వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే | kodumur mla Murali krishna quits congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

Published Fri, Apr 11 2014 8:29 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే - Sakshi

వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్లో లోటస్పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మురళీ కృష్ణ ఆ పార్టీలో చేరనున్నారు.

 

2009 ఎన్నికల్లో మురళీ కృష్ణ కోడుమూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement