Seemandhra TDP MLAs
-
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
-
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
శాసనసభలో శుక్రవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అయితే ముసాయిదా బిల్లులో 108 సవరణలు ప్రతిపాదిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అలాగే ఈ నెల 17 నుంచి 23 వరకు చివరి దఫా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. -
అసెంబ్లీలో సోనియా డౌన్ డౌన్ నినాదాలు
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యతిరేక నినాదాలతో రాష్ట్ర శాసనసభ దద్దరిల్లింది. సోనియా డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ సభ్యలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేనివారి గురించి మాట్లాడడం సరికాదని మంత్రులు కొండ్రు మురళి, శైలజానాథ్, జానారెడ్డి అన్నారు. సోనియాను నిందిచడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దోణ్రంరాజు శ్రీనివాస్ అన్నారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సోనియా డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది.