APNGO leader
-
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఎన్జీవో ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్య పరిష్కరిస్తామని స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈలోపే ఉద్యోగ సంఘాల నేతలు కొందరు బ్లాక్ మెయిల్‌కు దిగటం ఏమిటని ప్రశ్నించారు. తమ వద్ద 60 లక్షల ఓట్లు ఉన్నాయని ఉద్యోగ నేత అనడం దేనికి సంకేతమని అన్నారు. సీఎం జగన్ అడిగిన 10 రోజులు గడువు ముగియకముందే అల్టిమేటం ఎందుకు ఇచ్చారని, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకొంటే బాగుంటుందని చెప్పారు. ఉద్యోగులే ప్రభుత్వ రథ సారథులని, వారు బాగా పనిచేస్తున్నారని సీఎం జగన్ చెప్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగ నేతలు ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ అన్ని విధాల కృషి చేస్తారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఎక్కడ రావడంలేదో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలన్నారు. నాయకులు సంయమనం పాటించాలని కోరారు. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లే ఇక్కడా జరుగుతుందని చురకలు అంటించారు. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులను ఇంత మంచిగా చూసుకొనే సీఎం ఎక్కడా ఉండరని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ చాలా విషయాల్లో పెద్ద పీట వేశారన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు ఆలోచించి అడుగులు వేయాలన్నారు. -
ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్‌బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల తరలింపు గడువు మళ్లీ మారింది. ఈ విషయాన్ని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హెచ్ఓడీల తరలింపునకు ఆగస్టు 31 వరకు గడువు కావాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, దానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరామని, వాటి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని కోరామని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖలకు ఇంకా పూర్తిస్థాయిలో వసతులు సమకూరాల్సి ఉందని, సచివాలయ ఉద్యోగుల తరలింపు ఈనెల 27వ తేదీ నుంచి మొదలవుతుందని అశోక్‌బాబు చెప్పారు. భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకా సమయం పడుతుందని, మొత్తం తరలింపు దసరా నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. సాఫ్ట్వేర్ సమస్యలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను మాన్యువల్‌గా చేయాలని కోరామని, దానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. -
అశోక్‌బాబు స్పందించరేం?
తిరుపతి రూరల్: మహిళా అధికారులపై దాడులు జరుగుతున్నా ఎపీఎన్జీవో నాయకుడు ఆశోక్‌బాబు..ఎందుకు మౌనంగా ఉంటున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పచ్చనేతల మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యాపారాలు, రాష్ర్టస్థాయి పరపతి కోసమే పదవులను అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. అధికారులపై దాడులను ఖండించలేని అశోక్‌బాబు నాయకుడుగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీ, గుండా రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళితే అధికార పార్టీకి చెం దిన అక్రమార్కుల చేతిలో దెబ్బలు తినే పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరు దోచుకుంటున్నారని ఆరోపించారు. చిన్నగొట్టిగల్లు తహశీల్దార్‌పై దాడి అమానుషం చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లులో చెరువు కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా తహశీల్దార్‌పై టీడీపీ సర్పంచ్ దాడికి పాల్పడడం అమానుషమని చెవిరెడ్డి అన్నారు. కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. -
ఏ పార్టీతోనూ సంబంధంలేదు
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్ష అభ్యర్థి షేక్ అబ్దుల్ బషీర్ హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రెండు నెలల పాటు సమ్మెలో పాల్గొన్న సీమాంధ్ర ఉద్యోగులను ఆ తరువాత ఎలాంటి ఉద్యమానికి సిద్ధం చేయలేదని ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి తగ్గుతుందన్నారు. సోమవారమిక్కడ గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవోల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 5న ఏపీ ఎన్జీవోల సంఘం ఎన్నికలు ముగిసిన తరువాత 6 నుంచి తమ ప్యానెల్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తమ ప్యానెల్‌కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. ఇటీవల ఏపీఎన్జీవోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సమైక్యం కోసం పాటుపడుతున్న రాజకీయ పార్టీలను పిలవకుండా విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన వారిని ఆహ్వానించటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎన్నికల్లో రాష్ట్ర సమైక్య పరిరక్షణ కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికాకుండా ఓట్లు వేయాలని కోరారు. ఏపీఎన్జీవోల సంఘ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కొందరు సమైక్యాంధ్ర ఉద్యమంతో వచ్చిన చరిష్మాను ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణను అన్ని జిల్లాల ఉద్యోగులు వ్యతిరేకించినా ఎన్నికలు నిర్వహించడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగాలంటే నాయకత్వంలో మార్పులు రావాలని సూచించారు. ప్రతి మూడేళ్లకు ఓసారి జరిగే సంఘం ఎన్నికలను ఈసారి కొన్ని మీడియా వర్గాలు పెద్దవిగా చేసి చూపడం బాధాకరమన్నారు. పులివెందుల ప్రాంతంలో తమ ప్యానెల్‌కు మద్దతులేదనడం వారి అవివేకమని చెప్పారు. అన్ని జిల్లాలలో తమ ప్యానెల్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. బషీర్ ప్యానెల్ నుంచి వసంతరావు ఉపసంహరణ ఎన్నికల బరిలో బషీర్ ప్యానెల్ నుంచి నామినేషన్ వేసిన వసంతరావు సోమవారం అనూహ్యంగా తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి ప్రతి ష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే అశోక్‌బాబు ప్యానెల్‌కు చెందిన సభ్యులే వసంతరావును భయపెట్టి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని బషీర్ ఆరోపించారు. -
'అశోక్‌బాబుకు ఇంగిత జ్ఞానం లేదా'
ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు పి.అశోక్బాబుది ఏకపక్ష ధోరణితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఏపీఎన్జీవో నేత సుబ్బరాయన్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సుబ్బరాయన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవోలు గతంతో 66 రోజులు ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత అశోక్ బాబుదని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక ఏపీఎన్జనీవో సంస్థ ఇప్పుడు అసమర్థ నాయకత్వం కింద నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రకంగా స్వార్థపరుల నాయకత్వం కింద ఏపీఎన్జీవో నడుస్తోందన్నారు. రాజకీయ లబ్దికోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని వాడుకున్నారంటూ ఆయన అశోక్‌బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ నేతలను కూడా ఉద్యమంలోకి రానీయలేదని సుబ్బరాయన్ పేర్కొన్నారు. రాజకీయపార్టీలను కలుపుకోకపోతే విభజన బిల్లును అసెంబ్లీ, పార్లమెంట్లలో అడ్డుకునేది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగులు ఉద్యమం చేస్తే రాజకీయ నిర్ణయం మారుతుందా అంటు అశోక్‌బాబుపై మండిపడ్డారు. అశోక్‌బాబు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. అశోక్‌బాబు దిశా నిర్దేశం లేని వ్యక్తి అని సుబ్బరాయన్ అభివర్ణించారు. అశోక్‌బాబు కేవలం ఒక్క రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యోగసంఘాలు చేపట్టిన ఉద్యమాన్ని చూసి అశోక్ బాబు పాఠాలు కూడా నేర్చుకోలేదని వ్యాఖ్యానించారు. అశోక్‌బాబు కనీసం పొలిటికల్ జేఏసీని కూడా నిర్మాణం చేయలేదని సుబ్బరాయన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
6వ తేదీన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతాం : ఏపీఎన్జీఓలు