సమ్మెలో పాల్గొన్న గ్రామీణ తపాలా ఉద్యోగులు
ఆదోని అర్బన్ : గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పోస్టాఫీసులు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా తపాలాశాఖలో పనిచేసే గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్)లకు పనికి తగిని వేతనం, సమయ పాలన, సర్వెంట్ హోదాతో పాటు 7వ ఆర్థిక వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 22 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. తపాలా ఉద్యోగుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అయ్యే ఉత్తరాల బట్వడా ఆగిపోయింది. వీటిలో ప్రధానంగా టెలిఫోన్ బిల్లులు, పార్శల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే బల్క్ ఉత్తరాలు, నిరుద్యోగులకు కాల్ లెటర్లు, ఉద్యోగ నియామక రాత పరీక్షలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఆదోని సబ్ డివిజన్‌లో 140 బ్రాంచ్ తపాలా కార్యాలయాలు, 9 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయి. దాదాపు 327మంది గ్రామీణ డాక్‌సేవక్‌లు (జీడీఎస్), డిపార్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీడీఎస్‌లు రూ.7వేల నుంచి రూ.12వేల వేతనంతో జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సమ్మెబాట పట్టారు ఉద్యోగులు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
12వ రోజుకు చేరిన ఉద్యోగుల ఆందోళన
పట్టణంలో హెడ్ పోస్టాఫీసు ఆవరణలో గ్రామీణ డాక్ సేవక్‌లు చేపట్టిన నిరవధిక సమ్మె శనివా రానికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పీ3, పీ4 బ్రాంచ్ సెక్రటరీలు విజయలక్ష్మీ, గంగాధర్, జీడీఎస్ సంఘం సబ్ డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ బ్రాంచ్ సెక్రటరీ మునీ, సం ఘం నాయకులు రాజు, నరేష్ సింగ్, శ్రీనివాస స్వామి, ప్రహ్లాద్ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిం దన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment