quits congress party
-
పొత్తు చిచ్చు.. కాంగ్రెస్‌ను వీడిన బిహార్ మాజీ చీఫ్
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జేడీతో పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మ పార్టీని వీడారు. ఆర్జేడీతో వినాశకరమైన పొత్తులో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో అనిల్ శర్మ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను ఇటీవల ఆర్భాటంగా పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీలో దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం కనిపించదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీ లేదా అతని సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు” అని శర్మ ఆరోపించారు. దాదాపు దశాబ్ద కాలంలో పార్టీని వీడిన నాల్గవ మాజీ బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శర్మ నిలిచారు. 2018లో అశోక్ చౌదరి పార్టీని వీడి జేడీయూలో చేరారు. అంతకుముందు, 2015లో రామ్ జతన్ సిన్హా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. అంతకు ముందు సంవత్సరం, మెహబూబ్ అలీ కైజర్ ఎల్జేపీలో చేరారు. "నేను 1985లో కాంగ్రెస్‌లో చేరాను. దాదాపు నాలుగు దశాబ్దాలలో రెండుసార్లు సంస్థాగత పదవులను నిర్వహించాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాను. నేనెప్పుడూ టిక్కెట్ కోసం గానీ, శాసన మండలి బెర్త్ కోసం గానీ లాబీయింగ్ చేయలేదు. అలాగే కాంగ్రెస్‌ను వీడే ముందు మరే ఇతర పార్టీలో అవకాశాలను అన్వేషించలేదు" అని అనిల్ శర్మ చెప్పుకొచ్చారు. -
కాంగ్రెస్‌కు బై బై..శివసేనకు జై
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి గుడ్ చై చెప్పిన పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంత పార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కొంతమంది నేతలు తమ అనుచిత ప్రవర్తనతో బాధించారంటూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండానే.. వెంటనే శివసైనకు జై కొట్టారు. ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ఆమె శుక్రవారం ఉదయమ సమావేశమయ్యారు. అనంతరం థాక్రే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల లేఖను రాశారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు తన ట్విటర్ ప్రొఫైల్‌లో తక్షణమే కాంగ్రెస్ పార్టీ హోదాలను తొలగించారు.. -
వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మురళీ కృష్ణ ఆ పార్టీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో మురళీ కృష్ణ కోడుమూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.