తెలంగాణ ఉద్యోగుల ఆవేదన
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల ఉద్యోగ జేఏసీలు తమను పట్టించుకోవడం లేదని తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు, అధికారులను కలసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తమను సొంత రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఇక్కడ పని చేయలేకపోతున్నామని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఉద్యోగి శ్రీధర్ తెలిపారు. త్వరలో గవర్నర్‌తో జరిగే సమా వేశంలో తమ సమస్యలపై చర్చించాలని, తమను చేర్చుకునేలా తెలంగాణ ప్రభు త్వాన్ని ఒప్పించాలని కోరారు. ఏపీ సచివాలయంలో 233 మంది, హెచ్‌వోడీ కార్యా లయాల్లో 680 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు.
మమ్మల్ని సొంత రాష్ట్రానికి పంపండి
Published Thu, Mar 9 2017 3:40 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement