ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్‌బాబు | ap cm assured to extend time limit for shifting of employees, says ashok babu | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్‌బాబు

Published Fri, Jun 17 2016 7:51 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్‌బాబు - Sakshi

ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్‌బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల తరలింపు గడువు మళ్లీ మారింది. ఈ విషయాన్ని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హెచ్‌ఓడీల తరలింపునకు ఆగస్టు 31 వరకు గడువు కావాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, దానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరామని, వాటి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని కోరామని ఆయన అన్నారు.

ప్రభుత్వ శాఖలకు ఇంకా పూర్తిస్థాయిలో వసతులు సమకూరాల్సి ఉందని, సచివాలయ ఉద్యోగుల తరలింపు ఈనెల 27వ తేదీ నుంచి మొదలవుతుందని అశోక్‌బాబు చెప్పారు. భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకా సమయం పడుతుందని, మొత్తం తరలింపు దసరా నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను మాన్యువల్‌గా చేయాలని కోరామని, దానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement