అమరావతికి అప్పుడేనా? | ap secretariat employees not ready move to amravati | Sakshi
Sakshi News home page

అమరావతికి అప్పుడేనా?

Published Thu, May 12 2016 7:15 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

అమరావతికి అప్పుడేనా? - Sakshi

అమరావతికి అప్పుడేనా?

హైదరాబాద్: వచ్చే నెలలో అమరావతికి తరలి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. సౌకర్యాలు లేకుండా అక్కడి వెళ్లలేమని చెబుతున్నారు. హడావుడిగా తమను తరలించాలనుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత తెల్పుతున్నారు. జూన్ లోనే తరలివెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాది సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం సురక్షితంగా తరలిస్తుందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పడంపై సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీలు ఇవ్వకుండా ఎలా వెళ్లగలమని ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే ఉద్యోగుల అభ్యంతరాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినా అంగీకరించలేదని మురళీకృష్ణ చెప్పారు. ఉద్యోగుల తరలింపులో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. మరోసారి ప్రభుత్వంతో మాట్లాడాలని మురళీకృష్ణను ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement