Murali Krishna
-
‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్!
హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్‌సభ, శాసనసభ ఎన్ని కల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తు న్నాయి. ‘మినీ ఇండియా’గా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికలను శాసి స్తున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ... ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ‘పీపుల్స్ పల్స్’ అధ్యయనం చేయగా దాదాపు 30 శాతం మంది ఓటర్లు ఆయా ఎన్నికల్లో భిన్నంగా స్పందిస్తుండడంతో ఈ స్వింగ్ ఓటర్లే రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారని తేలింది.ఢిల్లీలో 2013 అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ మార్పులకు తెరలేపాయి. అప్పుడు మొదటిసారిగా బరిలోకి దిగిన ఆప్ ఊహించని విధంగా 30 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాలు విసిరింది. అప్పటికే మూడు పర్యా యాలు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో 33 శాతం ఓట్లతో పెద్ద పార్టీగా నిలిచినా అధికారం చేపట్టలేకపోయింది. వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 25 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి 4 స్థానాలు తక్కువగా పొంది 32 స్థానాలకు పరిమితమై అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 46 శాతం ఓట్లతో మొత్తం 7 ఎంపీ స్థానాల్లో గెలిచింది. ఆప్ అసెంబ్లీ ఎన్నికల కంటే 3 శాతం అధికంగా 36 శాతం ఓట్లు పొందినా ఒక్క స్థానం కూడా సాధించ లేదు. కాంగ్రెస్ 15 శాతం ఓట్లే పొందింది. 2015 అసెంబ్లీ ఎన్ని కలతో పోలిస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ భారీగా 36 శాతం ఓట్లు కోల్పోగా, బీజేపీ 25 శాతం, కాంగ్రెస్ 13 శాతం ఓట్లు అధికంగా పొందాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరిగి 7 స్థానాల్లో గెలిచింది. 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుండి చెరో 18 శాతం ఓట్లు చీల్చిన ఆప్ 2019లో తాను కోల్పో యిన 36 శాతం ఓట్లను తిరిగి పొంది అధికారం చేపట్టింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ 30 శాతం ఓట్లను నష్టపోగా, బీజేపీ 16 శాతం ఓట్లు ఎక్కువ సాధించి మళ్లీ మొత్తం 7 స్థానాలనూ గెల్చుకుంది. ఒక్క ఎంపీ సీటూ రాకపోయినా కాంగ్రెస్ 15 శాతం ఓట్లు అధికంగా పొందింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భిన్నంగా స్పంది స్తున్న దాదాపు 30 శాతం మంది ఢిల్లీ ఓటర్లే ఆప్‌కు కీలకంగా మారుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రవర్ణ ఓటర్ల గణాంకాలను అధ్యయనం చేస్తే... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం వీరి మద్దతు పొందిన బీజేపీ 2020 ఎన్నికల్లో 54 శాతానికి పరిమితం అయ్యింది. కాంగ్రెస్‌కు 2019లో అగ్రవర్ణాల మద్దతు 12 శాతం లభించగా, 2020లో అది 3 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆప్‌కు 2019లో 13 శాతమే మద్దతివ్వగా, 2020లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 41 శాతం మద్దతిచ్చారు.ఓబీసీ ఓటర్ల తీర్పును పరిశీలిస్తే... 2019లో బీజేపీకి 64 శాతం మంది మద్దతివ్వగా 2020 ఎన్నికలు వచ్చేసరికి అది 50 శాతానికి పడిపోయింది. 2019లో 18 శాతం మంది ఓబీసీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వగా 2020లో 16 శాతమే మద్దతిచ్చారు. ఆప్‌కు 2019లో ఓబీసీల మద్దతు 18 శాతమే లభించగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం మద్దతు సంపాదించగలిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 29 శాతం ఓబీసీ ఓట్లు కోల్పోయింది.దళిత ఓటర్లు 2019 లోక్‌సభ ఎన్నికల్లో 44 శాతం బీజేపీకి మద్దతివ్వగా 2020 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 25 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ 2019లో 20 శాతం ఓట్లు పొందగా, 2020లో 6 శాతానికి పరిమితమైంది. 2019లో 22 శాతం దళితుల మద్దతు పొందిన ఆప్ 2020లో ఏకంగా 69 శాతం దళితుల మద్దతు పొందింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 41 శాతం దళితుల ఓట్లను కోల్పోయింది. ముస్లిం ఓటర్ల గణాంకాలను పరిశీలిస్తే... 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింల మద్దతు బీజేపీకి 7 శాతం, ఉండగా, 2020 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 3 శాతానికి దిగజారింది. కాంగ్రెస్‌కు 2019 ఎన్నికల్లో 66 శాతం ముస్లింలు మద్దతివ్వగా, 2020 నాటికి అది 13 శాతానికి పరిమితమైంది. ఆప్‌కు 2019లో 28 శాతం ముస్లింలు మద్దతివ్వగా, 2020 నాటికి భారీగా 83 శాతం ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ 34 శాతం ముస్లింల మద్దతు కోల్పోగా, అవి 11 శాతం బీజేపీకి, 21 శాతం కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తుండడంతో త్రిముఖ పోటీలో ప్రధానంగా ముస్లిం, దళిత ఓట్ల చీలికతో ఆప్‌కు నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆప్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్థిక, సామాజిక వర్గాలవారీగా ఓట్లను పరిశీలిస్తే... పేదల్లో 37 శాతం ఓటర్ల మద్దతును ఆప్ కోల్పోగా, వారిలో 19 శాతం బీజేపీకి, 17 శాతం కాంగ్రెస్ వైపు మళ్లారు. మధ్యతరగతి కుటుంబాల ఓటర్ల లెక్కలను గమనిస్తే ఆప్ 21 శాతం మద్దతు కోల్పోగా, అందులో బీజేపీకి 11 శాతం, కాంగ్రెస్‌కు 12 శాతం లభించింది.రాజధాని ఢిల్లీలో పరిపాలన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడంతో ఓటర్లు కూడా పరిణతితో కూడిన తీర్పు ఇస్తు న్నారు. ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించిన ప్పుడు ఢిల్లీకి కేజ్రీవాల్, భారత్‌కు మోదీ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నట్టు కనిపించింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలో ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరికి మద్దతిస్తారని’ ఓటర్లను ప్రశ్నించగా ఆప్‌కు 49 శాతం, బీజేపీకి 33 శాతం మంది ఆమోదం తెలపడంతో ఈ రెండు పార్టీల మధ్య అప్పుడే 16 శాతం వ్యత్యాసం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఇప్పటి వరకు అనుకూలంగా ఉంటున్న 30 శాతం స్వింగ్ ఓట్లను బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 5 శాతం చీలిస్తే ఆప్ 44 శాతానికి పరిమితమవడంతో పాటు బీజేపీ 44 శాతానికి పెరిగి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయి. గతంలో వలే బీజేపీ, కాంగ్రెస్‌ల నుండి చెరో 15 శాతం ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మల్చుకుంటే హస్తిన మరోసారి ఆప్ హస్తగతమవుతుంది. ఆప్‌కు అగ్నిపరీక్షగా మారిన కీలకమైన 30 శాతం స్వింగ్ ఓట్లను ఎప్పటిలాగే తమ వైపుకు తిప్పుకోగలిగి తేనే మరోసారి ఆ పార్టీ అందలమెక్కుతుంది.జి. మురళీ కృష్ణ వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థలో సీనియర్ రిసెర్చర్ -
పొన్నూరులో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సీపీ పోస్టర్ రిలీజ్
-
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
-
కృష్ణా...ముకుందా...మురారి
కడప కల్చరల్: శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలను గురువారం కడప నగరం ద్వారకానగర్‌లోని శ్రీ మురళీకృష్ణాలయంలో ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం ఈ సందర్భంగా మూలమూర్తికి విశేష అభిషేకాలు, అనంతరం కనుల పండువగా అలంకారం చేశారు. ఆలయం నిర్వాహకులు రామమునిరెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులందరికీ నిబంధనల మేరకు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధ్యాన మందిరంలో ఉత్పవమూర్తిని నిలిపి ఆయనతోపాటు గణపతి సచ్చిదానంద స్వామి మూర్తికి కూడా పూజలు చేశారు. రాయచోటి రైల్వేగేటు వద్దగల శ్రీకృష్ణాలయంలో కూడా కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. కృష్ణయ్యకు పూజలు కడప నగర సమీపంలోని అప్పరాజుపల్లె గ్రామంలో గురువారం కృష్ణునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ అమర్నాథ్ యాదవ్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. రేపు కృష్ణాష్టమి పూజలు కడప నగరం గడ్డిబజారులోని శ్రీ లక్ష్మి సత్యానారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ్‌భట్టర్ తెలిపారు. శ్రీకృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం ప్రకారం ఈ కార్యక్రమాన్ని శనివారం పంచారాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో సందడి కృష్ణాష్టమి ముందస్తు వేడుకల్లో భాగంగా కడప నగరానికి చెందిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో గురువారం రాధాకృష్ణులుగా చిన్నారులు సందడి చేశారు. చిన్నికృష్ణులు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్న ఆ చిన్నారులను రిమ్స్ వైద్యులు అర్చన అభినందించారు. అనంతరం చిన్ని కృష్ణులతో కృష్ణయ్యకు ప్రార్థనలు నిర్వహించారు. భగవద్గీతా పఠనం చేయించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు స్వీట్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ హరికృష్ణ, సిబ్బంది సరస్వతి, సంధ్యారెడ్డి, వైశాలి, లక్ష్మిదేవి, భార్గవి, మేరి, పీఈటీ జయచంద్ర, జవహర్, లక్ష్మయ్య, శంకర్ పాల్గొన్నారు. దీంతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. అలరించిన నృత్యాలు కడప కల్చరల్ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని స్థానిక ద్వారకానగర్లోగల శ్రీ మురళీ కృష్ణాలయం ప్రాంగణంలో పలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప స్పందన డాన్స్ అకాడమీ చిన్నారులు చేసిన నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విన్నావ.. యశోదమ్మ, భరత వేదమున, జయజయహే మహిశాసుర మర్ధిని వంటి నృత్యాలు అలరించాయి. ప్రజలు కరతాళ ధ్వనులతో చిన్నారులను ప్రోత్సహించారు. ముద్దులొలికే చిన్నికృష్ణయ్యలు శ్రీకృష్ణాష్టమి సందర్బంగా చిన్నారులు ఉన్న ఇళ్లలో చిన్ని కృష్ణయ్యలుగా దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారి పాపలకు చిన్నారి కృష్ణయ్య వేషాలను ధరింపజేసి తమ కంటి పాపల నిండుగా తనివి తీరాచూసుకుని మురిసిపోతున్నారు. పనిలో పనిగా గోపెమ్మలను కూడా సిద్ధం చేసి వెన్న తినిపించే ఘట్టాలను, ఉట్టికొట్టే ఘట్టాలను నిర్వహించి ముచ్చట తీర్చుకుంటున్నారు. పనిలో పనిగా మనోళ్లు మన జిల్లాకు మత సామరస్యంగా గల ఘనతను మరోమారు చాటారు. ఈ సందర్బంగా పలువురు ముస్లింలు కూడా తమ చిన్నారులకు కృష్ణుడి వేషాలు ధరింపజేసి మతాలకు అతీతంగా నిలిచి ఆనందాన్ని ఆస్వాదించారు. -
రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలకు అర్థం చెప్పాలనే... విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో భారీగా యాష్(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్ డస్ట్ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్ ఎంచుకున్నారు. ఎన్టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా.. రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్ గ్రేడ్, సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. సీబీఆర్ రేషియో ప్రామాణికంగా.. రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్ రేషియో(సీబీఆర్)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్ బేస్ కోర్స్‌కు లిక్విడ్ లిమిట్ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి. పట్నాయక్ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్ లిమిట్ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్)కు బాటమ్ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బాటమ్ యాష్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్ విద్యుత్ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్ యూనిట్ల ద్వారా క్రషర్ డస్ట్ వెలువడుతోంది. యాష్, క్రషర్ డస్ట్ పర్యావరణానికి సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో తుమ్లుక్ థిగా రైల్వే లైన్ నిర్మాణంలో బాటమ్ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్), వాల్తేర్ డివిజన్ -
రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
-
డాక్టర్ మురళీకృష్ణ అరెస్టు
ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి జిల్లా): ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మురళీకృష్ణపై ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో ఏలూరు త్రీటౌన్ పోలీసులు డాక్టర్ మురళీకృష్ణను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం మురళీకృష్ణను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం మురళీకృష్ణను భీమవరం సబ్‌జైలుకు తరలించారు. (కార్పొ‘రేటు’ దోపిడీ) మురళీకృష్ణ హాస్పిటల్లో అనుమతులు లేకుండానే కోవిడ్‌కు చికిత్స చేయటం, కొంతమంది మరణానికి కారకులు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ఆ హాస్పిటల్‌ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక బాధితుడు ఏలూరు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో జూలై 23న బాధితుడ్ని మురళీకృష్ణ హాస్పిటల్లో చేర్పించారు. అదే నెలలో ఐదురోజుల అనంతరం బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యానికి సుమారుగా రూ.2లక్షల వరకూ వసూలు చేసిన వైద్యుడు, రోగి మృతిచెందిన తరువాత కూడా ఇంజెక్షన్లకు అంటూ మరో రూ.32,500లు వసూలు చేశాడని మృతుడి కుమారుడు చెబుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ మూర్తి ఆధ్వర్యంలో ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రికి డాక్టర్ మురళీకృష్ణను అరెస్టు చేశారు. (ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రి దందా) -
వీడని మిస్టరీ..!
విజయనగరం ,పార్వతీపురం: ఎంతటి కేసునైనా తమ డేగ కళ్లతో పసిగట్టి హంతకులను పట్టుకుంటారనేది పోలీసుశాఖకు ఉన్న గౌరవం. ఏదో ఒక ఆధారాన్ని ఆధారంగా చేసుకొని తీగ లాగితే డొంక కదిలినట్లు కేసును ఛేదించడం పోలీస్ శాఖకే చెందుతుంది. ఒక్కోసారి కేసుకు సంబంధించిన ఆధారాలు స్థానిక పోలీసులకు లభించని సమయంలో సీసీఎస్ పోలీసుల సహకారం తీసుకుంటారు. వీరు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎంతటి కేసునైనా ఏదో ఒక ఆధారంతో కొలిక్కి తీసుకువస్తుంటారు. ఇక విషయంలోకి వెళ్తే.. పార్వతీపురంలో 2017 జూలై 22న సుమిత్రా కలెక్షన్స్ భాగస్వామి మురళీకృష్ణ తుపాకీ కాల్పులకు మృతిచెందాడు. ఇలాంటి సంఘటనే పక్క మండలమైన బొబ్బిలిలో జరిగితే వారం రోజుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు మురళీకృష్ణ హత్య కేసులో మాత్రం నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ప్రశాంతంగా జీవనం సాగించే పార్వతీపురం పట్టణంలో మొట్టమొదటి సారిగా తుపాకీ చప్పుళ్లు మోతకు ఒక వ్యాపారి బలికావడం.. పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. నేరస్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలంతా వేయికళ్లతో ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. కానీ 21 నెలలు పైబడినా నేటికీ వ్యాపారి మురళీకృష్ణ హత్యకు సంబంధించి ఒక్క క్లూ కూడా సంపాదించకపోవడం, నేరస్తులను పట్టుకోకపోవడంతో పోలీసులపై ఉన్న నమ్మకం రోజురోజుకి ప్రజల్లో సన్నగిల్లుతోంది. జిల్లాకు కొత్త ఎస్సీగా దామోదర్ వచ్చారు. పార్వతీపురం పట్టణానికి కొత్త ఏఎస్పీగా సుమిత్ గార్గ్ వ్యవహరిస్తున్నారు. వీరి సారథ్యంలోనైనా నిందితులు పట్టుబడతారేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మౌనంతో మరుగున పడుతున్న కేసు మురళీకృష్ణ హత్యకు సంబంధించి అనేక విమర్శలతో పాటు అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే ఛేదించలేని కేసంటూ ఉండదని, కానీ మురళీకృష్ణ్ణ కేసును ఛేదించకపోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మృతుడు మురళీకృష్ణ్ణ కుటుంబ సభ్యులనుంచి ఫిర్యాదు లేకపోవడం.. తమ భర్తను చంపింది ఎవరో తేల్చాలని మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించకుండా మౌనం వహించడం వెనుక అనేక కారణాలు ఉండే ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు అనుమానితుల గురించి చెప్పకపోవడం వల్లే కేసు దర్యాప్తు నెమ్మదిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఫిర్యాదు చేయనంత మాత్రాన.. కుటుంబ సభ్యులు సహకరించనంత మాత్రాన జరిగింది హత్య కాదా, చంపింది తుపాకీతో కాదా, నేరస్తులను పట్టుకోరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నాళ్లకు నిందితులను పట్టుకుంటారో వేచి చూడాలి. -
2019లో వైఎస్సార్ సీపీదే విజయం
కోడుమూరు రూరల్: 2019ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని వైఎస్సార్ సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. కోడుమూరులో బుధవారం మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ పాదయాత్రలో తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలొకొచ్చిన 6నెలల్లోగా కోడుమూరుకు శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు మంచినీరందక ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలంటే టీడీపీ నాయకులకు ప్రజలు మామూళ్లను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. దళారులకంటే అధ్వానంగా టీడీపీ నాయకులు తయారై ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ స్థానిక నాయకులు రాజు, రాము, మద్దయ్య, శ్రీరాములు, అన్వర్, వీరేష్, మద్దిలేటి, అబ్దుల్, ఎల్లప్ప తదితరులు ఉన్నారు. -
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..
ఓర్వకల్లు: మెరుగైన కంటి చూపు కోసం పసరు మందు తీసుకుందామని బయల్దేరిన వృద్ధులపై విధి చిన్న చూపు చూసింది. బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని శాశ్వతంగా కబళించింది. కర్నూలు జిల్లా సోమయాజుల పల్లె వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని కల్లపరి, చనుగొండ్ల, రామళ్లకోట గ్రామాలకు చెందిన 60 మంది కంటి చూపు మందగించడంతో పసరు మందు తీసుకుందామని మహానందిలోని నాటు వైద్యుని వద్దకు ఆరు ఆటోల్లో బయల్దేరారు. ఒక్కొక్క ఆటోలో 8 నుంచి 14 మంది వరకు ఎక్కారు. తెల్లవారుజామున 3 గంటలకు వారివారి స్వస్థలాల నుంచి మహానందికి పయనమయ్యారు. కోడుమూరు నుంచి వెల్దుర్తి, రామళ్లకోట మీదుగా కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద 18వ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడ నంద్యాల వైపునకు మలుపు తిరిగి ఐదు ఆటోలు రాంగ్రూట్లో ముందుకు వెళ్లిపోయాయి. వాటి వెనకాలే వెళ్తున్న ఏపీ 21 టీసీ 1929 నంబర్ గల ఆటోలో 14 మంది ప్రయాణికులున్నారు. సోమయాజులపల్లె పెట్రోలు బంక్ వద్దకు వచ్చేసరికి ఈ ఆటోను నంద్యాల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు(ఏపీ 21 జెడ్ 0707) ఢీకొట్టింది. దీంతో ఆటో ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కల్లపరికి చెందిన బొరుసు మారెప్ప(55), గూడూరు ఈరమ్మ(53), సర్పంచ్ గౌరమ్మ(54), మాణిక్యమ్మ(52), రామళ్లకోటకు చెందిన హుసేనమ్మ(59), సోమక్క(58), చనుగొండ్లకు చెందిన బోయ నడిమింటి లక్ష్మీదేవి(48) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. క్షతగాత్రులను 108, హైవే పెట్రోలింగ్ వాహనాల్లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్లపరికి చెందిన అత్తాకోడళ్లు బోయ నల్లబోతుల లక్ష్మీదేవి, గోవిందమ్మ ప్రాణాలు విడిచారు. తీవ్రగాయాలపాలైన ఆటో డ్రైవర్ వాసు, అశోక్, నాగరాజు, సరోజమ్మ, భగవంతులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన జిల్లా ఏఎస్పీ షేక్షావలి ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. బస్సు డ్రైవర్ అతివేగం, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో బస్సు డ్రైవర్ మద్దిలేటి లొంగిపోయాడు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. మిన్నంటిన రోదనలు.. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. వైద్యం కోసమని వెళ్లిన తమ వారు.. రక్తమోడుతూ విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు పెద్ద దిక్కెవరు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద కూడా మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. కల్లపరికి చెందిన ఆరుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. మారెప్ప, లక్ష్మీదేవి, హుసేనమ్మ, సోమక్కలు రక్తసంబంధీకులు. వీరంతా ప్రమాదంలో మృతి చెందడంతో.. వారి కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతం. కాగా, మృతుల కుటుంబసభ్యులను ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నేత మురళీకృష్ణ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
‘జంబ లకిడి పంబ’ మూవీ రివ్యూ
టైటిల్ : జంబ లకిడి పంబ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిశోర్ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : జేబీ మురళీ కృష్ణ నిర్మాత : ఎన్ శ్రీనివాస్ రెడ్డి, రవి, జోజో జోస్ 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ క్లాసిక్ జంబ లకిడి పంబ. ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించటమే కాదు కామెడీలో కొత్త ఒరవడికి తెరలేపింది. అయితే ఇన్నేళ్ల తరువాత అదే కాన్సెప్ట్ తో అదే టైటిల్ తో మరో సినిమా తెర మీదకు వచ్చింది. కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో క్లాసిక్ సినిమాలను టచ్ చేసిన చాలా మంది ఫెయిల్ అయ్యారు. మరి ఆ ట్రాక్ రికార్డ్‌ను ఈ సినిమా బ్రేక్ చేసిందా..? కథ : వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక కలిసి జీవించలేం అని నిర్ణయించుకున్న వరుణ్, పల్లవిలు విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్ లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ (పోసాని కృష్ణమురళీ) వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్ గా గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకుంటాడు. కానీ వరుణ్, పల్లవికి విడాకులు రాకముందే హరిశ్చంద్ర ప్రసాద్ ఓ యాక్సిడెంట్లో భార్యతో సహా చనిపోతాడు. (సాక్షి రివ్యూస్) చేసిన పాపల కారణంగా ఆత్మగా మారిన హరిశ్చంద్ర ప్రసాద్ భార్యకు దూరమవుతాడు. తిరిగి తన భార్యను కలుసుకోవాలంటే వరుణ్, పల్లవిలను ఒక్కటి చేయమని దేవుడు(సుమన్) కండిషన్ పెడతాడు. దీంతో తిరిగి భూలోకంలోకి వచ్చిన హరిశ్చంద్రప్రసాద్ ఏం చేశాడు..? వరుణ్ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి శరీరంలోకి వరుణ్ ఆత్మని ఎందుకు మార్చాల్సి వచ్చింది..? చివరకు వరుణ్, పల్లవిలు ఒక్కటయ్యారా..? లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా మంచి ఇమేజ్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. కొన్ని సీన్స్ లో లవర్ భాయ్లా కనిపించే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కామెడీ పరంగా మాత్రం తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని మంచి నటన కనబరించారు. చాలా సీన్స్ లో శ్రీనివాస్ రెడ్డిని డామినేట్ చేశారు.(సాక్షి రివ్యూస్) ముఖ్యంగా వరుణ్ ఆత్మ తనలోకి వచ్చిన తరువాత వచ్చే సీన్స్ లో చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో మరో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి. తనకు అలవాటైన పాత్రలో పోసాని మరోసారి మంచి నటన కనబరిచారు. ఇతర నటీనటులకు పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు దక్కలేదు. విశ్లేషణ : జంబ లకిడి పంబ లాంటి క్లాసిక్‌ను టచ్ చేసే ధైర్యం చేసిన దర్శకుడు మురళీ కృష్ణ ఆ స్థాయిలో అలరించటంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా టీవీ సీరియల్ సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. (సాక్షి రివ్యూస్)కామెడీ సినిమా అనుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు హర్రర్ కామెడీ, ఎమోషనల్ డ్రామాలను చూపించటం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరో హీరోయిన్ల శరీరాలు మారిన తరువాత కూడా కథనం ఆసక్తికరంగా సాగలేదు. సెకండ్‌హాఫ్ లో మరింతగా కామెడీ పండించే అవకాశాలు ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా ఎమోషనల్ డ్రామాగా మీద దృష్టి పెట్టడం, కామెడీ ఆశించే ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. జంబ లకిడి పంబ లాంటి టైటిల్ ను ఎంచుకున్న దర్శకుడు ఆ స్థాయిలో నవ్వు తెప్పించే సన్నివేశాలు రాసుకోవటంలో విఫలమయ్యారు.(సాక్షి రివ్యూస్) గోపి సుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అనవసర సన్నివేశాలకు కత్తెర వేస్తే సినిమా కాస్త ఆసక్తికరంగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : టైటిల్ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : బలమైన కథ లేకపోవటం ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవటం నెమ్మదిగా సాగే కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఫుల్ ఫన్.. నో లెసన్
‘‘జంబ లకిడి పంబ’ కథను 116 మందికి చెప్పాను. అందరికీ నచ్చింది. కానీ, రెండో సగంలో ఆత్మలు మారడం అనేది చాలెంజింగ్ పార్ట్ కావడంతో సినిమా ప్రారంభం ఆలస్యమైంది’’ అని డైరెక్టర్ జె.బి.మురళీ కృష్ణ(మను) అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబ లకిడి పంబ’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు జె.బి.మురళీకృష్ణ పలు విశేషాలు పంచుకున్నారు. ► నేను పుట్టింది, పెరిగింది విజయనగరంలో. మా నాన్నగారు మలయాళీ, అమ్మ తెలుగు కుటుంబానికి చెందినవారు. అందుకే తెలుగు బాగా మాట్లాడుతున్నా. విక్రమ్ కుమార్‌గారి వద్ద ‘మనం’ చిత్రానికి సపోర్టింగ్ రైటర్‌గా పనిచేశా. ‘దృశ్యం’ సినిమా మలయాళం, తెలుగు, తమిళ వెర్షన్స్‌కు దర్శకత్వ శాఖలో పని చేస్తూనే, ఓ చిన్న పాత్ర చేశా. ► ఈ కథకు ముందు ‘కుడి ఎడమైతే’ టైటిల్ అనుకున్నా. ఆత్మలు మారే కథ కాబట్టి ‘జంబలకిడి పంబ’ టైటిల్ పెడితే కాస్త మైలేజ్ వస్తుందని శ్రేయోభిలాషులు చెప్పడంతో పెట్టాం. అయితే.. ఆ టైటిల్ పెట్టేటప్పుడూ.. ఇప్పుడూ భయంగానే ఉంది. పాత ‘జంబ లకిడి పంబ’ రేంజ్‌ను ఊహించుకుని ప్రేక్షకులు వస్తారేమోనని. మా సినిమా ఈవీవీగారి సినిమా రేంజ్లో ఉంటుందని చెప్పడం అహంకారం అవుతుంది. అయితే.. ఆ సినిమా పేరు మాత్రం పోగొట్టను. స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఫన్ ఉంటుంది. ఎక్కడా పాఠాలు చెప్పలేదు. ► శ్రీనివాసరెడ్డిగారు అయితేనే ఈ పాత్రకి న్యాయం చేయగలరనిపించింది. 36 మందిని ఆడిషన్స్ చేసి సిద్ధి ఇద్నాని తీసుకున్నాం. నా ప్రజెంట్, ఫ్యూచర్ ‘జంబ లకిడి పంబ’ చిత్రమే. దాని తర్వాత ఇంకా ఏమీ ఆలోచించలేదు. రెండు, మూడు అవకాశాలు వచ్చాయి. బౌండెడ్ స్క్రిప్ట్‌లు 5 ఉన్నాయి. -
‘జంబ లకిడి పంబ’ టీజర్ విడుదల
-
‘జంబ లకిడి పంబ’ టీజర్ రిలీజ్ చేసిన నాని
శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై తెరకెక్కిన సినిమా జంబ లకిడి పంబ. జె.బి.మురళీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను హీరో నాని గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ - ‘ ఈవీవీగారి ‘జంబ లకిడి పంబ’ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్ తో సినిమా అనగానే, అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . కరెక్టుగా టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది. మనం ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కాన్సెప్ట్ ఇది. చాలా ఫన్ గా, సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది . ఇక శ్రీనివాస్ రెడ్డి చేస్తే తిరుగేముంది! నాకిష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే ఫస్ట్ నుంచి నాకిష్టం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ గారంటీ. నాలుగైదు సీన్స్ లో కనిపించినా ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే ‘జంబ లకిడి పంబ’ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోండి. ఈ టీజర్ ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.’ అన్నారు. చిత్రయూనిట్ సమయం కేటాయించి టీజర్ రిలీజ్ చేసినందుకు నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
నిలోఫర్‌లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్ నిలోఫర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్‌కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అవగాహనా రాహిత్యం వల్లే.. కాగా, ధృవన్ అంశంపై నిలోఫర్ సూపరెండెంట్ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్ గ్రూప్ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్ విశ్వధాత కావున సదరు బ్లడ్ గ్రూప్ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు. -
సచివాలయ ఉద్యోగుల అధ్యక్షునిగా మురళీకృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అ«ధ్యక్షునిగా వి.మురళీకృష్ణ ఎన్నికయ్యారు. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన 229 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 1,268 మంది ఓటర్లుండగా.. 1,183 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో మురళీకృష్ణకు 706 ఓట్లురాగా.. ప్రత్యర్థి వెంకట్రామిరెడ్డికి 477 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా జి.రామకృష్ణ, ఉపాధ్యక్షునిగా ఎస్.రమణయ్య, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇందిరారాణి, అదనపు కార్యదర్శిగా ఐపీఐ నాయుడు, సంయుక్త కార్యదర్శిగా ఎన్.ప్రసాద్, మహిళా సంయుక్త కార్యదర్శిగా వి.సూర్యకుమారి, స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీగా ఎన్ఎస్ పవన్‌కుమార్, కోశాధికారిగా బి.రామ్‌గోపాల్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఆర్‌ఎంజే నాయక్ వ్యవహరించారు. అధ్యక్షునిగా ఎన్నికైన మురళీకృష్ణకు పలువురు ఉద్యోగులు పూలమాలలేసి అభినందనలు తెలియజేశారు. -
గోదారి తీరం కన్నీటి రాగం
సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్, ఫ్రెంచ్ శెవాలియర్ అవార్డు గ్రహీత డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ మృతితో సంగీతాభిమానులు శోకసాగరంలో మునిగిపోయారు. గోదారమ్మ ఒడిలో కనులు తెరిచిన బాలమురళి భారతీయ శాస్రీ్తయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సంగీత ప్రపంచ మేరునగ ధీరుడు. తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి స్థలం కేటాయింపునకు ఆయన విశేష కృషి చేశారు. నేటికీ ఆయన గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవాసమితి నిధికి శాశ్వత సభ్యుడు. 2003 పుష్కరాలలో ఆయన నగరానికి వచ్చి, అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో శారదానగర్‌లోని ఒక పార్కుకు నగర పాలక సంస్థ ఆయన పేరుపెట్టింది. ఆ కార్యక్రమానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినా, నాటి మునిసిపల్ కమిషనర్‌కు ఫోను ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. – రాజమహేంద్రవరం కల్చరల్ సంగీత సభ ఏర్పాటు రాజమహేంద్రవరానికి చెందిన బాలమురళి వీరాభిమాని సాగి శ్రీరామచంద్రమూర్తి 1995లో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట సంగీత సభను నెలకొల్పారు. ఏటా ఆయన పుట్టిన రోజున సంగీత సభలు నిర్వహించడం, సంగీత కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన పుట్టిన రోజున గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయంలో బాలమురళి పేరిట పూజలు చేసి, ప్రసాదాన్ని ఆయనకు పంపేవారు. ఆయన మరణ వార్తవిని నగర ,ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏటా ఆయన పుట్టినరోజు నిర్వహిస్తున్నా డాక్టర్ బాలమురళీకృష్ణ సభ ఆధ్వర్యంలో 1995 నుంచి ఎందరో పెద్దల సహకారంతో క్రమం తప్పకుండా ఏటా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాను. నా మనుమడికి ఆయన పేరే పెట్టుకున్నాను. ఇక్కడ నిర్వహించే ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వస్తానని చెప్పారు. ఆ మంచి రోజు రాకుండానే ఆయన కన్నుమూయడం బాధాకరం. – సాగి శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ వ్యవస్థాపక కార్యదర్శి, రాజమహేంద్రవరం తొలి సంగీత కచేరీ కాకినాడలోనే.. కాకినాడ కల్చరల్ : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాల మురళీకృష్ణకు కాకినాడ నగరంతో మంచి అనుబంధం ఉంది. బాలమురళి ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఆయన తొలి సంగీత కచేరీ సూర్యకళా మందిర్‌లోనే నిర్వహించారు. అభ్యుదయ ఫౌండేషన్ 5 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సూర్యకళా మందిర్‌లో 2013 జనవరి 13న నిర్వహించిన అభ్యుదయ సంప్రదాయ సాంస్కృతిక వైభవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంగీత కచేరీ నిర్వహించి సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధులను చేశారు. సూర్యకళా మందిరం శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని 2004 అక్టోబర్‌లో భవనాన్ని ఆధునికీకరించారు. ఈ భవనాన్ని బాలమురళీకృష్ణ ప్రారంభించారు. కాకినాడలోని సంగీత విద్వాంసులు మునిగంటి వెంకట్రావు, డాక్టర్ ఇ.వి.కృష్ణమాచార్యులు, పెద్దాడ సూర్యకుమారిలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. రాజమహేంద్రవరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తా కొత్తపేట : ప్రముఖ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, నేపథ్య గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తీరని లోటని ప్రముఖ శిల్పి, ఉభయ గోదావరి జిల్లాల సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు డి.రాజ్‌కుమార్ వుడయార్ నివాళులర్పించారు. మంగళంపల్లి మృతి చెందారన్న వార్త తెలిసి రాజ్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. వివిధ సందర్భాల్లో బాలమురళీకృష్ణతో మంచి పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి తాను రూపొందించిన పలు విగ్రహాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆవిష్కరించినప్పుడు ఆయన తనకు ఫోన్ చేసి అభినందించేవారన్నారు. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని తన వుడయార్ ఫై¯న్ ఆర్ట్స్ గ్యాలరీ వద్ద మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఉన్న పార్కులో ఆయన జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జూలై 6న మంగళంపల్లి విగ్రహాన్ని నెలకొల్పుతానని రాజ్‌కుమార్ తెలిపారు. – ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్ -
రోడ్డు ప్రమాదంలో ఐసీఐసీఐ ఉద్యోగి మృతి
ఎర్రగడ్డలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి మృత్యువాతపడ్డాడు. జేఎన్టీయూలోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మురళీకృష్ణ బైక్‌పై వెళ్తుండగా మెట్రోస్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యాంకర్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
'రేపు సాయంత్రం కల్లా డిసైడ్ చేస్తాం'
- హైదరాబాద్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల తిరుగుప్రయాణం - ఏ శాఖకు ఏ బ్లాక్ అన్నది ఇంకా కేటాయింపు జరగలేదు: మురళీ కృష్ణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమైయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెలగపూడికి వెళ్లిన ఉద్యోగులు తాత్కాలిక సచివాలయం భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులంతా అక్కడి నుంచి తిరుగుప్రయాణమైయ్యారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ఏ శాఖకు ఏ బ్లాక్ అన్నది ఇంకా కేటాయింపు జరగలేదని వెల్లడించారు. రేపు సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ఏపీ సచివాలయ ఉద్యోగులు వారి శాఖలకు వస్తారని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
ఉద్యోగుల తరలింపులో అధికారుల వైఫల్యం
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సాక్షి, హైదరాబాద్: సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశంలో అధికారులు వైఫల్యం చెందారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విమర్శించారు. సోమవారం ఆయన సచివాలయ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. వెలగపూడికి ఉద్యోగులను తరలింపునకు నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడానికి అధికారులే కారణమన్నారు. తరలింపులో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని.. రాబోయే 5,6 నెలలు ఉద్యోగులకు గడ్డు కాలమని చెప్పారు. తరలింపును మూడు నెలలు వాయిదా వేసినంత మాత్రాన ఆ సమస్యలన్నీ తీరవని స్పష్టం చేశారు. జూన్ 27 నుంచి వెలగపూడి నుండి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారని, దానికనుగుణంగా కొత్త రాజధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుందని భావిస్తున్నామన్నారు. తాత్కాలిక సచివాలయంలో భవన నిర్మాణాలను బట్టి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. కొత్త రాజధానిలో అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాలంటే సాధ్యం కాదని.. ఉద్యోగులు కూడా కొంతమేరకు సర్దుకుపోవాలని సూచించారు. ఉద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్‌కు హితవు పలికారు. ప్రస్తుతం వేతనం తగ్గకుండా హెచ్ఆర్ఏ ఇవ్వాలని సీఎంను కోరామని.. త్వరలో స్థానికత, 30 శాతం హెచ్ఆర్ఏపై జీవో విడుదల చేసే అవకాశముందని చెప్పారు. సెప్టెంబరు నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని.. పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు మురళీకృష్ణ తెలిపారు. ఉద్యోగుల్లో ‘తరలింపు’ గందరగోళం ఏపీ సచివాలయం ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 27కల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లాలన్న ఆదేశాలపై గందరగోళం నెలకొందని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించడంలో ఉద్యోగ సంఘ నాయకులు విఫలం కావడమే ఈ అయోమయ పరిస్థితికి కారణమని ఏపీ సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు.. స్థానికత అంశం తేల్చలేదు.. కొత్త రాజధానిలో ఉద్యోగులకు వసతి కల్పించలేదు.. తాత్కాలిక సచివాలయ భవనాలు పూర్తి కాలేదు.. రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సౌకర్యాలను కల్పించలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో తరలింపు ఉంటుందా అని ఉద్యోగులు మధనపడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇవేవి పట్టించుకోకుండా మీడియాలో మైకు దొరికినప్పడల్లా జూన్‌కు తరలిరావడానికి మేం సిద్ధం అని చెప్పడాన్ని ఆక్షేపించారు. కొత్త రాజధానికి వెళ్లడానికి అభ్యంతరం లేదని, అయితే దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. పిల్లల గురించి అడిగితే గొంతెమ్మ కోరికా?: కృష్ణయ్య పిల్లల స్థానికత గురించి తాము ఏడాది నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, అది గొంతెమ్మ కోరిక అవుతుందా అని ఏజీ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ అక్కడకు వెళ్లాల్సి వస్తుందని, మరి వాళ్ల పిల్లల సంగతి ఏమవ్వాలని ఆయన నిలదీశారు. -
భూ ప్రకంపనలు స్థానికమైనవే...
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోని కొన్ని చోట్ల ఆదివారం ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో వచ్చిన భూ ప్రకంపనలు స్థానికమైనవేనని విశాఖపట్నానికి చెందిన రిటైర్డు వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇలా అక్కడక్కడా అప్పుడప్పుడూ భూమి కంపించడం సర్వసాధారణమేనని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
అమరావతికి అప్పుడేనా?
హైదరాబాద్: వచ్చే నెలలో అమరావతికి తరలి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. సౌకర్యాలు లేకుండా అక్కడి వెళ్లలేమని చెబుతున్నారు. హడావుడిగా తమను తరలించాలనుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత తెల్పుతున్నారు. జూన్ లోనే తరలివెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాది సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సురక్షితంగా తరలిస్తుందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పడంపై సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీలు ఇవ్వకుండా ఎలా వెళ్లగలమని ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే ఉద్యోగుల అభ్యంతరాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినా అంగీకరించలేదని మురళీకృష్ణ చెప్పారు. ఉద్యోగుల తరలింపులో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. మరోసారి ప్రభుత్వంతో మాట్లాడాలని మురళీకృష్ణను ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
‘జూన్ 30 నాటికి అమరావతి వెళ్తాం’
హైదరాబాద్: జూన్ 30 నాటికి తాము అమరావతికి వెళ్లడం ఖాయమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ... తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామన్నారు. విభజన కారణంగా ముందుగా నష్టపోయింది ఉద్యోగులేనని అన్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నందున తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతికి వెళ్లే ఉద్యోగులకు తలెత్తే సమస్యలను సీఎం, సీఎస్ దృష్టికి తీసువెళ్లి పరిష్కరించుకుంటామని మురళీకృష్ణ తెలిపారు. -
కమల్‌నాథన్ కమిటీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల విభజనలో కమల్‌నాథన్ కమిటీ పనితీరు సరిగా లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ విమర్శించారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన చేయాల్సిన కమల్‌నాథన్ కమిటీ కాలయాపన చేస్తోందన్నారు. జూన్ ఆఖరు నాటికి ఆంద్రప్రదేశ్ సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్నా.. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కమల్‌నాథన్ కమిటీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజనలో పునర్విభజన చట్టాన్ని తుంగలోతొక్కుతోన్న కమల్‌నాథన్ కమిటీపై గవర్నర్, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
'కమల్‌నాథన్ కమిటీపై సీఎంకి ఫిర్యాదు చేస్తాం'
హైదరాబాద్ : కమల్‌నాథన్ కమిటీ తీరు సరిగా లేదని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు, సీఎస్ ఎస్పీ టక్కర్‌కి ఫిర్యాదు చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మురళీకృష్ణ మాట్లాడుతూ... ఓ వైపు జూన్‌లో తరలి వెళ్లమంటున్నారు...కానీ ఇప్పటి వరకు తుది కేటాయింపులు పూర్తి కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఏపీ ఉద్యోగుల అభ్యంతరాల నేపథ్యంలో కమల్‌నాథన్ కమిటీ ఈ రోజు సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది. -
కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
అంగన్వాడి కేంద్రంలో కుక్కర్ పేలి నలుగురు విద్యార్థులు గాయపడిన ఘటన బుధవారం డాబాగార్డెన్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని 21వ వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో అన్నం వండుతుండగా ప్రమాదవశాత్తు కుక్కర్పేలి మురళీకృష్ణ (4) , దీపక్ (4), మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కింగ్ జార్జ్ ఆసుపత్రికు తరలించారు. -
మురళీకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా పోస్టర్లు
హైదరాబాద్: ఉద్యోగుల తరలింపు వ్యవహారంలో ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ వ్యవహరిస్తున్నారంటూ సచివాలయంలో మంగళవారం పోస్టర్లు వెలిశాయి. ఇవి సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి పేరిట ఉన్నాయి. కొత్త రాజధానికి వెళ్లడానికి ఉద్యోగులను సిద్ధం చేసినట్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, నాయకుడు అలా చేయడం ధర్మం కాదని అందులో పేర్కొన్నారు. ఈ ధోరణిని ప్రశ్నించకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుందని, మరింతగా నష్టపోవాల్సి ఉంటుందని ఉద్యోగులను హెచ్చరించారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
డిఫరెంట్ జానర్లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మౌనం’. మురళీకృష్ణ, భానుశ్రీ ముఖ్యతారలుగా కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఈ చిత్రానికి శ్రీలేఖ మంచి పాటలతో పాటు చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. త్వరలో కొలంబోలో పాటలను చిత్రీకరించనున్నాం’’ అని తెలిపారు, ఈ చిత్రానికి కథ: అనిల్.కె.నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బలుసు రామారావు. -
రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలి
గుంటూరు కలెక్టర్, ఎస్పీలకు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ వినతి గుంటూరు ఈస్ట్: 'యూనివర్సిటీలో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు నాలా పిల్లల్ని కోల్పోయి బాధపడకుండా ఉండాలంటే రిషితేశ్వరి కేసుపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. ఈ కేసులో పోలీసులు హడావుడిగా చార్జిషీటు దాఖలు చేస్తున్నారనే విషయం తెలుసుకుని మరోసారి కలెక్టర్‌ను కలసి న్యాయం చేయాలని కోరడానికి వచ్చాను' అని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ పేర్కొన్నారు. ఈ కేసును పోలీసుల నుంచి సీబీఐకు బదలాయించాలని ఆయన ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దం డేను కలెక్టరేట్లో కలసి వినతిపత్రం అందించారు. అనంతరం ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిల ఆఫీసుల్లో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబూరావును ఏ-1 ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చేర్చడంతోపాటు, రిషితేశ్వరి డైరీలో రాసుకున్న విద్యార్థులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రిషితేశ్వరి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
'నా కూతురు కేసును సీబీఐకి ఇవ్వండి'
గుంటూరు: తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్‌ను, అర్బన్ ఎస్పీని కలిసి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యకరంగా వ్యవహరించినట్లు డైరీలో రాసినందున అతడ్ని కూడా విచారించాలని కోరారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ బాబూరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు కేసును హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు. ఇవన్నీ పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని కూడా మురళీకృష్ణ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
సీఎం చంద్రబాబుకు రిషితేశ్వరి తండ్రి లేఖ
-
రిషితేశ్వరి మృతి సామాజిక సమస్య
* విలేకరులతో విద్యార్థిని తండ్రి మురళీకృష్ణ * బెయిల్ పిటిషన్ కేసు నేటికి వాయిదా సాక్షి, గుంటూరు: రిషితేశ్వరి మృతి సంఘటన తన ఒక్కడి సమస్య కాదని, దీనిని సామాజిక సమస్యగా భావించాలని ఆమె తండ్రి మురళీకృష్ణ చెప్పారు. రిషితేశ్వరి మృతికేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులు హనీ షా, జయచరణ్, శ్రీనివాస్‌ల బెయిల్ పిటిషన్‌పై బుధవారం గుంటూరులోని ఒకటో అదనపు సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. దీన్ని గురువారానికి వాయిదా వేస్తూ ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపీనాథ్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్ బాబూరావును వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. -
'లైంగిక వేధింపులకు ప్రిన్సిపాలే కారకుడు'
వరంగల్:నాగార్జున యూనివర్శిటీలో తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపాల్ బాబూరావే కారకుడని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి యూనివర్శిటీల్లో మరే ఇతర అమ్మాయికి ఇలా జరగకూడదన్నారు. అప్పుడే తన కుమార్తె జీవించి ఉన్నట్లు భావిస్తానని తెలిపారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు ప్రిన్సిపాల్ బాబూరావునే కారణమని.. ఆ ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందేనని కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ నేరం చేసినందుకు బాబూరావుకు ఎలాంటి శిక్షా విధించలేదన్నారు. లైంగిక వేధింపులకు పూర్తిస్థాయి సహకారాన్ని ప్రిన్సిపాల్ అందించారన్నారు. హాయ్ లాండ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తితో ప్రిన్సిపాల్ అవార్డు ఇప్పించడమేమిటని ప్రశ్నించారు. ఆ అవార్డు ఇచ్చిన ఫోటో తీసి అందరికీ షేర్ చేసుకోవాల్సిన అవసరమేమిటన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డ బాబూరావుకు ఎలాంటి శిక్ష విధిస్తారని మురళీకృష్ణ అడిగారు. -
కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించాలి
రిషితేశ్వరి తల్లిదండ్రుల డిమాండ్ వర్సిటీ తెరిచిన తర్వాత విచారణ కొనసాగించాలి ఏపీ సీఎం చంద్రబాబుతో దుర్గాబాయి, మురళీకృష్ణ భేటీ విజయవాడ బ్యూరో: రిషితేశ్వరి కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగించడం ద్వారా వీలైనంత త్వరగా విచారణ పూర్తయ్యేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి సెలవులు ఇచ్చి విచారణ చేస్తే చాలామంది విద్యార్థులు అందుబాటులో లేక అసలు విషయాలు తెలియవని, అందువల్ల వర్సిటీ తెరిచిన తర్వాత విచారణ కొనసాగించాలని కోరారు. ఈ కేసు ఏళ్ల తరబడి సాగితే ఘటనకు సాక్షులుగా ఉన్న విద్యార్థులు రెండు, మూడేళ్లలో తమ చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోతారని, న్యాయం జరిగే అవకాశాలు సన్నగిల్లుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీలో యాజమాన్యపరమైన లోపాలు అనేకం ఉన్నాయని ముఖ్యమంత్రికి చెప్పామని, ర్యాగింగ్‌లపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ప్రిన్సిపల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. తమకు మీడియా, విద్యార్థి సంఘాలు కొండంత అండగా నిలిచాయని చెప్పారు. ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు ‘మా బిడ్డలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. భవిష్యత్తులో మరే ఆడపిల్లా బలి కాకూడదు. ఇకనుంచి ఏ వర్సిటీ లోనూ ర్యాగింగ్‌కు చోటు ఉండకూడదు. ర్యాగింగ్‌ను రూపుమాపడం ద్వారా మా రిషితేశ్వరి అందరికీ గుర్తుండేలా చేయాలి..’ అని రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరారు. వర్సిటీ తెరిచిన తర్వాత కూడా విచారణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ర్యాగింగ్ నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం విజయవాడలో రిషితేశ్వరి తల్లిదండ్రులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వర్సిటీకి సెలవులు ఇచ్చి విచారణ చేయడం వల్ల వాస్తవాలు వెలుగులోకి రావని రిషితేశ్వరి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ తెరిచిన తరువాత మరో రెండురోజులు విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ర్టంలోని అన్ని వర్సిటీల వైస్ చాన్సలర్లతో సమావేశం నిర్వహించి ర్యాగింగ్ నిరోధానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. రిషితేశ్వరి కేసులో న్యాయం చేయాలి ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యార్థుల ధర్నా.. విజయవాడ బ్యూరో: రిషితేశ్వరి కేసులో న్యాయం చేయాలని నినదిస్తూ విజయవాడలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు లాఠిచార్జి చేశారు. విజయవాడలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించే సమయంలో సీఎం క్యాంపు కార్యాలయ ప్రధాన గేటు వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు ధర్నాకు దిగగా.. విద్యార్థి నాయకులు సహా 30 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం తక్షణం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
'జీతం పెంచుతాం... సమ్మె వరమించండి'
మున్సిపల్ శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీ కృష్ణ గౌడ్ జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా) : మున్సిపాలిటీలలో అవుట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులకు రూ.10,200 జీతం ఇస్తామని, వారు వెంటనే సమ్మె విరమించాలని మున్సిపల్ శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన కార్మిక సంఘం నేతలతో సమావేశమయ్యారు. అనంతపురం రీజియన్ పరిధిలో 39 మున్సిపాలిటీలు ఉండగా, తొమ్మిదింటిలో కార్మికులు సమ్మెలో పాల్గొనలేదన్నారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు నిమగ్నమైనందున పారిశుద్ధ్య కార్మిక నేతలతో చర్చించే పరిస్థితి లేదన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతం రూ.10,200కు పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో వారు వెంటనే సమ్మె విరమించాలన్నారు. కార్మికులు కోరుతున్నట్లు జీతం పెంచాలంటే ప్రజలపై పన్ను భారం మరింతగా మోపాల్సి ఉంటుందన్నారు. ప్రొద్దుటూరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతిలో రెగ్యులర్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం భావ్యం కాదన్నారు. బుధవారంలోగా వారు విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పుష్కరాల నెపం చూపి తమ సంఘం నేతలతో ప్రభుత్వం మాట్లాడక పోవడం దారుణం అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ తాతిరెడ్డి తులసి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి పాల్గొన్నారు. -
'ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలి'
హైదరాబాద్:కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడిని ఏపీ పంచాయతీ రాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ ఖండించారు. ఆమె దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వనజాక్షికి ఉద్యోగులమంతా అండగా ఉంటామని మురళీకృష్ణ హామీ ఇచ్చారు. -
'సంక్రాంతిలోపు చర్చలకు ఆహ్వానిస్తామన్నారు'
హైదరాబాద్: పీఆర్సీ సిఫార్సులపై ఏపీ ఉద్యోగ సంఘాల అసంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు రోజుల్లో పూర్తిస్థాయి పీఆర్సీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పీఆర్సీపై మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం చర్చలు జరిపారు. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విమర్శించారు. తమకిచ్చిన నివేదికలో కేవలం ఫిట్మెంట్ అంశం మాత్రమే ఉందని, ఇంకా చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. కుటుంబానికి ముగ్గురిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం పీఆర్సీలోని అశాస్త్రీయతకు నిదర్శనమన్నారు. కనీసం నలుగురు సభ్యులను కుటుంబంగా పరిగణించి ఇతర ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వానికి కోరినట్టు చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత సంక్రాంతిలోపు చర్చలకు ఆహ్వానిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారని తెలిపారు. -
'మాకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ సర్కారు తమకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. హుదూద్ తుపాను కారణంగానే ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగినట్టు భావిస్తున్నట్టు చెప్పారు. తమ ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఆరోగ్య కార్డులు ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
సీఎస్ఆర్తో ఉపాధి అవకాశాలు లభించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు (సీఎస్ఆర్) ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉండాలని అమరరాజా బ్యాటరీస్ మాజీ సీఎఫ్‌వో సి. మురళీకృష్ణ చెప్పారు. సీఎస్ఆర్, కార్పొరేట్ గవర్నెన్స్ ఒక దాని వెంట మరొకటి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార, పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ, బోంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ సంయుక్తంగా కంపెనీల చట్టం 2013పై నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మురళీకృష్ణ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, కంపెనీల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన కొత్త కంపెనీల చట్టం.. దేశీయంగా కార్పొరేట్ రంగం వృద్ధికి తోడ్పడగలదని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ కుమార్ రుంగ్టా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంలో తోడ్పడేందుకు ఫ్యాప్సీ అంతర్గతంగా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. -
పశువులు ఈనే ముందు..ఈనిన తర్వాత..
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన త ర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువులు ఈనే సమయంలో పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. పశుపోషకులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువులు ఈనే ముందు.. చూడి పశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. వాటిని మందతో పాటు బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు. ఈనిన తర్వాత.. వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుని సంప్రదించాలి. మాయని ఆశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి, రక్తస్రావం కలిగి పశువులు తిరిగి పొర్లకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పశువు మరణించే ప్రమాదం ఉంది. ఈనిన తర్వాత పశువులు మాయ తినకుండా జాగ్రత్త పడాలి. ఆధిక పాల దిగుబడి ఉండే పశువులు ఈనిన వెంటనే రెండు రోజుల వరకు పాలను సంపూర్ణంగా పితకకూడదు. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత విటమిన్ డీ ఇవ్వాలి. -
సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
-
సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
ఏలూరు: ఏలూరు నగర వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏలూరులో ఎస్పీ రఘురామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... విధుల పట్ల సీఐ మురళీకృష్ణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారించారని తెలిపారు. పెద్ద అవుటపల్లి కాల్పు ఘటనలో సీఐ మురళీకృష్ణ పాత్రపై అనుమానాలు ఉన్నాయని... వాటిని నిర్థారించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా సీఐ మురళీకృష్ణతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో దొంగల నుంచి భారీగా బంగారం, నగదు సీఐ మురళీకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును ఆయన కోర్టులో డిపాజిట్ చేయకుండా అతడి వద్దే ఉంచుకున్నారు. అలాగే నగదును తన సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయం పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులుగా వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మురళీకృష్ణపై ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేస్తూ డీఐజీ హరికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదికాక గత వారం విజయవాడ సమీపంలో మద్రాసు - కోల్కత్తా జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం పినమడక గ్రామస్తులుగా నిర్థారించారు. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ హస్తం ఉందేమోనని... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పశువులు ఈనే సమయంలో జాగ్రత్త అవసరం
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన తర్వాత జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంతో కొన్ని సార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమయంలో పశుపోషకుడు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువులు ఈనే ముందు.. చూడిపశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. మందతో బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు. పశువు ఈనే సమయంలో.. పశువును, కొష్టాన్ని శుభ్రపరచాలి. ఈనడానికి రెండు గంటల ముందు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలను ఉడికించి పెట్టాలి. పచ్చిగడ్డి కూడా కొద్దిగా వేయాలి. ఈనే ముందు పచ్చిగడ్డి సరిగా తినవు. పారుకుంటూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈనే సమయం దగ్గర పడినప్పుడు బొడ్డు కింద నీరు చేరుతుంది. ముర్రుపాలు కనపడతాయి. ఆరోగ్యవంతమైన పశువు ఈనే ముందు ఇబ్బందిపడుతూ అరగంట నుంచి ఆరు గంటల్లోనే ఈనుతాయి. ఆరు గంటలు మించితే వైద్యుడి సహాయం తీసుకోవాలి. ఈనే ముందు సాధారణంగా లేగదూడ ముందరికాళ్లు, ముట్టె ముందు బయటకు వస్తాయి. సాధ్యమైనంతవరకు పశువు దానంతట అదే ఈనేందుకు ప్రయత్నించాలి. ఈనిన తర్వాత.. వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుడి సహాయం తీసుకోవాలి. మాయని అశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సార్లు పశువు మరణించే అవకాశం ఉంది. అధిక పాలిచ్చే పశువులకు ఈనిన తర్వాత పాలజ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత వారం రోజులు పశువుకు విటమిన్-డి ఇవ్వాలి. -
వ్యాపారి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : చేపల వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి క్వాలీస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ చెప్పారు. వన్‌టౌన్ పోలీస్‌స్టే షన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన అజయ్‌కుమార్ సాహు చేపల వ్యాపారం చేస్తుంటాడు. ఏలూరు, పరిసర ప్రాంతాలలో చేపలను కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది జాన్ 26న ఏలూరు వచ్చి వన్‌టౌన్‌లోని ఒక లాడ్జిలో బసచేశాడు. ఇతను గతంలో గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన సేరు శ్రీనివాసరావుకు చేపల కొనుగోలు నిమిత్తం రూ.12 లక్షలను చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బును రాబట్టుకునేందుకు సేరు శ్రీనివాసరావు మరో నలుగురు వ్యక్తుల సహాయంతో క్వాలిస్ వాహనంలో లాడ్జికు వచ్చి అజయ్‌కుమార్ సాహును 26న సాయంత్రం కిడ్నాప్ చే శారు. అజయ్‌కుమార్ సాహుతో పాటు ఏలూరు వచ్చిన అతని సోదరుడు సంజయ్‌కుమార్ సాహుకు ఈ విషయం తెలిసి 27న ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రేపల్లెలోని సేరు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ చేయగా, అక్కడే ఉన్న అజయ్‌కుమార్ సాహును విడిపించి కిడ్నాప్కుపాల్పడిన శ్రీనివాసరావు, కొక్కిరిగడ్డ శివశంకరరావులను జూన్ 1న అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులు రేపల్లెకు చెందిన కంచర్ల ప్రభు, జ్యోతి బాబు, విజయవాడకు చెందిన కారుడ్రైవర్ పసుపులేటి రామకృష్ణ పరారయ్యారు. బుధవారం సాయంత్రం ఏలూరు పాత బస్టాండ్ వద్ద క్వాలిస్ వాహనంలో తిరుగుతున్న ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి క్వాలిస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ వివరించారు. -
పెళ్లికి ముందు.. ఆ తర్వాత..!
పెళ్లికి ముందు, ఆ తర్వాత... ఇంకా కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు? వాళ్లల్లో వచ్చే మార్పులేంటి? అనే కథాంశంతో రూపొందుతున్న ‘గుమ్మడికాయల దొంగలు’ హైదరాబాద్‌లో ఆరంభమైంది. డా. రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో అంతర్జాతీయ అవార్డ్గ్రహీత, ఛాయాగ్రాహకుడు కిషన్ సాగర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, జి. మురళీ కృష్ణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి శాంతయ్య కెమెరా స్విచాన్ చేయగా, శ్రీరవి క్లాప్ ఇచ్చారు. గత కొంత కాలంగా కాస్టింగ్ మేనేజర్‌గా వ్యవహరించిన తాను నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదనీ, షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలనే ఆశయంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాననీ నిర్మాత తెలిపారు. అంతర్జాతీయంగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నా, సొంత గడ్డపై సాధించాలనే ఆశయంతో ఈ చిత్రం చేస్తున్నానని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె. వీర, సంగీతం: శ్రీ వెంకట్. -
పెద్దపంజాణిలో వైఎస్సార్సీపీ కేతనం
- చక్రం తిప్పిన ఎమ్మెల్యే - ఎంపీపీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ - మండల ఉపాధ్యక్షురాలిగా సుమిత్ర పలమనేరు: అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్దపంజాణి మండల ఎంపీపీ కుర్చీ వైఎస్ఆర్ సీపీ ఖాతాలో చేరింది. దీంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు టీడీపీ, ఆరు వైఎస్ఆర్ సీపీ, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల మద్దతుతో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని టీడీపీ ఎత్తుగడ వేసింది. వారికి సారధ్యం వహించిన స్వతంత్ర అభ్యర్థి, ఎంఎల్సీ సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి సహకారం తీసుకోవాలని భావించారు. ఇటీవలి పరిణామాలతో సీన్ పూర్తిగా మారిపోయింది. విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం. ఏడుగురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎంపీపీ కుర్చీపై కన్నేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు చెంగారెడ్డి, రోజారెడ్డి చక్రం తిప్పడంతో అనూహ్యంగా ముగ్గురు స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీ బలం తొమ్మిదికి చేరుకుంది. టీడీపీ నుంచి ఎంపీపీగా నామినేషన్ వేసిన రామచంద్రకు ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో కోగిలేరు ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికిన ఇండిపెండెంట్ల ప్యానెల్ నుంచి అమ్మరాజుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర మండల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఓటింగ్‌కు స్వతంత్రుల ప్యానల్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ కంగుతినింది. -
కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి
సంతమాగులూరు : మండలంలోని కామేపల్లి, తంగేడుమల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడులకు తెగబడ్డారు. కామేపల్లిలో మంగళవారం సాయంత్రం గుండపనేని మోహన్‌రావు అనే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తపై ఆదే గ్రామానికి చెందిన కొల్లూరి శ్రీను కత్తితో దాడి చేసి గాయపరిచాడు. తంగేడుమల్లిలో బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ధూళిపాళ్ల సుశీల భర్త మురళీకృష్ణ అతని సోదరుడు నాగరాజుపై ఆదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మర్లపాటి శేషయ్య కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలతో ఆ రెండు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తంగేడుమల్లిలో.. తంగేడుమల్లి సర్పంచ్ ధూళిపాళ్ల సుశీల భర్త మురళీకృష్ణ ద్విచక్ర వాహనాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మర్లపాటి శేషయ్య తన ద్విచక్ర వాహనంతో రెండు రోజుల క్రితం ఢీకొట్టించాడు. ఆ విషయం అప్పటితో సమసిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగి వచ్చిన శేషయ్య తేల్చుకుందాం రమ్మంటూ బొడ్రాయి సెంటర్‌కు ధూళిపాళ్ల మురళీకృష్ణకు ఫోన్ చేసి పిలిచాడు. మురళీకృష్ణ బొడ్రాయి వద్దకు వెళ్లగానే శేషయ్య తిట్ల పురాణం అందుకున్నాడు. మురళీకృష్ణ నిలువరించబోగా కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. మురళీకృష్ణ తమ్ముడు నాగేశ్వరరావు పరుగున వచ్చి అడ్డుకోబోగా అతని చేతి వేళ్లకు కత్తి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. కామేపల్లిలో.. బాధితుల కథనం ప్రకారం మండలంలోని కామేపల్లిలో గుండపనేని మోహన్‌రావు, టీడీపీ కార్యకర్త కొల్లూరి శ్రీనుకు మధ్య పొలం వద్ద ముళ్ల కంచె వేసే విషయంలో వివాదం చెలరేగింది. ముళ్లకంచె వేసేందుకు అభ్యంతరం తెలిపిన మోహన్‌రావుపై కొల్లూరి శ్రీను తన చేతిలో ఉన్న కత్తి విసరడంతో మోహన్‌రావుకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. మురళీకృష్ణ నుంచి వాంగ్మూలం నరసరావుపేట వెస్ట్: మురళీకృష్ణ నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ వన్‌టౌన్ పోలీసులకు తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
వరద గూ(గో)డు
తుంగభద్ర ఉగ్రరూపం ఇప్పటికీ గుర్తే. ఆ దృశ్యాలు చెరిగిపోని చేదు జ్ఞాపకాలు. తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడొస్తుంది. ఊరూవాడా కొట్టుకుపోగా.. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలు కోకొల్లలు. ప్రాణమైతే మిగిలింది కానీ.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదిగో.. ఇదిగో అంటూ సరిపెట్టింది. అత్తెసరు సాయంతో మూతి పొడిచింది. గూడు పేరిట.. మొండి గోడలతో సరిపెట్టింది. ఆ నిర్లక్ష్యం ఇప్పటికీ వరద బాధితులను వెక్కిరిస్తోంది. కర్నూలు(రూరల్): ఐదేళ్లు గడిచినా వరద బాధితులకు గూడు కరువైంది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. నిర్మాణంలోని ఇళ్లను పూర్తి చేస్తామని.. తక్కినవి బాధితులే కట్టుకుంటే పరిహారం ఇస్తామనే హామీతో బాధ్యత నుంచి తప్పుకుంది. 2009లో వరదలు బీభత్సం సృష్టించగా.. ఆరు నెలల్లోపు బాధితులందరికీ పునరావాసం కల్పిస్తామని నమ్మబలికిన నేతలు ఆ తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడిక కొత్త ప్రభుత్వం చుట్టూ వీరి ఆశల ‘పందిరి’ అల్లుకుంటోంది. కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల, జి.శింగవరం, నిడ్జూరు, మునగాలపాడు, మామిదాలపాడు గ్రామాలను వరదలు తుడిచిపెట్టేశాయి. సుంకేసుల గ్రామంలో పునరావాస కాలనీలో 576 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 100 పూర్తి కాగా.. మిగతా ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. కాలనీలో మంచినీటి పైపులైన్లు, అంతర్గత రోడ్ల ఊసే కరువైంది. జి.శింగవరంలో 1039 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 692 పూర్తయ్యాయి. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంతర్గత రోడ్లు నిర్మించకపోవడం.. వీధి లైట్లు.. పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో వరద బాధితుల్లో ఇళ్లలో కాపురం ఉండేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అంతర్గత రోడ్లకు రూ.80 లక్షలు మంజూరైనా పనులు చేపట్టకపోవడం గమనార్హం. నిడ్జూరుకు 966 ఇళ్లు మంజూరు కాగా 654 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 200 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా.. మిగతా ఇళ్లకు సంబంధించి ఇప్పటికీ భూ సేకరణ కూడా చేపట్టకపోవడం వరద బాధితుల దుస్థితికి నిదర్శనం. ఇక్కడా పైపులైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. మామిదాలపాడులో 459 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా 2011లో ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, అప్పటి కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ భూమి పూజ చేశారు. ఆ తర్వాత 22 ఇళ్లకు మాత్రమే పునాది పడినా ఇప్పటికీ నిర్మాణం ఒక్క అడుగు కూడా కదలకపోవడం నేతల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. పైకప్పు ఏసినారంతే.. సెంటు భూమి లేదు. కూలికి పోతేనే పూట గడిచేది. 2009లో వచ్చిన వరదల్లో ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన తడికెలతో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాం. వానలకు అది కూడ కూలిపాయ. ఇప్పుడు చెట్ల కింద బతుకుతున్నాం. ఐదుగురు కూతుళ్ల పెండ్లిళ్లు సేయనీక శానా కష్టపడిన. ఇల్లు కట్టిస్తామని సెప్పిన సారోల్లు పైకప్పు ఏసి వదిలేసినారు. సిమెంట్ సేయలేదు. పేదలంటే అందరికీ లోకువే. కాలనీల ఉండలేకపోతున్నాం.- ఉసేనమ్మ, నిడ్జూరు ఇళ్ల మధ్య కంప సెట్లు వరదల్లో కట్టుబట్టలతో మిగిలినం. అప్పులు సేసి ఏసుకున్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నాం. ఇద్దరు కొడుకులున్నారు. కూలి పనికి పోతేనే పూట గడుస్తాది. మాలెక్కటోల్లకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తాదంటే సంతోషించిన. పనులైతే మొదలు పెట్టినారు కానీ సరిగ జరుగుతలేవు. కరెంటు, నీళ్లు, రోడ్లు లేక రేత్రిల్లు శానా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల మధ్య కంప సెట్లు పెరిగినాయి. యా సారూ మా బాధలు పట్టించుకోల్యా. మా బతుకులింతే.- మల్లికార్జునయ్య, జి.శింగవరం -
ఆప్షన్ల తరువాతే శాశ్వత కేటాయింపులు
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు తాత్కిలికమేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు అందిన తరువాత ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్న తరువాత శాశ్వత కేటాయింపులు చేస్తారని ఆయన చెప్పారు. రెచ్చగొట్టేలా తెలంగాణ ఉద్యోగులు మాట్లాడటం సరికాదని మురళీకృష్ణ అన్నారు. -
'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
-
'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, తమకు అండగా నిలబడాలని చంద్రబాబును కలిసినట్టు ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్‌బాబు, మురళీకృష్ణ తెలిపాయి. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారని చెప్పారు. రాష్ట్రపతి జీవో ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి సీమాంధ్ర ఉద్యోగులకు బాబు న్యాయం చేస్తామన్నారని తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడటం మంచిది కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తెలంగాణ ఉద్యోగులు రాద్ధాంతం చేస్తున్న 193 మంది తెలంగాణలో పుట్టి పెరిగినవాళ్లేనని వెల్లడించారు. గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలన్నారు. -
వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మురళీ కృష్ణ ఆ పార్టీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో మురళీ కృష్ణ కోడుమూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. -
కడియం సీఐపై అట్రాసిటీ కేసు
కడియం, న్యూస్‌లైన్ : కడియం ఇన్స్పెక్టర్ ఎన్బీ మురళీకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈనెల ఆరో తేదీన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సమయంలో సీఐ తనపై అనుచితంగా ప్రవర్తించారని వైఎస్సార్ సీపీ నాయకుడు, న్యాయవాది యాదల సతీష్‌చంద్రస్టాలిన్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లిన స్టాలిన్ డీఎస్పీ ఎన్ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సీఐ మురళీకృష్ణపై అట్రాసిటీ కేసు నమోదుచేసారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఐ తనను కులం పేరుతో దూషించారని, పిస్టల్ గుండెలకు గురిపెట్టి భయాందోళనకు గురిచేశారని స్టాలిన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కడియం ఎస్సై టి. నరేష్ 9వ తేదీన కేసు నమోదు చేశా రు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఎన్బీ మురళీకృష్ణ కడియం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వచ్చింది మొదలు దురుసుగా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ర్యాలీ లను చూసీచూడనట్టు వదిలేసిన ఈ అధికారి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను మా త్రం లక్ష్యంగా చేసుకుని వేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకులు కావాలనే ఆయనను ఇక్కడికి తెచ్చుకున్నారనే ప్రచారం జరిగింది. మురళీకృష్ణ కూడా ఇందుకు తగ్గట్టే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో జనం నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విధుల నుంచి తప్పించాలి అట్రాసిటీ కేసులో నిందితుడైన మురళీకృష్ణను తక్షణం విధులనుంచి తప్పించి నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేందుకు దోహదం చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. కేసు విచారణ సమయంలో ఇక్కడే విధులు నిర్వహిస్తుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈమేరకు చర్యలు తీసుకోవాలని డీజీపీని కలసి కోరినట్టు స్టాలిన్ విలేకరులకు చెప్పారు. పోలింగ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్న తనను జేగురుపాడు ఎస్సీ కాలనీ పోలింగ్‌బూత్ వద్ద సీఐ అకారణంగా దూషించి, అమానుషంగా ప్రవర్తించారన్నారు. పోలింగ్‌లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. సీఐ అనుచిత వ్యవహార శైలి, కడియం స్టేషన్లో అవకతవకలను డీజీపీకి వివరించినట్టు స్టాలిన్ తెలిపారు. రాజమండ్రిలో ఎస్సైగా పనిచేసిన సమయంలో కూడా మురళీకృష్ణపై పలు ఆరోపణలున్నాయని, అనుచిత ప్రవర్తన కారణంగా గతంలో సస్పెండ్ అయ్యారని చెప్పారు. -
కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు తీసుకోండి
ఆదోని టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, సమస్యాత్మక ప్రాంతాలు, అసాంఘిక శక్తులపై నిఘా తదితర వాటిపై సమీక్షించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఏ పార్టీవారినైనా వదలవద్దని సూచించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. అనుమానితులపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం డీఎస్పీ బంగ్లా ఆవరణంలోని పరిసరాలను, కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ శివరామిరెడ్డి ఉన్నారు. -
సీమాంధ్ర రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం....
హైదరాబాద్: సీమాంధ్ర రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ అన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై నాయకులు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకుల ప్రకటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వమే లక్ష ఎకరాలు సేకరించి కొత్త రాజధాని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల హక్కులు, ఆఫ్షన్ల విధివిధానాలపై స్పష్టత లేదని ఆయన చెప్పారు. -
' రాష్ట్ర విభజన10 శాతమే జరిగింది'
రాష్ట్ర విభజన ప్రక్రియ పదిశాతమే జరిగింద, ఇంకా 90 శాతం జరగాల్సి ఉందని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ వెల్లడించారు. బుధవారం గుంటూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 2014 సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని తెలిపారు. తెలంగాణ ప్రత్యక రాష్ట్రం ఏర్పాటు అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయని కొంత మంది అవకాశవాదులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర విభజనతో కొత్త ఉద్యోగాలు ఏర్పాటు కావని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇప్పటికే విభజిన జరిగిన రాష్ట్రాలలో ఎంత మంది కొత్త ఉద్యోగాలు పొందారో వెల్లడించాలని ఆయన అవకాశవాదులను డిమాండ్ చేశారు. -
సమైక్య రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు
రాబోయే సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ అన్నారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన ప్రక్రియ అయిపోతుందంటూ కొందరు చెబుతున్న మాటలు సరికాదని ఆయన చెప్పారు. విభజన ప్రక్రియ ఇప్పటికి కేవలం 10 శాతం మాత్రమే జరిగిందని, ఇంకా 90 శాతం జరగాల్సి ఉందని మురళీకృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ ఆ ప్రాంతా నాయకులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, అలాంటి భ్రమలు కల్పించడం సరికాదని చెప్పారు. -
సంకల్పం ముఖ్యం
కర్నూలు, న్యూస్‌లైన్: జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదగాలంటే చదువుతో పాటు దృఢ సంకల్పం ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ అన్నారు. పోలీస్ కుటుంబాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం స్థానిక పోలీస్ పెరేడ్స్ గ్రౌండ్లో ఎస్పీ రఘురామిరెడ్డి అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఐజీ ప్రసంగించారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు కుటుంబాలకు చెందిన చిన్నారులు చదువులో ఇతర ఉద్యోగుల పిల్లల కంటే తక్కువేం కాదని నిరూపించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. పోలీస్ పురస్కార్ అందుకున్న పిల్లలను స్ఫూర్తిగా తీసుకుని మిగతావారు కూడా మంచి మార్కులు సాధించాలని కోరారు. జీవితంలో రాణించాలంటే చదువుతో పాటు సమాజంపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థికి క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా భాషపైన పట్టు సాధించిన విద్యార్థులు ఇంటర్వ్యూల్లో తమ ప్రతిభను కనబరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాచా నెహ్రూ పుట్టిన రోజు ఇలాంటి అవార్డుల ప్రదాన వేడుక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీసు పిల్లలు విద్యలో అభివృద్ధి చెందడానికి తండ్రుల కంటే కూడా తల్లుల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు టర్నింగ్ పాయింట్ అని.. ఉన్నత చదువుల్లో మరింత ప్రతిభ కనబరిచి జీవితంలో స్థిర పడాలని ఆకాంక్షించారు. ఎస్పీ రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ప్రతిభ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంటుందన్నారు. ఇంటర్ తర్వాత పెద్ద చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు ఉండాల్సి వస్తుందని, అదే సమయంలో స్నేహితుల సావాసంతో చెడు మార్గం పట్టే అవకాశం కూడా ఉందన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు.. ఎంత జాగ్రత్తగా పెంచారు.. తనపై కుటుంబం ఎలాంటి ఆశలు పెంచుకుందనే విషయాలను నిరంతరం మనసులో పెట్టుకుని మంచి స్థాయికి ఎదిగితేనే పోలీసు శాఖకు గర్వకారణంగా ఉంటుందన్నారు. పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో పని చేస్తున్న అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు ఎస్పీ వెంకటరత్నం అన్నారు. పదో తరగతిలో 9.3 శాతానికిపైగా మార్కులు సాధించిన 89 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో 930కి పైగా మార్కులు సాధించిన 49 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రతిభా పురస్కార్‌లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ వైవి.రమణకుమార్, ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, హోంగార్డ్స్ డీఎస్పీ క్రిష్ణమోహన్, సీఐలు శ్రీనివాసులు, బాబు ప్రసాద్, అబ్దుల్ గౌస్, కేశవరెడ్డి, వీవీ నాయుడు, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
మేమున్నాం
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో శాంతిభద్రతలను గాడిలో పెడుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లాకు చెందిన మంత్రి పట్టుబట్టి ముఖ్యమంత్రి వద్ద పంచాయితీ పెట్టి బదిలీ చేయించడం వివాదాస్పదమవుతోంది. రెండో రోజు మంగళవారం కూడా ఆయన పక్షాన వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతలు చేపట్టి నాలుగు మాసాలు గడవక మునుపే హైదరాబాద్ సౌత్ జోన్(దక్షిణ మండలం) డీసీపీగా రఘురామిరెడ్డిని బదిలీ చేయడం తెలిసిందే. అయితే ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్ల లోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. సరైన కారణం లేకుండా తనను బదిలీ చేశారంటూ ఎస్పీ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్పీ బదిలీ అంశం ఓ కొలిక్కి రానుంది. ఇదిలాఉండగా జిల్లాలో నేర ఘటనల తీరుతెన్నులను అతి తక్కువ సమయంలో అధ్యయనం చేసి అక్రమార్కులకు ఎస్పీ రఘురామిరెడ్డి అడ్డుకట్ట వేయగలిగారు. ఆయన బదిలీని నిలుపుదల చేయకపోతే జిల్లాలో మట్కా, పేకాట, చీకటి వ్యాపారాలు, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు పేట్రేగి ప్రజా జీవనానికి ఆటంకమవుతాయని సాధారణ జనం మొదలుకొని ఇంజినీర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, మహిళలు, విద్యా సంస్థల అధినేతలు డీజీపికి రాష్ట్ర గవర్నర్‌కు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేశారు. పోలీసు యంత్రాంగంపై రాాజకీయ నాయకుల పెత్తనం లేకుండా నిబంధనలు విధిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, రాజకీయ దురుద్దేశంతో చేసిన రఘురామిరెడ్డి బదిలీని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీజేవైఎం నగర అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ బాస్‌కు వీటిని పంపారు. ప్రజా చైతన్యయువజన సంఘం ఆధ్వర్యంలో కల్లూరు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, యువజనులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఎస్పీ బదిలీని ముక్తకంఠంతో ఖండించారు. నిజాయితీకి బహుమానం బదిలీనా అంటూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణలకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ, ఎమ్మార్పీఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు వేర్వేరుగా ఎస్పీ బదిలీకి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మంత్రి టీజీ స్వార్థ ప్రయోజనాలకు ఎస్పీని బలి చేయడం దుర్మార్గమైన చర్యగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి రాంభూపాల్ చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మట్కా మాఫియాపై ఎస్పీ ఉక్కుపాదం మోపడాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ నాయకులు ఆయనను బదిలీ చేయించారని ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ, ఆవాజ్ కమిటీలు పేర్కొన్నాయి. నిజాయితీ గల అధికారిని రాజకీయాలకు బలి చేయడం తగదంటూ ఆలూరులో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఎస్పీ బదిలీ నిలుపుదల కోరుతూ లోక్‌సత్తా ఆదోని డివిజన్ కార్యదర్శి సుబ్రమణ్యం శర్మ రాష్ట్ర డీజీపీకి పంపిన ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలో భాగమే ఎస్పీ బదిలీ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ పేర్కొన్నారు. -
లక్ష్యం చేరే దాకా పోరు: మురళీకృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు ఆందోళనలు కొనసాగుతాయని, కేంద్రం కళ్లు తెరవకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ హెచ్చరించారు. ఫోరం ఆధ్వర్యంలో స్థానిక ఏపీ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు గురువారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దాదాపు 500 మంది ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొని ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో ఏపీ భవన్ పరిసరాలను హోరెత్తించారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు అక్కడే బైఠాయించి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు ‘రోల్‌బ్యాక్ యూపీఏ డెసిషన్’ అని రాసున్న రిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సీమాంధ్రలో ప్రజలు రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. లక్ష్యం చేరే వరకు తమ పోరాటం ఆగదని ఉద్ఘాటించారు. ఫోరం సెక్రటరీ కేవీ కృష్ణయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రంలో అంధకారం అలుముకుందని దానిని తొలగించేందుకే తాము కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టామన్నారు. ర్యాలీకి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, లాయర్ల ఫోరం, ఢిల్లీ సమైక్యాంధ్ర జేఏసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఫోరం కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కో-చైర్మన్ మురళీ మోహన్, వైస్ చైర్మన్ టీ బెన్సల్, సెక్రెటరీ కేవీ కృష్ణయ్య, ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటరాంరెడ్డి, మాల మహానాడు రాష్ట్ర లీగల్‌సెల్ అధ్యక్షుడు డీకేవీ ప్రకాశ్, ఢిల్లీ జేఏసీ నాయకులు సతీష్, రాజేందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. దీనికిముందు ఫోరం నేతలు రాజ్‌ఘాట్, శక్తిస్థల్లను సందర్శించి శాంతియుతంగా ఉద్యమించే శక్తి నివ్వాలంటూ గాంధీ సమాధి వద్ద, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే బుద్ధిని సోనియాకు కల్పించాలని ఇందిరాగాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. మిన్నంటిన నినాదాలు : ‘బచావో.. బచావో.. ఆంధ్రప్రదేశ్ బచావో..’ ‘రోల్‌బ్యాక్ యూపీఏ డెిసిషన్’ ‘కాంగ్రెస్ పార్టీ డౌన్..డౌన్.’ ‘ ఉయ్ వాంట్ జస్టిస్’ అన్న ఉద్యోగుల నినాదాలతో ఏపీభవన్ పరిసరాలు హోరెత్తాయి. నేటి మహాధర్నాకు హాజరుకానున్న విజయమ్మ విభజనకు వ్యతిరేకంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించనున్నారు. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధర్నాలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించనున్నారు. అదేవిధంగా ఆ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొణతాల రామకృష్ణ తదితరులు కూడా ధర్నాలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగులు ఏపీ భవన్ నుంచి ర్యాలీగా జంతర్‌మంతర్ వద్దకు చేరుకుంటారని ఫోరం చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు మహాధర్నా కొనసాగుతుందన్నారు. -
19 ఏళ్ళలో 26 రెట్లు పెరిగింది
25వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 6.49 లక్షలయ్యింది మధ్యలో భారీగా పడినా ఆందోళన చెందలేదు ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ ఇన్వెస్టర్ సక్సెస్ స్టోరీ పేరుతో ప్రవేశపెట్టిన కొత్త శీర్షిక మాలాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లకు స్ఫూర్తినిస్తోంది. దీంతో నా సక్సెస్ స్టోరీ కూడా ‘ప్రాఫిట్’ పాఠకులతో పంచుకోవాలనిపించింది.’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ. ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టోరీ ఆయన మాటల్లోనే... రాష్ట్ర ప్రభుత్వరంగ కంపెనీలో పనిచేస్తున్న నేను 1994 సెప్టెంబర్‌లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రైమా ప్లస్ (నాకు తెలిసినంతవరకు ఫ్రాంక్లిన్ ఇండియాకి ఇది తొలి పథకం)లో రూ.25,000 ఇన్వెస్ట్ చేశాను. అది న్యూ ఫండ్ ఆఫర్ కావడంతో ఒక్కొక్క యూనిట్ రూ. 10 చొప్పున 2,500 యూనిట్లు వచ్చాయి. కాని ఇన్వెస్ట్ చేసిన రెండేళ్ళలోనే నా ఇన్వెస్ట్మెంట్ విలువ సగానికి సగం ఆవిరైపోయింది. 1996 డిసెంబర్లో యూనిట్ విలువ రూ.5.88 పడిపోయింది. ఆ సమయంలో కాస్త భయపడ్డాను. అయితే దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం కాబట్టి వైదొలగలేదు. ఇలా ధైర్యంగా ఎదురుచూసినందుకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం నా పెట్టుబడి రూ.25,000 కాస్త ఇప్పుడు ఇంచుమించుగా రూ.6.49 లక్షలకు చేరింది. అంటే ఈ పథకం సగటున 17 శాతం వార్షిక రాబడిని అందించింది. అలాగే నా పెట్టుబడి 26 రెట్లు వృద్ధి చెందినట్లు లెక్క. 2008 ఆర్థిక సంక్షోభంలో ఈ విలువ రూ.3 లక్షలకు పడిపోయింది. అప్పుడు కూడా నేను భయపడలేదు. కాని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. 1996లో భారీగా పడిపోయినప్పుడు చేతిలో డబ్బులుండి మరో రూ.25,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేదని. ఇలాంటి ఆలోచనలు మానవ సహజమే అయినా నా అనుభవంతో ఇన్వెస్టర్లకి చెప్పేది ఒక్కటే. ఇన్వెస్ట్ చేసిన మర్నాటి నుంచి ఎంత పెరిగింది అన్నది చూడకుండా మంచి పథకంలో ఇన్వెస్ట్ చేసి కనీసం 10 నుంచి 20 ఏళ్ళు ఎదురుచూస్తే తప్పక లాభాలు వస్తాయి. - జి.మురళీకృష్ణ, హైదరాబాద్ -
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు బాబు కృషిచేస్తానన్నారు’
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమతో చెప్పారని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తెలిపారు. చంద్రబాబుతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీకృష్ణ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం మాట్లాడతానని చంద్రబాబు హామి ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక వేదికలపై చర్చించి తీసుకున్న నిర్ణయమని , ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటుకు మాటను ఇచ్చామని, ఆ మాటను వెనక్కు తీసుకోలేనని చంద్రబాబు చెప్పినట్లు మురళీకృష్ణ తెలిపారు.