
Breadcrumb
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. అప్డేట్స్
Published Thu, May 5 2022 9:29 AM | Last Updated on Thu, May 5 2022 5:25 PM

Live Updates
సీఎం జగన్ తిరుపతి పర్యటన
టాటా ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్

టాటా ట్రస్ట్ సహకారంతో శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతిలో ప్రారంభించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో 92 పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించింది.
ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ అలిపిరి వద్ద 25 ఎకరాలు ఇచ్చింది. ఆస్పత్రి ప్రారంభంతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు.
ఆశీర్వాదాలు.. జ్క్షాపికలు అందుకున్న సీఎం జగన్
తిరుపతిలో శ్రీ పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజలో పాల్గొన్న సీఎం జగన్.. ఆపై పలువురు తల్లులు, పిల్లలతో మాట్లాడారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం అందుకుని.. పలువురు ఇచ్చిన జ్ఞాపికలను సీఎం జగన్ అందుకున్నారు.
చిన్నారుల తల్లులతో పలకరింపు
చిన్నారుల తల్లులతో సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు. వాళ్ల వేదనలను విని.. ఆ తల్లులకు భరోసా ఇచ్చిన సీఎం జగన్.
ఆస్పత్రి ఏవీని వీక్షించిన సీఎం జగన్
పిల్లలకు అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో తిరుపతిలో శ్రీ పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం. త్రీడీ నమునా పరిశీలించిన సీఎం జగన్.. నిర్మాణ శిలాఫలకాలు ఆవిష్కరించారు కూడా. హస్పిటల్కు సంబంధించిన ఏవీని వీక్షించారాయన.
ఆస్పత్రి భూమి పూజలో పాల్గొన్న సీఎం జగన్
తిరుపతిలో శ్రీ పద్మావతి చిల్డ్రన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమిపూజలో పాల్గొన్న సీఎం జగన్. దాదాపు 6.25 ఎకరాల విస్తీర్ణంలో.. 230 కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం. ఆస్పత్రి ప్లాన్ను అధికారులతో కలిసి పరిశీలించిన సీఎం జగన్.
బటన్ నొక్కి విద్యా దీవెన సొమ్ము జమ చేసిన సీఎం జగన్
బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేశారు.
వైఫల్యాలు ఉంటే వెంటనే చర్య తీసుకుంటున్నాం: సీఎం జగన్
అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ను తీసుకొచ్చాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతున్న సంఘటనల మీద దోషులు ఎవరైనా, ఎంతటి వాళ్లైనా చర్యలు తీసుకుంటున్నాం. వైఫల్యం ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. అయినా.. అత్యాచార ఘటనల పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.
చివరకు ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తున్నారు: సీఎం జగన్
► వాళ్లు(గత ప్రభుత్వం) ప్రభుత్వ బడులను మూయాలని ప్రయత్నిస్తే.. మనం పరిస్థితిని మార్చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో.. నాడు-నేడుతో రూపు రేఖలు మార్చేశాం. గత ప్రభుత్వం గుడులు కూలిస్తే.. మనం నిర్మించాం. ప్రతీ వ్యవస్థను వాళ్లు నాశనం చేస్తే.. బాగు పరిచే ప్రయత్నం మనం చేస్తున్నాం. గ్రామ వలంటీర్ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం.
► ఎన్నికలకు ముందు ఎన్నో అబద్దాలు చెప్తారు.తర్వాత పట్టించుకోరు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోతుంది. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. చంద్రబాబు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశారు.
► సంక్షేమ ప్రభుత్వాన్ని చూసి.. దొంగల ముఠాకు కడుపు మంట పెరుగుతోంది. విద్యావ్యవస్థలో ఇన్ని గొప్ప మార్పులు, పథకాలను ప్రజలు మర్చిపోవాలని పేపర్, టీవీల ద్వారా అబద్దాలతో ప్రచారం చేస్తూనే ఉన్నారు.
► దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది టీడీపీ తీరు. తమకు అనుకూలంగా ఉన్న స్కూల్స్ నుంచే ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ చేయించి.. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
► చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే.. జగన్ ఎక్కడ అందరి మనసులో నిలిచిపోతాడేమో అని కుయుక్తులు పన్నుతున్నారు.
టీడీపీ ప్రభుత్వ బడులు మూసివేద్దామనుకుంది: సీఎం వైఎస్ జగన్
నాడు-నేడుతో ప్రభుత్వ బడులను పూర్తిగా మర్చాము. ప్రభుత్వ బడులు మూసివేద్దామన్న ఆలోచనతోనే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. గత ప్రభుత్వం బకాయిలు కూడా మేమే చెల్లించాం. అవినీతికి తావు లేకుండా డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే వేస్తున్నాం. చంద్రబాబు.. నాడు-నేడు, వసతిదీవెన లాంటి పథకం ఏదైనా అమలు చేశారా..?
ఉన్నత విద్యంటే ఉన్నోడి కాదు.. అర్హత ఉన్నోడికి: మంత్రి రోజా
విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి రోజా అన్నారు. ప్రతీ పేద విద్యార్థి తాను కలలు గన్న చదువు చదువుకుని.. ఆ కుటుంబాన్ని పైకి తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చినా జగనన్నకు కృతజ్ఞతలు. ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకం విద్యాదీవెన. పేదోడంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదు. అందుకే అన్నిరకాలుగా నరకయాతన పెట్టాడు. కానీ, మనసున్న మహరాజు జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే ప్రతీరోజూ సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి విద్యార్థుల అదృష్టం.. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం అన్నారు మంత్రి రోజా. ఉన్నత విద్యంటే ఉన్నోడి కాదు.. అర్హత ఉన్నోడికి అందాలన్నదే విద్యా దీవెన ఉద్దేశమని ఆమె అన్నారు.
ఆయనకు చదువు విలువ తెలుసు కాబట్టే..
చదువు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే.. విద్యార్థుల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్నారని సీఎం జగన్ గురించి చెప్పారు మంత్రి మేరుగ నాగార్జున. వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లలకు విద్య అందాలనే లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు.
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సీఎం జగన్
ప్రజల కోసం నిజాయితీగా నిలబడిన వ్యక్తి సీఎం జగన్ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పేద ప్రజల జీవితాలను బాగుచేయడమే లక్ష్యంగా జగన్ పరిపాలన చేస్తున్నారని, ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నారయంటూ కొనియాడారు.
విద్యా దీవెనకు సంబంధించిన స్పెషల్ ఏవీ ప్రదర్శన
జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన స్పెషల్ ఆడియో విజువల్ ప్రదర్శన.. చప్పట్లతో మారుమోగిన సభా ప్రాంగణం.
జ్యోతి ప్రజల్వన చేసిన సీఎం జగన్
జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమ సభను ప్రారంభించిన సీఎం జగన్, మంత్రి రోజా తదితరులు.
కాసేపట్లో విద్యాదీవెన నగదు జమ కార్యక్రమం
తిరుపతి తారక రామ స్టేడియంలో.. కాసేపట్లో విద్యాదీవెన నగదు జమ కార్యక్రమం. విద్యాదీవెన వసతి పథకం కింద.. ఇప్పటి వరకూ రూ. 10, 994 కోట్లు వెచ్చించిన ఏపీ ప్రభుత్వం.
వేదికకు చేరుకున్న సీఎం జగన్
జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కోసం తిరుపతి తారకరామ స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్. విద్యార్థులతో ఆప్యాయ పలకరింపు.
రేణిగుంట నుంచి సభావేదికకు సీఎం జగన్
రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరిన సీఎం జగన్.
రేణిగుంట చేరుకున్న సీఎం జగన్
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.
జగనన్న విద్యాదీవెనపై ఆడబిడ్డల ఆనందం
జగనన్న విద్యాదీవెన ద్వారా తమ చదువులు కొనసాగుతుండడంపై పలువురు విద్యార్థులు తిరుపతి వేదిక వద్ద స్పందించారు. చాలా సంతోషంగా, చాలా గౌరవంగా, చాలా గర్వంగా కూడా ఉందన్నారు వాళ్లు. వెనకడుగు వేసే విద్యార్థులకు ఈ పథకం ఆసరాగా ఉంటోందని, మధ్యతరగతి విద్యార్థులను ముందుకు నడిపించేందుకు జగనన్న విద్యా దీవెన అండగా నిలుస్తోందంటూ పలువురు ఆడబిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న విద్యా దీవెన
తిరుపతి బయలుదేరిన సీఎం జగన్
తిరుపతి పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆపై తిరుపతికి బయలుదేరారు.
సీఎం జగన్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం
సీఎం జగన్.. జిల్లా ఏర్పాటు అయ్యాక తిరుపతి నగరంలో తొలిసారి పర్యటిస్తుండడంతో.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం జగన్ రాకతో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేట్టారు.
సీఎం జగన్ తిరుపతి పర్యటన ఇలా..
- తిరుపతి పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ గురువారం ఉదయం ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి.. రేణిగుంటకు చేరుకుంటారు.
- అక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్కు వెళ్తారు. స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం.. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియానికి చేరుకుంటారు.
- అక్కడ జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని..బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేస్తారు.
- అటుపై శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకొని భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
- అక్కడి నుంచి కేన్సర్ కేర్ ఆస్పత్రికి చేరుకుని.. ఆ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.
- అనంతరం.. రేణిగుంట నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
లబ్ధిదారులకు జగనన్న విద్యా దీవెన కానుక
జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతికి వెళ్లనున్నారు. 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు బటన్ నొక్కి జమ చేస్తారు.
Related News By Category
Related News By Tags
-
తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
తిరుపతి : పద్మావతి మెడికల్ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) బాధితుల్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan ...
-
YS Jagan: ఓ తరం.. అంతరం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు ...
-
చంద్రబాబు తిరుమలను కించపరుస్తుంటే బీజేపీ మౌనమేల?
సాక్షి,తాడేపల్లి : నా మతం ఏంటని అడుగుతున్నారా? నా మతం మానవత్వం.. డిక్లేషరేషన్లో రాసుకోండి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్...
-
నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకోండి: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర క...
-
వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. పోలీసుల ఆంక్షలు
సాక్షి,తిరుపతి జిల్లా : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బా...