Range DIG
-
‘రాష్ట్రంలో తగ్గిన 60 శాతం బీర్ వినియోగాలు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో 40 శాతం లిక్కర్ వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. అలాగే 60 శాతం బీర్ వినియోగం కూడా తగ్గందన్నారు. గుంటూరు రేంజ్ డీఐజీగా నియమితులైన డా. త్రివిక్రమ వర్మను బుధవారం వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అభినందించారు. ఈ మేరకు బుధవారం డీఐజీ కార్యాలయంలో డా. త్రివిక్రమ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు సైతం 18 శాతం తగ్గాయని డీఐజీకి వివరించారు. రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం అమలులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. పోలీస్ పాత్ర పెరగటం హర్షణీయమని, తద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. చదవండి: వారి రక్షణే మా ప్రాధాన్యం: సీఎం జగన్ "సెబ్ " ఏర్పడక ముందు జనవరి 2020 నుంచి మే15 వరకు సగటున ప్రతి నెల 3,800 కేసులు నమోదయ్యాయని, 3500 మంది అరెస్టు అయ్యారని వల్లరెండ్డి లక్ష్bమణ రెడ్డి తెలిపారు. ప్రతి నెల ఆరు వేల లీటర్ల అక్రమ మద్యం దొరికిందని, 700 వాహనాలను పట్టుకున్నారని అన్నారు. అదే "సెబ్ " ఏర్పడిన తర్వాత మే 15 నుంచి అక్టోబర్ 20 వరకు ప్రతి నెలా సగటున 10, 200 కేసులు నమోదు అవుతున్నాయని, 12800 మంది అరెస్టు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 82 వేల లీటర్ల అక్రమ మద్యం దొరుకుతుందని, ప్రతి నెల 3600 వాహనాలను పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. మద్యం అక్రమార్కులపై "సెబ్ " ఉక్కుపాదం మోపుతుందన్నారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకొస్తే సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి
జగిత్యాల క్రైం: త్వరలో జరగబోయే ఎన్నికలను శాంతియుతంగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా కృషి చేయాలని కరీంనగర్ రేంజ్ డీఐజీ పి.ప్రమోద్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సింధూశర్మతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘటనలూ జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోసం జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిలో ఎంతమందిని బైండోవర్ చేశారు..? ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎంత మంది రౌడీషీటర్లు ఉన్నారు..? ఎన్ని పోలింగ్ కేంద్రాలున్నాయి..? వాటి స్థితిగతులు ఏమిటీ..? ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఎంతమంది పోలీసు భద్రత ఏర్పాట్లు అవసరం..?అక్కడ ముందస్తు చర్యలు ఎలా సుకుంటున్నారు..? వంటి అంశాలపై చర్చించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల గురించి అధికారులు డీఐజీకి వివరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక నైపుణ్యంతో పనిచేయాలని డీఐజీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతోపాటు ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించే వ్యక్తులను గుర్తించి గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నేరస్తుల సమాచారాన్ని సేకరించి వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్ల వారిగా రౌడీషీటర్ల జాబితా రూపొందించుకుని వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి హెచ్‌ఎస్‌వో తమతమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు అన్ని పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చొరవ చూపాలన్నారు. ప్రతి పీహెచ్సీవోకి ఒక్కో గ్రామం పేరుతో పలకరించేలా రాజకీయేతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉండాలన్నారు. చెక్‌పోస్ట్‌ల తనిఖీ సమయంలో తప్పనిసరి వీడియో, ఫొటోగ్రఫీ తీసి జాగ్రత్తగా పొందుపర్చాలని సూచించారు. సాక్ష్యాధారాలు నేరానికి పాల్పడేవారికి శిక్ష పడటంలో కీలకమన్నారు. జిల్లాలో అన్ని పోలీస్స్టేషన్లలో అధికారులు ప్రజలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి గ్రామం ఒక ప్రాతిపాదికన తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, మల్లారెడ్డి, సీతారాములు, ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రాజు పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తీసుకోండి
ఆదోని టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తులపై నిఘా తదితర వాటిపై సమీక్షించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఏ పార్టీవారినైనా వదలవద్దని సూచించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం డీఎస్పీ బంగ్లా ఆవరణంలోని పరిసరాలను, కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ శివరామిరెడ్డి ఉన్నారు.