Adoni Town
-
CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్
కర్నూలు: ‘విద్యా కానుక’ కిట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేదీన ఆదోనికి రానున్నారు. ఇందు కోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురామ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదోనికి రావడం ఎంతో శుభసూచికమన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారని, పిల్లలకు అవసరమైన వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లను చేయాలన్నారు. చదవండి: (బూతు రాజకీయాలు మానుకో సూరీ: ఎమ్మెల్యే కేతిరెడ్డి) నేడు విద్యాశాఖ కార్యదర్శి రాక కర్నూలు సిటీ: పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదోని రానుండడంతో ఏర్పాట్లపై సమీక్షించేందుకు విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం జిల్లాకు రానున్నారు. ఈయన వెంట పాఠశాల విద్య కమిషనర్ సురేష్‌కుమార్ కూడా ఉంటారు. మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మంత్రి గుమ్మనూరు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ కోటేశ్వరరావు, అధికారులు హెలిప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ రామసుందర్‌రెడ్డి పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాల మైదానం మొత్తం కలియతిరిగారు. జిల్లా అధికారులకు తలసి రఘురామ్ పలు సూచనలు చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ్, డీఈఓ రంగారెడ్డి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, పత్తికొండ ఆర్డీఓ మోహన్‌దాసు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, విద్యుత్‌శాఖ ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టు పీడీ కుమారి పాల్గొన్నారు. -
భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది
సాక్షి, ఆదోని టౌన్: భార్యను పంపడం లేదని సొంత వదినను మరిదే హత్య చేసిన ఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. త్రీ టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపిన వివరాలు.. పట్టణం లోని పింజరిగేరికి చెందిన గుడుమామీ, షేక్షావలి దంపతులకు భాను(45), జీనత్, రఫీక్ సంతానం. భానును బార్పేటకు చెందిన షేక్షావలికి ఇచ్చి 40 ఏళ్ల క్రితం వివాహం చేయగా భర్త మృతిచెందడంతో పుట్టినింటిలోనే ఉంటోంది. జీనత్‌ను గోకారి జెండా వీధికి చెందిన కాశీంవలికి ఇచ్చి వివాహం చేశారు. కాగా జీనత్ ఇటీవల కాన్పు కోసమని పుట్టినింటికి వచ్చింది. శనివారం తన భార్యను తీసుకెళ్దామని కాశీంవలి రాగా.. ఆరోగ్యం సరిగా లేదని కొంత కాలం ఉంచుకొని పంపుతామని భాను పేర్కొంది. మాటామాటా పెరిగి వదిన భాను పొట్టలో మరిది కాశీంవలి కత్తితో పొడిచాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విష యం తెలుసుకున్న త్రీ టౌన్ సీఐ శ్రీనివాసనాయక్, ఎస్ఐ రమేష్, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించా రు. మృతురాలికి నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు సాబు హుసేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ మరిది కాశీంవలి చేతిలో హత్యకు గురైన భాను మృతదేహాన్ని డీఎస్పీ రామక్రిష్ణ పరిశీలించారు. హత్య ఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకొని మృతురాలి బంధువులతో మాట్లాడారు. త్వరలోనే నిందితుడు కాశీం వలిని అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. -
తపాలా పెట్టెకు సమ్మె తాళం !
ఆదోని అర్బన్ : గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పోస్టాఫీసులు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా తపాలాశాఖలో పనిచేసే గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్)లకు పనికి తగిని వేతనం, సమయ పాలన, సర్వెంట్ హోదాతో పాటు 7వ ఆర్థిక వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 22 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. తపాలా ఉద్యోగుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అయ్యే ఉత్తరాల బట్వడా ఆగిపోయింది. వీటిలో ప్రధానంగా టెలిఫోన్ బిల్లులు, పార్శల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే బల్క్ ఉత్తరాలు, నిరుద్యోగులకు కాల్ లెటర్లు, ఉద్యోగ నియామక రాత పరీక్షలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆదోని సబ్ డివిజన్లో 140 బ్రాంచ్ తపాలా కార్యాలయాలు, 9 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయి. దాదాపు 327మంది గ్రామీణ డాక్‌సేవక్‌లు (జీడీఎస్), డిపార్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీడీఎస్‌లు రూ.7వేల నుంచి రూ.12వేల వేతనంతో జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సమ్మెబాట పట్టారు ఉద్యోగులు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 12వ రోజుకు చేరిన ఉద్యోగుల ఆందోళన పట్టణంలో హెడ్ పోస్టాఫీసు ఆవరణలో గ్రామీణ డాక్ సేవక్‌లు చేపట్టిన నిరవధిక సమ్మె శనివా రానికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పీ3, పీ4 బ్రాంచ్ సెక్రటరీలు విజయలక్ష్మీ, గంగాధర్, జీడీఎస్ సంఘం సబ్ డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ బ్రాంచ్ సెక్రటరీ మునీ, సం ఘం నాయకులు రాజు, నరేష్ సింగ్, శ్రీనివాస స్వామి, ప్రహ్లాద్ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిం దన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. -
కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తీసుకోండి
ఆదోని టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తులపై నిఘా తదితర వాటిపై సమీక్షించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఏ పార్టీవారినైనా వదలవద్దని సూచించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం డీఎస్పీ బంగ్లా ఆవరణంలోని పరిసరాలను, కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ శివరామిరెడ్డి ఉన్నారు.