Seemandhra Secretariat employees
-
హైదరాబాద్‌లో పుట్టిపెరిగన వారు స్థానికులు కారా?
రాష్ట్రానికి సీఎం ఎవరైనా రాజ్యాంగం ప్రకారం పని చేయాల్సిందేని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అన్నారు. గురువారం సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో మాట్లాడుతు... ఆప్షన్స్ ఇస్తే తమ ప్రాంతంలో పని చేస్తామని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎవ్వరూ స్థానికత కోసం ఎప్పుడు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని వెల్లడించారు. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వారు స్థానికులు కాకుండా ఎలా పోతారని సీమాంధ్ర ఉద్యోగులు ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అలా మాట్లాడారని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు తెలంగాణలోనే పని చేయాలని... అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తమ సచివాలయంలోకి ఆంధ్ర ఉద్యోగులను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ఓ వేళ తమ సచివాలయంలోకి వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు ప్రవేశించిన బలవంతంగా బయటకు పంపుతామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు పై విధంగా స్పందించారు. -
సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న విజయమ్మ
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్జోవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మకు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. పార్టీ గౌరవ అధ్మక్షురాలితో పాటు పార్టీ నేతల మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొనేందుకు విజయమ్మ, పార్టీ నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. -
జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా
-
జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా
ఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దేశ రాజధానిలో కదం తొక్కారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రోజుల పాటు వీరు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ ధర్నాకు జాతీయ పార్టీల నాయకులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆమె కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో విజయమ్మ దీక్షాస్థలికి రానున్నారు. -
ఢిల్లీలో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
-
ఢిల్లీ చేరిన సచివాలయ సీమాంద్ర ఉద్యోగులు
-
ఢిల్లీ చేరిన సచివాలయ సీమాంద్ర ఉద్యోగులు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు ఉద్యోగులు గురువారం ఉదయం హస్తిన చేరుకున్నారు. గత రెండు రోజులుగా బస్సుల్లో, రైళ్లలలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొంటారు. గురువారం క్రొవ్వొత్తుల ప్రదర్శన, శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాను చేపట్టనున్నట్లు ఫోరం ఛైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. ఇక సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారు. -
జగన్ ను కలిసిన సీమాంధ్ర ఉద్యోగులు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాంతో జగన్ నివాసం అభిమాన సంద్రంతో పోటెత్తింది. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు లోటస్ పాండ్‌కు చేరుకుంటున్నారు. -
'జగన్ నిజాయతీగా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయతీగా వ్యవహరిస్తున్నారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు మురళీ కృష్ణ, వెంకటేశ్వర్లు అన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఈరోజు ఉదయం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. ముందుగా ఎంపీ పదవికి రాజీనామా చేసింది జగనేనని అన్నారు. హైదరాబాద్ నుంచి బయటకు రాలేని కారణంగా...ఈ 27న ఢిల్లీలో చేపట్టనున్న తమ ధర్నాకు పార్టీ ప్రతినిధులను పంపిస్తానని చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని వారు మండిపడ్డారు. టీపీడీ ఎంపీలో ధర్నా చేయాల్సింది.... పార్లమెంట్లో కాదని, చంద్రబాబు నివాసం ముందు చేయాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. -
జగన్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జంతర్ మంతర్ దగ్గర తాము తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఉద్యోగులు ఆహ్వానించారు. సంఘం ప్రతినిధులు బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తమకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నుల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... ఉద్యోగుల్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్యమంలో స్వయంగా పాలుపంచుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కోరారు. ఢిల్లీ నిరసన ప్రదర్శనకు వస్తే బాగుంటుందని పదేపదే అడిగారు. అయితే షరతులతో కూడిన బెయిల్ ఉన్నందున తాను రాలేనని... పార్టీ ప్రతినిధులను ఢిల్లీకి పంపిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు తెలిపారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు -
జగన్‌తో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాంతో జగన్ నివాసం అభిమాన సంద్రంతో పోటెత్తింది. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు లోటస్ పాండ్‌కు చేరుకుంటున్నారు.