శాసనసభలో శుక్రవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
అయితే ముసాయిదా బిల్లులో 108 సవరణలు ప్రతిపాదిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 17 నుంచి 23 వరకు చివరి దఫా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.