రాష్ట్ర విభజనకు నిరసనగా గురువారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా గురువారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సోనియా.. క్విట్ ఇండియా, దిగ్విజయ్.. గో బ్యాక్, రాహుల్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. రాష్ట్ర విభజనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. ఎల్-బ్లాక్ నుంచి ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు సమతా బ్లాక్ వద్ద బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉద్యోగ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ వెళ్లిపోయేంతవరకూ తమ నిరసనను తెలియజేస్తామన్నారు.