కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తీసుకోండి | Code Violations of the harsh measures | Sakshi
Sakshi News home page

కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తీసుకోండి

Published Mon, Mar 24 2014 12:47 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Code Violations of the harsh measures

ఆదోని టౌన్, న్యూస్‌లైన్:  ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని  కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తులపై నిఘా తదితర వాటిపై సమీక్షించారు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఏ పార్టీవారినైనా వదలవద్దని సూచించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం డీఎస్పీ బంగ్లా ఆవరణంలోని పరిసరాలను, కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ శివరామిరెడ్డి ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement