
సాక్షి, నెల్లూరు: తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 31లోగా హైకోర్టు భవనాలు సిద్ధం చేస్తామని గతంలో చంద్రబాబు అఫడవిట్ ఇచ్చారని, దానికి అనుగుణంగా హైకోర్టును విభజిస్తే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అఫడవిట్ ఇచ్చి ఇప్పుడు తగిన సమయం ఇవ్వలేదని అనడం ఏంటని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు రకాల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.
ఏపీ హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు విభజనకు, ప్రతిపక్షానికి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మకై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. డిసెంబర్ 15లోగా హైకోర్టు భవనం సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిన చంద్రబాబు ఆవిధంగా మాట నిలబెట్టుకోలేకపోయ్యారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment