వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సమైక్య తీర్మానానికి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ప్రకటించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సమైక్య తీర్మానానికి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ ప్రతిపాదించిన సమైక్య తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని సచివాలయం సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ నేత మురళీకృష్ణ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. సమైక్య తీర్మానం ద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అందులో భాగంగా ఏపీ భవన్ వరకు సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. అలాగే జంతర్ మంతర్ వద్ద సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు పలువురు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.