తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం | governor narasimhan visits ap temporary Secretariat in velagapudi | Sakshi
Sakshi News home page

తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం

Published Thu, Jul 7 2016 10:43 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం - Sakshi

తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం

అమరావతి: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రులు స్వాగతం పలికారు. సచివాలయ బ్లాక్లను గవర్నర్ పరిశీలించారు. చంద్రబాబు నాయుడు బ్లాక్ ల నిర్మాణాలను గవర్నర్ కు వివరించారు.

గవర్నర్ ఈ రోజు ఉదయం విజయవాడలో కనకదుర్గ అమ్మవారి, ఆ తర్వాత మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభం అవుతున్న సందర్భంలో అందరికీ మంచి జరగాలని  కోరుకున్నట్లు  తెలిపారు. గవర్నర్ ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకుని, వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో గవర్నర్ నరసింహన్కు విందు ఇచ్చారు. అంతకు ముందు విజయవాడలోని ఓ హోటల్‌లో గవర్నర్‌తో చంద్రబాబు 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు తన నివాసానికి విందుకు రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement