'రేపు సాయంత్రం కల్లా డిసైడ్ చేస్తాం' | AP secretariat employees return from velgapudi to hyderabad | Sakshi
Sakshi News home page

'రేపు సాయంత్రం కల్లా డిసైడ్ చేస్తాం'

Published Wed, Jun 29 2016 8:27 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

'రేపు సాయంత్రం కల్లా డిసైడ్ చేస్తాం' - Sakshi

'రేపు సాయంత్రం కల్లా డిసైడ్ చేస్తాం'

- హైదరాబాద్కు ఏపీ సచివాలయ ఉద్యోగుల తిరుగుప్రయాణం
- ఏ శాఖకు ఏ బ్లాక్ అన్నది ఇంకా కేటాయింపు జరగలేదు: మురళీ కృష్ణ


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్కు తిరుగుప్రయాణమైయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెలగపూడికి వెళ్లిన ఉద్యోగులు తాత్కాలిక సచివాలయం భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులంతా అక్కడి నుంచి తిరుగుప్రయాణమైయ్యారు.

ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ఏ శాఖకు ఏ బ్లాక్ అన్నది ఇంకా కేటాయింపు జరగలేదని వెల్లడించారు. రేపు సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ఏపీ సచివాలయ ఉద్యోగులు వారి శాఖలకు వస్తారని మురళీకృష్ణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement