పేదల ఇళ్లపై అదేపనిగా రామోజీ దుష్ప్రచారం
బాబు హయాంలో టిడ్కో ఇళ్ల పేరిట భారీ అవినీతి
ఇళ్లు కట్టిస్తానని 5 లక్షల మంది పేదలకు చంద్రబాబు టోపీ
2,08,160 టిడ్కో ఇళ్లలో రూ.8,929.81 కోట్ల అవినీతి
జగన్ ప్రభుత్వంలో ఫేజ్–1లో 1,51,298 టిడ్కో ఇళ్లు పూర్తి
మార్చి 7 వరకు 1,24,680 ఇళ్ల పంపిణీ
1,43,600 మందికి ఉచితంగానే ఇళ్లు కేటాయింపు
రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో పేదలకు రూ.5,487.32 కోట్ల మేలు
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.4,368 కోట్ల ప్రజాధనం ఆదా
రామోజీ పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని అదేపనిగా రోత రాతలు రాస్తూనే ఉన్నారు. ఆ కళ్లకు చత్వారం, చెవులకు బధిరత్వం వచ్చింది. అందుకే ఈనాడుకు నిజాలు కనిపించవు.. వినిపించవు. సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఎంత మంచి చేసినా ఆ కళ్లకు చెడుగా కనిపిస్తోంది. ముదనష్టపు రాతలతో పచ్చకామెర్ల రోగి సామెతను దఫదఫాలుగా గుర్తు చేస్తూనే ఉన్నారు.
చంద్రబాబు దగా పాలనలో 5 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తానని దాదాపు రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడితే అదేదీ ఆనలేదు.. కానరాలేదు. 2019 మొదలు ఇప్పటి వరకు సీఎం జగన్ 1,24,680 టిడ్కో ఇళ్లను పేదలకు అందించినా, అసలు ఏమీ చేయనట్లుగా అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది.
సాక్షి, అమరావతి : పట్టణ పేదలకు మెరుగైన జీవనానికి ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లపైనా ఈనాడుకే ఏడుపే. ఏడుపుతో పాటు అబద్ధాల విషాన్నీ చిమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కింద అన్ని సదుపాయాలతో ఇప్పటి దాకా 1,24,680 యూనిట్లను లబ్దిదారులకు అందించినా, అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నా రామోజీకి కనిపించడం లేదు. లబ్ధిదారులు ఆనందంగా సొంతింట్లో నివాసమున్నా చూడలేకపోతున్నారు. గత చంద్రబాబు బృందం టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడింది.
చ.అడుగు నిర్మాణ ధర రూ.1000 కంటే తక్కువే ఉండగా.. బాబు మాత్రం కంపెనీలు ఇచ్ఛిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేసినా, ఇప్పటి దాకా ఒక్కసారి చంద్రబాబును ఇదేం అక్రమమని రామోజీ ప్రశ్నించిందే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సరిచేసింది.
టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఫ్లాట్ ధరను సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. అదీ తాగునీరు, విద్యుత్తు సదుపాయం, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పించిన తర్వాతే ప్లాట్లను కేటాయిస్తోంది. బ్యాంకు రుణాలు మంజూరైనా రెండేళ్ల మారటోరియం ఇచ్చింది. గడువులోగా ఇల్లు ఇవ్వకుంటే ప్రభుత్వమే లబ్దిదారుల ఈఎంఐ చెల్లిస్తోంది.
అన్ని వసతులతో పేదలకు ఆధునిక ఇళ్లు
రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లు వంద శాతం నిర్మాణం పూర్తయింది. ఈనెల 7 వరకు 1,24,680 ఇళ్లను లబ్దిదారులకు అందించారు.
ముఖ్యంగా 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన 1,43,600 యూనిట్లలో ఒక్కో ఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా, వీటిని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే అందించింది. 365 చ.అ. ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారులు తమ వాటాగా రూ.3.40 లక్షలు చెల్లించాలి. రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అ. ఇళ్లకు ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారుల వాటాగా రూ.4.40 లక్షలు చెల్లించాలి.
రెండు, మూడో కేటగిరీ ఇళ్ల లబ్దిదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, సంబంధిత మున్సిపాలిటీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణ వాయిదాల (ఈఏంఐ) చెల్లింపునకు 24 నెలల మారటోరియం ఉంది. 20 ఏళ్ల పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. మారటోరియం గడువు లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగిస్తే అప్పటి నుంచి రుణ వాయిదాలు వారే కట్టాలి. ఒకవేళ గడువులోగా ఇంటిని లబ్ధిదారులకు అప్పగించకపోతే రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా, బాబు భజనలో తరిస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు.
పేదల ఇళ్లలో చంద్రబాబు రూ.8,929.81 కోట్ల అవినీతి
♦ వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను సైతం ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు.
♦ ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు.
♦ 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు.
♦ ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు.
♦ ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్‌లో ఏ ప్రైవేటు బిల్డర్ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్‌లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు.
♦ అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు.
♦ టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది.
♦ తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది.
♦ పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది.
♦ దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది.
బాబు అక్రమాలకు జగన్ చెక్...ప్రజాధనం ఆదా...
బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది.
♦ రివర్స్ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది.
♦ నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది.
♦ 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది.
♦ జగన్ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment