కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ విద్యాదీవెన పథకం కింద రూ.708.68కోట్లు ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి జరిగింది. పెద్ద చదువులు చదువుతున్న పేదింటి పిల్లల ఫీజు డబ్బులు వారి తల్లులకు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు.
- 57 నెలలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతోంది
- పిల్లల చదువుల కోసం పేదల అప్పులపాలు కాకూడదని అనుకున్నాం
- 93 శాతం మందికి విద్యాదీవెన అందిస్తున్నాం
- పిల్లల పూర్తి ఫీజును కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది
- విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన అమలు చేశాం
- గత త్రైమాసికానికి సంబంధించి రూ.708 కోట్లు ఇస్తున్నాం
- విద్యాదీవెన, వసతిదీవెన కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం
- విద్యారంగంపై ఐదేళ్లలో 73 వేల కోట్లు ఖర్చు చేశాం
- ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ నుంచి ఐబీఎస్ వరకు చదువు చెప్పిస్తున్నా్ం
- ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం
- ఈ పనులు చేస్తుంటే విపక్షాలు విమర్శిస్తున్నాయి
- చంద్రబాబు,దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది
- విమర్శించే వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు
- పెత్తందార్లకు ఓ ధర్మం..పేదలకు మరో ధర్మమా
- విద్యారంగంలో ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతోంది
- డబ్బులు ఉన్నవారికి,లేనివారికి యుద్ధం జరుగుతోంది
- ప్రభుత్వం ట్యాబ్ లు ఇస్తే చంద్రబాబు,పవన్ విమర్శిస్తున్నారు
- పెత్తందార్ల కుట్రలు ప్రజలు గమనించాలని కోరుతున్నా
- పేద విద్యార్ధుల కోసమే ఈ డబ్బు ఖర్చు చేస్తున్నాం
- విద్యార్ధులు పోటీ ప్రపంచంలో ఎదగాలన్నదే మా లక్ష్యం
- నాడు-నేడుతో బడులను మార్చేశాం
- పేద పిల్లలు విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదువుతున్నారు
- విద్యార్ధులకు వందశాతం ఫీజులు ప్రభుత్వం భరిస్తోంది
- పిల్లలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే
- చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలి
- విద్యాదీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు
- క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నాం
- విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి
- ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపు
- పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
- ఏ పేదవాడు తన పిల్లల చదువు కోసం అప్పులపాలు కాకూడదు
- మన ప్రభుత్వం వచ్చాక ఆయా ఆదాయపరిమితులు పెంచాం
- వీలైనంత మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం
- పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు
- ఫీజులే కాకుండా వసతి ఖర్చుల కోసం వసతి దీవెన ఇస్తున్నాం
- 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం
- రూ.708.68 కోట్లు ఖాతాల్లో ఇప్పుడు జమ చేయబోతున్నాం
- జగనన్న విద్యా దీవెనతో ఇప్పటి వరకు రూ.12,610 కోట్లు అందించాం
- వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఇప్పటి వరకు రూ.18 వేల కోట్లు వెచ్చించాం
- ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- విద్యారంగంలో ఇప్పటి వరకూ రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం
- కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం
- తర్వాతి తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి చదువే
- మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి
- ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- ఈరోజు క్వాలిటీతో ఉన్న చదువులే మన పిల్లలకు కావాలి
- క్వాలిటీ చదువుల అవసరం తెలుసుకున్నాం కాబట్టే విప్లవాత్మక మార్పులు అమలు చేస్తున్నాం
- మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి
- ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
- ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే విమర్శలు చేస్తున్నారు
- చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది
- వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి....మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?
- తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు
- పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా
- పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొచ్చు
- మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ నానా యాగీ చేస్తున్నారు
- పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి
- పెత్తంతారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం
- చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి
- 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయి
- మన పిల్లలు పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలి
- మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలి
- ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం
- ప్రభుత్వం ట్యాబ్‌లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు
- పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది
- పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా?
- చంద్రబాబు పేద విద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి?
- చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది
- చంద్రబాబు ఏరోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా?
- నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా?
- నారాయణ, చైతన్య విద్యా సంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన
- జగన్ అనే వ్యక్తి తప్పుకుంటే జరిగే నష్టం గురించి ఆలోచించండి
- జగన్ మళ్లీ రాకుంటే పిల్లల చదువులు, సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయి
- జగన్ మళ్లీ రాకుంటే పేదవాడు అప్పులపాలవుతాడు
- ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ అంటూ అబద్ధాలు చెబుతారు
- వాళ్లు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరుతున్నా
- మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే జగన్ కు ఓటు వేయండి
Comments
Please login to add a commentAdd a comment