Secretariat Seemandhra Employees
-
సీమాంధ్ర రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం....
హైదరాబాద్: సీమాంధ్ర రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ అన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై నాయకులు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాయకుల ప్రకటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వమే లక్ష ఎకరాలు సేకరించి కొత్త రాజధాని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల హక్కులు, ఆఫ్షన్ల విధివిధానాలపై స్పష్టత లేదని ఆయన చెప్పారు. -
'సీమాంధ్ర కేంద్రమంత్రులకు చీము, నెత్తురు లేదు'
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం పట్ల సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు నిప్పులు చెరిగారు. శుక్రవారం కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సచివాలయంలో విధులను బహిష్కరించారు. అనంతరం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలకు చీము,నెత్తురు లేదని వారు ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నిజాయితీతో పని చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్ జగన్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. -
'వైఎస్ఆర్ సీపీ సమైక్య తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సమైక్య తీర్మానానికి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ ప్రతిపాదించిన సమైక్య తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని సచివాలయం సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ నేత మురళీకృష్ణ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. సమైక్య తీర్మానం ద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అందులో భాగంగా ఏపీ భవన్ వరకు సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. అలాగే జంతర్ మంతర్ వద్ద సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు పలువురు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. -
జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా
-
జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా
ఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దేశ రాజధానిలో కదం తొక్కారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రోజుల పాటు వీరు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ ధర్నాకు జాతీయ పార్టీల నాయకులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆమె కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో విజయమ్మ దీక్షాస్థలికి రానున్నారు. -
నేడు ఢిల్లీలో కొవ్వొత్తులతో ర్యాలీ.. రేపు మహాధర్నా
-
ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున కేంద్రానికి సమైక్య లేఖ రాయండి
* సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో జగన్ * ఆ లేఖపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోండి * వైఎస్సార్ సీపీ తరఫున నేను మొదటి సంతకం చేస్తా.. * సమైక్య రాష్ట్రం డిమాండ్‌తోనే మేమంతా రాజీనామాలు చేశాం * మిగతా పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామా చేస్తే కేంద్రం వెనక్కు తగ్గుతుంది * రేపు ఢిల్లీలో ఉద్యోగుల ధర్నాకు వైఎస్ విజయమ్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆ లేఖపై అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సంతకాలు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు బుధవారం జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో తాము చేస్తున్న పోరాటాన్ని ప్రతినిధులు వివరించగా, వారి పోరాటానికి జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన ప్రక్రియ ఆపడానికి ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకుని జేఏసీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, దానిపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమైక్య ఉద్యమానికి శాయశక్తులా, అన్ని విధాలుగా మద్దతునిస్తానని చెబుతూ.. ఉద్యోగ సంఘాలు రాసే లేఖపై తాను తొలి సంతకం చేస్తానని కూడా జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తోనే తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు సమర్పించారని చెప్పారు. అలాగే మిగతా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేస్తే విభజన నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గుతుందని, అందువల్ల మిగతా రాజకీయ పార్టీలను కూడా రాజీనామాలకు డిమాండ్ చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని, ఆ కార్యక్రమంలో పాల్గొని మద్దతునివ్వాలని ఫోరం ప్రతినిధులు జగన్‌ను కోరారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున తాను రాలేనన్న జగన్.. మీ ఆందోళన సమంజసమైనందున మీరు చేపట్టే కార్యక్రమానికి మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా హాజరవుతారని చెప్పారు. ఉద్యోగ సంఘాలు నిర్వహించే ఆందోళనలకు తమ పార్టీ పూర్తి మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. సమావేశం అనంతరం ఫోరం చైర్మన్ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోరుతూ ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు ఆహ్వానించడానికి జగన్మోహన్రెడ్డిని కలిసినట్టు చెప్పారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నందున తాను రాలేనని, ఉద్యమానికి మద్దతుగా పార్టీ ప్రతినిధులను తప్పనిసరిగా పంపుతామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం చివరిదాకా పోరాటం చేస్తానని జగన్ తమతో అన్నారన్నారు. ఇప్పటికే తాను, మరో ఎంపీ, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటున్న విషయం గుర్తుచేశారని చెప్పారు. ఇతర పార్టీల అధ్యక్షులు కూడా రాజీనామా చేసి ముందుకొస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని జగన్ వివరించారన్నారు. తామంతా 56 రోజులుగా ఉద్యమిస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా ఢిల్లీలో ధర్నా చేపడుతున్నట్టు జగన్‌కు తెలిపామని మురళీకృష్ణ చెప్పారు. బుధవారం ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లిన తర్వాత ఢిల్లీలో చేపట్టే కార్యక్రమాలను వివరించామన్నారు. భావితరాలు నష్టపోకుండా ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని, ఉద్యమాన్ని బాగా నడిపిస్తున్నారని ఈ సందర్భంగా జగన్ అభినందించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం జగన్ తమకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని ఫోరం నాయకురాలు సత్యసులోచన చెప్పారు. జగన్ మాదిరిగా కిరణ్, చంద్రబాబులు రాజీనామా చేయాలి సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాజీనామాలు చేయాలని సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ మాదిరిగా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలు చేయకుండా వారెన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలుపుతూ చంద్రబాబు ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన లేఖను వెనక్కి తీసుకోకుండా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు విశ్వసించరన్నారు. లేఖను వెనక్కి తీసుకునే దాకా టీడీపీ నేతలకు సమైక్య ఉద్యమంలో పాల్గొనే అర్హతలేదన్నారు. జగన్‌ను కలిసిన వారిలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ వెంకటసుబ్బయ్య, నేతలు హరీష్‌కుమార్‌రెడ్డి, హేమలత తదితరులున్నారు. నేడు ఢిల్లీలో కొవ్వొత్తులతో ర్యాలీ.. రేపు మహాధర్నా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో సమైక్య సమర నినాదం చేయనున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మూడురోజుల పాటు ఆందోళనలు చేపట్టనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులు హస్తినకు చేరుకోగా.. బుధవారం రాజధాని ఎక్సప్రెస్లో వందలాది మంది ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆందోళనల్లో భాగంగా 26న ఏపీ భవన్ నుంచి ఇండియాగేట్ వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ, 27న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తారు. 28న కూడా ఆందోళనలు కొనసాగిస్తామని ఫోరం నేతలు తెలిపారు. వీలైతే రాష్టప్రతి ప్రణబ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలని సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పలువురు రాష్ట్ర ఎంపీలను కలిసిన ఉద్యోగుల ప్రతినిధి బృందం.. మహాధర్నాలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని కోరింది. ఎస్పీ, జేడీ(యూ), బీజేపీ తదితర పార్టీల జాతీయ నేతలను కూడా కలిసి ఆందోళనకు మద్దతు పలకాలని నేతలు విన్నవించారు. కాగా, ఉద్యోగుల ధర్నాకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంఘీభావం ప్రకటించారు. -
ఢిల్లీ ధర్నాలో పాల్గొనండి
విజయమ్మకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హైదరాబాద్‌లోని నివాసంలో కలిశారు. ఈనెల 27న ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాలో పార్టీ నేతలతో సహా పాల్గొనాలని ఉద్యోగులు విజయమ్మను కోరారు. ఇందుకు విజయమ్మ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన తో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదముందని, సీవు ప్రజలకు తాగు నీరు కూడా అందక అల్లాడుతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విభజన పర్యవసానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడడం హర్షణీయమన్నారు. విభజన నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు, అసంఘటిత వర్గాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, వారి తరఫున పోరాడతున్నామన్నారు. -
కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ : సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాయలం ముందు సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. మరోవైపు సీఎం కార్యాలయం ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ మంత్రులు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను కలిసినవారిలో జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, సారయ్య తదితరులు ఉన్నారు. అంతకు ముందు మంత్రి జానారెడ్డి ఛాంబర్లో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీకీ పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, సుదర్శన్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. జిల్లాల వారీగా తెలంగాణ సాధన సభలపై చర్చ జరిపినట్లు సమాచారం. -
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో గీతారెడ్డి భేటీ
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో మంత్రి గీతారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సచివాలయంలోని తన చాంబర్లో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులతో దాదాపు నలభై నిమిషాలు చర్చించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందుతున్న అంశాలను లిఖిత పూర్వకంగా అందజేస్తే వాటిని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనానంతరం తమ ఉద్యోగాలు, పదోన్నతులు, పెన్షన్లు, పిల్లల భవిష్యత్తు వంటి సమస్యలను ఉద్యోగులు మంత్రి ఎదుట వెలిబుచ్చారు. తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నామని ఉద్యోగులు చెప్పగా తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా ఏపీఎన్జీవోస్‌ను కూడా మంత్రి సమావేశానికి ఆహ్వానించగా వారు రాలేదు.