంబానికి సీఎం అండ

Published Sat, Dec 12 2020 5:11 AM | Last Updated on Sat, Dec 12 2020 5:11 AM

YS Jagan Govt Support To Abdul Salam Family - Sakshi

రేష్మకు నియామక పత్రాన్ని అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్నివిధాలా అండగా నిలిచారు. అబ్దుల్‌ సలాం అత్త మాబున్నీసా మనవరాలు రేష్మకు పశుసంవర్థక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శుక్రవారం నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రమణయ్య ఆమెకు అందజేశారు.

అబ్దుల్‌ సలాం భార్యా పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆదుకున్నారు. ముఖ్యమంత్రికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని సలాం అత్త మాబున్నీసా, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement