కాంగ్రెస్‌కు బై బై..శివసేనకు జై | Priyanka Chaturvedi Quits Congress Joins Shiv Sena | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బై బై..శివసేనకు జై

Published Fri, Apr 19 2019 3:14 PM | Last Updated on Fri, Apr 19 2019 3:17 PM

Priyanka Chaturvedi Quits Congress Joins Shiv Sena - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ చై చెప్పిన  పార్టీ అధికార ప్రతినిధి  ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. కాంగ్రెస్లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ  సొంత పార్టీపైనే ఫైర్‌ అయిన  ప్రియాంక కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కొంతమంది నేతలు తమ అనుచిత ప్రవర‍్తనతో బాధించారంటూ ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి  ఒక లేఖ రాశారు.  రాహుల్‌ నుంచి ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండానే.. వెంటనే శివసైనకు జై కొట్టారు. ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ఆమె శుక్రవారం ఉదయమ సమావేశమయ్యారు. అనంతరం థాక్రే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల లేఖను రాశారు. కాంగ్రెస్ పార్టీలోని‌ అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు తన ట్విటర్‌ ప్రొఫైల్‌లో తక్షణమే  కాంగ్రెస్‌ పార్టీ హోదాలను తొలగించారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement