సమైక్య తీర్మానం పెట్టిన తర్వాతే సభలో చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం చేయాలని తాము శాసన సభలో పట్టుబడతామని వారు వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం వారు మాట్లాడారు. సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు అసెంబ్లీలో ఉండి కూడా బీఏసీకి రాకపోవడం దారుణమని ఆరోపించారు.
విభజన బిల్లుపై చర్చ జరిగితే... సులువుగా రాష్ట్రాన్ని విభజించవచ్చనే కుయుక్తితో నాటకాలాడుతున్నారని వారు కిరణ్, చంద్రబాబులపై మండిపడ్డారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం జై సమైక్యాంధ్ర పేరుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్లను శాసనసభకు తీసుకువచ్చారు.