ఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దేశ రాజధానిలో కదం తొక్కారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మూడు రోజుల పాటు వీరు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ ధర్నాకు జాతీయ పార్టీల నాయకులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆమె కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో విజయమ్మ దీక్షాస్థలికి రానున్నారు.