హైదరాబాద్ : సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాయలం ముందు సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. మరోవైపు సీఎం కార్యాలయం ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచిన విషయం తెలిసిందే.
కాగా తెలంగాణ మంత్రులు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను కలిసినవారిలో జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, సారయ్య తదితరులు ఉన్నారు. అంతకు ముందు మంత్రి జానారెడ్డి ఛాంబర్లో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీకీ పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, సుదర్శన్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. జిల్లాల వారీగా తెలంగాణ సాధన సభలపై చర్చ జరిపినట్లు సమాచారం.