employees shifting
-
ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల తరలింపు గడువు మళ్లీ మారింది. ఈ విషయాన్ని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హెచ్ఓడీల తరలింపునకు ఆగస్టు 31 వరకు గడువు కావాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, దానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరామని, వాటి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని కోరామని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖలకు ఇంకా పూర్తిస్థాయిలో వసతులు సమకూరాల్సి ఉందని, సచివాలయ ఉద్యోగుల తరలింపు ఈనెల 27వ తేదీ నుంచి మొదలవుతుందని అశోక్బాబు చెప్పారు. భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకా సమయం పడుతుందని, మొత్తం తరలింపు దసరా నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. సాఫ్ట్వేర్ సమస్యలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను మాన్యువల్గా చేయాలని కోరామని, దానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. -
అమరావతికి అప్పుడేనా?
హైదరాబాద్: వచ్చే నెలలో అమరావతికి తరలి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. సౌకర్యాలు లేకుండా అక్కడి వెళ్లలేమని చెబుతున్నారు. హడావుడిగా తమను తరలించాలనుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత తెల్పుతున్నారు. జూన్ లోనే తరలివెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాది సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సురక్షితంగా తరలిస్తుందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పడంపై సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీలు ఇవ్వకుండా ఎలా వెళ్లగలమని ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే ఉద్యోగుల అభ్యంతరాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినా అంగీకరించలేదని మురళీకృష్ణ చెప్పారు. ఉద్యోగుల తరలింపులో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. మరోసారి ప్రభుత్వంతో మాట్లాడాలని మురళీకృష్ణను ఉద్యోగులు డిమాండ్ చేశారు.