సీమాంధ్ర రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం....
హైదరాబాద్: సీమాంధ్ర రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ అన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై నాయకులు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకుల ప్రకటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు.
ప్రభుత్వమే లక్ష ఎకరాలు సేకరించి కొత్త రాజధాని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల హక్కులు, ఆఫ్షన్ల విధివిధానాలపై స్పష్టత లేదని ఆయన చెప్పారు.