'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, తమకు అండగా నిలబడాలని చంద్రబాబును కలిసినట్టు ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్‌బాబు, మురళీకృష్ణ తెలిపాయి. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారని చెప్పారు. రాష్ట్రపతి జీవో ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి సీమాంధ్ర ఉద్యోగులకు బాబు న్యాయం చేస్తామన్నారని తెలిపారు.
ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడటం మంచిది కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తెలంగాణ ఉద్యోగులు రాద్ధాంతం చేస్తున్న 193 మంది తెలంగాణలో పుట్టి పెరిగినవాళ్లేనని వెల్లడించారు. గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలన్నారు.