రేపు సీఎం జగన్‌ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన | YS Jaganmohan Reddy to visit Kurnool and Nandyala districts on March 14 | Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన

Published Wed, Mar 13 2024 5:11 AM | Last Updated on Wed, Mar 13 2024 5:11 AM

YS Jaganmohan Reddy to visit Kurnool and Nandyala districts on March 14 - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో  ఈ నెల 14న పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్‌ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ముస్లింలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదర, సోదరీమ­ణులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement