abdul salam
-
బీజేపీ నుంచి ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే..
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఇటీవల 195 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఒకే ఒక పేరు ప్రత్యేకంగా నిలుస్తోంది. అదే కేరళలోని మలప్పురం నియోజకవర్గం అభ్యర్థి 71 ఏళ్ల డాక్టర్ అబ్దుల్ సలామ్. ఎందుకంటే బీజేపీ ప్రకటించిన జాబితాలో ఏకైక ముస్లిం అభ్యర్థి ఈయనే.. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సలామ్ 2019లో బీజేపీలో చేరారు. ‘ది క్వింట్’ కథనం ప్రకారం.. రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి లేనప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రభావితుడై రాజకీయాల్లోకి వచ్చారు. 2022 జూలై నుంచి లోక్‌సభలో గానీ, రాజ్యసభలోగానీ బీజేపీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. మలప్పురం స్థానంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) అభ్యర్థి ఈటీ మహమ్మద్ బషీర్, సీపీఎం అభ్యర్థి వి.వసీఫ్లపై అబ్దుల్ సలామ్ పోటీ చేయనున్నారు. మలప్పురం నియోజకవర్గం డీలిమిటేషన్‌కు ముందు మంజేరిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో భాగమైన ఐయూఎంఎల్కి కంచుకోటగా ఉంది. ఎవరీ అబ్దుల్ సలామ్? మలప్పురంలో జన్మించిన అబ్దుల్ సలామ్ పీహెచ్డీ చేశారు. 2011 నుంచి 2015 వరకు కాలికట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. కేరళలో యూడీఎఫ్ అధికారంలో ఉన్న సమయంలో ఐయూఎంఎల్ ద్వారానే ఆయనకు ఈ పదవి వచ్చినట్లు సమాచారం. అబ్దుల్ సలామ్ బీజేపీలో చేరిన రెండు సంవత్సరాల తరువాత అంటే 2021లో తిరుర్ స్థానం నుండి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఐయూఎంఎల్ అభ్యర్థి కురుక్కోలి మొయిదీన్ చేతిలో 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా సలాం బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు కూడా. -
అబ్దుల్ సలాం కుటుంబానికి సీఎం అండ
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్నివిధాలా అండగా నిలిచారు. అబ్దుల్ సలాం అత్త మాబున్నీసా మనవరాలు రేష్మకు పశుసంవర్థక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శుక్రవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రమణయ్య ఆమెకు అందజేశారు. అబ్దుల్ సలాం భార్యా పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆదుకున్నారు. ముఖ్యమంత్రికి తమ కుటుంబం రుణపడి ఉంటుందని సలాం అత్త మాబున్నీసా, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. -
సలాం కేసులో కౌంటర్లకు ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐని ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ (ఐయూఎంఎల్‌పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదన్నారు. అందువల్ల సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, తమ జోక్యం అవసరంలేదని స్పష్టంచేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఇటీవల పోలీసులపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు. సీబీఐకి హైకోర్టులో న్యాయవాది లేకపోతే ఎలా? సీబీఐ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు పూర్తిస్థాయి న్యాయవాది(స్టాండింగ్ కౌన్సిల్) లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని వెంటనే సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర న్యాయ శాఖకు తెలియచేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్‌కు సూచించింది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కౌంటర్ దాఖలుకు సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెన్నకేశవులు మూడు వారాల గడువు కోరడంతో ఏ హోదాలో హాజరవుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో ప్రత్యేకంగా స్టాండింగ్ కౌన్సిల్ ఉండాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరు కావడానికి వీల్లేదని పేర్కొంది. -
ధైర్యంగా ఉండండి.. అన్ని విధాలా ఆదుకుంటాం
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు కర్నూలుకు వచ్చిన సీఎం జగన్‌ను ఏపీఎస్పీ బెటాలియన్ గెస్టుహౌస్‌లో అబ్దుల్ సలామ్ అత్త మాబున్నీసా, ఆమె కూతురు సాజిదా, కుమారుడు షంషావలిని కలిశారు. తొలుత వారు తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పది రోజుల క్రితమే మాబున్నీసాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అందజేసిన విషయం తెలిసిందే. వారిపై కఠిన చర్యలు తీసుకోండి ► తన కూతురు, అల్లుడు, వారి ఇద్దరి పిల్లల మరణానికి కారణమైన పోలీసులను కఠినంగా శిక్షించాలని, తన రెండో కుమార్తె సాజిదాకు ఉద్యోగం ఇవ్వాలని, అనంతపురం వైద్య, ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న తన కుమారుడు షంషావలిని నంద్యాలకు బదిలీ చేయాలని మాబున్నీసా సీఎంను కోరారు. ► సలామ్ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్పను సీఎం ఆదేశించారు. సాజిదాకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వా లని, షంషావలిని అనంతపురం నుంచి నం ద్యాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్‌ను ఆదేశించారు. ► ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని, ఏ అవసరం వచ్చినా తనను కలవాలని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ► కాగా, మాబున్నీసా కుమారుడు షంషావలిని అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి నంద్యాల జిల్లా ఆసుపత్రికి వెనువెంటనే బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. సాజిదాకు కూడా కొద్ది రోజుల్లోనే ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: మాబున్నీసా
సాక్షి, కర్నూలు: అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారుకులైన దోషులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీఎస్పీ గెస్ట్‌హౌస్ వద్ద సలాం కుటుంబాన్ని సీఎం జగన్ నేడు పరామర్శించారు. సలాం అత్త మాబున్నీసా, శంషావలీ, షాజిదాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాబున్నీసా కుమార్తె షాజిదాకు ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆమె అల్లుడు శంషావలిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: సలాం అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత) ఈ క్రమంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి.. నంద్యాల వైద్య ఆరోగ్యశాఖకు శంషావలిని బదిలీ చేస్తూ డిప్యూటేషన్ ఆర్డర్స్ విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మాబున్నీసా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎంకు రుణపడి ఉంటామని కృతజ్ఞతాభావం చాటుకున్నారు. కాగా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై స్పందించిన సీఎం జగన్.. తక్షణమే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సలాం అత్త మాబున్నీసాకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 25 లక్షల ఆర్థికసాయం అందించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు. -
సలాం కుటుంబం ఆత్మహత్యపై రాజకీయాలొద్దు
సాక్షి, హైదరాబాద్: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై రాజకీయాలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ఉల్మా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ ఫారూక్ హెచ్చరించారు. నిందితులకు బెయిల్ ఇప్పించిన టీడీపీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని విమర్శించారు. టీడీపీ కార్యదర్శిగా ఉన్న న్యాయవాది నిందితులకు బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు. ముస్లిం సంఘాల పేరుతో టీడీపీ, కొన్ని రాజకీయ పక్షాలు నంద్యాలకు బస్సు యాత్ర చేపట్టటాన్ని ఖండించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడాన్ని స్వాగతించారు. అధికారంలో ఉండగా ముస్లింల సంక్షేమాన్ని పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని ముఫ్తీ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రాజమండ్రిలో ఒక మసీదు మౌజమ్ హత్యకు గురైతే ఆ కుటుంబానికి కనీసం న్యాయం చేయలేక పోయారని మండిపడ్డారు. ముస్లిం యువతపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయటాన్ని మరవబోమన్నారు. -
ఏమిటీ చిల్లర ఆరోపణలు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను మరిచిపోయి హైదరాబాద్‌లోనే గడుపుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ మీటింగ్‌ల్లో ప్రభుత్వంపై, అధికారులపై చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత హితవు పలికారు. నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపడుతూ శుక్రవారం హోంమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుకు సెక్షన్లు తెలియవా? సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ ఐపీసీ 306 ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. నిందితులకు టీడీపీ న్యాయవాది ద్వారా బెయిల్ ఇప్పిస్తే దాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్‌కు కూడా వెళ్లిందని గుర్తు చేశారు. గౌరవ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే పోలీస్ శాఖను నిందించడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. సీబీఐ విచారణ అప్పుడేమైంది? ఇప్పుడు ప్రతి అంశంపైనా సీఐబీ విచారణకు డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఆయన హయాంలో జరిగిన మహిళా అధికారి వనజాక్షిపై దాడి, విద్యారి్థని రిషితేశ్వరి ఆత్మహత్య, విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్, గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలపై నాడు ఎందుకు అదే విచారణ కోరలేదని హోంమంత్రి ప్రశ్నించారు. అప్పుడు ఆయనే సీబీఐకి నో ఎంట్రీ అని అడ్డుకోలేదా? అని నిలదీశారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. లక్షల మంది ఈఎస్ఐ కార్మీకుల ఇన్సూరెన్స్ సొమ్ము కాజేసిన అచ్చెన్నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించి చంద్రబాబు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అతి దారుణమైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర అరెస్టును కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. జైలు, బెయిలు, శిక్షల గురించి చంద్రబాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఆయన ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సూచించారు. -
సలామ్ అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత
-
సలామ్ అత్తకు రూ. 25 లక్షల పరిహారం అందజేత
సాక్షి, కర్నూలు : నంద్యాలలో ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. గురువారం సలామ్ అత్తగారిని కలిసిన ఎంపీ బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ కలెక్టర్ వీరపాండ్యన్, తహశీల్దార్ రవికూమార్ ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు. కాగా నంద్యాల మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్సలామ్ (45) తన భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్ (10)తో కలిసి ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్న కేసులో విచారణ నిమిత్తం పోలీసులు అబ్దుల్ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్న సలామ్.. కుటుంబంతో కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ సెల్‌ఫోన్‌ను ఇంట్లో పెట్టారు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్‌ను పరిశీలిస్తున్న క్రమంలో సెల్ఫీ వీడియో బయటపడింది. ‘నేనేం తప్పు చేయలేదు సార్. ఆటోలో జరిగిన దొంగతనానికి, నాకు సంబంధం లేదు. అంగట్లో జరిగిన దొంగతనంతో కూడా సంబంధం లేదు. పోలీసుల టార్చర్ భరించలేకున్నా సార్. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని భావిస్తున్నా’మంటూ సలాం, నూర్జహాన్ కన్నీటి పర్యంతమవుతూ తమ పరిస్థితిని అందులో వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విచారణకు ఆదేశించారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు. అదే విధంగా పోలీసులు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి.. పౌరులకు నష్టం కలిగిస్తే సహించేది లేదని హోం మంత్రి సుచరిత హెచ్చరించారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ -
బెయిల్ ఇప్పించి నిరసనలా?
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులకు టీడీపీ నాయకుడు, న్యాయవాది వేదుర్ల రామచంద్రరావు ద్వారా బెయిలు ఇప్పించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోవైపు నిరసనలకు పిలుపునివ్వటంపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స మాట్లాడుతూ చంద్రబాబు సూచనలతోనే నిందితుల తరఫున వాదించి బెయిల్ ఇప్పించడం నిజం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ‘చంద్రబాబు చేసింది చాలక వృత్తి, ప్రవృత్తి అని మాట్లాడతారా? చేసిందంతా చేసి తిరిగి ప్రభుత్వంపై బురద జల్లుతారా? ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించి భార్యాబిడ్డలతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కారకులపై చర్యలు తీవ్రంగా ఉండాలని స్పష్టం చేస్తూ ఇద్దరు ఐపీఎస్ అధికారులతో విచారణకు ఆదేశించారు. నిందితులను ప్రభుత్వం 24 గంటల్లోనే అరెస్టు చేసి జైలుకు పంపితే చంద్రబాబు కుట్రలకు పదును పెట్టి నిరసనలకు పిలుపునివ్వడం విస్మయం కలిగిస్తోంది’ అన్నారు. బెయిల్ ఇప్పించారా.. లేదా? ‘నిందితులకు ప్రభుత్వం బెయిల్ ఇప్పించిందా? లేక టీడీపీ బెయిల్ ఇప్పించిందా?’ అనేది చంద్రబాబు సూటిగా చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. చటుక్కున బెయిలు వచ్చిందంటే చంద్రబాబు లాంటి మేనేజ్మెంట్ చేసే వాళ్లుంటేనే ఇలా జరుగుతుందన్నారు. ‘పైకోర్టుకు వెళ్లి బెయిలు రద్దుకు ప్రతిపక్షం డిమాండ్ చేయాలి. కానీ ప్రభుత్వమే నిందితుల బెయిలు రద్దు కోసం పిటిషన్ వేసింది. ఏ స్థాయికైనా వెళ్లి బెయిలు రద్దు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సలాం ఆత్మహత్య కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించిన కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వేదుర్ల రామచంద్రరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సాక్ష్యాలు చూపిస్తున్నాం’ అని బొత్స అన్నారు. 30 లక్షల ఇళ్లను అడ్డుకున్నారు: పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారని, టీడీపీ లాంటి ప్రతిపక్షం ఉండటం మన ఖర్మని బొత్స పేర్కొన్నారు. 30 లక్షల ఇళ్లను ఇవ్వకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఘనంగా ఆజాద్ జయంతి: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు పాల్గొన్నారు. -
టీడీపీ తీరు రాబందులను గుర్తుచేస్తోంది
నంద్యాల: అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేయడం నీచం, దారుణమని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నంద్యాలలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య వ్యవహారంలో టీడీపీ నాయకుల హడావుడి, తాపత్రయం చూస్తుంటే రాబందులు గుర్తుకొస్తున్నాయన్నారు. సలామ్ కుటుంబం మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి ఐపీఎస్ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని, 24 గంటల్లోనే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేíÙయా కూడా ప్రకటించారన్నారు. సలామ్ కుటుంబానికి మొట్టమొదట ధైర్యం ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుంటే మరో పక్క చంద్రబాబు, అచ్చెన్నాయుడు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావుతో బెయిల్ పిటిషన్ వేయించి డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. అబ్దుల్ సలామ్ ఆత్మహత్య కేసులో బెయిల్ ఇప్పించడంపై ప్రజలకు చంద్రబాబు, అచ్చెం, లోకేష్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత న్యాయవాది సుబ్బరాయుడును హత్య చేస్తే టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదన్నారు. గుంటూరులో ముస్లిం యువకులు న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని, దీన్ని ఎవరూ మరచిపోలేదని అన్నారు. -
గుట్టు రట్టుతో రాజీ డ్రామా..!
నంద్యాల: కర్నూలు జిల్లాలో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కేసులో టీడీపీ రాజీ డ్రామాకు తెరతీసింది. ఈ కేసులోని నిందితులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వేదుర్ల రామచంద్రారావు బెయిల్ ఇప్పించిన వైనాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఆయన ప్రకటించారు. ఒకవైపు నిందితులకు బెయిల్ ఇప్పించి మరోవైపు ఒక్కరోజులోనే ఎలా ఇస్తారంటూ టీడీపీ డబుల్ గేమ్ ఆడటాన్ని ‘బెయిలడిగేదీ వారే.. బురద చల్లేదీ వారే’ పేరుతో ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తెలిసిందే. దీంతో టీడీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ద్వారా బెయిల్ ఇప్పించిన విషయం బహిర్గతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర నేతలు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎన్ఎండీ ఫరూఖ్ మౌనం దాల్చారు. ఈ నేపథ్యంలో రామచంద్రారావు బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. తనవల్ల ఇంత చర్చ జరగడం ఇష్టం లేదని, ఈ కేసులో వకాలత్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మోకా సువర్ణరాజు గురువారం విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల తరపున వాదించిన టీడీపీ నేత రామచంద్రారావు వకాలత్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. -
బెయిలడిగేదీ వారే... బురద జల్లేదీ వారే!
నంద్యాల: ఒకవైపేమో ఇంతటి తీవ్రమైన కేసుల్లో 24 గంటలు తిరక్కుండానే బెయిలెలా వచ్చేస్తుందంటూ ప్రశ్నించేది వాళ్లే!!. మరోవంక ‘మిలార్డ్! నా క్లయింటుకు బెయిలివ్వండి’ అంటూ కోర్టులో వాదించేది కూడా వాళ్లే!! ఇదీ తెలుగుదేశం నేతల తీరు!?. నంద్యాలలో కుటుంబంతో సహా అబ్దుల్ సలామ్ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో టీడీపీ రాజకీయ కుట్ర స్పష్టంగా బయటపడింది. ఒకవంక టీడీపీ నేతలే తమ లాయర్లను పంపి నిందితులుగా ఉన్న సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్ తరఫున కోర్టులో పిటిషన్లు వేసి, వారికి బెయిలొచ్చేలా చేశారు. మరోవంక కోర్టు ఇచ్చిన బెయిలును ప్రభుత్వానికి అంటగడుతూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేశారు. నిందితుల్ని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని, అందుకే 24 గంటల్లోపే బెయిలొచ్చేసిందని విమర్శలు చేశారు. నిజానికి అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించింది. దీనికి కారకులు ఎంతటివారైనా వదలొద్దని, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడమే కాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లను నియమించారు. దీంతో 24 గంటల్లోనే బాధ్యులైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌ను సస్పెండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే కుట్రలకు పెట్టింది పేరైనా టీడీపీ.. అరెస్టయిన ఆ ఇద్దరినీ బెయిలుపై బయటకు తేవటానికి తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టరు వేదుర్ల రామచంద్రరావును రంగంలోకి దింపింది. నిందితుల తరఫున ఆయన బెయిలు పిటిషన్ వేసి, వారికి బెయిలొచ్చేలా చేశారు. ఇలా నిందితుల్ని బెయిలుపై బయటకు తీసుకొచి్చన టీడీపీ నేతలు... ఆ బెయిలేదో ప్రభుత్వమే ఇచ్చినట్లుగా... నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని కూడా విమర్శలు చేయటం వారి నైజానికి పరాకాష్ట. బెయిలును రద్దు చేయండి.. వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్‌పై బయటకు రావటంతో... దాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలైంది. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాలలోని జిల్లా సెషన్స్ కోర్టులో పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై ఐపీసీ సెక్షన్ 323, 324, 306 కింద కేసులున్నాయని, వారు బయటకు వస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తూ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మోకా సువర్ణరాజు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యవర్గ జాబితాలో రామచంద్రరావు పేరు ఆర్థికంగా అంతంచేసింది అగ్రిగోల్డే.. ఎందరినో బలి తీసుకున్న అగ్రిగోల్డ్ దగ్గరే సలామ్ ఆత్మహత్యకూ మూలాలు కనిపిస్తాయి. ఈయన గాందీచౌక్‌లోని నిమిషాంబ జ్యువెలరీ షాపులో 22 ఏళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నాడు. గతంలో సలాం అనేక మందితో అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు పెట్టించారు. అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు సలాంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన ఇంటిని అమ్మేసి మరీ బాధితులకు రూ.10 లక్షల వరకూ చెల్లించాడు. ఆర్థికంగా చితికిపోయినా... ఏదో ఉద్యోగం ఆసరాగా నెట్టుకొస్తుండగా గతేడాది నవంబర్ 7న జ్యువెలరీ షాపులో కిలోన్నర బంగారం, రూ.5.50 లక్షల నగదు చోరీ జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా సలామ్‌ను పోలీసులు వేధించటంతో డిసెంబర్ 4న బాత్రూంకు అని బయటకువెళ్లి చెత్తను తగలబెట్టి ఆ మంటలను దుస్తులకు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో పోలీసులే గోప్యంగా చికిత్స అందించారు. చివరకు తన ఇంట్లోవారికి చెందిన 50 తులాల బంగారాన్ని పోలీసులకిచ్చాడని, వారు దాన్ని రికవరీగా చూపించారని సమాచారం. ఆ తరవాత మకాం మార్చి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత సోమవారం స్థానికుడైన భాస్కరరెడ్డి సలామ్ ఆటో ఎక్కి తరవాత దిగిపోయాడు. అయితే రూ.70వేలు ఆటోలో పోయాయంటూ భాస్కరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సోమశేఖర్‌రెడ్డి విచారణ నిమిత్తం సలామ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. వారు తమదైన శైలిలో ప్రశ్నించడంతో సలాం మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. టీడీపీ నాయకులెందుకు వాదించారు? అక్రమ కేసులు బనాయించిన పోలీసులకు టీడీపీ నేతలు వత్తాసు పలకడం శోచనీయం. పోలీసుల వేధింపులు తాళలేక నలుగురు మృతి చెందితే దానికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయం. టీడీపీ నాయకులు నిందితుల తరఫున వాదించి వారికి బెయిల్ ఇప్పించడం బాధాకరం. దీన్ని ముస్లిం మైనార్టీ వర్గాలు మరిచిపోవు. – పఠాన్ సాహెబ్‌ఖాన్, నంద్యాల -
సలామ్ అత్తకు రూ.25 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/నంద్యాల: నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యతో ఆసరా కోల్పోయిన అతని అత్త మాబున్నీసాను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తో కలిసి సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సలామ్ కుటుంబం ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని, దీనికి పోలీసుల వేధింపులే కారణమంటూ సలామ్ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన వెంటనే సీఎం జగన్ తనతోను, డీజీపీ సవాంగ్‌తోను మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. తప్పు చేస్తే పోలీసులనూ ఉపేక్షించేది లేదన్నారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, అణగారిన వర్గాలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా పోలీసులు వేధింపులకు పాల్పడితే బాధితులెవరూ ప్రాణాలు తీసుకోవద్దని, తక్షణం ఏపీ పోలీస్ సేవా యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేలా త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నం హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడైన అచ్చెన్నాయుడిను అరెస్ట్ చేస్తే బీసీలపై కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ముస్లిం, మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. టీడీపీ నేతల అవకాశవాద విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీసులనూ ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సలాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవి, హఫీజ్‌ఖాన్ బాధ్యులందరిపైనా చర్యలు అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అందరిపైనా ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. సోమవారం ఆయన నంద్యాలలోని అబ్దుల్సలామ్ ఇంటికి వెళ్లి అతని అత్త, బంధువులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌తో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన నంద్యాల సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లకు నంద్యాల ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రసన్నలత బెయిల్ మంజూరు చేశారు. వారిద్దరిపైనా పోలీసులు ఐపీసీ 323, 324, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, న్యాయమూర్తి దీనిని సెక్షన్ 506 (మాటలతో వేధించడం) పరిధిలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితుల తరఫున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది వి.రామచంద్రరావు వాదనలు వినిపించారు. న్యాయం జరుగుతుందనుకోలేదు నా అల్లుడు, కుమార్తె, వారి పిల్లల ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తారని అనుకోలేదు. ఈ కేసులో విచారణ కమిటీ ఏర్పాటు చేసి.. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయడం సంతోషంగా ఉంది. నా కుటుంబానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నా వాళ్ల చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్ట వద్దని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. – మాబున్నిసా, అబ్దుల్ సలామ్ అత్త సీఎం స్పందించిన తీరు మనోధైర్యం నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ముస్లింలలో మనోధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం విచారణ కమిటీ వేయడమే కాకుండా ఆత్మహత్యకు కారణమైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లను సస్పెండ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడం అభినందించదగ్గ విషయం. – అబ్దుల్‌ఖాదిర్, మతపెద్ద, నంద్యాల -
నోబెల్‌కే నిండుదనం
పురస్కారం అమర్త్యసేన్, రామకృష్ణన్, అబ్దుస్ సలామ్, నైపాల్, యూనస్ నోబెల్‌కే నిండుదనం నోబెల్ ఇండియా సామాజిక అర్థికవేత్త అమర్త్యసేన్‌కు 1998లోఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. అమర్త్యసేన్ 1933 నవంబర్ 3న ఢాకా నగరంలో పుట్టారు. అమర్త్యసేన్ తల్లిదండ్రులు అసుతోష్ సేన్, అమితాసేన్. అమర్త్యసేన్ తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, తల్లి శాంతినికేతన్లో పనిచేసేవారు. ‘అమర్త్యసేన్’కు రవీంద్రనాథ్ ఠాగూర్ నామకరణం చేశారు. శాంతినికేతన్ నుంచి కేంబ్రిడ్జి వరకు... అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన ఆర్థికశాస్త్రంలో చేసిన అధ్యయనాలకు గుర్తింపుగా అత్యున్నతమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. అమర్త్యసేన్ హైస్కూల్ విద్య శాంతినికేతన్లో, గ్రాడ్యుయేషన్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తిచేశారు. ఉన్నత విద్యభ్యాసం కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, ట్రినిటీ కళాశాలలో చేరారు. అర్థశాస్త్రానికి కొత్త అర్థం! అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో పాతవిధానాలకు స్వస్తి చెప్పి సామాజిక దృక్పథంలోను, సమాజంలో ఉండే ఆర్థిక అసమానతల పరంగా ప్రజలను మనస్తత్వాల ఆధారంగాను అర్థశాస్త్రాన్ని అభ్యసించాలని ప్రతిపాదించారు. జీవరసాయన వైతాళికుడు వేంకటరామన్ రామకృష్ణన్ 2009లో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రజ్ఞుడు. ఆయన తమిళనాడు, కడలూర్ జిల్లా చిదంబరంలో 1952వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు సి.వి.రామకృష్ణన్, తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మి. తల్లిదండ్రులిద్దరూ శాస్త్రవేత్తలే. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా వేంకటరామన్ రామకృష్ణన్ విద్యాభ్యాసమంతా వడోదరలోనే జరిగింది. ఆయన 1971లో బరోడా విశ్వవిద్యాలయంల నుంచి బీఎస్ పట్టా పొందారు. భారతదేశంలో ఆయనకు పైచదువులకు ప్రవేశం లభించలేదు. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో 1976లో పీహెచ్డీ పొందారు. రామకృష్ణన్‌కు డాక్టరేట్ వచ్చేనాటికి వయస్సు 24. 1976లో రామకృష్ణన్ తన పరిశోధనలను భౌతిక శాస్త్రం నుంచి బయో కెమిస్ట్రీలోకి మార్చుకున్నారు. డాన్ ఎంగెల్మన్, పీటర్ మూర్లు ప్రచురించిన రైబోజోమ్‌లపై పరిశోధన పత్రం ప్రభావంతో రైబోజోమ్‌ల నిర్మాణంపై పరిశోధనలు ప్రారంభించారు. రైబోజోమ్‌ల నిర్మాణంపై జరిపిన పరిశోధనలకు గాను రామకృష్ణన్ 2009లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. దైవకణ ఉనికి నిర్ధారకుడు అబ్దుస్ సలామ్‌కు 1979లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఆయన అవిభక్త భారతదేశంలోని పంజాబ్‌లో 1926, జనవరి 29న జన్మించారు. ఈయన తండ్రి చౌదరి మహమ్మద్ హుస్సేన్ తల్లి హజీరా హుస్సేన్. అబ్దుస్ సలామ్ 1944లో గణితశాస్త్రంలో బీఏ, 1946లో ఎం.ఎ. పట్టా సాధించారు. ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండ్ వెళ్లారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణితం, భౌతిక శాస్త్రాలు ప్రధానంగా 1949లో ఉత్తీర్ణత చెందారు. అదే విశ్వవిద్యాలయంలో థీరిటికల్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ ఎలక్ట్రో డైనమిక్ అంశంలో 1951లో పీహెచ్డీ పట్టా సాధించారు. అబ్దుస్ సలామ్ పార్టికిల్ ఫిజిక్స్‌లో గణనీయమైన పరిశోధనలు జరిపి పరమాణువులోని వివిధ కణాలు ఏ విధంగా సంయుక్తంగా ఉండగలుగుతాయో సిద్ధాంతీకరించారు. అబ్దుస్ సలామ్ జరిపిన నాలుగు దశాబ్దాల పరిశోధనల ఫలితంగానే ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన బోసాన్ అనబడే దైవకణం యొక్క ఉనికి నిర్ధారించబడింది. పార్టికిల్ భౌతిక శాస్త్ర పరిశోధనలకు గుర్తింపుగా 1979వ సంవత్సరపు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ప్రపంచసాహితీ వేత్త అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో విద్యాధర సూరజ్ ప్రసాద్ నైపాల్ (వి.ఎస్.నైపాల్) ఒకరు. ఆయనకు 2007లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. సర్ విద్యాధర సూరజ్ ప్రసాద్ ట్రినిడాడ్‌కు చెందిన భారత సంతతివారు. ఈయన బ్రిటన్ పౌరసత్వం పొందారు. వీరు ట్రినిడాడ్ టొబాగోలో 1932వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన జన్మించారు. మొదటి నుంచి ఆయనకు ఆంగ్లభాషలో ప్రావీణ్యత ఉండడం చేత అనేక గ్రంథాలు చదివారు. ఆ స్ఫూర్తితో కథలు, వ్యాసాలు రాశారు. తన భావాలను సులభంగా వ్యక్తీకరించారు. ఆయన రచనలు వలస సంప్రదాయం కలిగిన వెస్ట్ ఇండీస్ దీవులలో ముఖ్యంగా ఆక్రమణలకు గురైన దీవులలో ఎంతో ప్రబోధాత్మకాలై అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. విద్యాధర సూరజ్ నైపాల్ తల్లిదండ్రులు భారత సంతతికి చెందినవారే. ఈయన మొదటి భార్య పాట్రీషియా నైపాల్ 1996లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆ తర్వాత ఆయన 1996లో నాదిరా అనే భారతి సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. నైపాల్ పురస్కారాలలో కొన్ని: 1971వ సంవత్సరపు బుకర్ బహుమతి 2007లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం. మేధో దార్శనికుడు మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఈయన అసోమ్ రాష్ట్రం, చిట్టగాంగ్‌లో 1940 జూన్ 28న జన్మించారు. చిట్టగాంగ్ ప్రస్తుత బంగ్లాదేశ్‌కు చెందినది. యూనస్ బాల్యం, విద్యాభ్యాసం చిట్టగాంగ్‌లోనే జరిగింది. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ, ఎమ్ఏ డిగ్రీలను పొంది స్కాలర్‌షిప్‌పై వాండర్ బిల్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి 1971లో డాక్టరేట్ సాధించారు. 1969 నుంచి 1972 వరకు మిడిల్ టెన్నిసీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో 1972, 73లో సంభవించిన కరవులో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి ఉద్యోగానికి రాజీనామా చేసి, 1974 నుండి కరవు, పేదరికం నిర్మూలన ఉద్యమాలు, ప్రజాహిత ఆర్థిక సంస్కరణలు చేపట్టి సమాజానికి మేలు చేశారు. గ్రామీణ బ్యాంకులు, జనతా బ్యాంకులు, సూక్ష్మ రుణ పథకాలు, సంక్షేమ ఆర్థిక విధానాలు ఇవన్నీ అబ్దున్ సలామ్ ప్రతిపాదనలే. 2006లో లభించిన నోబెల్ పురస్కారానికి ఆయనకు వచ్చిన సొమ్మునంతా అబ్దున్ సలామ్ ‘చౌక ధరలో అధిక పోషణ విలువలు’ గల ఆహారం తయారు చేసే కర్మాగారానికి, పేదల కోసం కంటి ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించారు. మహాత్ముడికి ఎందుకురాలేదు? భారత జాతిపిత మోహనదాస్ కరమ్‌చంద్ గాంధీ పేరు నోబెల్ శాంతి పురస్కారానికి 1937, 1938, 1939, 1947, 1948లలో ప్రతిపాదనకు వచ్చింది. అది ప్రతిపాదనలకే పరిమితమైంది తప్ప బహుమతి ప్రదానం జరగలేదు. దలైలామాకు నోబెల్ బహుమతి ఇచ్చినప్పుడు ‘ఈ శాంతి పురస్కారం ఒక విధంగా మహాత్మాగాంధీ అహింసాయుత పోరాటానికి జ్ఞాపిక’ అన్నారు నిర్వహకులు. 1937లో ప్రతిపాదించినప్పుడు నోబెల్ కమిటీకి సలహాదారు ప్రొఫెసర్ జాకబ్ వర్మ్ ముల్లర్ ‘ఆయన జనబాహుళ్యం మెచ్చిన నాయకుడే కానీ విధాన నిర్ణయంలో నియంత. ఆదర్శవాది అయినప్పటికీ సామాన్య రాజకీయవేత్త. అహింసావాదం గొప్పదే, అయితే అన్ని సందర్భాలలోనూ నిలుస్తుందా?’ అన్నారు. ఐరోపా దేశాలకు చెందిన ‘భారతమిత్రత్వ సంఘ సభ్యులు’ మూడేళ్లు ప్రతిపాదించినా ఫలితం లేకపోవటానికి బ్రిటిష్ ప్రభుత్వ వత్తిళ్లే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. 1947లో ‘ఈ అహింసాయుత పోరాటం బ్రిటిష్ వారిపై విజయం అనుకుంటే, భారత్‌లో హిందు, ముస్లిమ్‌ల మధ్య అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయింది’ అన్నారు. 1948లో మహాత్మాగాంధీ హత్య అనంతరం ప్రతిపాదించినప్పుడు మరణించిన వారి పేర్లు నోబెల్ బహుమతికి ప్రతిపాదించలేదని, గాంధీ వారసులను పేర్కొనలేదని సాకులు చెప్పింది. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు, విశ్రాంత రసాయనాచార్యులు