సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో 40 శాతం లిక్కర్ వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. అలాగే 60 శాతం బీర్ వినియోగం కూడా తగ్గందన్నారు. గుంటూరు రేంజ్ డీఐజీగా నియమితులైన డా. త్రివిక్రమ వర్మను బుధవారం వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అభినందించారు. ఈ మేరకు బుధవారం డీఐజీ కార్యాలయంలో డా. త్రివిక్రమ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు సైతం 18 శాతం తగ్గాయని డీఐజీకి వివరించారు. రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం అమలులో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. పోలీస్ పాత్ర పెరగటం హర్షణీయమని, తద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. చదవండి: వారి రక్షణే మా ప్రాధాన్యం: సీఎం జగన్
"సెబ్ " ఏర్పడక ముందు జనవరి 2020 నుంచి మే15 వరకు సగటున ప్రతి నెల 3,800 కేసులు నమోదయ్యాయని, 3500 మంది అరెస్టు అయ్యారని వల్లరెండ్డి లక్ష్bమణ రెడ్డి తెలిపారు. ప్రతి నెల ఆరు వేల లీటర్ల అక్రమ మద్యం దొరికిందని, 700 వాహనాలను పట్టుకున్నారని అన్నారు. అదే "సెబ్ " ఏర్పడిన తర్వాత మే 15 నుంచి అక్టోబర్ 20 వరకు ప్రతి నెలా సగటున 10, 200 కేసులు నమోదు అవుతున్నాయని, 12800 మంది అరెస్టు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 82 వేల లీటర్ల అక్రమ మద్యం దొరుకుతుందని, ప్రతి నెల 3600 వాహనాలను పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. మద్యం అక్రమార్కులపై "సెబ్ " ఉక్కుపాదం మోపుతుందన్నారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకొస్తే సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment