కర్నూలు: ‘విద్యా కానుక’ కిట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5వ తేదీన ఆదోనికి రానున్నారు. ఇందు కోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదోనికి రావడం ఎంతో శుభసూచికమన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారని, పిల్లలకు అవసరమైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లను చేయాలన్నారు.
చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి)
నేడు విద్యాశాఖ కార్యదర్శి రాక
కర్నూలు సిటీ: పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదోని రానుండడంతో ఏర్పాట్లపై సమీక్షించేందుకు విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం జిల్లాకు రానున్నారు. ఈయన వెంట పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ కూడా ఉంటారు.
మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మంత్రి గుమ్మనూరు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు, అధికారులు
హెలిప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల మైదానం మొత్తం కలియతిరిగారు. జిల్లా అధికారులకు తలసి రఘురామ్ పలు సూచనలు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ్, డీఈఓ రంగారెడ్డి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, పత్తికొండ ఆర్డీఓ మోహన్‌దాసు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ కుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment