సాక్షి,తాడేపల్లి : నా మతం ఏంటని అడుగుతున్నారా? నా మతం మానవత్వం.. డిక్లేషరేషన్‌లో రాసుకోండి అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నా మతం ఏంటని అడుగుతారా? నా మతం మానవత్వం. నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు.
ఇదీ చదవండి : నా మతం మానవత్వం : వైఎస్ జగన్
నా మతం మానవత్వం. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా. బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తా. హిందూమత ఆచారాలను పాటిస్తా. ఇస్లాం, సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తా.
ఎన్డీయే కూటమిలోని చంద్రబాబు లడ్డూ విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఒక మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే.. దళితుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. గుళ్లకు వెళ్లి చంద్రబాబు తప్పు చేశారని, తాము కాదని దేవుడికి చెప్పండి’అని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment