Jagananna Vidya Kanuka Scheme
-
ఏపీలో విద్యారంగం నీరుగారిపోతోంది!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2 లక్షల 94 వేల 427 కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమానికి ఇవి ఏమాత్రమూ సరిపోవు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి విద్యారంగ సంక్షేమానికి పెద్దపీట వేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.పాఠశాల విద్యకు చంద్రబాబు సర్కారు 2024–25 బడ్జెట్లో రూ. 29 వేల 909 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్లో ఇది కేవలం 9.84 శాతం మాత్రమే. ఈ కేటాయింపు పాఠశాల విద్యను ఎలా బలోపేతం చేస్తుంది? ‘నాడు–నేడు’ పథకం గురించి బడ్జెట్లో ఊసె త్తలేదు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఆరో తరగతీ, ఆపై చదువు తున్న విద్యార్థులకు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసింది. 45 వేల స్మార్ట్ టీవీలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పాఠ్య, నోట్ పుస్తకాలు; బ్యాగులు, బూట్లు, యూనిఫారాలు వంటి వాటిని పాఠశాలల ప్రారంభం రోజునే పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వం అందించింది. ‘విద్యా కానుక’, ‘జగనన్న గోరుముద్ద’ వంటి పథకాలకు వేలకోట్లు ఖర్చు చేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌లను జగన్ పటిష్టంగా అమలు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 73 వేల కోట్లు విద్యారంగానికి కేటాయించి ఖర్చు చేశారు. గొల్లప్రోలు జెడ్పీ పాఠశాలలో తరగతి గదులు, ల్యాబ్‌లను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించి ప్రైవేట్ పాఠశాలల కంటే ఇవే బాగున్నాయని వ్యాఖ్యనించారు. జగన్ అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలకు పవన్ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి.‘తల్లికి వందనం’ (జగన్ హయాంలో ‘అమ్మఒడి’) పథకానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్లో కేవలం రూ. 5,387.03 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన బాబు వాస్తవంగా 84 లక్షల మంది విద్యార్థులకు రూ. 12 వేల 600 కోట్లు ఇవ్వాలి. కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి చంద్రబాబు సర్కారు తల్లుల్ని తీవ్రంగా దగా చేసింది. ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ, ఐబీ బోధనను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగు శ్రామిక వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ చదువుల్ని కూటమి నేతలు దూరం చేస్తున్నారు.చదవండి: ‘ఏపీ’ కోసం ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది?ఉన్నత విద్యకి బడ్జెట్లో రూ. 2,326.68 కోట్లు కేటాయించారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు గత ఆరు నెలల నుండి రూ. 3,500 కోట్లు రావాలి. ఒక్క పైసా కూడా చంద్ర బాబు సర్కారు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాల కోసం రూ. 2,542.95 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 75 శాతం. ప్రతీ ఏటా 12 లక్షల మంది విద్యార్థులకి రూ. 2,800 కోట్లు అవసరం. హాస్టల్ మెస్ చార్జీలకు రూ. 1,100 కోట్లు అవసరం.ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పోస్టు గత 5 నెలల నుండి ఖాళీగా ఉంది. జగన్ హయాంలో వున్న వైస్ ఛాన్స్లర్లను బలవంతంగా రాజీనామాలు చేయించింది చంద్రబాబు సర్కారు. 18 విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల్ని ఇంకా భర్తీ చేయలేదు. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చంద్రబాబు మోసగిస్తున్నారు. విద్యార్థి లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.– ఎ. రవిచంద్రవైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం బోధనను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్ మీడియంలో వర్క్‌బుక్స్‌తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచింది. గతేడాది ఆన్లైన్లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పుస్తకాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్ మీడియం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్సైట్లో ఉంచనున్నారు. పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్లైన్ పీడీఎఫ్‌లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్’ కోడ్‌ను జత చేసింది. ఆ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్‌లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు. పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మఒడి’ పథకం నిధులను వచ్చేనెలలో తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. గత నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందించనుంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.అదేరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు పుస్తకాలను అందజేయనున్నారు. మన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, వారు అంతర్జాతీయంగా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలుచేసింది.‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఐదోసారి రూ.6,400 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు..ఇక నవరత్నాల్లో భాగంగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే 2019–20 విద్యా సంవత్సరంలో తొలిసారి 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మఒడి అమలుచేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు నాలుగు విడతల్లో రూ.26,067 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇక ఐదోసారి 2023–24 విద్యా సంవత్సరానికి జూన్ నాలుగో వారంలో సుమారు రూ.6,400 కోట్ల నిధులను జమచేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరున్న ప్రతి విద్యార్థికీ నగదు జమకానుంది. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడేలా..గత టీడీపీ ప్రభుత్వంలో బడులు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసే ఉండేది కాదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే రూ.2,400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. దీంతో గత నాలుగు విద్యా సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఇబ్బందులు తలెత్తినా సంస్కరణలు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారు.ప్రతిభావంతులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ సత్కారం..ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యా సంవత్సరంలో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలోని విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్ని అత్యధిక మార్కులు సాధించారు.వీరిలో మొదటిస్థానంలో నిలిచిన 22,768 మందికి ‘జగనన్న ఆణిముత్యాలు బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ స్థానంలో ఉన్న వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు నగదు బహుమతిగా అందజేశారు. అలాగే, జిల్లా స్థాయి ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.15 వేలు ప్రదానం చేశారు.ఇక నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ఇవ్వగా, పాఠశాల స్థాయిలో రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ప్రదానం చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోను విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. స్కూళ్లు తెరిచిన అనంతరం వీరిని కూడా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.బడి తెరిచిన తొలిరోజే ‘జగనన్న విద్యాకానుక’ మరోవైపు.. ప్రభుత్వ, ఎయిడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన తొలిరోజు జూన్ 12న జగనన్న విద్యా కానుక కిట్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన కిట్‌లో బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు), నోట్‌బుక్స్, వరŠుక్బక్స్, కుట్టు కూలితో మూడు జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ గల కిట్‌ను మొదటిరోజే అందజేయనుంది.ఇప్పటివరకు ఇలా నాలుగు సార్లు అందజేయగా, గతేడాది రూ.1,042.53 కోట్ల ఖర్చుతో 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకానుకను అందించారు. 2024–25 విద్యా సంవత్సరానకి కూడా అంతే సంఖ్యలో కిట్లను సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదాపు పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో రవాణా నిలిపివేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం విద్యాకానుక కిట్లు స్టాక్ పాయింట్లకు చేరుస్తారు.గత విద్యా సంవత్సరాల్లో అమ్మఒడి, విద్యాకానుక పంపిణీ ఇలా..జగనన్న అమ్మ ఒడి.. సంవత్సరం లబ్ధిదారులు నగదు (రూ.కోట్లలో)2019–20 42,33,098 రూ.6,349.62020–21 44,48,865 రూ.6,673.42021–22 42,62,419 రూ.6,393.62022–23 42,61,965 రూ.6,392.9జగనన్న విద్యాకానుక ఇలా..విద్యా సం. లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)2020–21 42,34,322 రూ.648.102021–22 47,32,064 రూ.789.212022–23 45,14,687 రూ.886.692023–24 43,10,165 రూ.1,042.53 -
నాణ్యమైన విద్యకు పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్
-
రూ.1,042.51 కోట్లతో విద్యాకానుక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకిచ్చే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం రూ.1,042.51 కోట్లతో వీటిని సిద్ధంచేస్తున్నారు. గతేడాది మాదిరిగానే 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు విద్యా కానుక (జేవీకే–5)ను అందించాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ కిట్లను తీసుకుంటున్నారు. అయితే, జేవీకే–4లో మిగిలిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం కిట్లను తీసుకోనున్నారు. ఇప్పటికే కిట్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఆయా సంస్థలు అంగీకారం తెలపగా, ఏప్రిల్ చివరివారం నుంచి వాటిని సరఫరా చేయనున్నారు. ఈలోగా టెన్త్ పరీక్షలతో పాటు ఏప్రిల్ రెండోవారం నాటికి మిగతా తరగతుల పరీక్షలు కూడా పూర్తవుతాయి. దీంతో.. అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను తీసుకుంటారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి తప్పి, తిరిగి పాఠశాలల్లో చేరిన వారిని ఈ విద్యా సంవత్సరం ‘రెగ్యులర్’గా పరిగణించి వారికి కూడా విద్యాకానుక కిట్లను అందించారు. గతేడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో, జేవీకే–5 కిట్‌లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ నాలుగేళ్లలో జేవీకే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,366.53 కోట్లు వెచి్చంచింది. నూరు శాతం నాణ్యతతో కిట్లు.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులందరికీ 2020–21 విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ను అందిస్తోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కిట్లను అందించారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్‌బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. వీటి సరఫరాతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. మరోవైపు.. విద్యార్థులకిచ్చే ఈ కిట్ల నాణ్యతను ఆయా కంపెనీలు పరిశీలించే సరఫరా చేస్తున్నాయి. ఇందుకోసం గతంలో బ్యాగుల నాణ్యతా ప్రమాణాలను సీపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) చూసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అంటే.. రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్‌కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం క్యూసీఐ సంస్థే నాణ్యతను పర్యవేక్షించనుంది. -
జగనన్న విద్యా కానుకకు పరిపాలన అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో (2024–25) జగనన్న విద్యా కానుక–5 పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. ప్రతీ ఏడాదీ స్కూళ్లు తెరవకముందే ఈ విద్యా కానుకను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే జూన్ 12న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జగనన్న విద్యా కానుక–5లో భాగంగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, యూనిఫాం, బెల్ట్, బూట్లు, డిక్షనరీ, బ్యాగ్‌లు వంటి వాటిని 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు ఉచితంగా అందించేందుకు వీలుగా రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతులను విద్యాశాఖ మంజూరు చేసింది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్ మినహా మిగతా వాటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు.. 1వ తరగతి నుంచి టెన్త్ వరకు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ ముద్రించి సరఫరా చేసేందుకు ఈ–ప్రొక్యూర్మెంట్లో టెండర్లను ఆహ్వానించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. టెండర్ల ఆహ్వానం వీటికే.. ఇదిలా ఉంటే.. 4,73,37,549 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ సరఫరాకు, అలాగే.. 4,65,268 పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాల సరఫరాకు రూ.253.75 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ టెక్స్ ్టబుక్ ప్రెస్ శుక్రవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపించింది. ద్విభాషల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించి సరఫరా చేయాల్సిందిగా అందులో పేర్కొంది. తెలుగు–ఇంగ్లీష్, ఉర్దూ–ఇంగ్లీష్, కన్నడ–ఇంగ్లీష్, ఒడియా–ఇంగ్లీష్, తమిళం–ఇంగ్లీష్ మాధ్యమాల్లో పుస్తకాలు ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది. 26 జిల్లాల్లోని 670 మండల కేంద్రాల్లో ఉన్న విద్యాశాఖాధికారి కార్యాలయాలకు ఈ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ను నిర్ధేశించిన గడువులోగా సరఫరా చేయాలని వివరించింది. అలాగే, ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పేపర్ నాణ్యత, కలర్స్‌తో పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుందని అందులో స్పష్టంచేసింది. ఈ టెండర్లో ఎల్–1గా ఎంపికైన తరువాత రివర్స్ టెండర్ నిర్వహించి బిడ్డర్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. వర్క్ ఆర్డర్ ఇచ్చిన 50 రోజుల్లో 50 శాతం, 60 రోజుల్లో 75 శాతం, ఆ తరువాత వంద శాతం పుస్తకాల సరఫరా చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. నిబంధనలు ఇవే.. ► ఇక టెండర్లో పాల్గొనే బిడ్డర్లకు 2020–21, 2021–22, 22–23 సంవత్సరాల్లో కనీసం పది కోట్ల పుస్తకాలు ముద్రించి, సరఫరా చేసిన టర్నోవర్ కలిగి ఉండాలనే నిబంధన విధించారు. ► అలాగే, పుస్తకాల ముద్రణ, సరఫరా కార్యకలాపాల్లో కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. ► పుస్తకాల కాగితం దగ్గర నుంచి ముద్రణ దశ వరకు నాలుగు దశల్లో నాణ్యతను తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ► పుస్తకాల్లో లోపాలుంటే భారీ జరిమానా విధించనున్నట్లు విద్యాశాఖ ఆ టెండర్ డాక్యుమెంట్లో పేర్కొంది. ► దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఏమైనా ఉంటే తెలియజేసేందుకు ఈనెల 29 చివరి తేదీగా పేర్కొంది. -
చరిత్ర తిరగరాసిన సీఎం జగన్.. విద్యలో ఏపీ టాప్
సాక్షి, హైదరాబాద్: విద్యాబోధన, సంస్కరణల్లో ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పర్మామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసిన అతి ఉత్తమ్ కేటరిగిలో.. దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మేరకు ఏపీకి అభినందనలు సైతం తెలిపింది. విద్యకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుత ఫలితాలు రానున్నట్టు చెప్పుకొచ్చింది. అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయసమని తెలిపింది. ఈ సందర్బంగా ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల కాలంలో ఏపీలో విద్య విషయంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. విద్యకు సంబంధించి 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యా కానుక, అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాలతో విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్య కోసం 67వేల కోట్లు.. ఇక, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15వేలు అందిస్తోంది. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. నాడు-నేడు.. మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. దీని కోసం రూ.11,669 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు. డిజిటల్ విద్య.. ఇక, 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం ప్రభుత్వం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు అందించింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తోంది. ఇది కూడా చదవండి: విద్యా రంగానికి పెద్దపీట.. భారీగా కేటాయింపులు -
AP: 45 వేల పాఠశాలలు.. 1.06 కోట్ల పుస్తకాలు
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు విద్యాకానుక అందించి చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రెండో సెమిస్టర్‌కు పుస్తకాల పంపిణీ విషయంలోనూ రికార్డు నెలకొల్పింది. నవంబర్‌లో ప్రారంభమయ్యే 2వ సెమిస్టర్ పుస్తకాలను విద్యార్థులకు 2 నెలల ముందే పంపిణీ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైతం పుస్తకాల పంపిణీ పూర్తిచేసింది. రాష్ట్రంలోని 45,409 పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన 1,06,82,080 రెండో సెమిస్టర్ పుస్తకాలను శనివారం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగిన పుస్తకాల పంపిణీలో విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని అమలాపురం ఎంపీపీ స్కూల్లోను, ఎస్.రాయవరం మండలంలోని రేవు పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేశారు. ముందస్తు ప్రణాళిక విజయవంతం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతుల కల్పనలోను లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలై నాలుగో శనివారాన్ని ‘పుస్తకాల పంపిణీ రోజు’గా పాఠశాల విద్యాశాఖ ముందే ప్రకటించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టింది. విద్యార్థులకు పుస్తకాల కొరత ఉండరాదని విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అన్ని పుస్తకాలను అందించిన అధికారులు.. నవంబర్‌లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్‌కు అవసరమైన 1,06,82,080 పుస్తకాలను జూన్ నెలాఖరునాటికే సిద్ధం చేశారు. దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. పుస్తకాలను మొదట ప్రింటర్స్ నుంచి స్టాక్ పాయింట్లకు, ఆపై ఈనెల 16వ తేదీ నాటికి మండల కేంద్రాలకు చేరవేశారు. ఉపాధ్యాయులకు ఎలాంటి శ్రమ లేకుండా పౌర సరఫరాల శాఖ సహాయం తీసుకున్నారు. ఈనెల 17వ తేదీ నాటికి ఇంటింటి రేషన్ సరుకుల పంపిణీ పూర్తవడంతో 3,400 ఎండీయూ వాహనాల్లో పుస్తకాలను పాఠశాలలకు చేరవేశారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న 1,000 పాఠశాలలకు అమెజాన్ కొరియర్ సేవలను వినియోగించుకుని పుస్తకాలను పంపిణీ చేశారు. 20వ తేదీనాటికే రాష్ట్రంలోని 45,409 పాఠశాలల్లో రెండో సెమిస్టర్ పుస్తకాలను సిద్ధంగా ఉంచి, శనివారం అన్ని పాఠశాలల్లోను ఒకేసారి పంపిణీ చేశారు. జగనన్న విద్యాకానుక పంపిణీ సైతం.. ఎలాంటి విమర్శలకు తావులేకుండా 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 43,10,165 మంది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన మొదటిరోజు జగనన్న విద్యా కానుకను అందించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ప్రణాళికాబద్ధంగా మండలాల్లో స్టాక్ పాయింట్లను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆయా కేంద్రాల్లో క్వాలిటీ వాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను బడులు తెరిచిన మొదటి రోజే అందజేసింది. ఇదే ప్రణాళికను సెమిస్టర్–2 పుస్తకాల పంపిణీలోను విద్యాశాఖ అమలు చేసి విజయం సాధించింది. సీఎం ఆదేశాల మేరకు ఒకేరోజు పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాల కొరత రాకుండా చూడాలని సీఎం జగన్మోహన్రెడ్డి ముందే చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన సమావేశంలోనే రెండో సెమిస్టర్ పుస్తకాలను సకాలంలో అందించాలని, అదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు పంపిణీ చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేశాం. ఈ నవంబర్‌లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్ పుస్తకాలను ముందే ముద్రించి స్కూళ్లకు పంపిణీ చేశాం. ముందస్తు ప్రణాళికతో పుస్తకాలను అందించడంలో విజయవంతమయ్యాం. – ప్రవీణ్ ప్రకాశ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి నాణ్యత తగ్గకుండా ముద్రణ ప్రతి విద్యార్థికి సకాలంలో పుస్తకాలు అందించడంతో పాటు ముద్రణలో నాణ్యత తగ్గకూడదని విద్యాశాఖ సమీక్ష సమావేశాల్లో సీఎం చెప్పేవారు. ఆమేరకు నాణ్యమైన పేపర్‌ను తీసుకున్నాం. మొదటి సెమిస్టర్ ముద్రణ జూన్ ఒకటో తేదీనాటికే పూర్తిచేశాం. వెంటనే రెండో సెమిస్టర్ ముద్రణ చేపట్టాం. సమష్టి కృషితో ఏకకాలంలో కోటికిపైగా పుస్తకాలను పాఠశాల పాయింట్ వరకు రవాణా చేశాం. ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి, ఖర్చు పడకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంది. – కె.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ, ముద్రణ సంచాలకులు ప్రభుత్వ ఖర్చుతోనే రవాణా మా స్కూలు రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. బైరెడ్డిపల్లిని ఆనుకునే కర్ణాటక రాష్ట్రం ప్రారంభం అవుతుంది. ఇక్కడి ఏపీ మోడల్ స్కూల్లో ఆరు నుంచి 9వ తరగతి వరకు 340 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో కూడా మొదటి సెమిస్టర్ పుస్తకాలను జూన్ మొదటి వారంలోనే అందిస్తే.. నవంబర్‌లో ఇవ్వాల్సిన రెండో సెమిస్టర్ పుస్తకాలను ఇప్పుడే అందించారు. గతంలో మండల పాయింట్ నుంచి పుస్తకాలను సొంత ఖర్చులతో తెచ్చుకోవాల్సి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఎలాంటి శ్రమ లేకుండా ప్రభుత్వమే పాఠశాలలకు పుస్తకాలను తరలించి మాకు భారం లేకుండా చేసింది. – టీఎస్ అనిత ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, బైరెడ్డిపల్లి (చిత్తూరు జిల్లా) -
జగనన్న కానుక పైనా ఈనాడు విషపు రాతలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విప్లవాత్మక నిర్ణయాలతో విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడు పచ్చ పైత్యంతో పేట్రేగిపోతోంది. ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమం పైనా విషం చిమ్ముతోంది. చివరకు విద్యార్థులకు సరఫరా చేస్తున్న బూట్లపై కూడా అసత్యాలు వండి వార్చి ప్రభుత్వంపై బురద జల్లుతోంది. ‘జగనన్నా... ఈ బూట్లు ధరించలేం’ శీర్షికతో ఈనాడు అచ్చువేసిన పిచ్చి రాతలపై వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేని పచ్చ పత్రిక తప్పుడు రాతలపై ‘సాక్షి’ ‘ఫ్యాక్ట్ చెక్’. వాస్తవం ఏమిటంటే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ 4.40 లక్షల మంది చదువుతున్నారు. ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ‘జగనన్న విద్యా కానుక’ అందించింది. వరుసగా నాలుగేళ్లుగా ఈ కానుకలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి విద్యార్థికీ సుమారు రూ.2,400 వెచ్చించి బ్యాగ్, బూట్లు, బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఒక డిక్షనరీ, రెండు జతల సాక్స్, మూడు జతల స్కూల్ డ్రెస్, బెల్ట్ ఇస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇండెంట్ పెడుతున్నారు. ఆ సమయంలోనే విద్యార్థులకు జత బూట్లు అందించేందుకు అన్ని తరగతుల విద్యార్థుల పాదాలకు సంబంధించి ప్రింట్ పేపర్ ఆధారంగా కొలతలు తీసుకున్నారు. అవి సప్లై కాగానే స్కూళ్లు తెరచినప్పుడు విద్యార్థులకు వాటిని అందజేశారు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 90 శాతం మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. అక్కడక్కడ కొంత మంది విద్యార్థులకు బూటు సైజు సరిపోలేదు. ఎదిగే వయసు ిపిల్లలు కావడంతో శారీరక ఎదుగుదలతో పాటు పాదం సైజు కూడా మారుతూండటం సహజం. పై తరగతి పిల్లలకు అందజేసిన బూట్ల విషయంలో కొన్నిచోట్ల ఇబ్బంది రావడం సహజం. జనవరిలో పాదం కొలతలు తీసుకున్నారు. కొలతలు తీసుకుని ఏడు నెలలైంది. కొలతలు పాదం ఇన్నర్ సైజ్ తీసుకోగా, వాటిని బూట్ల తయారీ కంపెనీ బయటి కొలతలుగా భావించడంతో కొందరి సైజులు మారాయి. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మొత్తం బూట్లన్నీ సరిపోలేదన్నట్టు ఈనాడు తన రాతలతో ప్రజలను కుట్రపూరితంగా తప్పుదారి పట్టిస్తోంది. ఇదిగో వాస్తవం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తమకు బూట్లు సరిపోవడం లేదని చెప్పినట్టుగా ఈనాడు తన కథనంలో పేర్కొంది. కానీ ఇక్కడ వాస్తవాన్ని దాచిపెట్టింది. ఆ పాఠశాలలో 380 మంది విద్యార్థులుంటే వారిలో 200 మంది బూట్లు అందుకున్నారు. మిగిలిన వారిలో కొద్దిమందికి మాత్రమే బూట్ల సైజులు తేడా వచ్చాయి. పాఠశాలల ప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందించారు. చిన్న పాదాలున్న 200 మంది 6, 7, 8 తరగతి విద్యార్థులకు బూట్ల సైజులు సరిపోయాయి. 180 మందిలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే సైజు తేడా వచ్చింది. విద్యా శాఖ అధికారులు వెంటనే దీనిని గుర్తించారు. మళ్లీ కొలతలు తీసుకుని ఆర్డర్ పెట్టారు. త్వరలోనే వారికి కొత్త బూట్లు అందజేస్తామని ఆ మండల విద్యాశాఖాధికారి నాగరాజు ‘సాక్షి’కి చెప్పారు. వాస్తవం ఇలా ఉండగా ఉమ్మడి జిల్లా అంతటా బూట్ల పంపిణీపై ఈనాడు అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్న విద్యా కానుకపై రాస్తున్న పిచ్చి రాతలపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఏలుబడిలో ఇంత ఖరీదు పెట్టి సర్కార్ బడుల్లో పిల్లలకు యూనిఫాం, బ్యాగ్‌లు, బూట్లు, సాక్స్‌లు, బెల్ట్‌లు ఇచ్చిన దాఖలాలు లేనే లేవు. పాఠ్య పుస్తకాలు, ఒక జత యూనిఫాం మాత్రమే ఇచ్చేవారు. అదీ కూడా అరకొరగానే. పాఠశాలలో వంద మంది విద్యార్థులు ఉంటే పాతిక మందికి వస్తే గొప్పే అన్నట్లు ఉండేది నాటి పరిస్థితి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తుంటే సాంకేతికంగా ఎదురైన చిన్న సమస్యను భూతద్దంలో చూపి మరీ బురద జల్లుతోంది. పాఠశాల తెరచిన రోజేకిట్ల పంపిణీ పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక పేరుతో పుస్తకాలు, బూట్లు, బెల్టు, డిక్షనరీ, యూనిఫాం అన్నీ కలిపి ఒకే కిట్‌గా అందజేశాం. గత ప్రభుత్వంలో ఇవేమీ ఉండేవి కావు. ఉమ్మడి జిల్లాలో 90 శాతం పైనే పంపిణీ చేశాం. బూట్లకు సంబంధించి కొన్ని కొలతలు తేడా రావడంతో కొత్తవి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ విద్యాకానుక ఒక మైలురాయి విద్యాపరంగా ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో విద్యాకానుక కూడా ఒక మైలురాయి. విద్యాకానుకలో విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్‌లు, పుస్తకాలు, బూట్లు అందించడంతో పాటు ‘నాడు–నేడు’లో పాఠశాలల రూపురేఖలను ప్రభుత్వం పూర్తిగా మార్చింది. సర్కార్ బడుల్లోని విద్యార్థులు పరీక్షల ఫలితాల్లో కార్పొరేట్ తరహాలో దూసుకుపోతున్నారంటే విద్యాపరంగా తీసుకువచ్చిన మార్పులే కారణం. – ప్రొఫెసర్ ఎ.మురళీకృష్ణ, జేఎన్టీయూకే, విద్యావేత్త పాఠశాల తెరవగానే పంపిణీ ఈ ఏడాది పాఠశాల ప్రారంభంలోనే విద్యా కానుక కిట్లను సరఫరా చేశారు. ఈ కిట్లలో పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు కూడా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలా కిట్లు ఇవ్వలేదు. జగనన్న ఇచ్చిన బూట్లు వేసుకుని కొత్త యూనిఫాంతో ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది. – జంగం అఖిల, తామరపల్లి, కె.గంగవరం బూట్లు బాగున్నాయి ఈ ఏడాది ఇచ్చిన బూట్లు చాలా బాగున్నాయి. పాఠశాల ప్రారంభమైన తొలి రోజు నాటికే బూట్లు ఇచ్చారు. మాకు ఇచ్చిన బూట్లలో ఎక్కడా లోపం లేదు. మా పాదాలకు సరిగ్గా సరిపోయాయి. జగనన్న విద్యా కానుకలో ఇచ్చిన కిట్లలలో వచ్చిన బెల్ట్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం అన్ని చాలా నాణ్యతగా ఉన్నాయి. – కుడుపూడి నిఖిల్, కె.గంగవరం -
విద్య వ్యవస్థలో సరి కొత్త శకం
-
జగనన్న పాలనలో మా పాఠశాల ప్రైవేట్ స్కూలును మించి ఉంది
-
గతంలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వమని మేము తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు..!
-
జగనన్న విద్యాకానుక వల్ల మా తల్లితండ్రులకు ఆర్థికంగా భారం తగ్గింది
-
మా పిల్లల చదువుకు భరోసా ‘జగనన్న’. ఆయన వల్లే పిల్లలను చదివించుకోగలుగుతున్నాం.
-
ఎన్నో తరాలుగా మారని మా భవిష్యత్తు. జగనన్న రాకతో మారింది
-
ప్రైవేట్ స్కూలు వాళ్ళ లాగా యూనిఫాంలో వెళ్లాలన్న కోరిక ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా తీరింది
-
రామోజీ.. ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: విద్యాకానుకపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై రామోజీరావు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీ ముందు తన మైండ్‌సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యా శాఖకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా కానుక ఇచ్చారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్స్ ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తాయి. ప్రతీ స్కూల్లో ఇంటర్నెట్ కోసం టెంబర్లు పిలిచాం. ప్రజా ధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఆడిట్ పూర్తి కాకుండా అక్రమాలు జరిగినట్టు రాయడం నిజమైన జర్నలిజం కాదు అని విమర్శించారు. ఇదే సమయంలో అమిత్ షా కామెంట్స్‌పై మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఏపీకి ఏమైనా ఎక్కువ నిధులు ఇచ్చిందా?. బీజేపీకి నిజంగా ఏపీపై ప్రేమ ఉంటే విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డ్యాన్స్‌లు వేసుకునే పవన్ వంటి వ్యక్తి ఏపీకి అవసరమా? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ -
ఉధృతంగా ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని, పనులపై కలెక్టర్లు పర్యవేక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకూ సుమారు 3.9 లక్షల ఇళ్లు పూర్తి కాగా రూఫ్ లెవల్, ఆపై దశల్లో ఉన్న 5.27 లక్షల నివాసాలను కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండో దశ సమగ్ర భూ సర్వేలో భాగంగా మరో 2 వేల గ్రామాల్లో సెప్టెంబర్ 30 నాటికి భూపత్రాలు అందించాలని, అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కావాలని నిర్దేశించారు. స్పందనలో భాగంగా సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి పనులు, గృహ నిర్మాణం, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు–భూరక్ష, విద్యా కానుక కిట్ల పంపిణీపై అధికార యంత్రాంగానికి సీఎం మార్గ నిర్దేశం చేశారు. ప్రతి జిల్లాలో రోజూ 75 వేల పనిదినాలు ఉపాధిహామీ పనులపై కలెక్టర్ల పర్యవేక్షణ అవసరం. ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. అందులో 60 శాతం అంటే 14.4 కోట్ల పనిదినాలు ఈ నెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతి రోజూ ప్రతి జిల్లాలో కనీసం 75 వేల పనిదినాలు కల్పించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పనిచేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు సమకూర్చాలి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎలాంటి పనులు చేపట్టవద్దు. ఈ విషయాలన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. రోజుకు కనీసం రూ.272 వేతనం వచ్చేలా చూడాలి. డిసెంబర్‌కు డిజిటల్ లైబ్రరీలు.. ఉపాధిహామీకి సంబంధించిన బిల్లులన్నీ పూర్తిగా చెల్లించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వేగంగా పూర్తి చేయాలి. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కోసం అవి చాలా ఉపయోగపడతాయి. గ్రామంలో చదువుకున్న ఏ వ్యక్తి అయినా అక్కడకు వెళ్లి కంప్యూటర్లో పని చేసుకోవచ్చు. మంచి బ్యాండ్‌విడ్త్ అందించడం చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ అన్నీ సెప్టెంబరు కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలు డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇళ్ల నిర్మాణాలకు రూ.1,475 కోట్లు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. వీటిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వేగం పెరగాలి. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.1,475 కోట్లు ఇచ్చాం. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహించాలి. అధికారులు తప్పనిసరిగా లే అవుట్లలో పర్యటించాలి. సీఆర్డీఏలో 8 నుంచి పనులు సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణం వెంటనే మొదలు కావాలి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈమేరకు చర్యలు తీసుకోవాలి. జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల నిర్మాణాల్లో వాడే సామగ్రి నాణ్యతతో ఉండాలి. క్రమం తప్పకుండా క్వాలిటీ పరీక్షలు చేయాలి. వేగంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 1,43,600 ఇళ్లను ఉచితంగా పేదలకు ఇస్తున్నాం. ఇప్పటికే 61 వేల ఇళ్లను అందించాం. మరో 89,216 ఇళ్లను ఆగస్టులోగా అందచేస్తాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి. మిగిలిన కేటగిరీ ఇళ్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చింది. ఆ కేటగిరీ లబ్ధిదారులకు బ్యాంకులతో అనుసంధానించాలి. ఇప్పటికే రూ.1,962.15 కోట్లు బ్యాంకుల ద్వారా అందించాం. మిగిలిన వారికి కూడా రుణాలు టైఅప్ చేసేలా చర్యలు తీసుకోవాలి. విత్తనాలు, ఎరువులు, మందులకు కొరత రాకూడదు ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 19 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల ప్రారంభమైంది. మిగిలిన 29 మేజర్ ప్రాజెక్టుల పరిధిలో జూన్ 15 నుంచి జూలై 20 వరకు నీటి విడుదల షెడ్యూల్ ఖరారైంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలి. నాణ్యత చాలా ముఖ్యం. నకిలీల కారణంగా రైతులు ఎక్కడా నష్టపోయిన సందర్భాలు కనిపించకూడదు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ఖరీఫ్ 2023 సంబంధించి జూలై 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. సోషల్ ఆడిట్ చేపట్టి సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి. సీసీఆర్సీ కార్డులు కేవలం 11 నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగదనే విషయాన్ని వివరించాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలి. రైతులు అక్కడకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు 17 వేల రెవెన్యూ గ్రామాలకుగాను మొదటి ఫేజ్‌లో 2 వేల గ్రామాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు సహా జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం పూర్తైంది. 7.86 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశాం. 25.7 లక్షల సరిహద్దు రాళ్లు పాతాం. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఆయా గ్రామ సచివాలయాల్లో కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ద్వారా ఏవైనా సమస్యలుంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. జూలై 1 నాటికి ఇది పూర్తి కావాలి. ఆ గ్రామాల నుంచి రైతులు ఎవరూ తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. సబ్‌డివిజన్, మ్యుటేషన్, ల్యాండ్ కన్వర్షన్ తదితరాలన్నీ గ్రామ సచివాలయాల్లోనే జరగాలి. రెండో దశ కింద మరో 2 వేల గ్రామాల్లో తుది ఆర్వోఆర్ ఆగస్టు 31 కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. సెప్టెంబర్ 30 కల్లా రాళ్లు పాతడం పూర్తి చేసి భూ పత్రాలు అందించాలి. అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. విద్యాకానుక కిట్ల పంపిణీని కలెక్టర్లు సమీక్షించాలి జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువులు బాగా లేకున్నా వెంటనే సమాచారం తెప్పించుకోవాలి. హెచ్ఎంల నుంచి సమాచారాన్ని సేకరించి వెంటనే చర్యలు చేపట్టాలి. నాణ్యత విషయంలో ఎక్కడా సమస్య ఉన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. నాడు– నేడు తొలిదశ పనులు పూర్తైన 15,750 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 30,249 తరగతి గదుల్లో జూలై 12 కల్లా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. మానిటర్లను వినియోగించుకుంటూ పిల్లలకు చక్కటి బోధన అందించాలి. ఆమేరకు టీచర్ల సామర్థ్యాన్ని పెంచాలి. -
సింగుపురం పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
-
బాబు బతుకంతా మోసమే
-
బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవతను చాటుకున్నారు. ఎక్కడ ఎటువంటి బాధితులు కనిపించినా వెంటనే వారికి తగిన సహాయాన్ని అందించే సీఎం జగన్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులోనూ పలువురికి అండగా నిలిచారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన బహిరంగ సభ అనంతరం హెలీపాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివిధ సమస్యలతో బాధపడుతున్న 20 మంది వారి సమస్యలు వివరించారు. తమను వైద్యపరంగా, ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి బాధితులందరికీ అవసరమైన వైద్యం, ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటిని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రానికి బాధితులకు అధికారులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అవసరమైన వారికి వైద్య సాయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలివీ.. నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన బి. గోపి రైలు ప్రమాదంలో గాయపడ్డాడు. తన దీనస్థితిని సీఎం జగన్‌కు ఆయన వివరించారు. ఆదుకోవాలని కోరారు. సీఎం వెంటనే స్పందించి గోపికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు వెంటనే అధికారులు రూ.5 లక్షలు అందించారు. నూజెండ్ల మండలం తిమ్మాపురానికి చెందిన కుక్కమూడి సుబ్బారావు వెన్నెముక సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. నంద్యాలకు చెందిన కె. మార్తమ్మ మూర్ఛవ్యాధితో బాధపడుతున్నానని, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని కోరారు. ఆమెకు తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అందించి ఉద్యోగ కల్పన విషయమై నంద్యాల కలెక్టర్‌కు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. బెల్లంకొండ మండలం మాచయపాలేనికి చెందిన పున్నారెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో ఆయనకు తక్షణ సాయంగా రూ.లక్షన్నర అందించాలని, ఉచిత డయాలసిస్, మందులు అందించాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు అధికారులు వెంటనే చెక్కు అందించారు. అచ్చంపేట మండలం ముత్యాలకు చెందిన పువ్వాడ సాయికి చెయ్యి విరిగింది. ఆమె పరిస్థితిని విన్న సీఎం జగన్ లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ఇవ్వడంతోపాటు ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఆయనకు ఆర్థిక సాయం అందించారు. ► పిడుగురాళ్ల మండలం పత్తిగుంటలకు చెందిన మాస్టర్ మొహమ్మద్ షబ్బీర్, షేక్ అబ్దుల్ రెహ్మాన్ ఇద్దరూ మూర్చవ్యాధితో బాధపడుతున్నారు. వారికి చెరొక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి, ఉచితంగా వైద్యం అందజేయాలని సీఎం ఆదేశించారు. వారికి అధికారులు చెక్కులు అందించారు. ► క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన దుర్గారావు పశుమిత్రగా నియమించాలని కోరారు. అతనికి స్వయం ఉపాధి కోసం రెండు లక్షల తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు వెంటనే ఆయనకు చెక్కు అందించారు. ► నరసరావుపేట మండలానికి చెందిన ఇందిర తనకు ఉద్యోగం కావాలని కోరడంతో లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించడంతోపాటు ఆమె కుమారుడికి స్వయం ఉపాధి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆమెకు రూ.లక్ష చెక్కు అందించారు. ► నూజెండ్ల మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కుప్పల మరియమ్మ భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పగా సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ► అంగ వైకల్యంతో బాధ పడుతున్న క్రోసూరుకు చెందిన షేక్ సుభానికి తక్షణ ఆర్థిక సాయం కింద లక్ష రూపాయలు అందజేయాలని సీఎం ఆదేశించారు. ఆమేరకు అధికారులు ఆర్థిక సాయం అందించారు. ► దుర్గి మండలం నెహ్రూనగర్ తాండాకు చెందిన బాలునాయక్ కడుపులో ట్యూమర్లతో బాధపడుతున్నారు. అతని పరిస్థితిని విన్న సీఎం జగన్ అతనికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, పింఛన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆతనికి అధికారులు రూ.లక్ష చెక్కు అందించారు. ► నంద్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌కు స్వయం ఉపాధి కోసం రెండు లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించగా, అధికారులు ఆమేరకు చెక్కు అందించారు. ► క్రోసూరుకు చెందిన షేక్ అమాన్ వెన్నెముక సమస్యతో బాధపడుతుండటంతో తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించడంతోపాటు నాణ్యమైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చెక్కు అందించారు. ► క్రోసూరు మండలం ఇస్సపాలేనికి చెందిన కుమ్మరిగుంట మంజుల కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఆమెకు ఉచిత వైద్యంతో పాటు లక్ష రూపాయలు సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రానికే ఆమెకు రూ.లక్ష చెక్కును అధికారులు అందించారు. ► అంగవైకల్యంతో బాధపడుతున్న పెదకూరపాడుకు చెందిన ఆదాం షఫీకి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. సాయంత్రానికి అధికారులు ఆయనకు రూ. లక్ష చెక్కు ఇచ్చారు. ► గుండె జబ్బుతో బాధపడుతున్న కోసూరు మండలం గుడిపాడుకు చెందిన షేక్ కాజా షరీఫ్‌కు లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం, ఉచితంగా వైద్యం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆయనకు రూ.లక్ష చెక్కు ఇచ్చారు. ► తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పెదకూరపాడు మండలం లగడపాటికి చెందిన హాకీ హసన్ సాహెబ్‌కు సీఎం ఆదేశాల మేరకు అధికారులు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ► క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఇమామ్ బాషాకి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అతనికి లక్ష రూపాయల చెక్కు పంపిణీతోపాటు ఏదైనా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ► సంతమాగులూరు మండలం పరిటాల వారి పాలేనికి చెందిన గంజనబోయిన చరణ్ తలసేమియా బాధితుడు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇతనికి జిల్లా కలెక్టర్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇతనికి గతంలోనే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు మరోసారి ఆర్థిక సహాయం అందించారు. బాధితుడికి అత్యున్నత ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ► తాడేపల్లి మండలం పెనుమాకకి చెందిన కె అరవింద్‌కి మెదడు ఆపరేషన్ కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష రూపాయిలు తక్షణ సాయం అందించారు. -
మోగిన బడి గంట
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ఈనెల 17 వరకు ఉ.7.30 నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అన్ని పాఠశాలల్లోను అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు.. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్ష మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం సిద్ధంచేసిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సోమవారం అన్ని పాఠశాలల్లోను ప్రారంభించారు. అలాగే, గతంలో పాఠశాలలు తెరిచిన తొలిరోజు 30 శాతం దాటని హాజరు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రోజే 57 శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో 61 శాతం మందికి విద్యా కానుక కిట్లను అందించారు. రెండోరోజు మంగళవారం నుంచి కిట్ల పంపిణీని వేగవంతం చేసి వారం రోజుల్లో మొత్తం పంపిణీని పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక అన్ని పాఠశాలల్లోను ఉ.8.30–9.00గంటల మధ్య విద్యార్థులకు రాగిజావ.. 11.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. -
పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి
మన విద్యార్థులు ఇంకా బాగా ఎదిగి ముందు వరుసలో నిలిచేందుకు అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్, డేటా ఎనలిటిక్స్ మొదలు చాట్ జీపీటీ దాకా మన సిలబస్‌తో అనుసంధానించేలా వేగంగా అడుగులు వేస్తున్నాం. – పల్నాడు జిల్లా క్రోసూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేద విద్యార్థులకు అంతర్జాతీయ చదువులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విద్యారంగంలో సమూల మార్పులను తెచ్చి నాలుగేళ్లలో రూ.60,329 కోట్లు వ్యయం చేశామన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్ కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి చదివే ప్రతి విద్యార్థికీ కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫామ్, బ్యాగు, బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టుతోపాటు మంచి డిక్షనరీని కూడా విద్యాకానుక కిట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో రూ.1,042.53 కోట్లతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీనిద్వారా 43,10,165 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోడల్ స్కూల్‌ను సందర్శించి కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. కిట్లు, పాఠ్య పుస్తకాలను స్వయంగా పరిశీలించారు. స్కూల్ బ్యాగ్ ధరించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. బోర్డుపై ‘ఆల్ ద బెస్ట్..’ అని రాసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పిల్లలకు ఓటు హక్కు లేదని గతంలో పట్టించుకోలేదు విద్యార్థులకు ఈ దఫా యూనిఫామ్ క్లాత్ గతేడాది కంటే ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనిపించేందుకు యూనిఫామ్ డిజైన్‌లో కూడా మార్పులు తెచ్చాం. గతేడాది ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగ్ సైజ్ కూడా పెంచాం. మెరుగైన క్వాలిటీ బూట్లు ఇస్తున్నాం. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాల నాణ్యతను కూడా పెంచి పిల్లలకు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుంది. చిన్నపిల్లలు ఓటర్లు కానందున వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ మీ జగన్ మామయ్య ప్రభుత్వంలో విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల సమక్షంలో పండుగలా నిర్వహిస్తున్న పరిస్థితి తెచ్చినందుకు సంతోషిస్తున్నా. ఒక్కో విద్యార్థికి విద్యాకానుక కిట్ కోసం రూ.2,400 ఖర్చు చేస్తున్నాం. ఒక్క విద్యాకానుక కింద నాలుగేళ్లలో రూ.3,366 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. టోఫెల్‌కు శిక్షణ.. సర్టిఫికెట్ అధికారంలోకి రాగానే పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీషులో పిల్లల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకున్నాం. మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో ఉండాలే కానీ వారిని తక్కువగా చూసే పరిస్థితుల్లో ఉండకూడదని ఈ దిశగా అడుగులు వేశాం. మన పిల్లలు ఎక్కడైనా రాణించేందుకు వీలుగా టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం ఈ ఏడాది నుంచే మొదలవుతుంది. ఇందుకోసం ప్రపంచంలో ఎంతో పేరున్న అమెరికన్న్సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్), ప్రిన్స్టన్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. మూడు నుంచి ఐదో తరగతి వరకు టోఫెల్ ప్రైమరీ, ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు టోఫెల్ జూనియర్ పేరుతో పరీక్షలు నిర్వహించి టోఫెల్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ అందచేస్తారు. తద్వారా ఇంగ్లీషు వినడమే కాకుండా ధారాళంగా మాట్లాడడం కూడా వస్తుంది. అది కూడా అమెరికా యాసలో మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా అత్యుత్తమ ప్రతిభ చూపించిన ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్ వెరసి 26 జిల్లాల్లో 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లీషు టీచర్లను మెరుగైన ఓరియంటేషన్ కోసం అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపిస్తాం. నాడు–నేడు, సీబీఎస్ఈ, ఇంగ్లీషు మీడియం.. విద్యారంగంలో నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఇప్పటికే మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్లను నియమిస్తూ మన ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. డిసెంబర్ 21న మళ్లీ ట్యాబ్‌లు.. నాలుగో తరగతి నుంచి మన కరిక్యులమ్‌తో అనుసంధానిస్తూ పేద పిల్లలందరికీ బైజూస్ కంటెంట్ ఉచితంగా ఇస్తున్నాం. రోజుకో మెనూతో గోరుముద్ద, అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ ఏటా రూ.15 వేలు ఇస్తున్నాం. అమ్మ ఒడి కోసం ఇప్పటివరకూ రూ.19,674 కోట్లు ఖర్చు చేశాం. 8వ తరగతి పిల్లలకు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు, టీచర్లకు ట్యాబ్‌లు అందించాం. 5,18,740 ట్యాబ్‌ల కోసం రూ.685 కోట్లు ఖర్చు చేసి గత ఏడాది ఇచ్చాం. మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టిన రోజైన డిసెంబర్ 21న మళ్లీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తాం. ‘ఉన్నత’ మార్పులు.. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే మూడు నెలలకు ఒకసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఒక్క జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ఇప్పటి వరకు మన ప్రభుత్వం రూ.10,636 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో పిల్లాడి కోసం ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తూ జగనన్న వసతి దీవెన తీసుకొచ్చి ఇప్పటివరకు రూ.4,275 కోట్లు వెచ్చించాం. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలనే తపనతో జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం ఇప్పటిదాకా రూ.20 కోట్లు ఖర్చు చేశాం. టాప్ 50 యూనివర్సిటీల్లో మన పిల్లలు 213 మంది చదువుతున్నారు. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలని తీసుకొచ్చి వధూవరులకు టెన్త్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన విధించాం. విద్యారంగంపై నాలుగేళ్లలో మనం చేసిన ఖర్చు రూ60,329 కోట్లు. డిజిటల్ క్లాస్ రూములు.. స్కూళ్లతోపాటు ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతున్నాయి. నాడు–నేడు తొలిదశ పూర్తైన స్కూళ్లలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ తెస్తున్నాం. డిజిటల్ బోధనతో పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తైన 15,750 స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న 30,232 క్లాస్ రూముల్లో డిజిటల్ బోధనను జూలై 12న ప్రారంభిస్తున్నాం. కాసేపటి క్రితం క్రోసూరు హైస్కూల్లో డిజిటల్ బోర్డులు చూశా. అవి ఇక 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఉంటాయి. డిసెంబర్ 21 నాటికి నాడు–నేడు రెండు దశలు పూర్తైన దాదాపు 33 వేల స్కూళ్లలో 6 నుంచి క్లాస్ రూమ్స్‌లో డిజిటల్ బోధన దిశగా అడుగులు పడతాయి. టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణపై దృష్టి పెట్టి మెయింటెనెన్స్ ఫండ్ తీసుకొచ్చాం. బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. మెరుగ్గా విద్యా కానుక కిట్లు సీఎం వైఎస్ జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని సోమవారం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వంటి విద్యా సామాగ్రి కోసం ఇబ్బంది పడకుండా పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ కిట్ల పంపిణీని మన ప్రభుత్వంలో చేపడుతున్నాం. ఈ ఏడాది యూనిఫామ్ డిజైన్‌లో మార్పులు చేసి మెరుగ్గా తీర్చిదిద్దాం. షూస్ నాణ్యత పెంచడంతో పాటు పుస్తకాల బ్యాగ్ సైజ్‌ను కూడా పెంచాం. విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను రూ.1,042 కోట్ల ఖర్చుతో అందిస్తున్నాం’ అని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చదువుల విప్లవం మన విద్యార్థులు గ్లోబల్ సిటిజెన్‌గా రాణించాలనే ఆలోచనతో విద్యా విధానంలో సీఎం జగన్ సమూల మార్పులు తెస్తున్నారు. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాకానుక ఇస్తున్నాం. గోరుముద్దలో రోజుకో మెనూతో చక్కటి భోజనం పెడుతున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లిస్తూ బైజూస్ కంటెంట్ కూడా అందజేస్తున్నాం. రాష్ట్రంలో చదువుల విప్లవం కొనసాగుతోంది. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
సీఎం జగన్‌కు జేజేలు
-
Jagananna Vidya Kanuka: విద్యార్థులతో సీఎం జగన్.. ఫోటోలు
-
ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన పిల్లలు ఉండాలి
సాక్షి, పల్నాడు: వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం. నోట్ బుక్స్, వర్క్ బుక్స, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన. ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది 43.10 లక్షల మంది విద్యార్థులకు 1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి రూ. 2,600 విలువైన కిట్ పంపిణీ అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. అందుకే టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నాం. ఇందుకోసం అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇంగ్లీష్ మాట్లాడడంలో మన విద్యార్థుల ప్రతిభ పెరుగుతుందన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. బయట తీవ్రమైన ఎండలు ఉన్న కూడా ఏమాత్రం ఖాతరు చేయని చిరునవ్వులతో, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, నా చిట్టిపిల్లలకూ హృదయపూర్వక కృతజ్ఞతలు. బడి గంట కంటే ముందే కానుకల గంట... వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. బడిగంట మోగకముందే, బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈరోజే మోగిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది విద్యా కానుక.... ఈ రోజు స్కూళ్లు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫాం వంటి వాటి కోసం ఏ ఒక్కపాప, బాబు వారి తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంలో వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లోనూ ఒకటి నుంచి పదో తరగతివరకూ చదువుతున్న ప్రతి విద్యార్ధికి ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యాకానుక కిట్‌ను ఇవ్వనుంది. బట్టల కుట్టుకూలీతో సహా... విద్యాకానుక కిట్. ప్రతి విద్యార్ధికి కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫాం, ఒక స్కూల్బ్యాగు, బైలింగివల్ టెక్ట్స్‌బుక్(ఒక పేజీ ఇంగ్లిషు ఒక పేజీ తెలుగు), నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు ఇవి కాకుండా పిల్లలందరికీ ఇంగ్లిషు నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ కూడా విద్యాకానుక కిట్ ద్వారా ఇస్తున్నాం. వారికి వసతులు కల్పిస్తూ... బడి తెరిచే సమయానికి వారికి ఇవ్వవలిసినవి ఇస్తూ.. వీటి మీద ధ్యాస పెడుతూ, క్వాలిటీని మరింత మెరుగుపరిచేలా మార్పులు తీసుకువచ్చాం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత మెరుగ్గా... పిల్లలకు యూనిఫాం కింద ఇచ్చే క్లాత్ గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనపించాలని యూనిఫాం డిజైన్‌లో కూడా మెరుగైన మార్పులు తీసుకొచ్చాం. నిరుడు సంవత్సరం వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగు సైజ్‌ను కూడా పెంచి మెరుగైన బ్యాగు ఇస్తున్నాం. మెరుగైన క్వాలిటీ షూ కూడా ఇస్తున్నాం. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల నాణ్యతను కూడా పెంచి పిల్లలకిస్తున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాకానుక కిట్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుంది. చిన్నపిల్లలు ఓటర్లు కాదు వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితి గతం. ఒక్కో విద్యార్ధికి రూ.2400 ఖర్చుతో కిట్... కానీ ఈ రోజు ఆ పిల్లలు జగన్ మామయ్య ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే.. విద్యాకానుక పండగ కార్యక్రమంలో ప్రతి స్కూళ్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులంతా పాలుపంచుకునే గొప్ప వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఆ పిల్లలకు మంచి మేనమామగా సంతోషపడుతున్నాను. ఈ రోజు నుంచి అందిస్తున్న ఈ విద్యాకానుక కిట్స్ కోసం అయ్యే ఖర్చు రూ.1042 కోట్లు. 43.10 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... ఒక్కో విద్యార్ధికి ఇచ్చే స్కూల్ బ్యాగుతో సహా ఇచ్చే యూనిఫాం, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ కలుపుకుని వీటి ఖరీదు రూ.2400 ఖర్చుచేస్తున్నాం. ఆ పిల్లల తల్లులకు అన్నగా సంతోషంగా ఈ ఖర్చు చేస్తున్నాం. ఒక్క విద్యాకానుక కింద ఈ నాలుగేళ్లలో రూ.3366 కోట్లు ఖర్చు చేసింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు.... విద్యావ్యవస్ధలో మన ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి.పాఠశాల స్ధాయి నుంచే పేదపిల్లల ఇంగ్లిషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగుపడాలని ఆలోచన చేశాం. మన పిల్లలు ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో మన పిల్లలు ఉండాలి కానీ.. తక్కువగా చూసే పరిస్థితుల్లో ఉండకూడదని ఈ అడుగులు వేశాం. మన పిల్లలకు ఎక్కడైనా ఎదిగేందుకు వీలుగా టోఫెల్ పరీక్షలకు వారిని సిద్ధం చేసే కార్యక్రమం ఈ యేడాది నుంచే మొదలవుతుంది. టోఫెల్ కోసం అమెరికా ఈటీఎస్‌తో ఒప్పందం... ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతో పేరున్న అమెరికన్ సంస్ధ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్( ఈటీఎస్ ) ప్రిన్స్టన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రిన్స్టన్లో టోఫెల్ అనే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మన పిల్లలకు ఇస్తారు. ఈ టోఫెల్ అనే పరీక్షకు పిల్లలకు తర్ఫీదు ఇస్తూ తయారు చేస్తున్నాం. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టోఫెల్ ప్రైమరీ, ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి వరకు టోఫెల్ జూనియర్ పేరుతో పరీక్షలు నిర్వహించి వారికి టోఫెల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. తద్వారా ఇంగ్లిషు వినడమే కాకుండా మాట్లాడడం కూడా వస్తుంది. అది కూడా అమెరికన్ యాక్సెంట్, డైలెక్ట్లో వస్తుంది. వీరికి ఇవన్నీ తీసుకువచ్చే కార్యక్రమంలో ఈ సంవత్సరం టోఫెల్‌ను కూడా ప్రవేశపెడుతున్నాం. ప్రతిభా ఉపాధ్యాయులకు అమెరికాలో ఓరియెంటేషన్... అంతే కాకుండా రాష్ట్ర స్ధాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన ప్రభుత్వ స్కూళ్లలో... ప్రతి జిల్లాలోనూ ఒక ప్రభుత్వ హైస్కూల్, ఒక ప్రైమరీ స్కూల్ వెరసి 26 జిల్లాల్లోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లిషు టీచర్లను అందరికీ స్ఫూర్తినిస్తూ.. వారికి మెరుగైన ఓరియెంటేషన్ కోసం ప్రోత్సహిస్తూ అమెరికాలోని ప్రిన్స్టన్కు కూడా పంపిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలని, అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి, మారిపోతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలు అందరికన్నా ముందడుగులో ఉండాలని, రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్, డేటా అనలెటిక్స్ మొదలు చాట్ జీపీటీ వరకూ మన సిలబస్‌లోకి ఎలా అనుసంధానం చేయాలి, వాటిని ఎలా అనుసంధానం చేసి, మన పిల్లలను ముందు వరుసలో నిలబెట్టగలుగుతాము అనేది అధ్యయనం చేసే దిశగా వేగంగా ఆలోచనలు చేస్తున్నాం. విద్యారంగంలో విపరీతమైన మార్పులు కనిపించేటట్లుగా నాలుగేళ్లలో చేశాం. ఇప్పటికే మనబడి నాడు–నేడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపులు మారి కళ్లముందు కనిపిస్తున్నాయి. బడుల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. గవర్నమెంట్ స్కూళ్లు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లిష్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి.. మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్లే ఉండేట్లుగా మన ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. బైజూస్ కంటెంట్‌తో... నాలుగో తరగతి నుంచి మన కరిక్యులమ్ కు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ తీసుకొచ్చి ఉచితంగా ఇస్తున్నాం. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా స్కూళ్లలో గోరుముద్ద, అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 75 శాతం హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో జరిగిస్తూ, జగనన్న అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతిఏటా రూ.15 వేలు ఏటా ఇస్తున్నాం. ఒక్క అమ్మ ఒడి అనే కార్యక్రమానికి మాత్రమే రూ.19,674 కోట్లు ఖర్చు చేశాం. 8వ తరగతి పిల్లలకు ఆఫ్‌లైన్‌లో కూడా పని చేసేట్టుగా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు, టీచర్లకు ట్యాబ్‌లు అందించాం. అక్షరాలా 5,18,740 ట్యాబ్‌లు రూ. 685 కోట్లు ఖర్చు చేసి నిరుడు ఇచ్చాం. మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టిన రోజున డిసెంబర్ 21న మళ్లీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తాం. డిజిటల్ దిశగా మారుతున్న క్లాస్‌రూములు.. ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ బడులలో నాడు–నేడు అయిపోయిన స్కూళ్లలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ తీసుకొస్తున్నాం. డిజిటల్ బోధన పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి చదువును సులభంగా అర్థమయ్యేట్లు చేస్తున్నాం. తొలిదశలో నాడు నేడు పూర్తయిన దాదాపు 15,750 స్కూళ్లలో 6వ తరగతి, ఆ పైన ఉన్న 30,232 క్లాస్ రూముల్లో డిజిటల్ బోధనను జూలై 12న ప్రారంభిస్తున్నాం. డిజిటల్ బోర్డులు ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఉంటాయి. కాసేపటి క్రితం క్రోసూరు హైస్కూల్లో డిజిటిల్ బోర్డులను కూడా చూశాను.ఈడిజిటల్ బోర్డులు 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఉంటాయి. 2వ దశలో మరో 22 వేల స్కూళ్లు, మరో 16 వేల యూనిక్ స్కూళ్లలో డిసెంబర్ 21న మరో 31,700 ఐఎఫ్బీ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో డిసెంబర్ 21కల్లా నాడు–నేడులో ఫేజ్1, ఫేజ్2 పూర్తి చేసుకున్న దాదాపు 33 వేల స్కూల్స్‌లో 6వ తరగతి, ఆపైన క్లాస్ రూములన్నీ కూడా మొత్తం డిజిటల్ బోధన వైపు అడుగులు పడుతాయి. ఆడపిల్లలకు మరింత అండగా.. ఆడ పిల్లలకు మరింత అండగా నిలుస్తూ, బడుల్లో నాడు నేడుతో పాటు టాయిలెట్ల నిర్మాణం, మెయింటెనెన్స్‌పై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటినెన్స్, స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ తీసుకొచ్చాం. బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వారి కోసం స్వేచ్ఛ అమలు చేస్తున్నాం. ఇవన్నీ పిల్లల చదువుల కోసం వారు వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలించి సక్సెస్ కావాలని అడుగులు వేయిస్తుంది మీ మేనమామ ప్రభుత్వం. ఉన్నత విద్యలోనూ మార్పులు.. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో మార్పులు తెచ్చాం. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే.. ఎంత మంది పిల్లలుంటే అంతమందినీ చదివించినా సరే.. సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన ద్వారా నగదు జమ చేస్తున్నాం. ఒక్క జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పధకంతో ఇప్పటి వరకు మన ప్రభుత్వం రూ.10,636 కోట్లు. ఖర్చు చేసింది. పిల్లలందరూ పెద్ద చదువులు చదివేటప్పుడు భోజనం, వసతి కోసం ఇబ్బంది పడకూడదని, వాళ్ల తల్లిదండ్రులూ అంత కన్నా ఇబ్బంది పడే పరిస్ధితి రావద్దని, ఒక్కో పిల్లాడికిఏడాదికి రూ. 10 నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు చేసి జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. ఇప్పటివరకు ఈ పథకానికి రూ.4,275 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న విదేశీ విద్యాదీవెన... మన పిల్లలు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా నిలబడాలని తపన, తాయపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా రూ.1. 25 కోట్ల వరకూ ఖర్చయినా పర్వాలేదు. మీ జగన్ మామయ్య చదివిస్తాడు. టాప్ 50 యూనివర్సిటీల్లో 213 మంది మన పిల్లలు చదువుతున్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశాం. అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. కల్యాణమస్తు, షాదీ తోఫా అనే మరో పథకాన్ని తీసుకొచ్చాం. పెళ్లిళ్లు చేసేటప్పుడు వధూవరులకు టెన్త్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రేరణ అవుతుందని.. ఈ పథకంలో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు ముందుకు వేశాం. ఇలా ఈ నాలుగేళ్లలో కేవలం ఈపథకాలకోసమే విద్యా రంగంలో నాలుగేళ్లలో మనం చేసిన ఖర్చు రూ.60,329 కోట్లు. చదువుల గురించి, ఆ అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా, పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తున్నాడో గమనించాలని ప్రతి చెల్లెమ్మకూ తెలియజేస్తున్నా. తేడాఒక్కసారి గమనించమని కోరుతున్నా. మన హయాంలోనే పులిచింతల... పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆయన పూర్తి చేస్తే మిగిలిన పోయిన ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా 45 టీఎంసీల నీళ్లు నిల్వచేసే కార్యక్రమం చేయకుండా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు కేటాయించి, 45 టీఎంసీల నీళ్లు నింపి, ఆర్ ఆండ్ ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేశాం. ఈ కార్యక్రమం చేస్తూ.. పొరపాటున ఇమాజిగూడెంలో 128 ఇళ్లకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ మిగిలిపోయిందని ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను. ఇది కాకుండా రూ.45 కోట్లతో అచ్చంపేట మండలం తాళ్లచెరువులో లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగారు. దాన్ని కూడా మంజూరు చేస్తాం. అది కాకుండా మాదిపాడులో ఆర్ ఆండ్ బీ రోడ్డులో పులిచింతల డ్యామ్‌కు కనెక్ట్ చేస్తూ... రూ.3.50 కోట్లు ఖర్చయ్యే రోడ్డును అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. ఇంకా సబ్స్టేషన్లు వంటివి అడిగారు. అవసరమైన చోట వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. వీటన్నింటి వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు. ఇదీ చదవండి: ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం -
స్కూల్ బ్యాగ్స్, బుక్స్ ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
డిజిటల్ బోర్డుపై సీఎం జగన్ విద్యార్థులకు విషెస్
-
AP Schools ReOpen Photos: ఆంధ్రప్రదేశ్‌లో మోగిన బడి గంట (ఫొటోలు)
-
పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
జగన్ మావయ్య మా మనసులో బాధను అర్థం చేసుకుని విద్యాకానుక పథకం ద్వారా ఇవన్నీ సమకూరుస్తున్నాడు
-
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి స్వర్వం సిద్ధం
-
నేడు ‘జగనన్న విద్యా కానుక’
సాక్షి, అమరావతి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాదీ జగనన్న విద్యాకానుకను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యాకానుక కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. బడికెళ్లడం ఇక వేడుక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, కుట్టు కూలితో సహా మూడు జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతోపాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (6–10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1–5 తరగతి పిల్లలకు)తో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని బడులు తెరిచిన తొలిరోజే చేపట్టనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా నాలుగు దశల్లో నాణ్యతా పరీక్షలు చేపట్టారు. ప్రతి విద్యార్థికీ దాదాపు రూ.2,400 విలువైన విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లు తెరిచి 6,7 నెలలైనప్పటికీ యూనిఫామ్ సంగతి దేవుడెరుగు కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఇతర వస్తువుల ఊసే లేదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందచేస్తోంది. ఇక విద్యార్థుల చదువులను గాలికొదిలేస్తూ గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ బకాయిలను సైతం సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా, విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న రోజుల్లో ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియంతో సీబీఎస్ఈ సిలబస్‌లో బోధించేలా సిద్ధమైంది. ‘మనబడి నాడు నేడు’ తొలిదశ స్కూళ్లలో 6–10వ తరగతి వరకు 30 వేలకు తరగతి గదుల్లో బైజూస్ కంటెంట్‌తో కూడిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ బోధన చేపట్టనున్నారు. ఇంగ్లిష్ లాబ్స్‌తోపాటు 1–5వ తరగతి వరకు ప్రతి స్కూల్లో 10 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు దిశగా సన్నద్ధమైంది. తొలిదశ స్కూళ్లలో జూలై 12 నాటికి ఐఎఫ్‌పీలు మనబడి నాడు నేడు తొలిదశ పనులు పూర్తైన 15,715 స్కూళ్లలో ఈ ఏడాది జులై 12 నాటికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు పూర్తి కానుంది. రెండో దశలో భాగంగా 22,344 స్కూళ్లలో ఈ ఏడాది డిసెంబర్ 21 నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటవుతాయి. మిగిలిన 15 వేల స్కూళ్లలో మూడో దశలో ఐఎఫ్‌పీలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్ అందించనున్నారు. బీఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 45,000 పాఠశాలల్లో ఇంటర్ నెట్ సదుపాయం సమకూరనుంది. ఇక ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్ లో నైపుణ్యం సాధించేలా టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఫిర్యాదులకు 14417 టోల్‌ఫ్రీ నెంబర్ జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసిన వస్తువుల్లో ఏవైనా లోపాలుంటే విద్యార్థులు తమ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి అందచేస్తే వారం రోజుల్లో రీప్లేస్ చేస్తారు. మరే ఇతర ఫిర్యాదులున్నా 14417 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. 30 వరకు పాత యూనిఫామ్స్‌కు ఓకే 2023–24 విద్యా సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొదటిరోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్‌లో స్కూలు పుస్తకాల బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్ క్లాత్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, డిక్షనరీ ఉంటాయన్నారు. ఈ ఏడాది కొత్త డిజైన్‌లో యూనిఫామ్ క్లాత్ అందిస్తున్నామని, విద్యార్థులు వాటిని కుట్టించుకునే వరకు గతేడాది యూనిఫామ్ ధరించి పాఠశాలలకు హాజరు కావచ్చన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని, ఆలోగా కొత్త యూనిఫామ్ కుట్టించుకోవాలని సూచించారు. -
పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణికి అన్ని ఏర్పాట్లు
-
జగనన్న విద్యాకానుకలో విద్యార్థికి మూడు జతల యూనిఫామ్
-
ఈ నెల 12న జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ
-
ఈ నెల 12న సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి జగనన్న విద్యాకానుక పంపిణీ
-
12 నుంచి స్కూళ్లు.. తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని, అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం విజయవాడలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ సోమవారం విద్యా కానుకను లాంఛనంగా పంపిణీ చేస్తారని తెలిపారు. అదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా కానుక కిట్ల నాణ్యతను నాలుగు దశల్లో పరిశీలించామని, ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు. 20న సీఎం చేతుల మీదుగా విద్యార్థులకు సత్కారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక రాష్ట్రస్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్‌ఎంలనూ సత్కరిస్తామని చెప్పారు. 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో విద్యార్థులను సత్కరిస్తామన్నారు. వీరితో పాటు టెన్త్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను 12 నుంచి 19 వరకు సత్కరించనున్నట్లు తెలిపారు. మొత్తం 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తామన్నారు. పాఠశాల స్థాయిలోనే ‘టోఫెల్’ శిక్షణ రాష్ట్ర విద్యార్థులు గ్లోబల్ ఇంగ్లిష్‌లో పట్టు సాధించేలా రాష్ట్రస్థాయిలోనే విద్యార్థులుకు టోఫెల్ శిక్షణ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఇద్దరు ఉపాధ్యాయులను ప్రఖ్యాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పంపి శిక్షణ ఇప్పిస్తామన్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు టోఫెల్–ప్రైమరీ, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్– జూనియర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే గోరుముద్ద పథకం అమలు చేస్తామని మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు డాక్టర్ నిధి మీనా తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్ విద్య కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం టెన్త్, ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం తప్ప పాఠశాల, కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశం ఇంతవరకు లేదు. అయితే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇలాంటి విద్యార్థులకు మరో అవకాశంగా రెగ్యులర్‌గా అదే తరగతిలో మరోసారి చదువుకునే అవకాశాన్ని కలి్పస్తున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. వీరికి ఒక్క ఏడాదే ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్తిస్తాయని వివరించారు. -
జూన్ 12న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కానుక
-
ఏపీ: బడి గంట రోజే ‘కానుక’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12వతేదీన స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్ధికీ జగనన్న విద్యా కానుక కిట్లను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకకు సంబంధించి ప్రతి వస్తువును నిర్దిష్ట సమయంలోగా స్కూళ్లకు తరలించేలా తేదీలను నిర్ణయించారు. జూన్ 7వతేదీ నాటికే విద్యా కానుక కిట్లు పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేరుకునేలా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, స్కూళ్లకు తరలింపు ప్రక్రియ పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జగనన్న విద్యా కానుకలో ప్రతి వస్తువును మండల కేంద్రాల్లో నాణ్యత తనిఖీలు చేసేలా ఒక బృందాన్ని, పర్యవేక్షణ కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. మండల స్థాయి బృందాలకు సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా స్థాయిలో బృందాలను సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌తో పాటు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తయారీ దశలోనే తనిఖీలు జగనన్న విద్యా కానుకలో ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఇప్పటికే స్కూళ్లకు తరలింపు పూర్తి కాగా మే 31 నాటికి పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, బెల్టులు చేరుకోనున్నాయి. యూనిఫాం, నోట్ బుక్స్, బూట్లు, బ్యాగ్స్, యూనిఫామ్స్ తరలింపును జూన్ 7 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నిర్దేశించారు. తొలుత జిల్లా కేంద్రాలకు అక్కడ నుంచి 670 మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి 45,534 స్కూళ్లకు తరలింపు ప్రక్రియ చేపట్టారు. మొత్తం 39,96,064 జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి వస్తువు అత్యంత నాణ్యతతో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి తయారీ దశలోనే అధికారులు నాణ్యత తనిఖీలను నిర్వహించారు. -
చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కొత్త చరిత్రవైపు అడుగులేస్తోంది. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. అమ్మ ఒడి నుంచి మొదలుపెడితే జగనన్న విద్యా కానుక వరకూ అన్ని పథకాలూ చదువుపై ఇష్టం పెంచుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంటే ప్రేమగా దగ్గరకెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇదో గొప్ప ముందడుగు. కొత్త చరిత్ర. ఫలితాలు కూడా మొదలయ్యాయి. కానీ... రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాక్షసంగా నలిపేసిన తెలుగుదేశం మాఫియాకు ఇదెంతమాత్రమూ రుచించటం లేదు. విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని విషసర్పాలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడి బినామీల పని అయిపోతున్నదనే భయం ఎల్లో ముఠాను వణికిస్తోంది. ఫలితమే... కొద్దిరోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వస్తున్న నెగెటివ్ కథనాలు. జూనియర్ కాలేజీలు పెట్టారు తప్ప సౌకర్యాలను పట్టించుకోలేదని ఒకనాడు... ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతలు అంతంతమాత్రమేనని మరోనాడు... ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇంకోనాడు... ఇలా రోజుకొక విష గుళికను పాఠకుల మెదళ్లలో వేస్తున్నారు రామోజీరావు!. ఏం? రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రయివేటు మాఫియా చేతుల్లో పెట్టిందెవరు? విశాలమైన ప్రాంగణాల్లో ఉన్న జూనియర్ కాలేజీలను పరాధీనం చేసిందెవరు? కార్పొరేట్ మాఫియా చేతుల్లో విద్యార్థుల తలరాతల్ని పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? విద్యార్థులపై ఒత్తిడిని పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది అదే కార్పొరేట్ మాఫియా కాదా? వారిలో నారాయణ వంటివారు చంద్రబాబు బినామీలు కారా? అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబు కాదా? ఎందుకీ దౌర్భాగ్యపు కథనాలు? ఎందుకీ విషపు రాతలు? మీ మాఫియా మనగలిగే రోజులు పోతున్నాయనా? మీ రాతలింకా జనం నమ్ముతున్నారనే అనుకుంటున్నారా రామోజీరావు గారూ?? రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు వరకు... అంటే 2019 వరకు 10వ తరగతి విద్యార్థుల్లో 65 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా ప్రయివేటు స్కూళ్లలో 35 శాతం వరకు ఉండేవారు. కానీ ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి అది పూర్తిగా తారుమారయ్యేది. ఇంటర్ విద్యార్థుల్లో కేవలం 25 శాతం మంది ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 75 శాతం మందిది ప్రయివేటు కాలేజీల బాటే. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి మెల్లగా తన బినామీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రయివేటు కాలేజీలే విద్యార్థులకు దిక్కయ్యేలా చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,600 వరకు జూనియర్ కాలేజీలుండగా అందులో 290 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మిగతావన్నీ ప్రయివేటువే. దీన్నిబట్టే చంద్రబాబు ప్రయివేటు రంగానికి ఏ స్థాయిలో మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు కల్పించక... అక్కడ చదివితే భవిష్యత్తు ఉండదన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేసి వాటిని నిర్వీర్యపరిచారు. దీంతో టెన్త్ పాసైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ కాలేజీలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. అక్కడేమో లక్షల్లో ఫీజులు... అడ్డగోలు దోపిడీ!!. ఈ పరిస్థితి మారాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... పునాది స్థాయి నుంచే వ్యవస్థను బలోపేతం చేసేలా ఫౌండేషన్ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వాతావరణం ఉండేలా వాటిని వేలకోట్ల రూపాయలతో ‘నాడు–నేడు’ పేరిట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన విద్య అందేలా కరిక్యులమ్‌లోనూ సంస్కరణలు తెచ్చారు. ఊహించని స్థాయిలో వేలకోట్ల రూపాయలతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు. ఫలితాన్నిచ్చిన పథకాలు... ప్రభుత్వ విద్యను మెరుగు పరిచేందుకు... పాఠశాలలపై ఇష్టం పెంచేందుకు అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు పరిమితమైన ఇంగ్లీషు మీడియాన్ని ఎన్నో న్యాయపోరాటాలను కూడా తట్టుకుని అమల్లోకి తెచ్చారు. డిజిటల్ విద్యకూ శ్రీకారం చుట్టారు. వీటిల్లో కొన్ని పథకాలు విద్యా రంగ పరిస్థితులను సమూలంగా మార్చాయి. అవొక్కసారి చూస్తే... జీఈఆర్ పెంచిన అమ్మ ఒడి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు జగన్. ఈ పథకం కింద ప్రతి తల్లి/సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఇలా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇస్తున్న ఈ సాయంతో... ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో జీఈఆర్ గడిచిన మూడేళ్లుగా గణనీయంగా పెరిగింది. నిపుణులు మెచ్చిన ‘విద్యా కానుక’ పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని అందిస్తోంది. ప్రతి విద్యార్థి కిట్‌లో ఒక స్కూల్ బ్యాగ్, స్టిచింగ్ ఛార్జీతో కూడిన 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లీష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటోంది. గడిచిన మూడేళ్లుగా రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 47 లక్షల మంది చొప్పున పిల్లలకు ‘కిట్లు’ అందించింది. స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా అందరికీ పుస్తకాలు అందని గతమెక్కడ? ఆరంభమయ్యేనాటికే బుక్స్‌తో సహా బ్యాగులు, యూనిఫామ్, షూతో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులున్న ప్రస్తుతమెక్కడ? ఏ కొంచెమైనా పోలిక ఉందా? ఇంతటి నవశకాన్ని కనీసం ప్రశంసించని రామోజీరావును ఏమనుకోవాలి? ఇందులో కూడా రంధ్రాలు వెదికి... కొందరి బ్యాగులు పాడయ్యాయని, కొందరికి షూలు పెద్దవయ్యాయని పతాకస్థాయి కథనాలు రాసే నీచపు పాత్రికేయాన్ని ఏం చేయాలి? ఇలాంటివేవీ చేయకున్నా అధికారంలో చంద్రబాబు ఉంటే ఆహా ఓహో అనే రామోజీరావును అసలు మనిషనుకోవచ్చా? అది.. ఆడపిల్లల గౌరవం సీఎం స్వయంగా చొరవ తీసుకుని... ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ని«ధిని ఏర్పాటు చేయించారు. గడిచిన రెండేళ్లుగా రూ.874 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. చదువుకునే పిల్లలు టాయిలెట్ల కోసం ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ఆ విషయంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే గతంలో అధ్వాన్నంగా ఉండి, శిథిలమైపోయిన టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించటం, మరమ్మతులు చేయించటంతో పాటు... వాటికి రన్నింగ్ వాటర్ ఉండేలాంటి ఏర్పాట్లూ చేశారు. వాటి నిర్వహణ కోసం 44,748 స్కూళ్లలో 47,277 మంది ఆయాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. దీనికోసం రూ.442 కోట్లతో స్కూల్ నిర్వహణ నిధిని (ఎస్ఎంఎఫ్) ఏర్పాటు చేశారు. ఆత్మవిశ్వాసం పెంచిన ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు విద్య అందరికీ అందాలన్నది సీఎం కల. దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా, కార్పొరేట్ మాఫియా కలిసి రకరకాలుగా చేసిన పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా అమల్లోకి వచ్చిన ఇంగ్లీషు మీడియం విద్య... రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లలో విద్యార్థుల మాట తీరునే మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా తాము పోటీపడగలమన్న ఆత్మ విశ్వాసాన్ని వారిలో అణువణువునా నింపింది. అంతేకాదు! ఉన్నత ప్రమాణాలు, బోధనా పద్ధతులు ఉత్తమ మూల్యాంకన విధానానికి వీలుగా ప్రభుత్వ స్కూళ్లు దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈకి శ్రీకారం చుట్టింది కూడా. సీబీఎస్ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)–హైదరాబాద్, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్ (ఆర్ఎల్సీ)– అహ్మదాబాద్, సహకారంతో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. హిందూ గ్రూప్‌తో కలిసి టీచర్లు స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీలో (ఎస్టీఈపీ) శిక్షణ పొందారు. ఇవన్నీ కార్పొరేట్ స్కూళ్ల మనుగడనే ప్రశ్నిస్తుండటం... రామోజీ ఎదుర్కొంటున్న అసలు సమస్య. వినూత్నంగా డిజిటల్ తరగతులు... పాఠశాలలన్నిటా 6వ తరగతి నుంచి పైతరగతుల్లో ప్రతి తరగతి గదికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అంతకన్నా కింది తరగతులకు స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తోంది. మనబడి నాడు–నేడు... తొలిదశ పూర్తయిన 15,715 స్కూళ్లలో రూ.352.32 కోట్ల అంచనాతో 10,038 స్మార్ట్ టీవీలు, 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే ఈ డిజిటల్ తరగతులతో పిల్లలకు నాణ్యమైన ఈ–కంటెంట్... దానిద్వారా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తాయి. దీనికోసం విద్యా సమీక్షా కేంద్రాన్ని (కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) కూడా ఏర్పాటుచేస్తోంది. 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులోకి తేవటంతో... స్కూలు ముగిశాక విద్యార్థులకు వారి ఇళ్లలోనే సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడుతోంది. మారిన పాఠ్యాంశాలు... పెరిగిన ప్రమాణాలు ప్రభుత్వం 2020–21 నుండి పాఠ్యాంశాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది. 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఫలితాలొచ్చే పాఠ్యాంశాలపై దృష్టి సారించి మార్పులు చేయించింది. ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పొందడమే లక్ష్యంగా 8, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది. సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండు భాషల్లో (ఇంగ్లీషు– తెలుగు, హిందీ–తెలుగు మాదిరి) ఉండేలా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా 3 నుండి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల ద్వారా బోధనను అందిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబితే పిల్లల్లో ప్రమాణాలు మెరుగువుతాయనేది ప్రభుత్వ యోచన. ఇవన్నీ ఫలితాలనిస్తుండటమే... ప్రయివేటు విద్యా రంగ మాఫియాను కొమ్ముకాస్తున్న ఎల్లో ముఠాకు నచ్చటం లేదు. మండలానికి రెండు కాలేజీలు.. అందులో ఒకటి బాలికలకే తెలుగుదేశం హయాంలో ఉన్నవి మూతపడ్డాయి తప్ప ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా రాలేదు. విశాలమైన స్థలాలతో ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పరాధీనమైపోయాయి. కార్పొరేట్ల జెండా పైపైకి ఎగిరింది. చదివించే స్థోమత లేనివారు మగపిల్లలనైతే అప్పులు చేసి కాలేజీల్లో చేర్పించటం... ఆడపిల్లలనైతే చదువు మాన్పించటం చేసేవారు. దీంతో టెన్త్ తరువాత బాలికలు డ్రాపవుటవ్వడం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో ఒకటి హైస్కూల్‌ను అప్‌గ్రేడ్ చేసి కాలేజీగా మార్చటం ద్వారా చేయాలనుకున్నారు. రెండు కాలేజీల్లో ఒకటి బాలికలకే. దీనివల్ల హైస్కూల్లో ఉత్తీర్ణులైన బాలికలందరూ తమ విద్యను కొనసాగించడానికి వీలుంటుందన్నది సీఎం జగన్ ఉద్దేశం. ఇందులో భాగంగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్లస్2ను ప్రవేశపెట్టారు. 2022–23 నుండి 14 కో–ఎడ్ జూనియర్ కాలేజీలనూ బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. ఇలా మొత్తం 679 మండలాలలో రెండేసి జూనియర్ కాలేజీలుండేలా చేస్తున్నారు. విచిత్రమేంటంటే... అసలు కాలేజీలే లేనప్పుడు రామోజీరావు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇలా కాలేజీలు ఏర్పాటు చేసినపుడు మంచి చర్యంటూ ఒక్క కథనమూ వేయలేదు. కానీ కొన్ని కాలేజీల్లో ఫలితాలు బాగా రాలేదంటూ మాత్రం ఓ కథనాన్ని అచ్చేసేశారు. అదీ.. ‘ఈనాడు’ అంటే. విద్యారంగ పథకాలకు రూ.54వేల కోట్ల ఖర్చు.. ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు రూ.54,023 కోట్లు వెచ్చించింది. చరిత్రలో ఎన్నడూ ఇంతటి భారీ మొత్తాన్ని విద్యపై ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకొని ‘నాడు నేడు’ కింద జూన్ నాటికి 24వేల అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ‘నాడు నేడు’ రెండు, మూడు దశలు కూడా పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలే... రామోజీ ముఠాకు భవిష్యత్తుపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కేజీబీవీలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే... చంద్రబాబు హయాంలో కేజీబీవీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అనా«థ, నిరుపేద అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే ఈ సంస్థలకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం. ఇక్కడ 6 నుంచి 10 వరకే తరగతులుండడంతో... ఆ చదువు పూర్తిచేసిన వారికి పై చదువులకు ఆస్కారం ఉండేదికాదు. డ్రాపవుట్ అయ్యేవారు. చంద్రబాబు వీటిని పట్టించుకుంటే ఒట్టు!. రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా వాటిలో 84,923 మంది బాలికలు చదువుతున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దశలవారీగా మొత్తం 321 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది ఖాళీలను చంద్రబాబు అలాగే వదిలేయగా గడిచిన మూడున్నరేళ్లలో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ఇంటర్మీడియెట్‌ను దృష్టిలో పెట్టుకొని అదనంగా గెస్టు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో అధ్యాపకులను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఈ విద్యార్థినులకు సరైన సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వం వీరికి జగనన్న విద్యాకానుక కింద అన్నీ సమకూరుస్తోంది. ఇక వీరికి హాస్టల్‌తో కూడిన చదువులు అందిస్తున్నా.. వీరి తల్లులకోసం అమ్మ ఒడినీ అందిస్తుండడం విశేషం. అమ్మ ఒడి ద్వారా 2020–21లో 55వేల మందికి, 2021–22లో 67వేల మందికి, 2022–23లో 84వేల మందికి రూ.15వేల చొప్పున రూ.312.80 కోట్ల లబ్ధి చేకూరింది. కాకుంటే రామోజీరావు మాత్రం ఈ వాస్తవాలేవీ చెప్పరు. విషపు రాతలే అచ్చేస్తారు. అదే పాఠకుల దౌర్భాగ్యం. పోటీపడేలా చేసిన ‘నాడు–నేడు’ ‘మన బడి నాడు– నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 44,703 స్కూళ్లలో తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు పూర్తిచేయించారు. నాడు–నేడు 2వ దశలో రూ.4,100 కోట్లతో 17,500 స్కూళ్లలో పనులు చేయిస్తున్నారు. ఇవి రాబోయే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులన్నీ ఆ తరువాతి విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. కొంచెం ఖాళీ స్థలం కూడా లేకుండా ఇరుకిరుకు భవనాల్లో నడిపిస్తున్న కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విశాలమైన ప్రాంగణాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్కూళ్లపై విద్యార్థులకెంత ఇష్టం పెరగిందంటే... సీట్లు లేవు అని స్కూళ్లకు బోర్డులు పెట్టేంతగా!. ఇదొక్కటి చాలు ఈ సంస్కరణల ఫలితమేంటో చెప్పడానికి. హాజరు పెంచిన ‘గోరుముద్ద’ ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై సీఎం జగన్ ఎంతశ్రద్ధ పెట్టారంటే... వారికి అందించే భోజనం మెనూను స్వయంగా తానే మార్పు చేయించారు. ఎందుకంటే... కడుపు నిండితేనే చక్కని చదువు కూడా వంటబడుతుందన్నది ఆయన మాట. స్వయంగా తానే మెనూ తయారు చేయించి... ‘జగనన్న గోరుముద్ద’ పేరిట రోజుకోరకమైన ఆహారాన్ని అందించేలా చేశారు. వారానికి ఐదు గుడ్లు, రోజూ చిక్కీలతో పాటు ఇటీవల బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. వీటికి ప్రభుత్వం ఏటా రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. గుడ్డు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లను అందించాలని కూడా ఆలోచిస్తోందంటేనే సర్కారు చిత్తశుద్ధి అర్థమవుతుంది. డిజిటల్ లెర్నింగ్... కొత్త చరిత్ర కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు దెబ్బతిన్నారు. అభ్యసన స్థాయిలు దిగజారాయి. అందుకే విద్యార్థులకు గూగుల్ రీడ్ ఎలాంగ్ పీఎఎల్, బైజూస్ తదితర మార్గాల్లో చదువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 4 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు బైజూస్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధన చేసే టీచర్లకు ప్రభుత్వం రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను అందించింది. ఈ ఏడాది కూడా 8వ తరగతిలోకి వచ్చేవారికి రూ.750 కోట్లతో ట్యాబులు అందించనుంది. ప్రతి ఏటా ఇలా 8వ తరగతిలో ఇచ్చే ట్యాబులు వారికి 10వ తరగతి వరకూ డిజిటల్ లెర్నింగ్‌కు పనికొస్తాయి. తరవాత ఇంటర్మీడియెట్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. అంటే... కార్పొరేట్ స్కూళ్లలో సైతం వేలకు వేలు అదనపు ఫీజులు కడితే తప్ప అందని ట్యాబులు, బైజూస్ వంటి ఎడ్యుటెక్ దిగ్గజ సంస్థ పాఠాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగానే అందుతున్నాయి. తద్వారా వారికి ఏ స్థాయిలోనైనా పోటీపడే సామర్థ్యం వస్తోంది. -
జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ దినపత్రిక అసత్యాలతో దుష్ప్రచారం సాగిస్తోందని పాఠశాల విద్యా శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘విద్యా కానుక బూట్లు కాళ్లకు పట్టవు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవమని ఖండించింది. ‘ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేముల కోట జడ్పీ ఉన్నత పాఠశాలను ఈనెల 15న పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు. 7వ తరగతికి వెళ్లి విద్యార్థులు ధరించిన షూలను పరిశీలించారు. కొంత మంది విద్యార్థులు షూ ధరించలేదు. ఇందుకు వారు చెప్పిన కారణాలు సహేతుకంగా లేకపోవడంతో వారికి ఇచ్చిన షూలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లారు. జి.సందీప్ కుమార్, కె.శివపార్వతి ఇళ్ల వద్ద ఉన్న వారి షూలను పరిశీలించారు. అవి ఆ విద్యార్థులకు సరిగ్గా సరిపోయాయి. ఎలాంటి డ్యామేజీ కూడా లేదు. దీంతో ఆ షూలను విద్యార్థులకు తొడిగించారు. ప్రతి రోజూ పిల్లలతో షూ ధరింపచేసి స్కూళ్లకు పంపాలని వారి తలిదండ్రులకు సూచించారు. ఆ తర్వాత ఆ పిల్లలను తన వెంట స్కూలుకు తీసుకెళ్లారు. అక్కడి టీచర్లతో సమావేశమై 100 రోజుల పాటు అలవాటు చేస్తే విద్యార్థులు తప్పకుండా షూ వేసుకొని వస్తారని సూచించారు. ప్రకాశం జిల్లాలో 21 వేల మంది విద్యార్థులకు సంబంధించిన షూ లను ఎక్స్ఛేంజ్ చేసి అందించారు. ఈ మేరకు విద్యా శాఖ అన్ని స్కూళ్ల హెచ్ఎంల నుంచి విద్యార్థులందరికీ షూలు సరిపోయాయని డిక్లరేషన్ కూడా తీసుకుంది. ఈ వాస్తవాలను విస్మరించి, విద్యా కానుక బూట్లు విద్యార్థులకు పట్టవు అంటూ ‘ఈనాడు’ అసత్యాలతో వార్త ప్రచురించడం దారుణం. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’ అని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
జగనన్న విద్యాకానుకపై ఈనాడు మళ్లీ అదే ఏడుపు
-
జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ ఏడుపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్న ‘జగనన్న విద్యాకానుక’పై ఏడుపుగొట్టు కథనాలతో ఈనాడు మరోసారి తన నైజాన్ని చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగా విద్యాకానుక గుత్తేదార్లకేనంటూ ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈనాడు కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని ‘ఫ్యాక్ట్ చెక్’లో వెల్లడైంది. గతంలోనూ ఇదే తరహా కథనాలు ప్రచురించడం తెలిసిందే. ఈనాడు ఆరోపణ: ఈసారి బూట్లపై రూ.14 అధికం వాస్తవం: జీవో 172 ప్రకారం ఒక జత బూట్లు, 2 జతల సాక్సుల కొనుగోళ్లకు ఆమోదించిన వ్యయం రూ.200. అయితే రివర్స్ టెండర్లతో రూ.187.48కే టెండర్ ఖరారు చేశారు. ఇది ప్రభుత్వం ఆమోదించిన ధర కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం ఆరోపణ: బ్యాగ్‌పై సగటున రూ.92 అధికం వాస్తవం: జీవో 172 ప్రకారం ఒక్కో బ్యాగు కొనుగోలు కోసం ప్రభుత్వం ఆమోదించిన వ్యయం రూ.265.50. మొదటిసారి టెండర్లలో కాంట్రాక్టర్లు 30 శాతం అధికంగా రేటు కోట్ చేయడంతో వాటిని రద్దు చేసి రెండోసారి పిలిచారు. రివర్స్ టెండర్ల ద్వారా నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కో బ్యాగును రూ.272.92 చొప్పున ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఇది కేవలం 2.43 శాతం అధికం. బ్యాగు నాణ్యత పెరగడంతో ప్రభుత్వం అనుమతించిన గరిష్ట పరిమితి యూనిట్ వ్యయం 5 శాతం మించకుండా టెండర్లు ఖరారు చేశారు. ఆరోపణ: చిరిగిన బ్యాగ్‌ల సరఫరాపై చర్యలు శూన్యం వాస్తవం: జగనన్న విద్యాకానుక 3వ విడతలో చిరిగిన, పాడైన బ్యాగులకు సంబంధించి జేవీకే యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అలాంటి బ్యాగులు రీప్లేస్ చేయని సరఫరాదారులకు ఆ మేరకు చెల్లింపులు నిలిపివేశారు. ఆరోపణ: ముగ్గురు పాత కాంట్రాక్టర్లే వాస్తవం: టెండర్ నిబంధనల ప్రకారం అనుమతించారు. కొత్త కాంట్రాక్టర్లు కూడా పాల్గొనేలా అవకాశం కల్పిస్తూ బ్యాగులు, బూట్లకు సంబంధించి పెద్ద టెండర్లను ఐదు రీజియన్లుగా విభజించి పిలిచారు. దీనివల్ల ఏకపక్ష ఆధిపత్యం ఉండదు. ఆరోపణ: బూట్లు, బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి. వాస్తవం: ప్రభుత్వం అనుమతించిన మేరకు మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కేవలం ఒక్క శాతం పెరుగుదలతో మాత్రమే టెండర్లను ఖరారు చేశారు. ఆరోపణ: విద్యార్థులు తగ్గినా రూ.155.84 కోట్లు అదనపు భారం వాస్తవం: యూడైస్ గణాంకాల ఆధారంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 శాతం పెరుగుదల లెక్కించి టెండర్లు ఆహ్వానిస్తుంటారు. డెలివరీ షెడ్యూల్ ఇచ్చేటప్పుడు మాత్రం విద్యార్థుల యథార్థ సంఖ్యను పరిగణలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం 39,96,064 మంది విద్యార్థులను పరిగణనలోకి తీసుకుని సరఫరా షెడ్యూల్ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతించిన విధంగా 5శాతానికి మించకుండా టెండర్లు ఖరారు చేశారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన వ్యయం కంటే తక్కువ బడ్జెట్లోనే విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. -
ఏపీలో విద్యార్థులకు అత్యుత్తమంగా జగనన్న విద్యా కానుక
-
Jagananna Vidya Kanuka: సీఎం జగన్ ఆదేశాలు.. మేలిమి ‘కానుక’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తూ అందచేస్తున్న జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరింత నాణ్యతతో, సకాలంలో సమకూర్చేలా విద్యాశాఖ సన్నద్ధమైంది. రూ.1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి సరఫరాదారులందరికీ ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఈసారి విద్యార్థులకు మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగ్‌లు, బూట్లను అందించనున్నారు. యూనిఫామ్‌ను ప్లెయిన్ క్లాత్ కాకుండా ఆకర్షణీయంగా రంగు రంగుల చెక్స్ డిజైన్‌తో రూపొందించారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా యూనిఫామ్ క్లాత్‌ను అదనంగా పెంచారు. ఇక పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పంపిణీ మొదలవుతుంది. స్కూళ్లు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పట్ల పెరుగుతున్న ఆదరణ, ఏటా అదనంగా చేరుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఐదు శాతం అదనపు బఫర్‌తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తుండటం గమనార్హం. విద్యాకానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ఓ మేనమామలా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మూడున్నరేళ్లుగా జేవీకే అమలు తీరును గమనిస్తూ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పు చేర్పులను సూచిస్తున్నారు. ► స్థానిక మార్కెట్లో సుమారు రూ.650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను సరఫరా చేసేందుకు మంజీత్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, కోర్స్ ఇండియా లిమిటెడ్, అభిలాష కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్వో ఫుట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, వినిష్మా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి ఆర్డర్లు ఇచ్చారు. స్వే్కర్ టైపులో పెద్ద బ్యాగులు రీ డిజైన్ చేశారు. ►యూనిఫామ్‌కి సంబంధించి బాలికల టాప్, బాలుర షర్ట్‌లను ప్లెయిన్ క్లాత్ నుంచి చెక్స్ (గడులు) రూపంలోకి మార్పు చేశారు. దుస్తులు కుట్టే సమయంలో సమస్యలు ఎదురు కాకుండా క్లాత్ పరిమాణాన్ని కూడా దాదాపు 20 శాతం పెంచారు. మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నందన్ డెనిమ్ లిమిటెడ్, కంచన్ ఇండియా లిమిటెడ్, అరవింద్ కాట్సిన్ ఇండియా లిమిటెడ్, పదమ్ చంద్ మిలాప్‌చంద్ జైన్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. యూనిఫామ్ వస్త్రం మరో 50 రోజుల్లో జిల్లాలకు సరఫరా మొదలు కానుంది. ►బూట్లు మరింత కాంతివంతంగా (షైనింగ్) ఉండేలా చర్యలు చేపట్టారు. సరఫరాదారులు పాత మెటీరియల్ వాడకుండా నియంత్రించారు. డైమండ్ ఫుట్‌కేర్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్, మంజీత్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ఎక్స్ఓ ఫుట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, పవర్ టెక్ ఎలక్ట్రో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, లెహర్ పుట్వేర్ లిమిటెడ్ సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేసి పంపిణీ ఆర్డర్లు ఇచ్చారు. ►అటల్ ప్లాస్టిక్స్, ఓం స్పోర్ట్స్ సంస్థలను బెల్టుల తయారీకి టెండర్ల ద్వారా ఎంపిక చేశారు. ►ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌కి గతంలో మాదిరిగా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించారు. ►1 నుంచి 9వ తరగతి వరకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 6, 7, 9 తరగతుల విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. తమిళనాడు న్యూ ప్రింట్ పేపర్స్ లిమిటెడ్ కాగితాన్ని సరఫరా చేస్తోంది. 40 లక్షల మందికిపైగా విద్యార్థులకు రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాలు తయారు చేస్తున్నారు. దాదాపు 4.83 కోట్ల పుస్తకాలు ముద్రించి అందించనున్నారు. ►ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థుల కోసం 5 శాతం అదనపు బఫర్‌తో ప్రభుత్వం 5.06 కోట్ల పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది. ►అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వుల్ పుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూ, ఇంగ్లీష్లలో ద్విభాషా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయనున్నారు. బెలింగ్వుల్ పుస్తకాలు 5 భాషల్లో (తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం) ముద్రించనున్నారు. 9వ తరగతికి కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలను 2023–24లో పరిచయం చేస్తున్నారు. ►2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ముద్రణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి 88 ప్రింటర్లకు ఈ పనులు అప్పగించారు. 14,611 మెట్రిక్ టన్నుల ఇన్సెట్ పేపర్, 1,401 మెట్రిక్ టన్నుల టైటిల్ కవర్ పేపర్ సరఫరా కోసం తమిళనాడు న్యూ ప్రింట్ – పేపర్స్ లిమిటెడ్‌కి ఆర్డర్లు ఇచ్చారు. సంస్థ పేపర్ సరఫరా చేస్తుండడంతో ప్రింటింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ►ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు పుస్తకాల పంపిణీ ప్రారంభమవుతుంది. మే 31వ తేదీకల్లా అన్ని స్కూల్ పాయింట్లకు పుస్తకాలు చేరేలా చర్యలు చేపట్టారు. ►పాఠ్య పుస్తకాలు వర్కు బుక్కులు స్కూళ్లు తెరిచే రోజే విద్యార్ధులకు అందించనున్నారు. గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసే కిట్లలో నాణ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి దశలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. పాఠ్య పుస్తకాల సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి, సమగ్ర శిక్ష రాష్ట్ర అదనపు సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డితో కలసి వివిధ ముద్రణ కేంద్రాలు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మరింత నాణ్యమైన కిట్లను సకాలంలో అందించేలా చర్యలు చేపట్టినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. -
Andhra Pradesh: బాలికల ఓటు చదువుకే
అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్వేచ్ఛ, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, డిజిటల్ తరగతులు, బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలు, కార్యక్రమాలు రాష్ట్రంలోని బాలికల్లో చదువుకోవాలన్న ఆలోచనను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితంగా అమ్మాయిలందరూ బడిబాట పడుతున్నారు. పాఠశాలల స్థాయిలోనే ఆగిపోకుండా కళాశాలలో సైతం అడుగు పెడుతున్నారు. మంచి ఉద్యోగమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి బాలిక కనీసం పదో తరగతి వరకు అయినా చదవాలన్న తపన, తాపత్రయంతో ప్రభుత్వం ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి పదో తరగతి అర్హత పెట్టింది. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలవడంతో తల్లిదండ్రులు సైతం బాలికల చదువుకు ఊకొడుతున్నారు. ఫలితంగా ఏడాదికేడాది పాఠశాలలు, కళాశాలల్లో వీరి చేరికలు పెరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి దశలోనూ అండగా నిలవడంతో విద్యా రంగంలో అమ్మాయిలు దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు చదువుల్లో వెనుకబడిన ఆడపిల్లలు నేడు అన్ని అడ్డంకులను అధిగమించి పోటాపోటీగా దూసుకుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బాలికల చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో యుక్త వయసు రాక ముందే ఆడ పిల్లల పెళ్లిళ్లపై దృష్టి సారించే తల్లిదండ్రులు.. నేడు ఆ ఆలోచనను వాయిదా వేసి, వారి చదువులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఆడపిల్లల చేరికలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ఏన్యువల్ స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్), ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదికల్లోని గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. బాలికల చేరికల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మరింత అధికమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక విద్యాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపిస్తున్నారు. పాఠశాల స్థాయి అనంతరం.. ఇంటర్మీడియెట్ చదవులకు వీలుగా బాలికల కోసం ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఉన్నత కోర్సుల్లో చేరే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. విద్యకు సంబంధించిన భారమంతా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఆడపిల్లల చేరికలు బాగా పెరిగాయి. ఏటా పెరుగుదల రాష్ట్రంలో 2020–21లో టెన్త్‌లో 3,19,193 మంది బాలికలు ఉండగా, 2021–22లో వారిలో 2,37,530 (75 శాతం) మంది ఇంటర్లో చేరారు. అంతకు ముందు ఏడాది.. అంటే 2019–20లో టెన్త్‌లో 3,20,227 మంది ఉండగా, అందులో 2,24,943 (70 శాతం) మంది 2020–21లో ఇంటర్లో చేరినట్లు యూడైస్ గణాంకాలు వివరిస్తున్నాయి. ఏటేటా బాలికల చేరికల శాతం పెరుగుతోందనేందుకు ఈ గణాంకాలే తార్కాణం. ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయి సాధిస్తున్నారు. 2022 ఇంటర్ ఫలితాల్లో 68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా బాలురు 32 శాతమే ఉత్తీర్ణులయ్యారు. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో బాలికల చేరికలు మరింత మెరుగ్గా ఉన్నాయి. జాతీయ స్థాయిలో బాలికల జీఈఆర్ పెరుగుదల 2.28 శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలో 11.03 శాతానికి పెరిగిందని ఐష్ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా తగ్గిన డ్రాపవుట్లు గతంలో దేశ వ్యాప్తంగా చాలా కాలంగా 7 లేదా 8వ తరగతి తర్వాత ఆడపిల్లల డ్రాపవుట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో క్రమేణా ఆ పరిస్థితి మారుతోంది. 14–16 వయసు బాలికలు బడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయే వారి శాతం 2018 నాటికి 13.5 శాతం వరకు ఉన్నట్లు అసర్ గత నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ శాతం 7.9 శాతానికి తగ్గినట్లు 2022 నివేదిక పేర్కొంది. 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో బడులకు వెళ్లని వారి శాతం 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఇంటర్లో పెరిగిన చేరికలు గతంలో టెన్త్ తర్వాత బాలికల చదువు ముందుకు సాగడానికి చాలా సమస్యలు ఉండేవి. అయితే కాలేజీల అందుబాటు, వివిధ వనరుల కల్పనతో భద్రతాపరమైన చర్యలు పెరగడం, తల్లిదండ్రులు కూడా పిల్లలను కాలేజీల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడంతో హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియెట్ స్థాయిల్లోనూ బాలికల చేరికలు బాగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విడుదల చేసే దేశ వ్యాప్త గణాంకాల ప్రకారం 2021–22లో పదో తరగతిలో 89,66,648 మంది బాలికలు ఉండగా.. ఇందులో ఇంటర్లో 73,36,609 (82 శాతం) మంది చేరారు. 2020–21 గణాంకాల ప్రకారం టెన్త్‌లో 91,64,940 మంది ఉండగా, వారిలో ఇంటర్లో 65,80,132 (72 శాతం) మంది చేరారు. అంటే పది శాతం మేర బాలికల చేరికలు పెరిగినట్లు యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ – యూడైస్+ (యూడీఐఎస్+) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉన్నత విద్యలోనూ బాలికల పెరుగుదల ► ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువుల్లోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఐష్ పేర్కొంది. 2020–21 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్నత చదువుల్లో చేరికలు 2019–20లో 3.85 కోట్లు ఉండగా, 2020–21లో అది 4.13 కోట్లకు చేరినట్లు తెలిపింది. అంటే 28.80 లక్షల మంది పెరిగారు. ► 2018–19లో 2.7 శాతం ఉండగా, 2019–20లో 3 శాతం మేర, 2020–21లో 7.4 శాతం మేర పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. వీరిలో బాలికల చేరికలు 2019–20లో 1.89 కోట్లు కాగా, 2020–21లో 1.96 కోట్లుగా ఉంది. 2021–22, 2022–23 అధికారిక గణాంకాలు ఖరారైతే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ► ఏపీ విషయానికి వస్తే యూడైస్ గణాంకాల ప్రకారం 2018–19లో టెన్త్ బాలికల్లో 70 శాతం మంది ఇంటర్ ఫస్టియర్‌లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో అమ్మ ఒడి తదితర కార్యక్రమాలతో 78 శాతం మంది ఇంటర్లో చేరారు. ► 2020–21లో కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో చేరికలు 70 శాతంగా ఉన్నా, మళ్లీ 2021–22 నాటికి బాలికల చేరికల శాతం 75 శాతానికి చేరుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇంటర్లో బాలికల చేరికలు 2021–22లో ఏపీలో 75 శాతంగా ఉండగా బీహార్‌లో 56 శాతం, కర్ణాటకలో 73 శాతం, తెలంగాణలో 74 శాతంగా ఉన్నాయి. -
శ్రద్ధ వహిస్తేనే.. సత్ఫలితాలు: సీఎం జగన్
విద్యార్థులు 6వ తరగతిలోకి రాగానే విద్యను సీరియస్ అంశంగా తీసుకుని చదువుపై మరింతగా దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టాలి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఏర్పాటు, సబ్జెక్టుల వారీ టీచర్లతో పాటు బోధన కార్యక్రమాలపై అన్ని స్థాయిల్లోనూ అధికారులు, క్షేత్ర స్థాయిలోని సిబ్బంది సీరియస్‌గా వ్యవహరించాలి. మొక్కుబడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని విజయాలు సాధించేలా మన విద్యార్థుల్లో ఇంగ్లిష్ ప్రావీణ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం కేంబ్రిడ్జి, టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్‌ను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్–ఈటీఎస్ అనే సంస్థ నిర్వహిస్తుంది) లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలి. 3వ తరగతి నుంచే పరీక్షలు నిర్వహించి పిల్లలకు సర్టిఫికెట్లు జారీ చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. అప్పుడు మరిన్ని మంచి ఫలితాలుంటాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను తరచూ సమీక్షించడంతో పాటు, అవి పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇచ్చేలా క్షేత్ర స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మరింత మెరుగు పడేలా బోధనాభ్యసన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ తరగతుల ఏర్పాటు తరుణంలో అధికారులు ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతర సమీక్ష, పర్యవేక్షణ వల్ల విద్యాకానుక దగ్గర నుంచి పాఠ్యాంశాల వరకు.. మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి గోరుముద్ద వరకు నాణ్యత పెరుగుతుందన్నారు. పిల్లలకు అద్భుతమైన స్కూలు వాతావరణం అందుబాటులో ఉంటుందని, తద్వారా చదువుపై వారు మరింత ఏకాగ్రత చూపగలుగుతారని చెప్పారు. ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని, నాణ్యతలో రాజీ ఉండకూడదని ఆదేశించారు. పాఠ్య పుస్తకాల్లో పేపర్ క్వాలిటీగా ఉండేలా చూడాలన్నారు. వచ్చే ఏడాది అందించాల్సిన విద్యా కానుక కిట్లను ఈ విద్యా సంవత్సరం ఆఖరుకే స్కూళ్లకు చేర్చాలని చెప్పారు. మార్చిలో మొదలు పెట్టి ఏప్రిల్ చివరి నాటికి విద్యా కానుక వస్తువులన్నింటినీ స్కూళ్లకు చేరుస్తామని, స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక కిట్ అందిస్తామని అధికారులు చెప్పారు. గోరుముద్దలో భాగంగా రాగి మాల్ట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఐఎఫ్‌పీల ద్వారా బోధనపై మరింత నిశిత దృష్టి ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్)లను ఏర్పాటు చేస్తు న్నాం. 6వ తరగతి ఆపై ప్రతి తరగతి గదిలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల బోధన, నేర్చుకోవడం మరింత సులభతరమవుతుంది. 6వ తరగతి కన్నా దిగువ తరగతులకు టీవీ స్క్రీన్లను అందుబాటులోకి తెస్తున్నాం. తర్వాత 8వ తరగతి నుంచి ట్యాబ్లిస్తున్నాం. దీని వల్ల ఇంటి దగ్గర కూడా పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఉన్న పాఠ్యాంశాలను నేర్చుకునే అవకాశం కల్పించాం. ► వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఐఎఫ్‌పీ, టీవీ స్క్రీన్లను స్కూళ్లలో ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేసినప్పుడే నాడు–నేడు పూర్తవుతుంది. 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబులను వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అందించేలా చర్యలు తీసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్లు, పాఠ్య పుస్తకాల్లో అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్.. మొత్తంగా పూర్తి సినర్జీతో ఉండాలి. ► టీచర్లకూ ఇంగ్లిష్‌పై పట్టు పెరిగేందుకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు క్రమంగా ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో మెరుగైన ప్రావీణ్యం సాధించాలి. ట్యాబ్‌ల వినియోగం, పాఠ్యాంశాలను నేర్చుకుంటున్న తీరుపై పిల్లల తల్లిదండ్రులకు ఫీడ్‌బ్యాక్ అందించాలి. ► నాడు–నేడులో మొత్తం 11 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వీటిలో లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి. విద్యార్థులకు అందించే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్ మార్చి 2 నుంచి పిల్లలకు రాగి మాల్ట్ జగనన్న గోరుముద్దలో భాగంగా వారంలో మూడు రోజులు ఉదయం పూట విద్యార్థులకు రాగి మాల్ట్ అందించాలి. మార్చి 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. మరో మూడు రోజులు చిక్కి అందించాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో రక్తహీనత (ఐరన్ లోపం)ను నివారించవచ్చు. అధికారులు ఏం చెప్పారంటే.. ► సబ్జెక్ట్ టీచర్ విధానంతో అర్హతలున్న టీచర్లు అందుబాటులోకొచ్చారు. ► గతంలో 3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్జెక్టుల వారీగా బోధన లేదు. ఇప్పుడు వీరికి మంచి బోధన అందుతోంది. ► ఐఎఫ్‌పీల కొనుగోలు టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లింది. ► ట్యాబ్‌ల వినియోగంలో వైఎస్సార్ కడప, విజయనగరం, చిత్తూరు జిల్లాల విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ► మొదటి దశ నాడు–నేడుపై, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆడిట్ పూర్తయ్యింది. అంగన్వాడీలు, హాస్టళ్లలోనూ నాడు–నేడు ► మొదటి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం రెండో దశలో 23,221 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. మూడో దశలో 16,968 స్కూళ్లను మౌలిక వసతులతో తీర్చిదిద్దనుంది. వీటితోపాటు అంగన్వాడీలు, హాస్టళ్లను కూడా నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తోంది. ► సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, విద్యా శాఖ సలహాదారు సాంబశివారెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్‌కుమార్, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీశేషగిరిబాబు తదితరులున్నారు. -
విద్యార్థులు పెరిగితే మీ బాధేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను, వాటిలోని విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు చరిత్రలో ఇదివరకెన్నడూ జరగలేదు. అసలు ఆ ఆలోచనే చెయ్యలేదు. ఇక్కడి విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ల పిల్లలకన్నా ఒక మెట్టు పైనే ఉండేలా... ప్రభుత్వమిస్తున్న జగనన్న విద్యాకానుక పైనా ‘ఈనాడు’ దుష్ప్రచారానికి దిగింది. వాస్తవాలకు మసిపూసి... ‘కిట్లు కొన్నారు–కోట్లు తిన్నారు’ అంటూ పచ్చి అబద్ధాల వంటకాన్ని జనంలోకి వదిలింది. జగనన్న విద్యాకానుక కింద... బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలతో పాటు 3 జతల యూనిఫారం, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు, నోటు పుస్తకాలు, వర్కుబుక్కులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తూ విద్యార్థుల చదువుల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చారని ఎన్నడూ ఒక్క మంచిమాట కూడా రాయని రామోజీరావు... అసత్య సమాచారంతో మాత్రం బాగానే చెలరేగిపోయారు. గతంలో అరకొరగా ఇచ్చే పాఠ్యపుస్తకాలు... 8 నెలలు గడిచినా, కొన్ని సందర్భాల్లో విద్యా సంవత్సరం ముగిసిపోయినా అందేవి కావు. తన పాదయాత్రలో ఈ పరిస్థితిని గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని చక్కదిద్దే పని మొదలెట్టారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలి రోజే పుస్తకాలు అందించాలనుకున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారమే కాకుండా విద్యార్థులకు అవసరమైన ఇతర వస్తువులనూ కిట్‌లో చేర్చి ‘జగనన్న విద్యాకానుక’గా అందిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఆయా వస్తువుల నాణ్యతను పరిశీలించిన అనంతరం టెండర్ల ద్వారా ఏటా విద్యార్థులకు సకాలంలో కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా నాణ్యతలో లోపాలుంటే వాటిని తిరిగి సరిచేసి మళ్లీ కొత్తవి విద్యార్థులకు అందేలా చేస్తున్నారు. ఇవి వచ్చే ఏడాది కోసమని మరిచారా? ఇలా విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే అందరికీ కిట్లు అందించాలంటే ఆరేడు నెలల ముందు నుంచే కసరత్తు మొదలుకావాలి. అంటే... వచ్చే విద్యా సంవత్సరం కోసం ఈ ఏడాదే కసరత్తు మొదలవుతుంది. మరి ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటుంది కదా? అప్పటికప్పుడు పెంచటం సాధ్యం కాదు కదా? అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రస్తుత సంఖ్యకు 5 శాతం జోడిస్తున్నారు. ఆ మేరకు పెరుగుదలను అంచనా వేసి టెండర్లు పిలుస్తున్నారు. ఒకవేళ పిల్లలకు ఇచ్చాక మిగిలిపోతే వాటిని తదుపరి ఏడాదికి సర్దుబాటు చేస్తూ... ఈ మేరకు కొత్తగా కొనే వాటి సంఖ్యను తగ్గిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతున్న వాస్తవం కాగా... దీనికి ‘ఈనాడు’ మసిపూసింది. ఇలా మిగిలిపోయిన వస్తువుల వల్ల రూ.162 కోట్లు వృథా అంటూ తప్పుడు సమాచారంతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేసింది. నిజానికి వస్తువుల్లో నాణ్యత లోపాలుంటే వాటిని వాపస్ తీసుకొని కొత్తవివ్వాలన్న నిబంధన సైతం ప్రతి ఏటా తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగుల్లో లోపాలు కనిపించగా ఆయా కంపెనీల ద్వారా తిరిగి కొత్తవి పంపిణీ చేయించారు. ‘ఈనాడు’ మాత్రం అవాస్తవాల ప్రచారమే లక్ష్యంగా చెలరేగిపోయింది. ఈ మంచిని ఏనాడైనా ప్రశంసించారా? ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించడానికి, కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగానే వారికి మౌలిక సదుపాయాలను అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దార్శనిక ఆలోచనలతో ప్రభుత్వం ‘నాడు–నేడు’ పేరిట మహాయజ్ఞాన్ని ఆరంభించటం తెలిసిందే. గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యతను తెచ్చారు. న్యాయ పోరాటాలను సైతం దాటుకుని... ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించారు. సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన బోధన కోసం అంతర్జాతీయ ఎడ్యుటెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకున్నారు. బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను విద్యార్థులకు ఉచితంగా అందించారు. త్వరలో డిజిటలీకరణ పద్ధతుల్లో బోధనకోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది. వీటన్నిటి ఫలితంగానే ఇటీవలి పెర్ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులో కానీ, అసర్ సర్వే నివేదికలో కానీ, అంతకు ముందు ఇండియాటుడే వంటి సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కానీ పాఠశాల విద్యాప్రమాణాలు ఎంతో మెరుగుపడి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఒక్క విద్యారంగంలో సంస్కరణలకే రూ.55వేల కోట్ల వరకు ఖర్చు చేశారంటే ముఖ్యమంత్రి ఈ రంగానికిస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో పాఠశాల విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసినా... విద్యాసంవత్సరం చివరి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారం వంటివి ఇవ్వకపోయినా అద్భుతంగా ఉందంటూ కథనాలు రాసిన ‘ఈనాడు’ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమాలను ఒక్కనాడూ ప్రశంసించకపోవటమే విచిత్రం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ విద్యాకానుక కొనుగోళ్ల విషయంలో టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల తనిఖీకి ఈ ఏడాది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే... విద్యార్థులు ఇబ్బంది పడకుండా వెంటనే రీప్లేస్ చేయడానికి... అదనంగా తెప్పించుకున్న నిల్వలు ఉపయోగపడుతున్నాయి. బెల్టులు, నోటు పుస్తకాలు, బూట్లు, డిక్షనరీలలో ఎటువంటి మార్పులు లేనందున వాటిని తర్వాతి విద్యా సంవత్సరంలో వాడుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. 10 రకాల వస్తువుల పంపిణీ జగనన్న విద్యాకానుక ద్వారా మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభానికి ముందే అందిస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్స్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ ( 1–5 తరగతులకు), ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ( 6 –10 తరగతులకు), స్కూలు బ్యాగు, షూ, 2 జతల సాక్సులు, యూనిఫాం, కుట్టుకూలి డబ్బులు, బెల్టు మొత్తం పదిరకాలు మూడేళ్లనుంచి విజయవంతంగా అందిస్తోంది. మొత్తంగా మూడేళ్లలో విద్యాకానుక కోసం సుమారు రూ.2,324 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. వరుసగా నాలుగో ఏడాది 2023–24 విద్యా సంవత్సరంకోసం మరో రూ.1042.53 కోట్లు ఖర్చు చేసేందుకు ఇప్పటికే టెండర్లను పూర్తి చేసింది. ఏటా స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా 5 శాతం కలుపుకుని ఆ మేరకు పంపిణీ చేయాల్సిన సంఖ్యను నిర్ణయిస్తోంది. ఒకవేళ పంపిణీ అనంతరం విద్యాకానుక వస్తువుల్లో ఏం మిగిలిపోయినా కూడా... వాటిని తదుపరి సంవత్సరంలో వాడుకుంటున్నారు. విద్యాకానుక విప్లవాత్మక పథకం విద్యాకానుక విషయమై తమ నుంచి ఎలాంటి వివరణ కూడా అడగకుండా అభూత కల్పనలతో కథనాన్ని రాశారని విద్యాశాఖ తప్పుబట్టింది. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాలు, యూనిఫారం.. మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం అందిస్తోందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని విద్యాశాఖ పేర్కొంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా... పరీక్షలు వస్తున్నా... పాఠ్యపుస్తకాలు సహా ఏవీ అందని పరిస్థితి గతంలో ఉండేదని వివరించింది. -
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం
అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. -
2, 3 సెమిస్టర్ల పాఠ్యపుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన 2, 3 సెమిస్టర్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్న ఈ పుస్తకాల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలతో ఆయన మంగళవారం సర్క్యులర్ విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక–3 కింద సెమిస్టర్–2, 3కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్టోబర్ 15 నుంచి 31 వరకు పూర్వపు 13 జిల్లాల గోడౌన్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లా బుక్ డిపో మేనేజర్లు మండల పాయింట్లకు వీటిని పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పుస్తకం చేరేలా... సెమిస్టర్–1 పాఠ్యపుస్తకాల సరఫరాలో కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు కమిషనర్ సూచించారు. అన్ని జిల్లాల బుక్ డిపోల మేనేజర్లు సెమిస్టర్–2, 3 పాఠ్యపుస్తకాల అన్ని టైటిళ్లను ఒకే షెడ్యూల్లో అందించాలి. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు సెమిస్టర్–2, 3ల అన్ని పాఠ్యపుస్తకాలను తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సరఫరా చేయాలి. ప్రతి టైటిల్ బుక్ ప్రతి విద్యార్థికి చేరేలా చూసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు అందరూ తమ స్కూలులో ప్రస్తుత నమోదు ప్రకారం మండల పాయింట్ల నుంచి అన్ని పాఠ్యపుస్తకాల శీర్షికలను తీసుకోవాలి. ఏ పాఠశాలలో అయినా ఆంగ్ల మాధ్యమంలో నమోదు పెరిగి, తెలుగు మాధ్యమంలో తగ్గితే మండల విద్యాధికారి ద్విభాషా పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల కోసం సరఫరా చేయాలి. ఇంకా, మండలాల్లో చేరికలు పెరిగి ఏదైనా కొరత ఏర్పడితే మండల విద్యాధికారి సంబంధిత పత్రాలతో జిల్లా విద్యాధికారికి, జిల్లా బుక్ డిపో మేనేజర్‌కు తెలియజేసి అవసరమైన శీర్షికలను పొందాలి. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, సంస్కృతం పాఠ్యపుస్తకాలు కూడా ప్రింట్ అయి జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్లకు సరఫరా అయ్యాయి. జిల్లా విద్యాధికారి, జిల్లా బుక్ డిపో మేనేజర్ ఈ పుస్తకాలను అవసరమైన పాఠశాలలకు సరఫరా చేయాలి. సెమిస్టర్–2, 3ల పాఠ్యపుస్తకాలు మొత్తం నవంబర్ 10వ తేదీలోపు పంపిణీ చేయాలి. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా బుక్‌డిపో మేనేజర్లు పాఠ్యపుస్తకాల పంపిణీని పర్యవేక్షించాలి. ఏదైనా మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. -
బడులపైనా రాజకీయాలా?: విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. ఇంత చేస్తున్నా.. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. ఇదంతా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేకుండా చేసి, ఇదివరకట్లా పేదలకు మంచి విద్య అందకుండా దూరం చేయాలనే కదా! ఇంతటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే మనం లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు. విద్యార్థులని కూడా చూడకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వీటిపై సీఎం స్పందిస్తూ ‘విద్యా సంబంధిత కార్యక్రమాలపై రాజకీయాలు దురదృష్టకరం. ముఖ్యంగా లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఆసరాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి దుష్ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు’ అని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదవలేక మానేస్తున్నారన్నట్టుగా వక్రీకరణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వక్రీకరణల వెనుక వారి ఉద్దేశం ఏమిటో ప్రజలందరికీ తెలుసని.. మంచి మాటలు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని అందివ్వాల్సిన వాళ్లే ఇలాంటి వక్రీకరణలు చేస్తుండటం దారుణం అన్నారు. స్కూళ్ల నిర్వహణపై నివేదికలు స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా నివేదికలు తెప్పించుకోవాలని, ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ఇవ్వాల్సిన ట్యాబ్‌లు ప్రస్తుతం లక్షన్నరకు పైగా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. అవసరమైనన్ని రాగానే, వాటిలో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలని సీఎం చెప్పారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని, ముందుగా టీచర్లకు పంపిణీ చేసి.. అందులోని కంటెంట్‌పై వారికి అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందిస్తామని.. అందువల్ల ట్యాబ్‌లు పొందిన 8వ తరగతి విద్యార్థులే కాకుండా మిగతా తరగతుల్లోని విద్యార్థులందరికీ ఈ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అధికారులు వివరించారు. ఆ విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకొనేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ‘బైజూస్ కంటెంట్‌లోని అంశాలను పాఠ్య పుస్తకాల్లో కూడా పొందు పరచాలి. డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చయ్యే కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందిసున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేయడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని సీఎం అన్నారు. ‘విద్యాకానుక’లో ఏ లోటూ ఉండకూడదు ‘నాడు – నేడుకు సంబంధించి ఆడిట్లో గుర్తించిన అంశాలన్నింపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి. నాడు–నేడు కింద తొలి దశలో పనులు పూర్తి అయిన చోట్ల తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. జగనన్న విద్యా కానుకకు సంబంధించి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును అవసరమైన మేరకు పెంచండి. ప్రస్తుతం జతకు ఇస్తున్న కుట్టు కూలి రూ.40ని ఇకపై రూ.50కి పెంచుతున్నాం. స్కూలు బ్యాగు విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి. వచ్చే ఏడాది నుంచి 1–6 తరగతుల వరకు మీడియం సైజు, 6–10 తరగతుల వారికి పెద్ద బ్యాగు ఇవ్వాలి. షూ సైజులు ఇప్పుడే తీసుకుని, ఆ మేరకు వాటిని నిర్ణీత సమయంలోగా తెప్పించాలి. ఎట్టిపరిస్థితిలో స్కూళ్లు తెరిచే నాటికే విద్యాకానుకను అందించాలి. పీపీ–1, 2 పూర్తి చేసుకున్న అంగన్వాడీ పిల్లలను తప్పకుండా స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. నాణ్యత పరిశీలనకు థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కూళ్ల నిర్వహణ మరింత మెరుగవ్వడం కోసం మండల విద్యా శాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామని, దీని వల్ల పర్యవేక్షణ మెరుగై మంచి ఫలితాలు వస్తాయని సీఎం తెలిపారు. సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామని అధికారులు వివరించారు. అక్టోబర్ 17 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ‘జగనన్న గోరుముద్దకు సంబంధించి నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలి. కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 14417 నంబర్‌ను అన్ని స్కూళ్లలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి’ అని సీఎం ఆదేశించారు. నాడు–నేడు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.1,120 కోట్లు విడుదల అయ్యాయని, పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాకానుక టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఏప్రిల్ నాటికే కిట్లను సిద్ధం చేయనున్నామని, నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు సీఎంకు నివేదించారు. ఈ సమీక్షలో సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, విద్యా శాఖ సలహాదారు ఏ మురళి, నాడు–నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరరెడ్డి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది. జగనన్న విద్యా కానుక వస్తువులకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అక్కడక్కడ తలెత్తిన చిన్న చిన్న లోపాలు కూడా భవిష్యత్తులో ఉండకుండా చూసుకోవాలని నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ మరింత నాణ్యమైన వస్తువుల పంపిణీకి ఇప్పటి నుంచే సన్నాహాలు చేపట్టింది. ఏటేటా పెరుగుతున్న నాణ్యత ► గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారం మాత్రమే ఇచ్చేవారు. అదీ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడెనిమిది నెలలు గడిచినా అందేవి కావు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందించేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారంతో పాటు నోట్సులు, వర్కు బుక్కులు, షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులు అందించేలా జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ► రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు అందిస్తున్నారు. దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను పంపిణీ చేయిస్తున్నారు. 2020–21లో 42,34,322 మంది విద్యార్థులకు రూ.648.10 కోట్లతో, 2021–22లో 45,71,051 మందికి రూ.789.21 కోట్లతో, 2022–23లో 4,740,421 మందికి రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుకను అందించారు. మూడేళ్లలో ఈ వస్తువుల కోసం రూ. 2,368.33 కోట్లు వెచ్చించారు. ► అయితే వేలాది స్కూళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం కావడంతో క్షేత్ర స్థాయిలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు తలెత్తడం సహజం. వాటిని ఎప్పటికప్పుడు విద్యా శాఖ అధికారులు పరిష్కరిస్తున్నారు. మౌలికమైన అంశాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటినీ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ► ఇలా ఏటేటా ఈ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తాజాగా వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇకపై మరింత నాణ్యమైన వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపై మార్పులు ఇలా.. ► అన్ని ఊళ్లలో ఒక్కో తరగతిలో ఒకరో ఇద్దరో పిల్లలు లావుగా ఉండొచ్చు. వారికి యూనిఫాం క్లాత్ సరిపోకపోయి ఉండొచ్చు. ఇకపై ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ సరిపడా రీతిలో మూడు జతల యూనిఫారం క్లాత్ ఇచ్చేందుకు చర్యలు. ► కుట్టు కూలీ మరింత పెంచి ఇచ్చే విషయమూ విద్యా శాఖ పరిశీలన చేస్తోంది. ► బ్యాగుల పరిమాణంపై నిపుణుల సూచనల మేరకు మార్పులు చేయిస్తోంది. 1–5 తరగతుల విద్యార్థులకు మీడియం సైజు, 6–10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు అందించనున్నారు. ఈసారి బ్యాగు వెడల్పు పెంచనున్నారు. ► బ్యాగులో నోట్‌బుక్కులు, పాఠ్య పుస్తకాలు అన్నీ పట్టేలా కొత్త టెండర్లో స్పెసిఫికేషన్లు సవరించనున్నారు. ► పిల్లల షూ సైజులను తీసుకొనేందుకు మండల స్థాయిలో ఆయా కంపెనీల ద్వారా షూ మేళాలు నిర్వహించేలా చేయడమో, లేదా కూపన్లు అందించి ఆయా కంపెనీల దుకాణాలలో వాటిని రీడీమ్ చేసుకొని షూలు పొందేలా చేయడమో చేయాలని ప్రతిపాదించారు. ► విద్యా కానుక పంపిణీలో జాప్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేకుండా ఇప్పటి నుంచే విద్యా శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. బడ్జెట్ ఎస్టిమేట్లను త్వరగా పూర్తి చేసి ఆర్థిక అనుమతులు పొందడం, టెండర్ డాక్యుమెంట్లు ఫైనల్ చేయడం, టెండర్లను పిలవడం, కంపెనీల ఎంపిక, వర్కు ఆర్డర్ల జారీ, ఒప్పందాలు చేసుకోవడం వంటివి ఈ ఏడాది నవంబర్ చివరికల్లా ముగించాలని భావిస్తున్నారు. ► వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారానికి జిల్లా.. మండల స్థాయికి ఆయా వస్తువులను చేర్చడం. ఏప్రిల్ 15 నాటికి కిట్ల రూపంలో వాటిని సిద్ధం చేయడం. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేయించడం. వచ్చే ఏడాది విద్యా కానుక అమలు కోసం రూ.958.34 కోట్లు అవసరమవుతాయని విద్మాయ శాఖ అంచనా వేసింది. తిరుపతికి చెందిన వంశీ అనే విద్యార్థి ఇప్పుడు ఆరవ తరగతి చదువుతున్నాడు. ఒబేసిటీ కారణంగా ఈ విద్యార్థిలావుగా ఉంటాడు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన యూనిఫారంతో మూడు జతల డ్రస్ కుట్టించడం వీలు పడలేదు. రెండు జతలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉండొచ్చు. ఇలా ఒకరిద్దరికి క్లాత్ సరిపోనంత మాత్రాన.. అందరికీ సరిపోలేదని ప్రచారం చేసే ప్రబుద్ధులున్నారు. అందువల్ల ఇకపై ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఏపీ నాడు–నేడు స్కూళ్లలో.. నిరంతర పరిశీలన
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు ద్వారా పనులు పూర్తైన పాఠశాలల్లో నిరంతరం ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలని, అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు. నెలకు ఒకసారి తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ను వినియోగించుకుని నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియ చేసేందుకు వీలుగా ఏర్పాటైన టోల్‌ఫ్రీ నంబర్‌ను అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తూ పాఠశాలల్లో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల విద్య, నాడు–నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌ల పంపిణీ, తరగతి గదుల డిజిటలైజేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాకానుక కింద పిల్లలకు ఇచ్చే బ్యాగుల నాణ్యతను ఈ సందర్భంగా సీఎం స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందచేసే బ్యాగులు మరింత నాణ్యంగా, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు – నేడు కింద పనులు పూర్తైన స్కూళ్లలో ఆడిట్‌కు సంబంధించిన వివరాలను అధికారులు అందచేశారు. స్కూళ్లలో సౌకర్యాలకు సంబంధించి గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. స్కూళ్లలో నాడు–నేడు పనులు, ట్యాబ్‌ల పంపిణీపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ తల్లిదండ్రుల కమిటీలు క్రియాశీలకం స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలను నిరంతరం క్రియాశీలకం చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎంఈవోలకు అకడమిక్, స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు మండల విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈవో) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాల బాధ్యతలను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములు కానున్నారు. వెల్ఫేర్–ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ప్రతివారం స్కూళ్లను సందర్శించనున్నారు. నెలకు ఒకసారి ఏఎన్ఎంలు సందర్శించనున్నారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా సచివాలయ సిబ్బంది అప్లోడ్ చేయనున్నారు. అధికారులు వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్దిష్టంగా ఎస్‌వోపీలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విలేజ్ క్లినిక్ పరిధిలోకి పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తేవాలని సూచించినట్లు ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్స్ పంపే నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అంటువ్యాధులు, రోగాలను చాలావరకు నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. 5,18,740 ట్యాబ్‌ల కొనుగోలు టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వీరి కోసం 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ట్యాబ్‌ల్లో 8వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇవ్వనున్నారు. ఏటా స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. యూనిఫామ్స్ కుట్టు కూలీ డబ్బులను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. మార్చికి తొలి దశ తరగతి గదుల డిజిటలైజేషన్ తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను సమకూర్చటంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 72,481 స్మార్ట్ టీవీ యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.512 కోట్లకుపైగా వ్యయం కానుందని అంచనా. మనబడి నాడు – నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో వచ్చే ఏడాది మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్దేశించారు. అందుకు అనుగుణంగా నవంబర్‌లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అన్ని చోట్లా ఇంటర్నెట్ అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలతో సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్‌లో కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్
సాక్షి, అమరావతి: విద్యా పరంగా ప్రపంచంతో పోటీ పడేలా మన పిల్లలను తీర్చిదిద్దాలనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం, చిత్తశుద్ధి, ఆశయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే పిల్లలు సీబీఎస్ఈ బోర్డు (పదో తరగతి) పరీక్షలు సమర్థవంతంగా రాసేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతోంది. టెక్నాలజీ ఆధారిత నాణ్యమైన విద్య అందించేంబదుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే 4.72 లక్షల మంది పిల్లలకు రూ.606.18 కోట్ల వ్యయంతో, 8వ తరగతి పాఠాలు చెప్పే 50,194 మంది టీచర్లకు రూ.64.46 కోట్లతో ప్రముఖ కంపెనీ శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా అతి పెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఉచితంగా కంటెంట్‌ను ఇవ్వనుంది. రివర్స్ టెండరింగ్‌తో మార్కెట్ ధర కంటే తక్కువ ► జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 తర్వాత 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను అత్యంత పారదర్శకంగా, రివర్స్ టెండరింగ్ ద్వారా బయట మార్కెట్ కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. ► మెమొరీ కార్డుతో సహా మూడేళ్ల వారంటీ వంటి ఫీచర్స్ అన్నీ కలిపితే బయట మార్కెట్లో శ్యామ్‌సంగ్ ఒక్కో ట్యాబ్ ఖరీదు రూ.16,446 చొప్పున.. 5.22 లక్షల ట్యాబ్‌లకు రూ.858.48 కోట్ల వ్యయం అవుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా వ్యవహరించడంతో ఒక్కో ట్యాబ్‌ను రూ.12,843 చొప్పున 5.22 లక్షల ట్యాబ్‌లను రూ.670.64 కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన రూ.187.84 కోట్లు ఆదా చేసింది. ► 5.22 లక్షల మంది 8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.1,923.20 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్‌ను, శ్యామ్‌సంగ్ ట్యాబ్‌లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి, టీచర్‌కు రూ.24 వేల విలువైన బైజూస్ కంటెంట్, రూ.12,843 ట్యాబ్ కలిపి మొత్తం రూ.36,843 విలువైన మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తోంది. ట్యాబ్‌ల ప్రత్యేకతలు ఇవీ.. ► ట్యాబ్‌లు, బ్యాటరీకి మూడేళ్ల వారంటీ (సాధారణంగా ఏడాది మాత్రమే) ఉంటుంది. ► మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం), ఓటీజీ కేబుల్, ఫ్లిప్ కవర్‌తో 8.7 అంగుళాలు ఉంటుంది. ► పిల్లలు చూడకూడని సైట్లు బ్లాక్ చేసే సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో లోడ్ చేసి ఇస్తారు. తద్వారా పిల్లలు అవాంఛనీయ సైట్ల జోలికి వెళ్లే అవకాశం ఏ కోశానా ఉండదు. ► కంటెంట్ డేటా కార్డుతో పాటు 64 జీబీ మెమొరీ కార్డు. ► ఏటా పదవ తరగతి వరకు విద్యార్థులకు ఇదే ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఇస్తారు. ► ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్, బైజూస్ కంటెంట్ ఇస్తారు. ► ఏదైనా రిపేరు వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారంలోగా సరిచేసి లేదా రీప్లేస్ చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్ చేయనున్నారు. ► విజువల్ గ్రాఫిక్స్‌తో కూడిన కంటెంట్‌ను ట్యాబ్‌లో అప్లోడ్ చేయడంతో పిల్లలు సులభంగా అర్థం చేసుకోనున్నారు. బైజూస్‌తో ఒప్పందంలో ముఖ్యాంశాలు ► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. బైజూస్‌తో ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందుతుంది. ► 2025 నాటికి పదో తరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాసేందుకు వీలుగా వారిని సన్నద్ధం చేసేందుకు ఈ యాప్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్ లెర్నింగ్ యాప్ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. ► బైజూస్ లెర్నింగ్ యాప్‌లో బోధన అత్యంత నాణ్యతగా ఉంటుంది. యానిమేషన్, బొమ్మలు, గ్రాఫ్స్ ద్వారా విద్యార్థులు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ► మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్, అటు తెలుగు మాధ్యమంలోనూ అందుబాటులో ఉంటాయి. తద్వారా భాషా పరమైన ఆటంకాలు లేకుండా పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు ఉపయోగ పడుతుంది. ► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టత, నాణ్యతతో ఉంటాయి. ► విద్యార్థులు ఎంత వరకు నేర్చకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్ బ్యాక్ పంపుతారు. ► సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా మ్యాపింగ్ చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికను అనుసరించి ప్రతి సబ్జెక్టులో.. ప్రతి అధ్యాయంలోనూ వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటరాక్టివ్ గేమ్స్ కూడా యాప్‌లో ఉంటాయి. ► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, అనుకరణ.. అన్నీ యాప్‌లో పొందుపరిచారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్ స్కాన్ క్వశ్చన్స్ (లైవ్ చాట్ పద్ధతిలో నేరుగా), స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ► తరచూ సాధన చేయడానికి వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులోకి వస్తాయి. ► విద్యార్థి నేర్చుకున్న అంశాలపై నెలవారీగా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తారు. ఆన్లైన్లో ఉపాధ్యాయుడితో మీటింగ్ కూడా ఉంటుంది. -
జగనన్న విద్యా కానుక: ఆలస్యానికి ఇక తావుండదు
సాక్షి, అమరావతి: కార్పొరేట్ స్కూళ్ల పిల్లలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వనరులు కల్పించడంలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ (జేవీకే) కిట్ల పంపిణీలో ఆలస్యానికి తావు లేకుండా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు ఆయా వస్తువులు అందేలా ఏడాది ముందు నుంచే కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఏటా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పాఠశాలలు జూన్ రెండో వారంలో ప్రారంభం కానున్నందున మొదటి వారానికే పిల్లలకు ఈ కిట్లు అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. కరోనా పరిస్థితుల్లో రెండేళ్లుగా అకడమిక్ సంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. జేవీకే కిట్ల పంపిణీపై కూడా దాని ప్రభావం కొద్దిగా పడుతూ వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా కానుక కిట్లలోని వస్తువులను కాంట్రాక్టు కంపెనీలు వాటిని సకాలంలో సరఫరా చేయలేక పోవడంతో పంపిణీ కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లలోని వస్తువులపై ప్రభుత్వం ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ చేపట్టింది. ఇందుకు సమగ్ర క్యాలెండర్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల మూడో వారం నుంచే చర్యలు ప్రారంభించనుంది. పెరుగుతున్న చేరికలతో బడ్జెట్ పెంపు ► ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలు ఏటేటా పెరుగుతుండడంతో జగనన్న విద్యా కానుక కోసం వెచ్చించే మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచుతోంది. చదువులకు అవసరమైన అత్యంత నాణ్యమైన వస్తువులు ఇవ్వడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టినందున అదనంగా డిక్షనరీలను అందించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. ► ప్రభుత్వం 2020–21లో 42,34,322 మంది విద్యార్థుల కోసం రూ.648.10 కోట్లు, 2021–22లో 45,71,051 మంది కోసం రూ.789.21 కోట్లు వెచ్చించింది. 2022–23 విద్యా సంవత్సరానికి 47,40,421 మందికి లబ్ధి చేకూరేలా రూ.931.02 కోట్లతో జగనన్న విద్యా కానుక వస్తువుల సరఫరా చేపట్టింది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు వెచ్చించింది. ► విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా.. జగనన్న విద్యా కానుక కింద బడులు తెరిచిన తొలి రోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ (కుట్టు కూలి సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్ (తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉండే) పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన సచిత్ర డిక్షనరీలను, 6–10 తరగతుల వారికి ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను ఇస్తున్నారు. ఈ డిక్షనరీలను ఆ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన వారితో పాటు గతంలో అందుకోని వారికి మాత్రమే ఇస్తారు. ► గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు.. కనీసం పాఠ్య పుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ సీఎం జగన్ పాఠశాలలు తెరిచే నాటికే జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ► వస్తువుల నాణ్యతలో రాజీ పడకుండా బ్రాండెడ్ వస్తువులనే పంపిణీ చేయించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా వస్తువులను, వాటి నాణ్యతను ముందుగా తానే స్వయంగా పరిశీలిస్తుండడం విశేషం. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. ఈ ఏడాది అందరికీ ఒకే రకమైన బ్యాగులను అందించారు. జనరల్ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్ పేజీలతో నోట్‌బుక్స్‌ను ఇచ్చారు. యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీ పడలేదు. -
CM YS Jagan: పేదరికానికి విద్యతోనే వైద్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ ఇంగ్లిష్ మీడియంలో చదివి ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయట పడుతుందని, ఇందుకోసమే 9 రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మన బడి నాడు–నేడు, విద్యాకానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేయడంతోపాటు 9వ పథకంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నామని, అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక ద్వారా పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు ఉచితంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది 47 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.1,964 విలువ చేసే కిట్‌ను దాదాపు రూ.931 కోట్లు వెచ్చించి ప్రభుత్వం అందచేస్తోంది. ఈ సందర్భంగా ఆదోనిలో ‘నాడు–నేడు’ ద్వారా రూపురేఖలు మారిన నెహ్రూ మెమోరియల్ పాఠశాలను సీఎం జగన్ వీక్షించారు. తరగతి గదులలో విద్యార్థులతో పాటు బల్లపై కూర్చుని ఆప్యాయంగా ముచ్చటించారు. నేరుగా వెళ్లి పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాగునీటిని స్వయంగా తాగి చూశారు. పుస్తకాలు, యూనిఫాంతో పాటు విద్యాకానుక కిట్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థులు, తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. ఆదోనిలో జరిగిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ప్రజలు రేపటి తరం భవిష్యత్ కోసం.. పిల్లలను బడికి పంపే తల్లులకు మూడేళ్లుగా జగనన్న అమ్మఒడి అమలు చేస్తున్నాం. ఉద్యమంలా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. బడికి వెళుతున్న పిల్లలకు కనీసం పౌష్టికాహారం అందించాలని కూడా గత పాలకులు ఆలోచించలేదు. ఎదిగే చిన్నారులకు అది ఎంత అవసరమో ఆలోచించి ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో రుచికరంగా రోజుకో మెనూ తీసుకొచ్చాం. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. మంచి చదువుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాం. శ్రీమంతుల పిల్లలు రూ.24 వేలు చెల్లించే బైజూస్‌ను మన పిల్లల కోసం తీసుకొచ్చాం. రేపటి తరం భవిష్యత్‌పై దృష్టి సారించిన ఏకైక ప్రభుత్వం మనది. రాబోయే 10–15 ఏళ్లలో ఎలాంటి పోటీ ఉంటుంది? అని ఆలోచించి పోటీ ప్రపంచంలో నెగ్గేలా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన పేదలందరికీ నవరత్నాల ద్వారా మంచి చేస్తున్నాం. రేపటి తరం పేదరికం నుంచి బయటపడేలా పిల్లలు బాగా చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. నాణ్యమైన విద్యా బోధనతో తలరాతలు మార్చేలా అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగానే జగనన్న విద్యాకానుకకు శ్రీకారం చుట్టాం. వరుసగా మూడో ఏడాది పిల్లలు బడిలోకి అడుగుపెట్టే రోజే ‘విద్యాకానుక’ చేతిలో పెడుతున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 1–10 తరగతుల పిల్లలకు జగనన్న విద్యాకానుక కిట్లు అందిస్తున్నాం. ఇంటి నుంచి బడికి వెళ్లేందుకు, అక్కడ బాగా చదువుకునేందుకు కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తున్నాం. విద్యాకానుక కిట్‌లో ప్రతి విద్యార్థికి కుట్టుకూలీతో సహా 3 జతల యూనిఫాం, నాణ్యమైన స్కూల్ బ్యాగు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్ బుక్స్, రెండు జతల సాక్స్‌లు, బూట్ల ఇస్తున్నాం. వీటితో పాటు గతేడాది ఇచ్చిన డిక్షనరీలు పోగొట్టుకున్నవారికి, కొత్తగా చేరేవారికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందచేస్తున్నాం. పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చు చేయలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు. విద్యార్థులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఫలితాలు సాధించాలని.. ఏటా విద్యార్థుల సంఖ్యతో పాటు విద్యాకానుకపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతోంది. అయినా సరే ఎక్కడా కూడా మీ జగన్.. మీ మేనమామ వెనుకడుగు వేయలేదు. విద్యాకానుక తొలిఏడాది 2020–21లో ఒక్కో కిట్ సగటున రూ.1,531 చొప్పున 42,34,322 మంది పిల్లలకు ఇచ్చేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశాం. 2021–22లో ఒక్కో కిట్‌కు రూ.1,726 చొప్పున ఖర్చు చేసి 45,71,051 మంది పిల్లలకు రూ.790 కోట్ల వ్యయంతో అందించాం. ఈ ఏడాది ఒక్కో కిట్ రూ.1,964 చొప్పున 47 లక్షల మంది పిల్లలకు ఇచ్చేందుకు రూ.931 కోట్లు వెచ్చించాం. గతేడాది కంటే ఎక్కువ మంది పిల్లలు బడుల్లో చేరతారని మరిన్ని కిట్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే కాదు.. పిల్లల జీవితాలను మెరుగుపరిచేందుకు మరో అడుగు ముందుకేశాం. 8 తరగతిలోకి అడుగు పెట్టే 4.70 లక్షల మంది విద్యార్థులకు సెప్టెంబర్‌లో ట్యాబ్‌లను అందించబోతున్నాం. ఒక్కో ట్యాబ్ విలువ రూ.12 వేలు ఉంటుంది. పిల్లల చక్కటి భవిష్యత్ కోసం ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. బైజూస్ ద్వారా విద్యా బోధన సులభంగా జరిగేలా ట్యాబ్‌లతో అనుసంధానిస్తాం. 2025 మార్చిలో సీబీఎస్ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. మూడేళ్లలో పెను మార్పులతో.. చంద్రబాబునాయుడు హయాంలో 2018–19లో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతి వరకు చదివే విద్యార్థులు 37,010 లక్షల మంది ఉండగా 2021–22లో ఏకంగా 44.30 లక్షలకు పెరిగారు. అంటే అదనంగా 7.20 లక్షల మంది పెరిగారు. వీరంతా ప్రైవేట్ స్కూళ్లు మానేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులే దీనికి కారణం. 44 లక్షల మంది తల్లులకు, తద్వారా 80 లక్షల మంది పిల్లలకు మేలు చేసేలా రూ.19,617 కోట్లు ఒక్క అమ్మఒడి పథకానికే ఖర్చు చేశాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పెద్ద చదువులు ప్రతీ పిల్లాడికి అందాలని 21,55,298 మందికి మేలు చేస్తూ రూ.7,700 కోట్లు ఇచ్చాం. చదువులతో పాటు భోజనాలు, హాస్టల్ కోసం ఇబ్బంది పడకూడదని ఇంజనీరింగ్, మెడిసిన్ చదివేవారికి రూ.20 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, ఐటీఐ చదివేవారికి రూ.10 వేలు చొప్పున ‘వసతి దీవెన’ ద్వారా రూ.3,329 కోట్లు అందచేశాం. గోరుముద్ద ద్వారా ఏటా రూ.1,850 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో మధ్యాహ్న భోజన పథకానికి రూ.500 కోట్లు కూడా సరిగా ఖర్చు చేయలేదు. 8–9 నెలల పాటు సరుకులు ఇవ్వకుండా, ఆయాలకు బకాయిలు పెట్టారు. అంగన్వాడీలలో గర్భిణిలు, బాలింతలు, ఆరేళ్ల పిల్లలకు పోషకాహారం కోసం చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా రూ.1,950 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇక ఈ ఏడాది బైజూస్‌తో ఒప్పందం చేసుకుని ట్యాబ్‌ల కోసం అదనంగా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పాఠశాలల్లో టాయిలెట్లపై ప్రత్యేకంగా ధ్యాసపెట్టడమే కాకుండా చిట్టి చెల్లెమ్మలకు ఇబ్బంది రాకూడదని నెలకు 10 న్యాప్కిన్స్ ‘స్వేచ్ఛ’ పథకం ద్వారా ఉచితంగా అందచేస్తున్నాం. పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, అధికారులు ఆదోనిపై వరాల జల్లు ఆదోని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ పలు వరాలు ప్రకటించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరుతోపాటు ఆటోనగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు మంజూరు చేశారు. ఆదోని పట్టణంలో రోడ్ల విస్తరణకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను ఎస్సీ కమిషన్‌కు పంపామని, కేంద్ర ప్రభుత్వానికి కూడా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బోయల రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తాగునీటి కోసం గ్రామాల్లో సర్వే చేయించి నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ, కార్మికశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాగు ధరించి.. ఆదోనిలో జగనన్న విద్యాకానుక పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపు స్కూలు విద్యార్థి అయ్యారు. కిట్లు పంపిణీ సమయంలో తాను కూడా స్కూలు బ్యాగు భుజాన ధరించి విద్యార్థులతో సరదాగా గడిపారు. అనంతరం విద్యార్థుల భుజాలకు స్వయంగా బ్యాగులు అమర్చి అభినందించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మీ మేనమామ సంకల్పం ‘‘విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం. మన రాష్ట్రంలో బడి మానేసే పిల్లలు తగ్గాలి. చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలి. పిల్లలను బడికి పంపించి పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. ఈతరం, రాబోయే తరం పేదరికం సంకెళ్లను తెంచుకోవాలి. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. మంచి చదువులు, పెద్ద చదువులు, ఇంగ్లిషు మీడియం చదువులు పేదింటి పిల్లలకు అందాలి. అప్పుడే ప్రతి ఇంట్లో ఆనందాన్ని, అభివృద్ధిని చూస్తాం. ఇంగ్లిషు మీడియం చదువుతోనే పేదరికాన్ని జయిస్తాం. పిల్లలు, వారి చదువులు, భవిష్యత్తు బాగుండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నా. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువే. ఇది నా సంకల్పం. మీ మేనమామ సంకల్పం’’ -
మూడో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం (ఫోటోలు)
-
పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసింది. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయంచేస్తోంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. 'దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్ యాప్‌నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యాకానుక పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్ విలువ రూ.2వేలు. విద్యార్థుల ఖర్చు గురించి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 8వ తరగతిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ట్యాబ్. రూ.12వేల విలువైన ట్యాబ్ విద్యార్థులకు ఇస్తున్నాం. 2020-21లో విద్యాకానుకకు రూ.648 కోట్లు ఖర్చు చేశాం. 42.34 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2021-22లో విద్యాకానుకకు రూ.789 కోట్లు ఖర్చు చేశాం. 45.71లక్షల మందికి లబ్ధి చేకూరింది. మూడో ఏడాదిలో విద్యాకానుకకు రూ.931 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 47.40 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే.. విద్యాకానుకలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే.. బడిమానేసే పిల్లలు తగ్గాలి. పిల్లల్ని బడికిపంపేలా, పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. అప్పుడు ప్రతి ఇంట్లో ఆనందం చూడగలుగుతాం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి. ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 7లక్షల మందికి పైగా చేరారు. విద్యారంగంలో 9 ప్రధాన పథకాలను అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ అన్నారు. ఆదోనికి వరాల జల్లు స్థానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడిగిన మేరకు ఆదోనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికనుంచే ప్రకటించారు. అకడమిక్ కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. -
బడికి పోదాం చలో చలో.. (ఫోటోలు)
-
ఆరంచెల నూతన విధానంలో స్కూళ్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. 2022–23 విద్యా సంవత్సరపు బోధనాభ్యసన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో సమగ్రంగా కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. ఏ రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలో అందులో పొందుపరిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్టూడెంట్ కిట్ల పంపిణీ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ. 931.02 కోట్లతో ఈ కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులందరికీ అందిస్తారు. ప్రభుత్వం స్కూళ్లను ఆరంచెల నూతన జాతీయ విద్యా విధానం కింద మార్పులు చేసింది. నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పునాది విద్యను బలోపేతం చేసేందుకు పీపీ1, పీపీ2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్ ప్లస్‌గా ఈ స్కూళ్లు ఉంటాయి. ఇప్పటివరకు విలీన ప్రక్రియ పూర్తయిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు కూడా జారీచేసింది. ఈ సంవత్సరంలో 220 రోజుల పాటు స్కూళ్లు పనిచేస్తాయి. పాఠశాలలల ప్రారంభానికి జూన్ 28వ తేదీ నుంచే స్కూల్ రెడీనెస్ కార్యక్రమాన్ని విద్యా శాఖ చేపట్టింది. ప్రతి పాఠశాలను శుభ్రం చేయించడం, మంచినీటి సదుపాయం ఏర్పాటుతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోకి రప్పించేలా గ్రామ సందర్శన కార్యక్రమాలను కూడా నిర్వహించింది. ప్రభుత్వం విద్యా పరంగా అమలుచేస్తున్న కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను బడుల్లో చేర్చేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది బడి ఈడు పిల్లలెవరూ బడి బయట ఉండకుండా 100 శాతం చేరికలు ఉండేలా కార్యాచరణ చేపట్టింది. -
Jagananna Vidya Kanuka: రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది. విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్ ఏటా విద్యారంగానికి బడ్జెట్లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారు. విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా.. జగనన్న విద్యాకానుక కింద బడులు తెరిచిన తొలిరోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్ (తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉండే) పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. గతంలో అందుకోని వారు, ప్రస్తుతం కొత్తగా చేరిన వారికి మాత్రమే ఈ డిక్షనరీలను ఇస్తారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు కిట్లను అందజేస్తారు. మూడేళ్లలో జేవీకే కింద రూ.2,368.33 కోట్లు వ్యయం జగనన్న విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రూ.931.02 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.రెండువేలు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు తెలిసినవే. వీటన్నింటి ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు ఏటా పెరుగుతున్నాయి. పలుచోట్ల ‘సీట్లు లేవు’ అన్న బోర్డులు పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ సీఎం జగన్ పాఠశాలలు తెరిచిన రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్ అందిస్తున్నారు. విద్యాకానుకలో నాణ్యతకు పెద్దపీట వస్తువుల నాణ్యతలో రాజీలేకుండా బ్రాండెడ్ వస్తువులనే పంపిణీ చేయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా వస్తువులను, నాణ్యతను ముందుగా తాను స్వయంగా పరిశీలిస్తున్నారు. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. కానీ, ఈసారి అందరికీ ఒకేరకమైన బ్యాగులను అందిస్తున్నారు. అంతేకాక.. జనరల్ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్ పేజీలతో నోట్‌బుక్స్‌ను అందిస్తున్నారు. యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా అందిస్తోంది. ఈ విద్యాకానుక వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలుంటే 9908696785 నెంబర్‌కు పనివేళల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే, cmo.apsamagrashiksha@gmail.com లేదా spdapssapeshi@gmail.comకు తెలియచేయాలన్నారు. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలనూ జారీచేశారు. కార్యక్రమంలో ఆదోని శాసన సభ్యులు సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పాదయాత్రంలో ప్రజల కష్టాలను జగన్ చూశారు. ఇచ్చిన హామీలన్నింటిని సీఎం జగన్ నెరవేర్చారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. నాడు-నేడు కింద సీఎం జగన్ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ►విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడతూ.. వరుసగా మూడో విడత విద్యాకానుకను అందిస్తున్నాం. 47 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుకను ఇస్తున్నాం. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు. అక్టోబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ►ఆదోనిలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్ యాప్‌నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్ విలువ రూ.2వేలు అని సీఎం జగన్ అన్నారు. ఆదోనికి సీఎం జగన్ వరాల జల్లు స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడిగిన మేరకు ఆదోనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేశారు. ఆటోనగర్, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికనుంచే ప్రకటించారు. అకడమిక్ కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగనన్న విద్యాకానుక: తొలిరోజు నుంచే పంపిణీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి(మంగళవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి నాడు నేడు కింద రూ. వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. విద్యపై పెట్టే వ్యయం విద్యార్ధుల భవిష్యత్‌కు పెట్టుబడి అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ ఏటా విద్యారంగానికి బడ్జెట్లో వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక క్రింద అందజేసే వస్తువులు. 1. ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టుకూలితో సహా, 2. ఒక జతల బూట్లు, 3. రెండు జతల సాక్సులు, 4. బెల్టు, 5. స్కూలు బ్యాగు, 6. బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, 7. నోట్‌బుక్స్. 8. వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లాంఛనంగా మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగనుంది. ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి. 2020 –21 విద్యా సంవత్సరంలో 42,34,322 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 648.10 కోట్లు. 2021 –22 విద్యా సంవత్సరంలో 45,71,051 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 789.21 కోట్లు. 2022 –23 విద్యా సంవత్సరంలో 47,40,421 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. దానికి అయిన వ్యయం రూ. 931.02 కోట్లు. ఇదంతా కలిపి ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక చర్యల వల్ల 2018 – 19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 7 లక్షలుకు పైగా పెరిగి 2021 – 22 నాటికి 44.30 లక్షలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రేవేట్ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరింది. గత ప్రభుత్వంలో స్కూల్స్ తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్ధితి ఉండేది. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్ధితిని సమూలంగా మారుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తున్నారు. కట్టుబాట్ల నుండి స్వేచ్ఛలోకి.. బాలికల డ్రాపౌట్ రేట్‌ను తగ్గించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికి పైగా విద్యార్ధినులకు స్వేచ్ఛ ద్వారా ఏటా రూ. 32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మన బడి నాడు – నేడు ద్వారా విద్యాసంస్ధల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టిన ప్రభుత్వం. అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతున్నది? విద్యారంగంలో సంస్కరణలపై ప్రభుత్వం 36 నెలల్లో చేసిన వ్యయం వివరాలు.. - జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య 44,48,865 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 19,617.53 కోట్లు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకమే లేదు. - జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల సంఖ్య 21,55,298 లక్షలు, జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య 18,77,863 లక్షలకు గాను, రెండింటికీ కలిపి అందించిన మొత్తం రూ. 11,007.17 కోట్లు. గత ప్రభుత్వంలో ఇచ్చినవే అరకొర ఫీజులు, అవీ ఏళ్ళ తరబడి పెండింగ్‌లు, గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. - జగనన్న విద్యా కానుక లబ్ధిదారుల సంఖ్య 47,40,421 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 2,368.33 కోట్లు. గత ప్రభుత్వంలో స్కూల్స్ తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్ధితి, ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. - జగనన్న గోరుముద్ద లబ్ధిదారుల సంఖ్య 43,26,782 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 3,087.50 కోట్లు. గతంలో నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచీపచీ లేని కూరలు, ఆయాల జీతాలు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్నాయి. - పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూళ్ళకి అందించిన మొత్తం రూ. 3,669.00 కోట్లు, రెండోదశలో 22,344 స్కూళ్ళకి అందించిన మొత్తం రూ. 8,000.00 కోట్లు. మూడు దశల్లో రూ. 16,450 కోట్ల వ్యయంతో మొత్తం 56,572 స్కూల్స్‌లో అభివృద్ది పనులు. గతంలో శిధిలావస్ధలో బడులు, సౌకర్యాల లేమి. - వైఎస్సార్ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 34,19,875 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 4,895.45 కోట్లు. గతంలో నామమాత్రంగా పౌష్టికాహారం, అదీ కొందరికే పరిమితం - స్వేచ్ఛ (శానిటరీ న్యాప్కిన్స్) లబ్ధిదారుల సంఖ్య 10.01,860 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 32 కోట్లు. గత ప్రభుత్వంలో లేదు. -
CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్
కర్నూలు: ‘విద్యా కానుక’ కిట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేదీన ఆదోనికి రానున్నారు. ఇందు కోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదోనికి రావడం ఎంతో శుభసూచికమన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారని, పిల్లలకు అవసరమైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లను చేయాలన్నారు. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) నేడు విద్యాశాఖ కార్యదర్శి రాక కర్నూలు సిటీ: పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదోని రానుండడంతో ఏర్పాట్లపై సమీక్షించేందుకు విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం జిల్లాకు రానున్నారు. ఈయన వెంట పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ కూడా ఉంటారు. మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మంత్రి గుమ్మనూరు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు, అధికారులు హెలిప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల మైదానం మొత్తం కలియతిరిగారు. జిల్లా అధికారులకు తలసి రఘురామ్ పలు సూచనలు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ్, డీఈఓ రంగారెడ్డి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, పత్తికొండ ఆర్డీఓ మోహన్‌దాసు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, విద్యుత్‌శాఖ ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ కుమారి పాల్గొన్నారు. -
AP: జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి పునః ప్రారంభంకాను న్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రధాని మోదీ జూలై 4న రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొంటున్నందున పాఠశాలల పునః ప్రారంభాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుకను సీఎం విద్యార్థులకు అందించనున్నారని, అందుకను గుణంగా స్కూళ్లను 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. (క్లిక్: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి) -
జనమే సాక్షి - జగనన్న పథకాలు.. మా జీవితాల్లో వెలుగులు
-
10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్
-
జగనన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే..
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక పథకం కింద స్కూల్ బ్యాగుల పంపిణీ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలన్నీ సరైనవేనని హైకోర్టు ప్రకటించింది. టెండర్ నిబంధనల రూపకల్పన, కాంట్రాక్టు అప్పగింత పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగంతో కూడుకున్నప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది. కాంట్రాక్టు వ్యవహారాల్లో ప్రభుత్వ చర్యలు నిష్పాక్షికంగా, సహేతుకంగా ఉన్నప్పుడు అందులో న్యాయస్థానాల జోక్యం చాలా పరిమితమని తేల్చి చెప్పింది. కాంట్రాక్టులో నిర్దేశించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సమర్థత, వనరుల కల్పన నిమిత్తమే ప్రీ–కండీషన్లు, అర్హతల నిర్ణయం జరుగుతుందని తెలిపింది. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! కాంట్రాక్టు అప్పగింత వ్యవహారంలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు సహేతుకంగా, నిష్పాక్షికంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహించేందుకు తమకు ప్రాథమిక హక్కు ఉందని చెప్పలేరని స్పష్టం చేసింది. ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన అది టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టెండర్ దాఖలు చేయని వ్యక్తి ఆ టెండర్ నోటిఫికేషన్ చట్టబద్ధత, చెల్లుబాటును ప్రశ్నించలేరని పేర్కొంది. జగనన్న విద్యా కానుక కాంట్రాక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలను చట్ట విరుద్ధమైనవిగా, ఏకపక్షమైనవిగా, అహేతుకమైనవిగా చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ పథకం టెండర్ నిబంధనలను సవాల్ చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం... జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీకి టెండర్లను ఆహ్వానిస్తూ 2021 జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రూ.39 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్‌తోపాటు కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగా ఉండాలని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి అసాధ్యమైన నిబంధనలు లేకుండా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం టెండర్ దక్కించుకున్న కంపెనీ వాదన వినకుండానే సింగిల్ జడ్జి తీర్పునిచ్చారంటూ ఆ తీర్పును రద్దు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అటల్ ప్లాస్టిక్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ దుర్గాప్రసాద్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఆ నిబంధనను ఇప్పుడు ప్రశ్నించలేరు.. పిటిషనర్ అటల్ ప్లాస్టిక్స్ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదని, కేవలం ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో మాత్రమే పాల్గొందని, ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో పాల్గొనడం టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదన్న అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను మొదటి టెండర్ నోటిఫికేషన్లోనే పొందుపరిచారని, పిటిషనర్ అప్పుడు ప్రశ్నించకుండా అన్యాయమంటూ కోర్టును ఆశ్రయించడం సరికాదన్న అదనపు ఏజీ వాదనలో వాస్తవముందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. తయారీదారు 90 రోజుల్లో 45 లక్షల బ్యాగులు సరఫరా చేయడం అంత చిన్న విషయం కాదని, అందుకే ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన సాల్వెన్సీ సర్టిఫికెట్ నిబంధనను పొందుపరిచారని, ఇది ఎంత మాత్రం తప్పు కాదన్నారు. గత మూడేళ్ల వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగా ఉండాలన్న నిబంధన బిడ్డర్ ఆర్థిక పరిస్థితి, సమర్థతను తెలుసుకునేందుకు తెచ్చారని, ఈ నిబంధనను ఏ రకంగానూ తప్పుపట్టడానికి వీల్లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా టెండర్ నిబంధనలను సవాలు చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చదవండి: ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్ మంత్రి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లోనే విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నాడు–నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న ఫౌండేషన్ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల మ్యాపింగ్, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు. -
AP: విద్యార్థులకు ‘పద సంపద’
సాక్షి, అమరావతి:ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పద సంపదను పెంపొందించడం ద్వారా వారిలో భాషా నైపుణ్యాలను సమగ్రంగా అలవర్చేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు ‘లిప్’ (లాంగ్వేజ్ ఇంప్రూవ్‌మెంటు ప్రోగ్రామ్)ను రూపొందించారు. ప్రస్తుతం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలుకానుంది. ఈ జిల్లాల్లో కార్యక్రమం పురోగతి, ఫలితాలు, ఇతర అంశాలను సమీక్షించిన అనంతరం మిగిలిన జిల్లాల్లో అమలుచేయనున్నారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు చాలా రోజులుగా మూతపడి ఉండడంతో బోధనాభ్యసన ప్రక్రియలు నిలిచిపోవడంతో అది విద్యార్థుల సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడింది. గతంలో నేర్చుకున్న అంశాల్లోనూ వెనుకబడ్డారు. ముఖ్యంగా భాషా సామర్థ్యాలు లోపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, నోట్‌బుక్‌లతో పాటు ఈ విద్యా సంవత్సరంలో ఆంగ్లం, తెలుగు డిక్షనరీలను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటి ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి వీలుగా ‘లిప్’ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిరోజూ కొత్త పదాల అభ్యాసం ఈ లిప్ కార్యక్రమం ద్వారా తెలుగు, ఇంగ్లీçషు భాషల్లోని పదాలను విద్యార్థులు అర్థంచేసుకుని నేర్చుకునేందుకు 100 రోజులపాటు సమగ్ర ప్రణాళికతో అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా.. 1, 2, తరగతుల విద్యార్థులు ప్రతిరోజూ రెండేసి కొత్త పదాలను, 3 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు మూడేసి పదాలను (ఆంగ్లం, తెలుగులలో), 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఐదేసి పదాలను (ఆంగ్లం, తెలుగు, హిందీ భాషలలో) రోజూ నేర్చుకునేలా చేస్తారు. ఇలా ప్రణాళిక ముగిసే నాటికి ఆంగ్ల, తెలుగు, హిందీ భాషలలో కలిపి 1, 2 తరగతుల విద్యార్థులు 400 పదాలను, 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు 600 పదాలను, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1,500 పదాలను చదవడం, రాయడం, అర్థంచేసుకోవడం వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందేలా చేస్తారు. లక్ష్యాలు ఇలా.. సరైన ఉచ్ఛారణ.. భాషా దోషాలు లేకుండా రాయడం, చక్కని చేతిరాత నైపుణ్యం.. మూడు భాషలను నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం.. ప్రాథమిక స్థాయి నుంచే భాషా సామర్థ్యాలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యం పెంపొందించుకోవడం.. తద్వారా అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకుని ప్రపంచ పౌరుడిగా ఎదగడం. అమలు ఇలా.. జగనన్న విద్యాకానుక కింద అందించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ.. ప్రాథమిక విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ రూపొందించిన చిత్రాలతో కూడిన డిక్షనరీల నుంచి రోజూ ఈ పదాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. పాఠ్య ప్రణాళికలో భాగంగానే ఆయా భాషోపాధ్యాయులు తమ తరగతి బోధన ప్రారంభించే ముందు ఈ కొత్త పదాలపై విద్యార్థులతో అభ్యాసం చేయిస్తారు. ఈ పదాలను ఒక క్రమపద్ధతిలో నేర్పించడానికి అవసరమైన పదజాల పట్టికను భాషా నిపుణులతో రూపొందించి పంపిణీ చేయిస్తారు. ఇక విద్యార్థులు ఏ మేరకు అవగాహన చేసుకున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి 15 రోజులకోసారి 15 పదాలతో పరీక్షను నిర్వహిస్తారు. వీటి ఆధారంగా విద్యార్థులకు ఏ, బీ, సీ, డీ, ఈ గ్రేడ్లు ఇస్తారు. ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ప్రతి విద్యార్థి ‘ఏ’ గ్రేడ్‌లోకి వచ్చేలా చేస్తారు. అలాగే.. పాఠశాలల వారీగా ప్రతినెలా సమీక్షించి వాటికి స్టార్ రేటింగ్ ఇస్తారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 11,20,862 విద్యార్థులు, టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు ఈ కార్యక్రమం అమలులో భాగస్వాములుగా ఉంటారని ఈ కార్యక్రమం రూపొందించి అమలుచేస్తున్న జోన్–2 రీజినల్ జాయింట్ డైరెక్టర్ డి. మధుసూదనరావు తెలిపారు. -
AP: బడితోనే అమ్మఒడి
సాక్షి, అమరావతి: పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే ‘అమ్మ ఒడి’ పథకం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా తల్లులు, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తెచ్చామని, విద్యాకానుకను కూడా అమలు చేస్తున్నామని, వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15 వేలకుపైగా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి తెలిపారు. అమ్మ ఒడి పథకం స్ఫూర్తి కొనసాగేలా పిల్లలంతా బడి బాట పట్టాలన్నారు. పాఠశాలల నిర్వహణ, విద్యార్ధుల హాజరు, అమ్మ ఒడి, విద్యా కానుక పథకాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విస్త్రృత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్ధులకు ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, రెగ్యులర్ డ్రస్, షూలను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అమ్మ ఒడి పథకానికి విద్యార్ధుల హాజరు అనుసంధానం, సీబీఎస్ఈ అఫిలియేషన్, ఎయిడెడ్ స్కూల్స్, సోషల్ ఆడిట్‌పై సీఎం జగన్ పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. కోవిడ్ వల్లే అమలు కాలేదు.. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75% హాజరు ఉండాలన్న నిబంధన గతంలోనే విధించామని, అయితే కోవిడ్ వల్ల ఇన్నాళ్లూ అమలు చేయలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చెప్పారు. రెండేళ్లుగా కరోనాతో పాఠశాలలు సరిగా పని చేయని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించగా మార్చి చివరి వారంలో కోవిడ్ మొదలైందన్నారు. పథకం అమల్లోకి వచ్చిన 2 – 3 నెలలు తిరగకముందే కోవిడ్ ప్రారంభం కావడంతో స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. తిరిగి 2020 నవంబరు, డిసెంబరులో పాఠశాలలు తెరిచి జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చామని తెలిపారు. అయితే కోవిడ్ రెండో వేవ్ రావడంతో పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 75 % హాజరు.. జూన్‌లోనే అమ్మ ఒడి, కానుక 2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి విద్యార్ధులహాజరును అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలను చదువుల బాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలనే 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం (2021–22)లో 75 శాతం హాజరు నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సాధారణంగా స్కూళ్లు జూన్‌లో ప్రారంభమై ఏప్రిల్ వరకూ కొనసాగుతాయి కాబట్టి విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్నారు. హాజరును పరిగణలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సూచించారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలని, దీనిపై మ్యాపింగ్ చేసి ప్లే గ్రౌండ్స్ లేని చోట భూ సేకరణ చేసి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలక్రమేణా ప్రీ హైస్కూల్ స్థాయి వరకూ ప్లే గ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ నాటికి విద్యా కానుక వర్క్ ఆర్డర్ డిసెంబర్ నాటికి విద్యా కానుక వర్క్ ఆర్డర్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ప్రతీ స్కూల్ నిర్వహణకు రూ.లక్ష ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.లక్షను వారికి అందుబాటులో ఉంచాలని, దీనివల్ల మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందని, ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ మార్పులు తెచ్చినా టీచర్లతో మాట్లాడాలి స్కూళ్ల పనితీరుపై సోషల్ ఆడిట్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదించగా ఇలాంటి ఏ మార్పులు ప్రవేశపెట్టినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని సీఎం స్పష్టం చేశారు. చిరునవ్వుతో వారిని ఆహ్వానించి అభిప్రాయాలు తెలుసుకోవాలని, అయోమయానికి, గందరగోళానికి దారితీసేలా ఉండకూడదన్నారు. లేదంటే దీనివల్ల అపోహలు పెరుగుతాయని, వాటిని రెచ్చగొట్టి పక్కదోవ పట్టించే ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తేవాలనుకున్నా దాని వెనక ఉద్దేశాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలని సూచించారు. భాగస్వాములందరూ కలిసి ముందుకు సాగితేనే విజయవంతం అవుతుందన్నారు. ర్యాంకింగ్‌లు ఎందుకు ఇస్తున్నామో వారికి స్పష్టంగా చెప్పాలని సీఎం సూచించారు. వెంటనే టీచర్ల మ్యాపింగ్ టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తేవాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి మ్యాపింగ్ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. పాఠ్యప్రణాళికను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని, దీనిపై తర్వాత సమావేశంలో వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకునేలా సోషల్ ఆడిట్ ఎక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవడమే లక్ష్యంగా సోషల్ ఆడిట్ విధానం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి విధానాలు టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురి చేయడానికో కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు. తప్పులు వెతకడానికి, ఆ తప్పులకు బాధ్యులను చేయడానికీ ఈ విధానాలు కావనే విషయాన్ని పదేపదే చెప్పాలన్నారు. స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిటింగ్ ఉండాలని సీఎం ఆదేశించారు. ఎయిడ్ స్కూళ్లపై బలవంతం లేదు ఎయిడెడ్ స్కూళ్లను ఎవరూ బలవంతం చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్ యాజమాన్యాలు విద్యాసంస్థను అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని, లేదా వాళ్లే నడపాలనుకుంటే వారే నిర్వహించుకోవచ్చనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ఇది స్వచ్ఛందం అనే విషయాన్ని చెప్పాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 91 % హాజరు కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరుపైనా ఆరా తీశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తైనందున చురుగ్గా విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతం ఉండగా సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరులో ఇప్పటిదాకా 85 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91 శాతం ఉందని వెల్లడించారు. ► విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ (దిశ స్పెషల్ ఆఫీసర్) కృతికా శుక్లా, ఎండీఎం అండ్ శానిటేషన్ డైరెక్టర్ బీఎం దివాన్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్ రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ’కీ ఎల్లోవైరస్!
సాక్షి, అమరావతి: ఆక్స్ఫర్డ్ డిక్షనరీ!!. దీనికో చరిత్ర ఉంది. ఇంగ్లీషు పదాల అర్థం తెలుసుకోవటానికి చాలామంది ఆశ్రయించేది దీన్నే. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ముద్రిస్తుంది కనక దానికంత విశ్వసనీయత. అదే డిక్షనరీని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఇస్తున్న కిట్లలో భాగంగా సరఫరా చేసింది. విద్యార్థులకైతే ఈ డిక్షనరీ బాగానే నచ్చింది. కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు మాత్రం ఇది నచ్చలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చేయడానికి ఎలాంటి విమర్శలూ లేకపోవటంతో దాదాపు 37 ఏళ్లుగా ముద్రిస్తున్న ఈ డిక్షనరీలోని ఓ పదాన్ని రాజకీయం చేయడానికి సంకల్పించింది టీడీపీ బ్యాచ్. ఆ పదానికి అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలనే అలా మార్చేసిందంటూ దానికి మతం రంగు అల్లే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎల్లో గ్యాంగ్ విపరీతంగా వైరల్ చేస్తున్న ఆ పదమేంటి? దానికి అర్థమేంటి? అసలు డిక్షనరీలో ఏముంది? నిజంగా ప్రభుత్వం సరఫరా చేసిన డిక్షనరీలో అర్థం మారిందా? నిజానిజాలేంటి? ఇదిగో... మీ కోసమే ఈ సాక్షి... ‘ఫ్యాక్ట్‌చెక్’. అవి మార్కెట్లోని డిక్షనరీలే.... అత్యంత ప్రామాణికమయిన తెలుగు–ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కొనుగోలు చేసి ఉచితంగా విద్యార్థులకు విద్యా కానుకలో భాగంగా అందించాం. ఇందులోని పదాల నిర్వచనాలు ఆక్స్ఫర్డ్ సంస్థ నిర్ణయించినవే. మార్కెట్లో లభించే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలనే బల్క్‌గా కొని విద్యార్థులకు అందించాం. దాన్లోని అంశాలను మార్చటం వంటివేమీ మేం చెయ్యలేదు. చెయ్యలేం కూడా. బయట ఉన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని అంశాలే వీటిలోనూ యథాతథంగా ఉంటాయి. – వెట్రి సెల్వి, ఎస్పీడీ, సమగ్ర శిక్ష, ఏపీ ఇదీ ఆరోపణ.... జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో గాడ్ అనే పదానికి ‘ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవ మరియు యూదా మతస్తులు నమ్మి ప్రార్థించే దైవం, గాడ్.’ అని ఉంది.‘గాడ్‌పేరెంట్’ అనే పదానికి ‘పిల్లలను పెంచి పెద్దచేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి, ధర్మపిత’ అని ఉంది. అయితే ప్రభుత్వం తాను పంచుతున్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కావాలనే ఇలా మార్చేసిందని, క్రిస్టియానిటీని పిల్లల్లో ప్రోత్సహించడానికే ఇలా చేశారంటూ ఎల్లో మీడియా, టీడీపీ గ్యాంగ్ విపరీతంగా వాపోతోంది. టీడీపీ నేతలు, సానుభూతి పరులు దీనిపై వీడియోలు చేస్తూ... డిక్షనరీలోని పదాన్ని చూపిస్తూ... హిందూ వ్యతిరేకతను రెచ్చగొట్టి, దాన్ని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆపాదించే పనిలో పడ్డారు. ‘ఫ్యాక్ట్ చెక్’లో తేలినదేంటి? ఫ్యాక్ట్ చెక్... అంటే నిజానిజాల తనిఖీ. దీన్లో ఏం తేలిందో ఓ సారి చూద్దాం. మొదట అందరికీ వచ్చే సందేహం ఆ డిక్షనరీలో అలా ఉందా? అనేది. నిజమే... ఆ డిక్షనరీలో అలానే ఉంది. కాకపోతే అది స్కూలు పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసిందేమీ కాదు. మార్కెట్లో దొరికే ప్రతి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోనూ అలానే ఉంది. నిజానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1984 ఫిబ్రవరి నుంచీ ముద్రిస్తోంది. ఇంగ్లీషు– తెలుగు డిక్షనరీ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచీ దాన్లో ‘గాడ్’, ‘గాడ్ పేరెంట్’ అనే పదాలకు ఇదే అర్థం ఉంది. మార్కెట్లో లభ్యమవుతున్న డిక్షనరీలను బల్క్‌గా కొనుగోలు చేసి ప్రభుత్వం పిల్లలకు అందించింది. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఏమీ దొరకని ఎల్లో బ్యాచ్... వై.ఎస్.జగన్‌కు మతం రంగు పులిమి కాస్తయినా లబ్ధి పొందాలనే దురాలోచనతో ఈ దుర్మార్గానికి దిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను మరింత పెంచుతాయే తప్ప డ్యామేజీ చేయలేవన్నది తాజా ఉదంతంతో మరోసారి తేటతెల్లమయింది. దీనికి సంబంధించి రెండు డిక్షనరీలనూ చూపిస్తూ ప్రభుత్వం రూపొందించిన వీడియోను ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి చూడొచ్చు. https://twitter.com/factcheckapgov?lang=en ‘ఎఫ్ఏసీటీసీహెచ్ఈసీకె.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లోనూ ఈ వీడియో లభ్యమవుతుంది. -
జగనన్న విద్యాకానుక : బ్యాగ్‌లు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం జగన్ ఫోటోలు
-
సచివాలయాల్లోనే ‘వన్‌టైం సెటిల్మెంట్’
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం, పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పథకం పేరు.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్మెంట్కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా పేరు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించడంతోపాటు ప్రతిపాదనలను వివరించారు. సెప్టెంబర్ 25 నుంచి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డేటా అప్లోడ్ చేయనుందని, వివిధ సచివాలయాలకు డేటాను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపడతారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్మెంట్ పథకం డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పథకం అర్హుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితా ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లించిన వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తామని వెల్లడించారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ కచ్చితంగా ఇళ్ల లే అవుట్ల సందర్శన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయినట్లు అధికారులు తెలియచేయగా గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి స్వయంగా పరిశీలన, తనిఖీల కోసం కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్ కమిషనర్లు కచ్చితంగా వారానికో లేఅవుట్‌ను సందర్శించాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ జేసీ, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు లే అవుట్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వారానికోసారి మంత్రుల కమిటీ సమీక్ష సమగ్ర భూ సర్వేపై నియమించిన మంత్రుల కమిటీ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కూడా వారానికోసారి సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కమిటీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా నియమించాలని సూచించారు. ఇళ్ల లబ్ధిదారులందరికీ పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18 వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాలనీ యూనిట్‌గా మౌలిక వసతులు పేదల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, టిడ్కో ఇళ్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాలనీ యూనిట్‌గా తీసుకుని మౌలిక సదుపాయాల పనులను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుకల తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయని చెప్పారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలు, ఖర్చులు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్‌పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్.భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక కిట్ నాణ్యత పరిశీలన సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక కిట్‌లో భాగంగా వచ్చే ఏడాది అందించనున్న స్కూల్ బ్యాగ్, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, సీఎం కార్యాలయ అధికారులు చూపించారు. వచ్చే ఏడాది జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇచ్చే బ్యాగ్ నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్ -
విద్యా కానుక: బ్యాగ్‌లు, బూట్ల నాణ్యతను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బూట్లు, స్కూల్ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ‘జగనన్న విద్యాకానుక’ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి అదనంగా అయ్యే ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది. జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. 1 నుంచి 10 వ తరగతి బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు. చదవండి: వన్‌టైం సెటిల్మెంట్ పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశం ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్ -
జగనన్న విద్యా కానుక: ఆక్స్ఫర్డ్- ఇప్పుడు ఏపీ సర్కార్ బడుల్లో ..
-
రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ‘జగనన్న విద్యాకానుక’ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి అదనంగా అయ్యే ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతుండడంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరానికి జగనన్న విద్యాకానుక పథకం కింద అందించే స్టూడెంట్ కిట్లకోసం రూ.731.30 కోట్లు వ్యయం కావచ్చని ముందు అంచనా వేశారు. కానీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో తాజాగా మరో రూ.57.92 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విద్యాసంవత్సరానికి జగనన్న విద్యాకానుక కిట్లకోసం మొత్తం రూ.789.22 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ఏడాది 42.34 లక్షల మందికి ఈ కిట్లు అందించగా ఈ విద్యాసంవత్సరంలో 48 లక్షల మందికిపైగా విద్యార్థులకు అందించనున్నారు. ఈసారి అదనంగా విద్యార్థులకు డిక్షనరీలను కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: డ్రోన్ల ఆపరేషన్ సులభతరం ఈ నెల 31 లోగా పంపిణీ ఈనెల 16వ తేదీనుంచి పాఠశాలలు ప్రారంభమైన రోజునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. ఆ రోజునుంచే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేపట్టారు. గత సంవత్సరం జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో అదనంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్ డిక్షనరీలను (బొమ్మల నిఘంటువును) అందిస్తున్నారు. 47,32,064 మంది విద్యార్థులకు వీటిని అందించేలా తొలుత అంచనా వేసినా చేరికలు పెరుగుతుండడంతో ఈ సంఖ్య 48 లక్షలకు పైగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్ కారణంగా దశలవారీగా కిట్లను పంపిణీ చేస్తుండటంతో ఇప్పటికి 75 శాతం వరకు విద్యార్థులకు అందాయి. ఈనెల 31వ తేదీలోపు పంపిణీ పూర్తిచేయనున్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం సెప్టెంబర్ 1 నుంచి కొత్త ప్రవేశాల వివరాలతో పాటు విద్యాకానుక కిట్ల వస్తువుల్లో చినిగిన, పాడైన, కొలతలు తేడాలున్న వాటిని పంపిణీ చేయకుండా రిజెక్టు చేసి ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేసిన అనంతరం స్కూలు హెచ్ఎంలు, ఎంఈవోలు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. దీనికోసం రాష్ట్ర కార్యాలయంలో జగనన్న విద్యాకానుక గ్రీవెన్సె్సల్ను ఏర్పాటుచేసి రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. ఏమైనా ఫిర్యాదులను ‘జేవీకే2గ్రీవెన్స్ఎట్దరేట్జీమెయిల్.కామ్’కు పంపించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నేరుగా సంప్రదించడానికి 0866–2428599 నంబరును ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్సె్సల్ ఏర్పాటైంది. స్కూళ్లనుంచి అందిన ఫిర్యాదులు ఇతర అంశాలను సెప్టెంబర్ 15లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. స్టూడెంట్ కిట్లు జిల్లాకు సరిపడినన్ని రానిపక్షంలో ఏ సరుకు ఎంతకావాలో రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. ఈ వస్తువుల జాబితాను ఎప్పటికప్పడు నమోదు చేసేందుకు జగనన్న విద్యాకానుక యాప్‌ను ఏర్పాటుచేశారు. ఏ వస్తువులు ఎవరెవరికి ఎన్నెన్ని.. జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. 1 నుంచి 10 వ తరగతి బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు. -
Jagananna Vidya Kanuka: అపురూప ‘కానుక’!
శ్రీకాకుళంలోని ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉంటున్న దేవేంద్రనాథ్బాబు అడ్వొకేట్ కాగా ఆయన భార్య శ్రీదేవి గృహిణి. వారి కుమార్తె దుర్గాశివాని గతేడాది వరకు ప్రైవేట్ స్కూల్లో చదవగా 10వ తరగతి శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చేరింది. విద్యాకానుక ద్వారా ఇస్తున్న వస్తువులను చూసి ఆశ్యర్యపోయింది. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూ, సాక్సులు కోసం తన తల్లిదండ్రులు ఇన్నేళ్లూ రూ.వేలల్లో ఖర్చు చేసేవారని, రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక ద్వారా స్టూడెంట్స్ కిట్ల పంపిణీ చురుగ్గా సాగుతోంది. విద్యార్థులంతా ఉత్సాహంగా నాడు–నేడు ద్వారా తీర్చిదిద్దిన పాఠశాలలకు తరలివస్తూ కిట్లను అందుకుని మురిసిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 16వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 47,32,064 మంది విద్యార్థులకు ఈ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకు అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు కిట్లలోని వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని బ్యాగుల్లో సర్ది ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, కిట్‌లో ఉన్న వస్తువులను సూచిస్తూ స్టిక్కర్‌పై వివరాలు పొందుపరిచి విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులంతా ఒకేసారి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దశలవారీగా కిట్ల పంపిణీకి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 31వ తేదీవరకు కిట్లను పంపిణీ చేయాలని సూచించారు. కాకినాడలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తున్న సీఎంవో శివరామకృష్ణయ్య జిల్లాలవారీగా పంపిణీ ఇలా.. విశాఖ జిల్లాలో 3,63,114 కిట్లు అవసరం కాగా ఇప్పటివరకూ 70,084 పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుక కిట్లు అందజేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. జిల్లాలో 4,68,455 మంది విద్యార్థులుండగా వీరందరికీ కిట్లలోని వస్తువులన్నీ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,31,887 మందికి కిట్లు ఇవ్వాల్సి ఉండగా గురువారం వరకు 1,13,112 కిట్లను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 4,71,024 మంది విద్యార్థులకు గానూ ఇప్పటి వరకు 37,933 మందికి కిట్లు అందాయి. శ్రీకాకుళం జిల్లాలో 2,86,450 లక్షల మంది విద్యార్థులు ఉండగా 1,56,810 మందికి ఇప్పటికే అందచేశారు. విజయనగరం జిల్లాలో 2,26,157 మంది విద్యార్థులు చదువుతుండగా 1,19,100 మందికి ఇప్పటిదాకా కిట్లు అందించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 3,71,315 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేయాల్సి ఉండగా ఇప్పటివరకు 66 వేల కిట్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో 2,71,498 మంది విద్యార్థులు ఉండగా గురువారం మధ్యాహ్నం సమయానికి 12,917 మందికి కిట్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 4,208 మంది విద్యార్థులకు రిజిస్టర్లలో పేర్లు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ అధెంటిఫికేషన్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో పంపిణీ ఆగింది. మండలాల వారీగా డివైజ్‌లను సరి చేసి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో 3.51 లక్షల మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా బయోమెట్రిక్ యంత్రాల సమస్య, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది. ఈనెల 18వ తేదీ నాటికి మొత్తం 5 వేల కిట్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 1,22,913 మందికి జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 4,06, 678 మందికి కిట్లు ఇవ్వాలి. కృష్ణా జిల్లాలో 3,17,443 మంది విద్యార్థులకుగానూ ఇప్పటిదాకా 1.30 లక్షల మందికి పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 3,373 స్కూళ్లలో 2,68,143 మంది విదార్థులు చదువుతుండగా ఇప్పటివరకు మాన్యువల్‌గా 97,312 మందికి, బయోమెట్రిక్ విధానంలో 2,688 మందికి విద్యాకానుకలను అందచేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే శివరామకృష్ణది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి. ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనడం తలకుమించిన భారంగానే ఉండేది. ఇప్పుడు అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వం ఆసరాగా నిలవడంతో ఊపిరి పీల్చుకుంటున్నాడు. విద్యాకానుక ద్వారా కొత్త దుస్తులతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, స్కూల్ బ్యాగులు, ఆఖరికి టై, బెల్టు లాంటివన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుండటంతో పిల్లలను దొరబాబుల్లా బడికి పంపుతున్నట్లు ఆయన భార్య శాయన ఉష సంతోషంగా చెప్పింది. – తల్లి శాయన ఉషతో 7వ తరగతి విద్యార్థి హర్షవర్థన్, మాదేపల్లి జెడ్పీ హైస్కూల్ కర్నూలు జిల్లా వెల్దుర్తి ఇందిరాగాంధీనగర్‌కు చెందిన రాజుకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులకు వెళ్తుంటాడు. ఏటా పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయంటే ఆందోళన మొదలయ్యేది. బ్యాగులు, నోట్ పుస్తకాలు తదితరాల రూ.8 వేల దాకా ఖర్చు అయ్యేది. జగనన్న విద్యా కానుక వల్ల గతేడాది నుంచి ఆ ఖర్చులు మిగులుతున్నాయి. – రాజు, వెల్దుర్తి పెయింటర్, ఇందిరాగాంధీనగర్ ఇక ఏ దిగులూ లేదు.. గతంలో పిల్లల పుస్తకాలు, యూనిఫారాలు కొనేందుకు అప్పులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ తెరిచిన రోజే అన్నీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగనన్న మాకు ఏ దిగులూ లేకుండా చేశారు. బ్యాగ్ చాలా బాగుంది. మంచి నాణ్యమైన పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. – సిద్ధాంతపు లక్ష్మి, తగరపువలస, భీమిలి (తనయుడు భరత్‌కుమార్‌తో) ప్రభుత్వ మేలు మరువలేం నా పేరు షాహీనా. చిత్తూరులోని మార్కెట్వీధిలో ఉంటున్నాం. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త ముజీబ్ చికెన్ వ్యాపారం చేస్తుంటారు. రెండో కుమారుడు మహమ్మద్సేటును మున్సిపల్ స్కూల్లో 5వ తరగతి చదివిస్తున్నాం. రెండేళ్లుగా నోటు పుస్తకాలు, బ్యాగులు అన్నీ ప్రభుత్వమే సమకూర్చింది. బ్యాగు, యూనిఫాం, షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు చాలా నాణ్యంగా ఉన్నాయి. మా పిల్లల చదువుకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఎప్పటికీ మరువలేం. – షాహీనా, విద్యార్థి తల్లి కొత్త ఉత్సాహం.. కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మా పాప అమృత నెల్లిమర్ల కేజీబీవీలో పదోతరగతి, బాబు ఉదయ్‌కిరణ్ రామతీర్థం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. సకల సదుపాయాలతో అందంగా సిద్ధమైన పాఠశాలలను చూసి పిల్లల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అమ్మ ఒడి కింద ఆర్థిక సాయం అందుతోంది. మరోవైపు జగనన్న విద్యాకానుక అందజేశారు. కిట్‌లో ఉన్న బూట్లు, బ్యాగు, యూనిఫారాలు అన్నీ నాణ్యమైనవి ఇచ్చారు. – పతివాడ శ్రీను, విద్యార్థి తండ్రి, కొత్తపేట గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం రెట్టించిన ఉత్సాహంతో.. నోట్ పుస్తకాలు, వర్క్‌పుస్తకాలు కొనుక్కునేందుకు చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆర్థిక స్థోమత లేక నెలకు కొన్ని మాత్రమే కొనుగోలు చేసేవాళ్లం. జగనన్న విద్యాకానుకతో ఆ కష్టాలు తీరాయి. రెట్టించిన ఉత్సాహంతో పాఠశాలకు హాజరవుతున్నా. – శ్రావణి లావణ్య, బాలికోన్నత పాఠశాల, సాలిపేట, కాకినాడ ప్రతి వస్తువు నాణ్యంగా ఉంది పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నా. ఈ ఏడాది ఇచ్చిన యూనిఫాం చాలా బాగా, గట్టిగా ఉంది. షూ కూడా బాగుంది. బ్యాగు చాలా గట్టిగా ఉంది. విద్యాకానుకలో ఇచ్చిన అన్ని వస్తువులు నాణ్యతతో ఉన్నాయి. – వి. మౌనిక, 10వ తరగతి, జిల్లా పరిషత్తు హైస్కూల్, నెల్లూరు పైసా ఖర్చు లేకుండా.. మా పాప సాజియా ఫిర్దోస్ గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. వరుసగా రెండో ఏడాది విద్యాకానుక కిట్ పంపిణీ చేశారు. కూలిపనులు చేసుకునే మేం పైసా ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం ఇచ్చి చదువు చెప్పిస్తున్న జగనన్నకు రుణపడి ఉంటాం. – సయ్యద్ జమీల, గుంటూరు పర్ఫెక్ట్గా సరిపోయాయి.. నాపేరు హర్షిత.మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతుతున్నాను. నాన్న రాధాకృష్ణ కిరాణా షాపులో పని చేస్తాడు. అమ్మ సౌమ్య చిన్న హోటల్ నడుపుతోంది. జగనన్న విద్యా కానుక ద్యారా రూపాయి ఖర్చు లేకుండా నా చదువుకు అన్ని రకాల వస్తువులు సమకూరాయి. విద్యా కానుకలో ఇచ్చిన వస్తువులన్నీ చాలా బాగున్నాయి. బూట్లు, యూనిఫామ్ కూడా సరిపోయాయి. అన్నీ ఫిట్‌గా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. – ఎం. హర్షిత, 9వ తరగతి, మునిసిపల్ హైస్కూల్, వైఎస్సార్ జిల్లా. నాణ్యతతో ఉన్నాయి.. నేను 8వ తరగతి చదువుతున్నా. జగనన్న విద్యాకానుక కిట్లు చాలా బాగున్నాయి. టెక్ట్స్‌బుక్కులు అందంగా ఉన్నాయి. గ్రాఫిక్స్, బొమ్మలు అర్థవంతంగా ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నాను. మాకు సులువుగా అర్థమయ్యేలా ఒక వైపు తెలుగులో, మరో వైపు ఇంగ్లిష్‌లోనూ టెక్ట్స్‌బుక్కులు ముద్రించారు. స్కైకలర్ బ్యాగు చాలా బాగుంది. – సాహితీ. జెడ్పీ హైస్కూల్, హవళిగ, అనంతపురం జిల్లా.