సాక్షి, హైదరాబాద్: విద్యాబోధన, సంస్కరణల్లో ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పర్మామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసిన అతి ఉత్తమ్ కేటరిగిలో.. దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మేరకు ఏపీకి అభినందనలు సైతం తెలిపింది. విద్యకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుత ఫలితాలు రానున్నట్టు చెప్పుకొచ్చింది. అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయసమని తెలిపింది.
ఈ సందర్బంగా ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో విద్య విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. విద్యకు సంబంధించి 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యా కానుక, అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాలతో విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
విద్య కోసం 67వేల కోట్లు..
ఇక, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15వేలు అందిస్తోంది. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది.
నాడు-నేడు..
మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. దీని కోసం రూ.11,669 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్‌లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్‌ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన..
పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు.
డిజిటల్ విద్య..
ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం ప్రభుత్వం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు అందించింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తోంది.
ఇది కూడా చదవండి: విద్యా రంగానికి పెద్దపీట.. భారీగా కేటాయింపులు
Comments
Please login to add a commentAdd a comment