సచివాలయుంలో అడ్డుకున్న ఉద్యోగులు
రాష్ట్ర సమైక్యతను కాపాడాలని వేడుకోలు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ సమావేశం కోసం వెళ్లిన సీమాంధ్ర మంత్రులకు శుక్రవారం సచివాలయంలో సమైక్య సెగ తగిలింది. రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తూ సచివాలయంలో తవు నిరసనను ప్రదర్శిస్తూ వస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు మంత్రులను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి నమస్కరిస్తూ అర్థించారు. విభజనతో సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, యువజనలు తీవ్రంగా నష్టపోతారని, ఈ గండం నుంచి గట్టెక్కించాలని, దాదాపు రెండు నెలలుగా జీతాలు తీసుకోకుండా సమ్మె చేస్తున్నామని, తమ మొర ఆలకించాలని కోరారు. వుంత్రివర్గ సమావేశం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వుుందుగా బయటకు రాగా, నిరసనలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే సమతా బ్లాకు వద్దకు చేరుకున్నారు. మంత్రి వాహనం ఎక్కకుండా అడ్డుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు మీరేమి చేస్తారో చెప్పాలంటూ వుంత్రిని ప్రశ్నించారు.
మంత్రులంతా రాష్ట్రం విడిపోకుండా చూడాలంటూ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని అభ్యర్థించారు. వుంత్రి బొత్స ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై తవుకు సానుభూతి ఉందని వుంత్రి అన్నపుడు, తమకు సానుభూతి అక్కర్లేదు, న్యాయం కావాలన్నారు. ఉద్యోగుల సమస్యలను వినేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలకు రావాలని బొత్స ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళి, బాలరాజులను కూడా ఉద్యోగులు అడ్డుకున్నారు. రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేయాలన్నారు. ఉద్యోగుల మనోభీష్టం మేరకే తావుూ పోరాడుతున్నామని, ఉద్యోగుల సమస్యలను పార్టీ హైకమాండ్‌కు వివరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.